endowment
-
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
జీవిత బీమా అనగానే.. డబ్బు వృథా, అనవసరంగా ప్రీమియం చెల్లించాలనే ధోరణి ఉంది. దీన్ని గ్రహించిన కంపెనీలు వినియోగదారులు చెల్లించే ప్రీమియంపై రాబడి వచ్చేలా ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చారు. అయితే ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఒకవైపు బీమా కవరేజీ.. మరోవైపు రాబడి ఉంటుంది. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా సరైంది కాదని, కొన్నిసార్లు సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే రాబడి తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బీమా సంస్థలు, ఏజెంట్లు మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. కానీ, బీమా రక్షణా? లేక రాబడా? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ అంశాలను వివరించే కథనం ఇది..బీమా, పొదుపుతో కూడిన ప్లాన్లుసంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రముఖ సంస్థకు చెందిన ఓ ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది.ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తున్నాయా..?55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై సుమారు రూ.50 చొప్పున వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు.. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి.మరణిస్తే చెల్లింపులు ఇలా..ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది.ప్రత్యామ్నాయం..బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైన బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా ప్యూర్ లైప్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పైఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం.35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేలు అనుకుందాం. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. పైన చెప్పుకున్న ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పైప్లాన్లో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈఉదాహరణ తెలియజేస్తోంది.కాంపౌండింగ్ ఉండదు..విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది.ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.గ్యారంటీడ్.. పార్టిసిపేటింగ్బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ అనే వాటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్‌ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో వీటిని చెల్లిస్తారు.ఇదీ చదవండి: ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రాఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమియంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. -
దేవుడికే శఠగోపం !
సాక్షి, అనంతపురం: రాయదుర్గం మండలం కదరంపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి 36 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఆ భూమిని అర్చకుడు జయరాములు సాగు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జయరాములు పేరిట 12 ఎకరాలు, అతని భార్య నిర్మల పేరిట 12 ఎకరాలు, అవివాహితుడైన అతని కుమారుడు కార్తీక్ పేరిట 12 ఎకరాలకు ఎండోమెంట్ అధికారులు సాగు పత్రాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి 36 ఎకరాల భూమి ఇవ్వడం దేవదాయ ధర్మదాయ, రెవెన్యూ శాఖల చట్టాలకు విరుద్ధం. అలాంటిది గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు ముగ్గురికి సాగు పత్రాలివ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని వివిధ ఆలయాల నిర్వహణ కోసం అప్పట్లో కొందరు భూస్వాములు వందల ఎకరాలను ఆయా దేవాలయాలకు రాసిచ్చారు. ఆలయాల్లో పనిచేసే అర్చకులు వాటిని సాగుచేసుకోవడం, లేదా కౌలుకు ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో దేవుళ్లకు దూపదీప నైవేద్యాలు పెడుతూ జీవనం సాగించేవారు. కానీ విలువైన మాన్యం భూములపై కొందరు కన్నేశారు. అధికారుల సాయంతో దేవుడి సొమ్ముకే కన్నం వేశారు. ఆలయ భూములన్నీ అన్యాక్రాంతమే రాయదుర్గం నియోజకవర్గంలోని పలు ఆలయాలకు భూములున్నా సంబంధిత ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. కొన్నిచోట్ల ఎండోమెంట్ అధికారులు భూములను నామమాత్రపు వేలంవేసి, కౌలుకు ఇచ్చారు. మరికొన్నిచోట్ల దూప, దీప నైవేద్యాలు పెడతామని కొందరు అర్చకులు సాగుచేసుకుంటున్నారు. ఎక్కువశాతం భూములు అన్యాక్రాంతమయ్యాయి. అయినా దేవదాయశాఖ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం పట్టణం కోటలోని శ్రీప్రసన్న వెంకటరమణస్వామి ఆలయానికి ఆరు ఎకరాల మాన్యాన్ని (పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ), కొండపై ఉన్న శ్రీమాధవరాయుని ఆలయానికి చెందిన 6.14 ఎకరాలను పేదల ఇళ్ల కోసం రెవెన్యూశాఖకు బదలాయించారు. రాయదుర్గం మండలంలో 42 దేవాలయాలుండగా 759 ఎకరాల భూమి ఉంది.74 ఉడేగోళం గ్రామ ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 4.69 ఎకరాల భూమిలో గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే మిగిలిన చోట్ల దేవదాయ భూమి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. గుమ్మఘట్ట మండలంలో 731.92 ఎకరాల మాన్యం భూములున్నాయి. ఇందులో పూలకుంట వద్ద తిమ్మప్ప మాన్యం సర్వే నంబర్ 96లో ఉన్న పొలం ఆక్రమణకు గురైంది. ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా ఇళ్లను నిర్మించుకున్నారు. అడిగేవారు లేక పోవడంతో నిత్యం కబ్జాకు గురవుతున్నాయి. మండలంలోని ఆరు గ్రామాల్లోనూ మాన్యం భూములు అన్యాక్రాంతమవుతున్నా, వారించే నాథులే కరువయ్యారు. ఇక డీ.హీరేహాళ్ మండలంలోని 15 పంచాయతీల్లో 1034.54 ఎకరాలను దేవాలయాల భూములుగా గుర్తించారు. అందులో 670 ఎకరాలు భూములు సాగులో ఉన్నాయి. మిగిలిన 364 ఎకరాల్లో కొండలు, గుట్టలు వ్యాపించాయి. గవిసిద్దేశ్వర ఆలయానికి సంబంధించిన భూముల్లోనే కొండలు, గుట్టలున్నాయి. ప్రస్తుతం కూడ్లూరు కంచి వరదరాజస్వామి, డీ.హీరేహాళ్‌లోని గవిసిద్దేశ్వస్వామి, ఆంజనేయస్వామి భూములను కొంతమంది ఆక్రమించుకుని ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. నాగలాపురంలో కాశీవిశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన 39.83 ఎకరాలుండగా... అక్కడి అర్చకులు కొంతమందికి లీజుకు ఇచ్చి కర్ణాటకకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయా ఆలయాల్లో గ్రామస్తులే దూపదీప నైవేద్యాలను నిర్వహిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలంలో 98.37 ఎకరాల మాన్యం భూములుండగా... కొన్ని చోట్ల అర్చకులు సాగు చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భూములు సాగుచేయకపోవడంతో కంపచెట్లు పెరిగాయి. కణేకల్లు మండలంలో 38.62 ఎకరాల మాన్యం భూములుండగా...అవన్నీ అన్యాక్రాంతమయ్యాయి. కొందరు స్వార్థపరులు మాన్యం భూములను కబ్జా చేసి తమ పేర్లపై పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పొందినట్లు సమాచారం. ప్రభుత్వానికే పంగనామాలు దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని భూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అయితే ఆ పథకానికి తూట్లు పొడిచేలా దేవదాయ ధర్మదాయ శాఖ ఈఓ శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సాగుపత్రాలున్న రైతుల కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మొదటి విడతలో రూ.11,500 నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అదనుగా ఈఓ శ్రీనివాసులు ఇష్టారాజ్యంగా ఎంతమందికంటే అంతమందికి సాగు పత్రాలిచ్చి ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఈఓను వివరణ కోరడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచాం దేవాలయ భూములను సాగు చేసుకుంటున్న వారి జాబితా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ద్వారా రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఇక్కడి ఈఓ ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి సాగుపత్రాలు ఎలా ఇచ్చాడో తెలియడం లేదు. అలా సాగుపత్రాలు పొందిన వ్యక్తులు ‘వైఎస్సార్ రైతు భరోసా’ కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా.. వాటిని పెండింగులో ఉంచాం. – సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ -
సేవలు కాదు వితరణలు..
