Board Members
-
అధిక రేటింగ్ కంపెనీ బోర్డుల్లో మహిళలు
న్యూఢిల్లీ: అధిక రేటింగ్ కలిగిన కంపెనీలు.. బోర్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ తాజాగా పేర్కొంది. తక్కువస్థాయి రేటింగ్ కలిగిన కంపెనీలతో పోలిస్తే వీటిలో బోర్డు సభ్యులుగా స్త్రీలకు అధికంగా చోటు కలి్పస్తున్నట్లు తెలియజేసింది. సంస్థ రేటింగ్ ఇచి్చన 3,138 కంపెనీలను విశ్లేషించినట్లు వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్(బీఏఏ, అంతకంటే అధిక రేటింగ్) కలిగిన కంపెనీల బోర్డు సీట్లలో సగటున 29 శాతం మంది మహిళలకు చోటు లభించింది. 2023తో పోలిస్తే 1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక స్పెక్యులేటివ్ గ్రేడ్(బీఏ, అంతకంటే తక్కువ రేటింగ్) కంపెనీలలో సగటున 24 % బోర్డు సీట్లను మహిళలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య యథాతథమే. అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థల్లో బోర్డు సభ్యుల లింగభేదం, క్రెడిట్ రేటింగ్స్ మధ్య పరస్పర సంబంధమున్నప్పటికీ వర్ధమాన మార్కెట్లలో ఇది లేనట్లు మూడీస్ పేర్కొంది. విశ్లేషణకు పరిగణనలోకి తీసుకున్న కంపెనీలలో 24 ఏఏఏ, 146 ఏఏ, 728 ఏ, 1165 బీఏఏ, 582 బీఏ, 394 బీ, 90 సీఏఏ, 9 సీఏ రేటింగ్ కలిగినవి ఉన్నట్లు వెల్లడించింది. -
పీటీఐ చైర్మన్‌గా శాంత్ కుమార్
న్యూఢిల్లీ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్(మైసూర్)కు చెందిన కేఎన్ శాంత్ కుమార్(62) ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా హిందుస్తాన్ టైమ్స్ సీఈవో ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారు. అవీక్ సర్కార్ స్థానంలో శాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు. శుక్రవారం ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీటీఐ బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. శాంత్ కుమార్ 1983 నుంచి ది ప్రింటర్స్ (మైసూర్) ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
టీటీడీ పాలకమండలి ప్రకటన
సాక్షి, గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి ప్రకటన వెలువడింది. TTD బోర్డు కొత్త సభ్యుల జాబితాపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ పాలక మండలిని ప్రకటించారు. బోర్డు సభ్యులుగా.. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను(జగయ్యపేట), పొన్నాడ సతీష్(ముమ్మిడివరం), తిప్పేస్వామి(మడకశిర)లకు అవకాశం దక్కింది. ఇక.. టీటీడీ సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు(ఉంగుటూరు).. నెరుసు నాగ సత్యం యాదవ్(ఏలూరు), ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ (శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య.. మాసీమ బాబు, ఎల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి(మంత్రాలయం), పెనక శరత్ చంద్రారెడ్డి, అశ్వద్థనాయక్‌లకు అనంతపురం నుంచి చోటు దక్కింది. టీటీడీ సభ్యులుగా మేకా శేషుబాబు, రాంరెడ్డి సాముల, డాక్టర్ కేథన్ దేశాయ్, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, ఎస్ఆర్ విశ్వనాథ్‌రెడ్డి, సుదర్శన్ వేణులకు అవకాశం దక్కింది. అలాగే.. తమిళనాడు నుంచి డాక్టర్ ఎస్. శంకర్, కృష్ణమూర్తి వైద్యనాథన్, కర్ణాటక నుంచి ఆర్వీ దేశ్‌పాండే, తెలంగాణ నుంచి గడ్డం సీతా రంజిత్‌రెడ్డి( ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి) , మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలె నియమితులైన సంగతి తెలిసిందే. