ట్రస్ట్‌బోర్డుల నియామకానికి నోటిఫికేషన్
Published Tue, Jun 13 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
కర్నూలు (న్యూసిటీ): దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని నాలుగు దేవాలయాలకు సంబంధించి ట్రస్ట్‌బోర్డుల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తూ డీసీ అనురాధ ఉత్తర్వులు జారీ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. బనగానపల్లె వీరప్పయ్య స్వామి దేవాలయం నేలమట్టం, ఆళ్లగడ్డ మండలం రుద్రవరం భాస్కరాంజనేయ, నందీశ్వర స్వామి దేవాలయాలు, చింతకొమ్మదిన్నె చెన్నకేశవ స్వామి దేవాలయం, బోయలకుంట్ల రామేశ్వర అనంత పద్మనాభ స్వామి తదితర 6బి గ్రూపులోని ఆలయాల ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. నాలుగు దేవాలయాలు రూ.రెండు లక్షలకుపైగా ఆదాయం కల్గినవని, ఒక్కొక్క దేవాలయానికి ఏడుగురు సభ్యుల బోర్డును నియమిస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను కమిషనర్, దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రధాన కార్యాలయం, గొల్లపూడి, అమరావతి, విజయవాడకు పంపాలన్నారు. ట్రస్టుబోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారన్నారు.
Advertisement
Advertisement