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజాదికాలను ఆర్జిత సేవలుగా పేర్కొంటారు. తోమాల సేవ, ఊంజల్ సేవ, పవళింపు సేవ.. ఇలా వాటికి ఎన్నో పేర్లు. ఈ పేర్లలో ‘సేవ’ అన్న పదం ఉండటమే కొంపముంచిందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ‘సేవ’లను సర్వీస్ (సేవ)గా పరిగణిస్తూ వాటి రూపంలో వచ్చే ఆదాయాన్ని జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తెచ్చింది. ఇప్పుడు వాటి పేర్లు మార్చి సేవ అన్న పదం లేకుండా చూడాలని దేవాలయాల అధికారులు దేవాదాయశాఖ దృష్టికి తెచ్చారు. దీంతో సేవ అన్న పదం బదులు వితరణ అన్న పదంగాని ఆ అర్థం వచ్చే మరేదైనా పదం గాని జోడించాలని సూచించారు. దీన్ని దేవాదాయ శాఖ కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. త్వరలో పేర్లను అధికారికంగా మార్చనున్నట్టు సమాచారం. దేవాలయాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కొన్ని దేవాలయాల నిర్వాహకులు ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీతో కుదేలు..: గతేడాది జూన్ కంటే ముందు దేవాలయాలపై పన్ను లేదు. జీఎస్టీ అమలులోకి రావటంతో పరిస్థితి మారిపోయింది. ప్రసాదాల తయారీ కోసం కొనే వస్తువులు, ఆర్జిత సేవలపై 18% జీఎస్టీ పడుతోంది. ఆలయాల ఆదాయంలో 12% దేవాదాయశాఖకు, 3% అర్చక సంక్షేమ నిధికి, మరో 3% సర్వశ్రేయోనిధికి జమకడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీ కూడా తోడవటంతో ఆదాయం సరిపోక కొన్ని చోట్ల జీతాలకూ ఇబ్బంది పడాల్సి వస్తోందని దేవాలయ కార్యనిర్వహణాధికారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రసాదాలకు కూడా వితరణ, చందా అర్థం వచ్చేలా పేర్లు మార్చాలంటున్నారు. -
ట్రస్ట్‌బోర్డుల నియామకానికి నోటిఫికేషన్
కర్నూలు (న్యూసిటీ): దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని నాలుగు దేవాలయాలకు సంబంధించి ట్రస్ట్‌బోర్డుల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తూ డీసీ అనురాధ ఉత్తర్వులు జారీ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. బనగానపల్లె వీరప్పయ్య స్వామి దేవాలయం నేలమట్టం, ఆళ్లగడ్డ మండలం రుద్రవరం భాస్కరాంజనేయ, నందీశ్వర స్వామి దేవాలయాలు, చింతకొమ్మదిన్నె చెన్నకేశవ స్వామి దేవాలయం, బోయలకుంట్ల రామేశ్వర అనంత పద్మనాభ స్వామి తదితర 6బి గ్రూపులోని ఆలయాల ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. నాలుగు దేవాలయాలు రూ.రెండు లక్షలకుపైగా ఆదాయం కల్గినవని, ఒక్కొక్క దేవాలయానికి ఏడుగురు సభ్యుల బోర్డును నియమిస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను కమిషనర్, దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రధాన కార్యాలయం, గొల్లపూడి, అమరావతి, విజయవాడకు పంపాలన్నారు. ట్రస్టుబోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారన్నారు. -
‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆగ్రహం వేద పాఠశాల నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి సహజ ఆసుపత్రి నిర్వహణపైనా అదే రీతిలో స్పందన పారిశుద్ధ్యం బాగోలేదని కాంట్రాక్టర్‌కు రూ.పదివేలు జరిమానా యాగశాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ అన్నదానం భవనం నిర్మాణస్థలం మార్పుపై పరిశీలన అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరుపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు నత్తనడకన సాగడం, సహజ ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవించడంపై ‘ఇది దేవస్థానానికి అప్రతిష్ట’ అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆయన అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. వివిధ నిర్మాణపథకాల పనితీరును పరిశీలించారు. సత్యగిరిపై రూ.2.82 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంపై జేఎస్వీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం నిర్వహణ, సహజ ఆసుపత్రి పనితీరుపైనా తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులను నిలదీశారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాలి.. సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై ఆరాతీశారు. ఈ నిర్మాణాలు చేసే నిపుణులైన పనివారి కొరత ఉండడంతో ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్ నాయుడు తెలిపారు. అవసరమైనంత మందిని తీసుకువచ్చి ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యేలోపు వేదపాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలని, స్థలం చుట్టూ పాతపద్ధతిలో మెస్తో ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సహజ ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి.. దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి ఆసుపత్రి పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పది మంది సిబ్బంది, నలుగురు పేషెంట్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడాన్ని చూసి మండిపడ్డారు. ఇది ఆలయానికి అప్రతిష్ట అని ఈఓను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు చూస్తున్న పద్మావతి సంస్థ అన్నవరం మేనేజర్ కుళాయప్పకు రూ.