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్‌కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్‌రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్‌కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్‌కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్‌కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్‌కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్‌కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్‌ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్‌రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్‌డ్రైవ్‌ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను యాక్సెస్ చేసిన ప్రశాంత్‌రెడ్డి.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్‌కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ షమీమ్, రమేశ్, సురేశ్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్‌లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నూతన బోర్డు ఎంపిక
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ 2023 సంవత్సరానికి గాను కొత్త బోర్డు కొలువుదీరింది. ఎన్నికైన నూతన బోర్డు కార్యవర్గం, ఇతర సభ్యుల చేత పద్మశ్రీ సంత్ సింగ్ వీరమణి ప్రమాణ స్వీకారం చేయించారని ఐఏఎన్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బోర్డు అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షుడు- దినేష్ హుడా మాజీ అధ్యక్షుడు- ఉర్మీత్ జునేజా సుష్మా మల్హోత్రా - ప్రెసిడెంట్ ఎలెక్ట్ కార్యదర్శి - జస్టిన్ వర్గీస్ కోశాధికారి- పద్మ మిశ్రా జాయింట్ కోశాధికారి- నవాజ్ ఝా డైరెక్టర్స్: శ్రేయాన్స్ జైన్, స్మరణిక రౌత్ , హేతల్ షా, వైభవ్ శేత్, మనీష్ చోక్షి , సుభాశిష్ నాయక్ , దీపక్ కల్రా, వెంకట్ ములుకుట్ల ట్రస్టీలు ఇందు రెడ్డి మందడి (ట్రస్టీ చైర్) కమల్ కౌశల్ (ట్రస్టీ కో-చైర్) సల్మాన్ ఫర్షోరి (తక్షణ గత కుర్చీ) స్వాతి షా శైలేష్ షా అక్రమ్ సయ్యద్ జాక్ గోధ్వాని ట్రస్టీ ఎమెరిటస్: షబ్నం మోద్గిల్, లాల్ దాస్వానీ, సుధీర్ పారిఖ్ తమ బోర్డ్ సభ్యులు 6 దశాబ్దాలకు పైగా భారతీయ సమాజానికి గొప్ప అభిరుచితో సేవలందిస్తున్నారని పేర్కొన్న పద్మశ్రీ సంత్ సింగ్ విర్మణి కొత్త బోర్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు అందించారు. IANTని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు దినేష్ హుడా, BOT చైర్ ఇందు రెడ్డి మందాడి వెల్లడించారు. 1962లో స్థాపించిన ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) ఉత్తర టెక్సాస్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన రాజకీయేతర, సెక్టారియన్ సంస్థ అని, 1976లో విలీనమైందని ఐఏఎన్టీ వెల్లడించింది. సాంస్కృతిక విద్యా అవసరాలను తీర్చడమే ప్రాథమిక ఉద్దేశమని సంస్థ ప్రకటించింది. IANT అనేది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ద్వారా DFW ఏరియాలో ఆమోదించబడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) గొడుగు సంస్థ అని పేర్కొన్నారు. గత 60 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో వివిధ కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా భారతీయ సంతతికి చెందిన విశిష్ట వ్యక్తులు భారతీయ సమాజానికి సేవ సేవలందించారని ఐఏఎన్టీ పేర్కొంది. -
నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్‌గా అరుణ గంటి
న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) బోర్డుకి చైర్ పర్సన్ పదవి తొలిసారిగా మహిళకు వరించింది. నాట్స్‌లో అంచెలంచెలుగా ఎదిగిన అరుణ గంటికి తాజాగా బోర్డ్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. 