
విజయవాడ దుర్గగుడి
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశం సోమవారం రసాభాసగా సాగింది. ఆలయ ఈవో, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. ఉద్యోగుల సస్పెన్షన్ పై పాలకమండలి జోక్యం పట్ల ఈవో కోటేశ్వరమ్మ అసంతృప్తి చెందారు.
సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోమని లెటర్ ఇచ్చింది చైర్మన్ గౌరంగబాబు కాబట్టి దీనికి ఆయనే బాధ్యత వహించాలన్న పాలకమండలి సభ్యులు. పాలనా పరంగా ఉద్యోగుల విషయాల్లో కలుగచేసుకోవద్దంటు చైర్మన్ గౌరంగబాబు. పాలకమండలి ఉద్యోగుల విషయంలో చెర్మన్, పాలకమండలి సభ్యలు జోక్యం చేసుకోవద్దన్న ఈవో దీంతో సమావేశం చెర్మన్ గౌరంగబాబు బయటకు వెళ్లి పోయ్యారు.