పదివేలు జురిమానా విధించారు. ఆర్జేసీ అజాద్‌కు ‘సహజ’ బాధ్యతలు.. సహజ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థకు అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. ఇందుకుగాను 20 పాయింట్లు రూపొందించామన్నారు. ఆసుపత్రి ముందు ఔషద మొక్కలను పెంచుతామన్నారు. ఆ పనులను దేవాదాయశాఖ కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్‌కు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తయ్యాక దీనిపై ఒక బ్రోచర్ ముద్రించి ప్రచారం చేస్తామన్నారు. చెందుర్తిలో సోలార్ పవర్‌ప్రాజెక్ట్ చెందుర్తిలో ఉన్న 135 ఎకరాల దేవస్థానం స్థలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను సత్యగిరిపై ఏర్పాటు చేయాలని గతంలోనే దేవస్థానం చైర్మన్, ఈఓ లతో కూడిన పాలకమండలి తీర్మానించింది. అయితే సత్యగిరిపై కాకుండా చెందుర్తి భూమిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎట్టకేలకు యాగశాల నిర్మాణానికి మోక్షం: దేవస్థానంలో యాగశాల ఏర్పాటు పనులు 18 నెలలుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తన ఆదేశాలను దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఈఓను ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణస్థలం మార్పుపైనా సానుకూలత.. అన్నదాన భవన నిర్మాణాన్ని పాత టీటీడీ సత్రం భవనస్థలంలో నిర్మించే విషయమై పరిశీలనకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలతో కలసి ఆయన టీటీడీ సత్రం స్థలాన్ని పరిశీలించారు. సత్యగిరిపై నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదు సత్యగిరిపై 138 గదుల సత్రంతో సహ ఈ విధమైన నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే సౌండ్ అంట్ లైట్ షో, అర్బన్ గ్రీనరీ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈలు రామకృష్ణ, రాజు, ఏఈలు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
‘తూర్పు’లో మూలాలు ... ‘పశ్చిమ’లో సోదాలు
- పెద్దాపురం ఈవోపై ఏసీబీ కొరడా - అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు - రూ. కోటికి పైనే అక్రమాస్తులు - ఏసీబీ చేతిలో మరో అరడజన్ మంది చిట్టా - ‘సాక్షి’ వరుస కథనాలతో కొరడా ఝుళిపించి ఏసీబీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖలోని అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుడినే కాకుండా గుడిలో లింగాన్ని సైతం మింగేసే ప్రబుద్ధుల నిర్వాకాలతో ఆ శాఖపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అర్హత లేకున్నా అందలాలు ఎక్కించడం మొదలుకుని ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేయడం వరకు దేవాదాయశాఖలో అడ్డగోలు వ్యవహారాలకు అంతే లేకుండాపోయింది. ఈ బాగోతాలపై ‘సాక్షి’ ఇటీవల కాలంలో వరుస కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు అవినీతి అధికారులపై నిఘా పెట్టిన ఏసీబీ తొలి పంజా సోమవారం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ చీమలకొండ సాయిబాబుపై విసిరింది.ఆస్తులు గుర్తించింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా దాని మూలాలు మాత్రం పెద్దాపురం సత్రంలోనే ఉండటం గమనార్హం. రెండేళ్లుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు ఆధ్వర్యంలో సత్రంలో పేదలకు అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానం చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ నిర్థారణకు రావడం, ఏకకాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో దాడులు జరపడంతో దేవాదాయ శాఖలో గుబులు రేపుతోంది. ఏసీబీ జాబితాలో మరింతమంది... ప్రస్తుతం ఏసీబీ వలకు చీమలకొండే చిక్కినా జిల్లాలో మరికొన్ని దేవాలయాల కార్యనిర్వాహణాధికారుల జాతకాలు కూడా ఏసీబీ సేకరించిందని సంబంధిత వర్గాల సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారుల అండదండలు దండిగా ఉండటంతో అర్హత లేకున్నా ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న వారి చిట్టా సిద్ధంగా ఉందంటున్నారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్లు,, గ్రేడ్–1, గ్రేడ్ –2 ఇఒలు అరడజన్ మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. తొలి తిమింగలం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ సాయిబాబుతోనే మొదలైందని మిగిలిన వారి భరతం కూడా త్వరలో పట్టడం ఖాయమంటున్నారు. సాయిబాబు అక్రమాస్తుల చిట్టా... సాయిబాబు ఆస్తులను నిగ్గుతేల్చేందుకు ఏసీబీ పెద్దాపురం, తణుకు బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు, మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, ప్లాటు, పెద్దాపురం కార్యాలయం, భీమవరంలో బావమరిది ఇంటితోపాటు స్వగ్రామం రేలంగిలో ఇల్లు, తణుకులో స్నేహితుడి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించడంతో ఆ శాఖల అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కోనాల గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 35 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, పాస్‌పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కేస్తే అతని ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన 14 బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్ చేయగం గమనార్హం. -
