తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదు | temples administration committees soon, says endowments minister Manikyala rao | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదు

Published Mon, Aug 18 2014 11:37 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM

తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదు - Sakshi

తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదు

హైదరాబాద్ : రెండు వారాల్లోగా అన్ని దేవాలయాల్లో పాలకమండళ్లు నియమిస్తామని ఏపీ దేవాదాయశాఖ  మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టీటీడీకి స్పెసిఫైడ్ అథార్టీ కమిటీని నియమించే యోచన లేదన్నారు. సెప్టెంబర్ 2వ వారంలో టీటీడీ పాలకవర్గం నియామకంతో పాటు వచ్చేనెలాఖరుకల్లా అన్ని దేవాలయాల పాలక వర్గాలను నియమిస్తామన్నారు.

టీటీడీలో సభ్యుల సంఖ్య 15 నుంచి 18కి పెంచుతామన్నారు. ప్రతి దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో మెంబరు పెంపు ఉంటుందన్నారు. టీటీడీ పాలకవర్గంలో తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదని మాణిక్యాలరావు తేల్చి చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement