అలిపిరి తరహాలో రహదారులు
అలిపిరి తరహాలో రహదారులు
Published Tue, Mar 7 2017 10:39 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- శ్రీశైలం ప్రధాన రహదారుల విస్తరణపై ప్రిన్సిపల్ సెక్రటరీ
- ఆధ్యాత్మికత ఉట్టి పడేలా నిర్మించాలని ఆదేశం
శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలోని ప్రధాన రహదారులను అలిపిరి తరహాలో అధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా రూ. 200 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులను మంగళవారం ఈఓ నారాయణభరత్‌గుప్తతో కలిసి ఆయన పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రథశాల వీధి, పోçస్టాఫీస్‌రోడ్డు, అసుపత్రి నుంచి మల్లికార్జునసదన్ వెళ్లే రూటు, టోల్‌గేట్ నుంచి శివసదనం కూడలి రోడ్లను పరిశీలించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందునా అందుకు తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ చేపట్టాలన్నారు.
ఇరువైపులా మొక్కలతో పచ్చదనాన్ని పెంపొందిస్తే క్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. తిరుమలలోని అలిపిరి తరహాలో క్షేత్రంలో కూడా ప్రవేశ రహదారులను ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలంలోని ప్ర«ధాన రహదారుల విస్తరణలో పక్కా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్వాన ద్వారాలు, సందేశాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఆయుర్వేద వైద్యశాల పరిశీలన..
దేవస్థానం పరిధిలోని ఆయుర్వేద ఆసుపత్రిని జేఎస్వీ ప్రసాద్.. ఈఓ నారాయణభరత్‌గుప్త, ఎండోమెంట్ సీఈ సుబ్బారావు, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం హార్టికల్చరిస్ట్ ఏడీ వెంకట్రావు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ లావణ్య ఆసుపత్రికి సంబంధించిన విషయాలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో ఔషధ మొక్కలను పెంచాలని, వాటి వివరాలు, ఆవశ్యకతను తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు భక్తులు, స్థానికులకు అందిస్తున్న వైద్యసేవలు, అందుకు అవసరమైన వసతులపై ఈఓ నారాయణ భరత్‌గుప్త, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎండోమెంట్ సీఈ సుబ్బారావు, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం హార్టికల్చరిస్ట్ ఏడీ వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Advertisement