అర్హత లేకున్నా అందలమెక్కేస్తాం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోరుకున్న కొలువు కావాలనుకుంటున్నారా.. అర్హత లేకున్నా ఫర్లేదు, కావల్సిందల్లా...దండిగా సొమ్ములు...సిఫార్సులే. ఇదంతా దేవాదాయశాఖలో మాత్రమే సాధ్యమనడానికి ఉదాహరణ జిల్లాలోని పలు ఆలయాల్లో అర్హతలేని ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో కూర్చొబెట్టడమే. అర్హతలుండీ అడిగినంత సొమ్ము ఇచ్చుకోలేని వారిని ప్రాధాన్యం లేని పోస్టులకే పరిమితం చేయడం అవినీతికి దర్పణం పడుతోంది. నెలవారీ మామూళ్ల మత్తులో పడి ఒకేచోట నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్న వైనందేవాదాయ శాఖలో సాగుతోంది. ఎవరైనా ఏదైనా అంటే పదేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నామని సమాధానం చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. డీసీ పోస్టులో జూనియర్... దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ పోస్టు ఇన్చార్జి ఏలుబడిలో నడుస్తోంది. రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు గడచిన ఎనిమిది నెలలుగా డీసీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కారుణ్య నియామకంలో 1986లో దేవాదాయశాఖలోకి వచ్చిన రమేష్‌బాబు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్‌గా పదోన్నతిపొంది అనంతరం 2009లో అడ్హాక్ ఏసీ అయ్యారు. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం అడహాక్ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కాకినాడ డీసీగా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాది తప్ప మిగిలిన సర్వీసంతా జిల్లాలోనే. జిల్లాలో పలువురు సీనియర్ అధికారులున్నా రమేష్‌బాబుకు డీసీ ఇన్చార్జిగా కట్టబెట్టడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రమేష్‌బాబు కంటే సీనియర్లయిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఈవో దేవుళ్లు, పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం ఆర్ పుష్పనాథం, అన్నవరం దేవస్థానం సహాయ కమిషనర్ ఈరంగి జగన్నాథం. తలుపులమ్మ లోవ ఈవో చంద్రశేఖర్, అప్పనపల్లి బాలాబాలజీ స్వామి దేవస్థానం ఈవో బాబూరావులు రమేష్బాబుకంటే సీనియర్లు. వీరంతా పూర్తి స్థాయి అసిస్టెంట్ కమిషనర్లే. అయినా వీరందరినీ పక్కనబెట్టి అడహాక్ ఏసీగా ఉన్న రమేష్‌బాబును గడచిన ఎనిమిది నెలలుగా కాకినాడ డీసీగా కొనసాగించడంలో ఔచిత్యమేమిటో ఆ దేవుడికే తెలియాలి. డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) నిర్వహిస్తే పదోన్నతుల్లో పైన పేర్కొన్న ముగ్గురు డీసీ జాబితాలో ముందుంటారు...అయినా అడ్హాక్ ఏసీగా ఉన్న రమేష్‌బాబుకే పదోన్నతి పట్టం కడుతోండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేడ్ వన్ అధికారులు కూడా ఆయన తరువాతే... ఏసీలు, డీసీలే కాదు గ్రేడ్–1 అధికారులు కూడా అన్యాయమైపోతున్నారు. పళ్లంరాజు గ్రేడ్–1 అధికారి. ఆయన అర్హతకు తగ్గట్టు కాకుండా తక్కువ క్యాడర్ కలిగిన వారిని నియమించే 6బి పరిధిలోని కాండ్రకోట నూకాలమ్మ ఆలయానికి ఈవోగా కొనసాగిస్తున్నారు. మరో గ్రేడ్–1 అధికారి అల్లు భవాని కాకినాడ జగన్నాథపురం గ్రూపు దేవాలయాల ఈవోగా పనిచేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈవో పోస్టు 6–సీ అంటే గ్రేడ్–3 అధికారి పనిచేసే పోస్టింగ్ అది. మరో అధికారిణి ఆర్.చందన. ఈమె కూడా పదేళ్ల సీనియర్ గ్రేడ్–1 అధికారి. ఆమెను కూడా 6సీ అంటే గ్రేడ్3 రాజమహేంద్రవరం సత్యనారాయణస్వామి ఆలయం ఈవోగా పని చేస్తున్నారు. గ్రేడ్1అధికారైన పితాని సత్యనారాయణ (తారకేశ్వరరావు)ను 6బి పరిధిలోని రాజమహేంద్రవరం చందాసత్రం ఈఓగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆర్.శ్రీనివాస్, సత్యవాణి వీరు కూడా గ్రేడ్1 అధికారులే. వీరిద్దరూ రాజానగరం సత్రం, రాజమహేంద్రవరం నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్(ఎన్ఎస్బిఎస్) ఈవోలుగా పనిచేస్తున్నారు. 6–బి, 6–సీ గ్రేడ్లు కలిగిన ఈ రెండు పోస్టుల్లో గ్రేడ్–1 అధికారులు పనిచేస్తున్నారు. వీరంతా ఆ శాఖలో సీనియర్ గ్రేడ్–1 అధికారులే అయినా ఉన్నతాధికారులు ఎవరికీ వీరు కనిపించకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పైవారికి తెలియదా...? అర్హతలు లేని వారెందరో జిల్లాలో అందలాలెక్కి కూర్చున్నా ఆ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కమిషనర్‌కు తెలియకుండా ఉండి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కలిగిన ఆలయాల్లో అంతకు తక్కువ స్థాయి కలిగిన వారు పైరవీలతో పాతుకుపోయారు. బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం ఈవో వాసంశెట్టి ఉమామహేశ్వరరావు కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్, అమలాపురం వెంకటేశ్వరస్వామి ఈఓ వీవీవీఎస్ మూర్తి మందపల్లి, గ్రేడ్–1 స్థాయి కలిగిన ఈఓలు ఉండాల్సిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి, అయినవిల్లి సిద్దివినాయక ఆలయాల్లో అంతకంటే తక్కువ గ్రేడ్–2 క్యాడర్ కలిగిన రమణమూర్తి, సత్యనారాయణరాజు ఈవోలుగా పనిచేస్తున్నారు. అయినవిల్లి, వాడపల్లి రెండు దేవస్థానాల్లో పెరిగిన ఆదాయంతో ఏసీ క్యాడర్‌కు వచ్చేశాయి. అధికారికంగా ఉత్తర్వులు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటువంటి ఈ రెండు దేవస్థానాలు గ్రేడ్–2 అధికారులనే కొనసాగిస్తున్నారు. ఇందులో తాజా బదిలీల్లో వాడపల్లి దేవస్థానానికి వచ్చేందుకు గ్రేడ్–1 రెగ్యులర్ ఇఒలు విశ్వప్రయత్నం చేసినా ఇన్ఛార్జిగా కొనసాగుతోన్న గ్రేడ్–2 వానపల్లి ఇఒ రమణమూర్తి తన స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఆ ఆలయానికి పని చేయగలిగే అర్హతలున్న గ్రేడ్–1 ఈవోలను కాదని ఇన్‌ఛార్జిని కొనసాగించడంలో మర్మమేమిటో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ విషయాన్ని గత నెల 25న ‘వాడపల్లి వెంకన్నా నీ వాడిని నేనయ్యా’మ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయ ఈవో గ్రేడ్–2 కేడర్. ఆ ఆలయం చూస్తే గ్రేడ్–1 అంతకంటే ఎక్కువగా అసిస్టెంట్ కమిషనర్‌ను కూడా నియమించవచ్చు. అటువంటిది ఐదేళ్లయినా గ్రేడ్–2 ఈవోను రెగ్యులర్ చార్జితో ఇన్ఛార్జిగా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రేడ్–1 ఈవోలు బీజేపీ నేతల దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారని తెలిసింది. దేవాదాయ శాఖలోని కమ్యునికేషన్ స్కిల్స్‌లో ఆరితేరిపోవడమే వారికి శ్రీరామ రక్షగా ఉందంటున్నారు. సరైన విధానం లేకనే... అయినవిల్లి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మురమళ్ల వీరేశస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి...ఈ ఆలయాలన్ని ప్రస్తుతం గ్రేడ్–1, గ్రేడ్–2 ఈవోలు పనిచేస్తున్నారు. ఈ ఆలయాలన్నీ ఏసీ క్యాడర్ స్థాయికి ఎప్పుడో చేరిపోయాయంటున్నారు. వాటికి తగ్గ క్యాడర్‌ను ప్రకటించి ఆ తరహా ఈవోలను నియమించాల్సి ఉంది. ఇవి జరగనంత వరకు ఈ సిఫార్సు వ్యవహారాలు ఆ శాఖలో మామూలేనంటున్నారు. -
మహానంది ఇన్చార్జ్ ఈఓగా వెంకటేశ్వర్లు
మహానంది: మహానంది దేవస్థానం ఇన్చార్జ్ ఈఓగా అనంతపురం జిల్లా ఉవరకొండ గౌరీ మఠం అసిస్టెంటు కమిషనర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శంకర వరప్రసాద్ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వెంకటేశ్వర్లుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయశాక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వెంకటేశ్వర్లు గౌరీ(గవి)మఠం ఏసీ, మేనేజర్‌గా ఉన్న ఆయన కర్నూలు జిల్లా డీసీగా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పది రోజుల్లో మహానంది దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
ఆ ఆరుగురిదే హవా
- డీసీ కార్యాలయంలో కొన్నేళ్లుగా వారే - దేవాదాయం...వారికే... - ఏళ్లతరబడి తిష్ట వేసినా బదిలీలుండవు - పై స్థాయిలో వాటాలతో కొనసాగింపు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అది దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం. కాకినాడ కేంద్రంగా ఆ శాఖ పని చేస్తుంటుంది. డీసీ కార్యాలయం మూడు జిల్లాలను పర్యవేక్షిస్తుంటుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో సుమారు మూడువేల ఆలయాలు, సత్రాలను ఈ కార్యాలయమే అజమాయిషీ చేస్తుంటుంది. ఈ కార్యాలయానికి డిప్యూటీ కమిషనర్ సుప్రీం. చాలా కాలంగా ఈ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పైసలిస్తే పని కానిదంటూ ఏదీ ఉండదనే ఆరోపణ ఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగులపై ఉంది. అందుకే ఇక్కడి డీసీ కార్యాలయంలో పని చేయడమంటే ఎగిరి గంతేస్తారు. డీసీ కార్యాలయంలో ఒకసారి జాయినైతే ఇక కార్యాలయాన్ని అంటిపెట్టుకునే ఉంటారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఏ శాఖలో అయినా చివరకు దేవాదాయశాఖ పరిధిలో ఇతర కార్యాలయాల్లోనైనా నిబంధనల ప్రకారం ఉద్యోగులకు బదిలీలు జరుగుతుంటాయి. కానీ ఈ కార్యాలయంలో ఏళ్లతరబడి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు బదిలీలు అంటే ఏమిటో తెలియదు. బదిలీలు జరిగే ప్రతి సందర్భంలో ఉన్నతాధికారులకు ‘ఆమ్యామ్యా’లు ఇచ్చేసి ఆ సీట్లలోనే కొనసాగుతున్నారంటే ఎంత పలుకుబడి ఉందో ఊహించుకోవచ్చు. డిప్యూటీలు ఎవరైనా సరే వీరిదే స్టీరింగ్... డిప్యూటీ కమిషనర్‌గా ఎవరు వచ్చినా చక్రం తిప్పేది మాత్రం ఆ ఆరుగురే. ఈ కార్యాలయంలో అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి 20 మంది ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మూడేళ్లు పైబడితే బదిలీలు తప్పవు. పాతికేళ్లవుతున్నా బదిలీ కాని ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. - కార్యాలయంలో అటెండర్‌గా జాయినైన ఒక ఉద్యోగి ఇక్కడే రికార్డు అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆ ఉద్యోగి ఇక్కడ 27 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. - 2004లో టైíపిస్టుగా జాయినైన ఒక ఉద్యోగి అప్పటి నుంచి ఇప్పటి వరకు టైపిస్టుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. - మహిళా జూనియర్ అసిస్టెంట్æ 11 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. - 1999లో జూనియర్ అసిస్టెంట్‌గా జాయినైన ఒక మహిళా ఉద్యోగిని ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఇప్పుడు అంతకంటే పై స్థాయిలో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందినప్పటికీ ఇదే కార్యాలయంలో పనిచేస్తున్నారు. - 2009లో ఈ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్లుగా వచ్చిన ఇద్దరిలో ఒకరికి సీనియర్ అసిస్టెంట్ రాగా, మరొకరు జూనియర్ అసిస్టెంట్‌గా ఇక్కడే తిష్ట వేశారు. డీసీ కార్యాలయమే శాశ్వత నివాసం... బదిలీలకు నోచుకోని ఈ ఆరుగురు ఉద్యోగులు డీసీ కార్యాలయమే శాశ్వత కార్యాలయంగా మార్చేసుకున్నారు. ఏటేటా ఈ కార్యాలయంలో పలువురికి బదిలీలు జరుగుతున్నా వీరి సీటుకు మాత్రం ఢోకా ఉండటం లేదు. బదిలీల ప్రక్రియ మొదలవుతుందనగానే అధికారులకు ‘సంభావనలు’ సమర్పించుకొని బదిలీ జాబితాలో తమ పేరు లేకుండా చేసుకుంటున్నారు. డీసీగా ఎవరు వచ్చినా కార్యాలయంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది ఆ అరడజను మంది ఉద్యోగులేనని కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదోన్నతులు పొందుతున్నా సీటు మారుతారే తప్ప బయటకు పోయే ప్రసక్తే లేదు. మూడు జిల్లాలు పరిధిలో ఉన్న దేవాదాయశాఖ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఫైళ్లు, సత్రాల భూముల లీజులు పెంపు, షాపింగ్ కాంప్లెక్సుల్లో దుకాణాల రెన్యూవల్స్ ఫైళ్లు... ఇలా ప్రతి నెలా వచ్చే 20, 30 ఫైళ్లు కార్యాలయ ఉన్నతాధికారి టేబుల్‌పైకి వెళ్లాలంటే ముందు వీరందరి చేతులు తడపాల్సిందే. ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు నిర్ణయించి దండుకోవడం ఇక్కడ రివాజుగా మారిపోయింది. వీరి నుంచే పక్కాగా ఎవరి వాటా వారికి వెళ్తుండడంతో పై అధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇలా చేయొచ్చు..అయినా... ఈ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగిన ఉద్యోగులను నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి. వీరిని జిల్లాలో ఉన్న ఏసీ, జెవీవో (జ్యువెలరీ వెర్ఫికేషన్ ఆఫీసర్) కార్యాలయానికి బదిలీ చేయవచ్చు. సీనియర్ అసిస్టెంట్లను ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాతోపాటు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) కార్యాలయం సహా జిల్లాలో పలు ప్రాంతాలకు ఇన్స్పెక్టర్లుగా బదిలీ చేయవచ్చు. అయినా సరే దశాబ్దాలుగా కార్యాలయానికే అతుక్కుపోయిన ఈ ఉద్యోగులను మాత్రం కొనసాగిస్తున్న తీరు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్‌గా రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ ఉద్యోగుల వ్యవహారాలు మరింత మితిమీరిపోయాయంటున్నారు. ఆయన కార్యాలయానికి అప్పుడప్పుడు వచ్చిపోతుండటంతో వీరి ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోందని మండిపడుతున్నారు. తాజాగా బదిలీల ప్రక్రియకు తెరలేవడంతో ఈసారైనా వీరికి స్థాన చలనం ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే. -
అలిపిరి తరహాలో రహదారులు
- శ్రీశైలం ప్రధాన రహదారుల విస్తరణపై ప్రిన్సిపల్ సెక్రటరీ - ఆధ్యాత్మికత ఉట్టి పడేలా నిర్మించాలని ఆదేశం శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలోని ప్రధాన రహదారులను అలిపిరి తరహాలో అధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా రూ. 200 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులను మంగళవారం ఈఓ నారాయణభరత్గుప్తతో కలిసి ఆయన పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రథశాల వీధి, పోçస్టాఫీస్రోడ్డు, అసుపత్రి నుంచి మల్లికార్జునసదన్ వెళ్లే రూటు, టోల్గేట్ నుంచి శివసదనం కూడలి రోడ్లను పరిశీలించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందునా అందుకు తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ చేపట్టాలన్నారు. ఇరువైపులా మొక్కలతో పచ్చదనాన్ని పెంపొందిస్తే క్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. తిరుమలలోని అలిపిరి తరహాలో క్షేత్రంలో కూడా ప్రవేశ రహదారులను ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలంలోని ప్ర«ధాన రహదారుల విస్తరణలో పక్కా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్వాన ద్వారాలు, సందేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయుర్వేద వైద్యశాల పరిశీలన.. దేవస్థానం పరిధిలోని ఆయుర్వేద ఆసుపత్రిని జేఎస్వీ ప్రసాద్.. ఈఓ నారాయణభరత్‌గుప్త, ఎండోమెంట్ సీఈ సుబ్బారావు, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం హార్టికల్చరిస్ట్ ఏడీ వెంకట్రావు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ లావణ్య ఆసుపత్రికి సంబంధించిన విషయాలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో ఔషధ మొక్కలను పెంచాలని, వాటి వివరాలు, ఆవశ్యకతను తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు భక్తులు, స్థానికులకు అందిస్తున్న వైద్యసేవలు, అందుకు అవసరమైన వసతులపై ఈఓ నారాయణ భరత్‌గుప్త, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎండోమెంట్ సీఈ సుబ్బారావు, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం హార్టికల్చరిస్ట్ ఏడీ వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
బకాయిలను త్వరగా జమ చేయండి
– డీసీ గాయత్రిదేవి కర్నూలు(న్యూసిటీ): దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెల్లించ వలసిన సర్వశ్రేయోనిధి ఫండ్(సీజీఎఫ్), అర్చక వెల్ఫేర్ ఫండ్ బకాయిలను వెంటనే జమ చేయాలని ఆ శాఖ ఉప కమిషనర్ బి.గాయత్రిదేవి కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. శనివారం పాతబస్టాండ్‌లోని నగరేశ్వరస్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రిదేవి మాట్లాడుతూ.. 6ఎ, 6బి గ్రూపు పరిధిలోని దేవాలయాల్లో సర్వశ్రేయోనిధి ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్, ఇఎఎఫ్ ఫండ్ ఎంత వసూలు అయిందని కార్యనిర్వహణాధికారులను ప్రశ్నించారు. కమిషనర్ వై.వి.అనురాధ ఆదేశాల ప్రకారం సీజీఎఫ్, అర్చక వెల్ఫేర్ ఫండ్ బకాయిలను దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు. మిగిలిన నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నారు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్లు పాండురంగారెడ్డి, తిరుమలరెడ్డి, సహాయ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ బి.సుధాకర్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారులు ఎస్.సత్యనారాయణ, ఎం.రామాంజనేయులు, శోభ, స్వర్ణముఖి, డి.ఆర్.కె.వి.ప్రసాద్, గుర్రొడ్డి, తిమ్మనాయుడు, సుబ్రహ్మణ్యేశ్వర నాయుడు, ఉరుకుంద ఈరన్న, దేవస్థానం సూపరింటెండెంట్ మల్లికార్జున, ఇన్స్పెక్టర్లు హరిచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమఠంపై అజమాయిషీ లేదు
-దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెల్లడి - రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం మఠం పీఠాధిపతితో ఏకాంత భేటీ మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంపై దేవాదాయ శాఖ అజమాయిషీ ఉండదని మంత్రి మాణిక్యాల రావు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ సోమువీర్రాజుతో కలిసి శ్రీమఠం రాఘవేంద్ర స్వామి దర్శనానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పేద భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కార్యక్రమం చేపట్టామన్నారు. టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త నిధులతో రాష్ట్రంలో కొత్తగా 500 దేవాలయాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. విశాఖపట్నంలో యోగా యూనివర్సిటీ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశామన్నారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన, హారతులు పట్టి రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూల మంత్రాక్షితలతో వారిని ఆశీర్వదించారు. పీఠాధిపతితో మంత్రి ఏకాంత భేటీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో ఏకాంతంగా భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు స్వామిజీ ప్రత్యేక గదిలో మంతనాలు సాగించారు. ఆ సమయంలో శ్రీమఠం ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మంత్రి గత పర్యటన వచ్చి వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలో శ్రీమఠానికి కొన్ని జీవోలు, వెసులబాటులు కల్పించారు. ఉద్యోగ భద్రతకు ఉరిగా జీవో 35 ప్రకటించారు. అయితే, ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా సదరు జీవోను సుప్తచేతనావస్థలో ఉంచిన విషయం విదితమే. అయితే, ప్రస్తుత భేటీ రీత్యా శ్రీమఠానికి ఎలాంటి జీవోలు వస్తాయోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. స్థలభావం సమస్య తీర్చండి : వై.బాలనాగిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రం చుట్టు శ్రీమఠం భూములు మాత్రమే ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు, పేదలకు గృహనిర్మాణానికి స్థలం కరువైందన్నారు. మండల కేంద్రం అభివృద్ధి నిమిత్తం శ్రీమఠం భూముల విషయంలో ఆలోచించాలన్నారు. అందుకు మంత్రి సమాధాన మిస్తూ శ్రీమఠంతో చర్చిస్తామన్నారు. అవసరమైతే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అవసరాలు తీర్చేందుకు యత్నిస్తామన్నారు. పర్యటనలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నీలకంఠప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీఎస్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ రాజారెడ్డి పాల్గొన్నారు. -
‘దేవాదాయ’లో అక్రమాలకు చెక్
దశబంధం చెరువు వ్యవహారం కూడా పరిష్కరిస్తాం ‘సాక్షి’తో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి ఒంగోలు కల్చరల్: దేవాదాయశాఖ ఆస్తులు ఎవరైనా ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన “సాక్షి’తో మాట్లాడారు. త్రోవగుంటలోని ఎనిమిది ఎకరాల ధర్మకుంట దేవాదాయశాఖదే అని అయితే కొందరు ఆ స్థలంలో ప్లాట్లు వేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ స్థలానికి సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో కేసు కూడా దాఖలైందన్నారు. ధర్మకుంట స్థలం దేవాదాయశాఖదేనని స్పష్టం చేస్తూ 22ఏ 1సీ ప్రకారం ఏ విధమైన క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని రిజిస్ట్రార్ కార్యాలయానికి వివరాలు కూడా సమర్పించామని పేర్కొన్నారు. సంతమాగులూరు మండలంలోని 192 ఎకరాల దశబంధం చెరువు కూడా దేవాదాయశాఖదేనని ఆయన స్పష్టం చేశారు. చెరువుపై ప్రతి ఏటా రూ. 25 లక్షల ఆదాయాన్ని కొందరు అనుభవిస్తున్నారన్నారు. మామిళ్లపల్లి, కుందుర్రు గ్రామాలకు సంబంధించిన ఈ చెరువుపై కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని, చెరువు దేవాదాయశాఖదేనని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ఒంగోలు కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ భూముల కేసు త్వరలో విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెవెన్యూశాఖ పరంగా జరుగుతున్న కొన్ని పొరపాట్లతో సమస్యలు వస్తున్నాయని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దేవాదాయశాఖకు చెందిన విలువైన ఆస్తులకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణలు చోటుచేసుకుంటే ఆ వివరాలు 94910 00676 నంబర్లో తెలియజేయాలని కోరారు. -
స.హ.చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ
– చట్టాలను అమలు చేసే బాధ్యత పాలకులదే – దేవాలయాల్లో ధర్మాన్ని నిలబెట్టాలి – ఈఓ ఒకరు కోట్లలో అక్రమార్జన చేస్తే స.చట్టం వర్తించదా ? మహానంది : దేవాదాయశాఖకు సమాచార హక్కు చట్టం వందశాతం వర్తిస్తుందని, ఆ శాఖ కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుందని ఉభయ రాష్ట్రాల సమాచార హక్కుచట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. అయితే, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన మహానందికి వచ్చారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ శంకరవరప్రసాద్, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీదేవీ సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఏపీ టూరిజం అతిథిగహం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని, అలాగే భక్తుల మనో భావాలను పరిరక్షించాలని చెప్పారు. శ్రీశైలదేవస్థానంలో ఒక ఈఓ రూ. కోట్లలో ఆక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడం, భక్తుల విరాళాలు మింగడం స.హ. చట్టం కిందికి వస్తుందన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో కళాశాలలో, పలు ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో 108 కేసుల విచారణ చేశామని, ఈ కేసులకు సంబంధించిన వివిధ స్థాయి అధికారులైన 32 మందికి షోకాజు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ శాఖలో ఏ ఒక్కరో అవినీతికి పాల్పడితే మొత్తం ఆ శాఖకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రామకష్ణుడు, వీఆర్వోలు సత్యనారాయణ, కష్ణనాయక్ పాల్గొన్నారు. -
దేవాదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతర్ !
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై మౌనస్వామి దేవాలయం కూల్చివేత విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను సైతం స్థానిక అధికారులు పట్టించుకోలేదు. దుర్గగుడిపై భవానీ మండపం, అన్నదాన భవనంతోపాటు మౌనముని గుడిని కూల్చివేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోయారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న నవదుర్గలను కలుపుతూ భవానీ మండపాన్ని నిర్మించారని, 1950 నుంచి 1980 వరకు మౌనముని కొండపై ఉండి దేవాలయ అభివృద్ధితోపాటు అన్నదానం చేశారని వివరిస్తూ టి.విజయకనకదుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధకు లేఖ రాశారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వాటిని కాపాడాలని కోరారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ జూన్ నెలలో మౌనస్వామి గుడి జోలికి వెళ్లవద్దని ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో మౌనస్వామి ఆలయాన్ని కూల్చేందుకు దేవస్థానం అధికారులు సాహసించలేదు. స్వయంప్రతిపత్తి వచ్చిన వెంటనే.. దుర్గగుడికి స్వయంప్రతిపత్తి వచ్చిన వెంటనే ఈవోకు నిర్ణయాధికారులు వచ్చాయి. దీంతో కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మౌనస్వామి గుడిని నేలమట్టం చేశారు. స్వయంప్రతిపత్తి వల్ల దేవాలయ ప్రతిష్ట పెరిగే పనులు చేయాలని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
దేవాధిదేవులంటే ధిక్కారమా..?
శిథిలమవుతున్న పురాతన ఆలయాలు పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు తాడేపల్లి మండల, పట్టణ పరిధుల్లో ఉన్న దేవాలయాలకు కోట్ల విలువ చేసే భూములు ఉన్నా ధూప దీప నైవేద్యాలు కూడా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నాయి. ఓ వైపు ప్రై వేటు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాలు నిర్మించి నిధులను సేకరిస్తుంటే, పురాతన కాలం నుంచి ఉన్న దేవాలయాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. అయినా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. తాడేపల్లి (తాడేపల్లి రూరల్): రానున్న పుష్కరాలకు దేవాలయాలు అన్నింటికీ మరమ్మతులు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు రూ. 40 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కానీ తాడేపల్లి పట్టణ, మండల పరిధిల్లో ఉన్న దేవాలయాలకు పైపై అద్దకాలు చేస్తున్నారు తప్పా పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించడం లేదు. కోట్ల ఆస్తులు ఉన్నా, పూజలకు కూడా నోచుకోని పరిస్థితుల్లో దేవాలయాలు ఉన్నాయంటే అధికారుల నిర్వాకం అర్థం అవుతూనే ఉంది. కోట్ల విలువ చేసే భూములు.. సీతానగరం శ్రీకోదండరామాలయానికి కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. దాంతోపాటు దేవాలయం ముందు భాగంలోనే 80 సెంట్ల స్థలం కూడా ఉంది. ఆ స్థలంలో దేవాదాయ శాఖ అధికారులు అన్ని హంగులతో కార్యాలయాన్ని నిర్మించుకున్నారు తప్పా కనకదుర్గమ్మ దత్తత దేవాలయంగా ఉన్న రామాలయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వందల సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయానికి కొన్ని సంవత్సరాల క్రితం దాతల సాయంతో మండపం, ధ్వజస్తంభాలకు వెండి తొడుగులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఎండోమెంటు శాఖ ఆధీనంలోకి వెళ్లిన తరువాత అభివృద్ధికిS నోచుకోలేదు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి గుడి శిథిలావస్థకు చేరడంతో అధికారులు దాన్ని తొలగించారు తప్ప పునర్నిర్మాణం మాత్రం చేపట్టలేదు. కోదండరామస్వామి ఆలయ ఆస్తులు అనుభవిస్తున్నారు తప్ప దాని అభివృద్ధి మాత్రం ఆలోచించడంలేదు. వడ్డేశ్వరంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న తిరునారాయణ స్వామి దేవాలయానికి రాజధాని పరిధిలో 8 ఎకరాల మాగాణి భూమి, తాడేపల్లి మండలంలో 3.5 ఎకరాలు, అమరావతి మండలంలో 12 ఎకరాల భూమి ఉన్నప్పటికీ దాని అభివృద్ధి మాత్ర శూన్యం. రాజధాని నిర్మాణం పేరుతో.. రాజధాని పరిధిలో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు. ఇక్కడ కనీసం పూజారులకు జీతాలు కూడా అందజేయలేని పరిస్థితి. ఉండవల్లిలో భీమలింగేశ్వర స్వామి ఆలయంలో నిరంతరం పూజలు నిర్వహించేందుకు దాతలు 2.5 ఎకరాల భూమిని అందించారు. ఆ భూమిని దేవాదాయ శాఖ ఏనాడో అమ్మేసింది. కనీసం ఇక్కడ శివరాత్రికి కూడా దేవాదాయ శాఖ వారు పూజలు నిర్వహించరు. తాడేపల్లి పట్టణ పరిధిలో భీమలింగేశ్వర స్వామి ఆలయానికి 3.75 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కోట్ల విలువ ఉన్నా ఓ ప్రై వేటు సంస్థ క్లబ్ నిర్వహించేందుకు నామమాత్రంగా నగదు చెల్లిస్తుండటంతో ఆలయ అభివృద్ధి జరగడంలేదు. దేవాదాయ అధికారులు దృష్టి సారించి, పూర్వం నుంచి ఉన్న దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయాలని పలువురు అర్చకులు, భక్తులు కోరుతున్నారు. -
తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదు
హైదరాబాద్ : రెండు వారాల్లోగా అన్ని దేవాలయాల్లో పాలకమండళ్లు నియమిస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టీటీడీకి స్పెసిఫైడ్ అథార్టీ కమిటీని నియమించే యోచన లేదన్నారు. సెప్టెంబర్ 2వ వారంలో టీటీడీ పాలకవర్గం నియామకంతో పాటు వచ్చేనెలాఖరుకల్లా అన్ని దేవాలయాల పాలక వర్గాలను నియమిస్తామన్నారు. టీటీడీలో సభ్యుల సంఖ్య 15 నుంచి 18కి పెంచుతామన్నారు. ప్రతి దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో మెంబరు పెంపు ఉంటుందన్నారు. టీటీడీ పాలకవర్గంలో తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదని మాణిక్యాలరావు తేల్చి చెప్పారు.