2011 నుంచి అరుణ గంటి నాట్స్‌లో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. తన నాయకత్వ ప్రతిభతో నాట్స్‌కు మహిళల మద్దతు కూడగట్టడంలో ఆమె విశేష కృషి జరిపారు. బోర్డు చైర్ పర్సన్ ఎంపికతో పాటు మిగిలిన బోర్డు సభ్యులను కూడా ప్రకటించారు. సేవాభావం పెంపొందిస్తా తన మీద నమ్మకం ఉంచి నాట్స్ బోర్డ్ బాధ్యతలను అప్పగించిన నాట్స్ సభ్యులకు అరుణ గంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళ సాధికారిత, మహిళా చైతన్యం కోసం నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్‌గా తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. అలాగే చిన్నారులు, యువతలో సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు తన ప్రాధాన్యత అని అరుణ గంటి చెప్పుకొచ్చారు. నాట్స్ వైపు వారిని ఆకర్షించేలా తన ప్రయత్నాలు ఉంటాయన్నారు. బోర్డు సభ్యులు 2022- 2023 సంవత్సరానికి నాట్స్ ప్రకటించిన బోర్డు సభ్యుల వివరాలు అరుణ గంటి (చైర్ వుమన్), శ్రీధర్ అప్పసాని (ఇమ్మీడియేట్ పాస్ట్ చైర్మన్), ప్రశాంత్ పిన్నమనేని ( వైస్ చైర్మన్), శ్యామ్ నాళం (బోర్డ్ సెక్రటరీ), శేఖర్ అన్నే, ప్రెసిడెంట్ (డాక్టర్ మధు కొర్రపాటి) బోర్డు సభ్యులుగా శ్రీనివాస్ గుత్తికొండ, మోహన కృష్ణ మన్నవ, డాక్టర్ సుధీర్ అట్లూరి, ఆది గెల్లి, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజ్ అల్లాడ, ప్రేమ్ కలిదిండి, కృష్ణ మల్లిన, వంశీ కృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, శ్రీనివాస్ మల్లాది, రాజేంద్ర మాదాల, మధు బోడపాటి, సునీల్ పాలేరు, శ్రీనివాస్ అరసాడ, రాజేష్ నెట్టెం, రఘు రొయ్యూరు, సుమిత్ అరిగపూడి, శ్రీనివాస్ బొప్పన, మూర్తి కొప్పాకలు ఉన్నారు. -
ముఖేశ్ అంబానీ కూతురికి అరుదైన గౌరవం
Smithsonian’s National Museum: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. వందేళ్ల వేడుకలు స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్‌ని 1923లో ప్రారంభించారు. రాబోయే 2023లో వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను నిర్వహించే బాధ్యత కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యుల మీదే ఉంది. ఇషా అంబానీ బోర్డు సభ్యురాలిగా చేరడంతో మ్యూజియం నిర్వాహాన మరింత బాగా ఉంటుందని చరిత్ర ప్రేమికులు నమ్ముతున్నారు. ప్రతిష్టాత్మక మ్యూజియం అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉన్న స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్‌లో అనేక అద్భుత కళాఖండాలు ఉన్నాయి. ఇందులో ఇండియా, మెసపోటనియా, జపాన్, చైనాలకు చెందిన 45,000లకు పైగా చారిత్రక చిత్రాలు, శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. రాతి యుగం నుంచి నేటి అధునాత యుగం వరకు ఏషియా నాగరికతను పట్టిచ్చే కళాఖండాలు ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి. -
30 మందితో టీటీడీ నూతన పాలకమండలి
-
ఐపీవో బాట- ఫ్లిప్‌కార్ట్ బోర్డులో మిస్త్రీ
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా బోర్డు పునర్వ్యవస్థీకరణకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ అంశాలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి ఉద్యోగులకు తాజాగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం 2021లో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. బోర్డులో సీఈవో కళ్యాణ్‌తోపాటు.. హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ చేరనున్నారు. ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్లోబల్ సీఈవో సురేష్ కుమార్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ సైతం బోర్డులో సభ్యులు కానున్నారు. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ సీఈవో జుడిత్ మెకెన్నా బోర్డుకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. బోర్డు నుంచి బయటకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి హైప్రొఫైల్ వ్యక్తులు కొంతమంది వైదొలగనున్నారు. జాబితాలో వాల్‌మార్ట్ వ్యవస్థాపకులు స్టువార్ట్ వాల్టన్‌తోపాటు, కుటుంబ సభ్యులున్నారు. మరోవైపు వాల్‌మార్ట్ ఏషియాకు వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిర్క్ వాన్ డెన్ బెర్గే పదవీ విరమణ చేయనున్నారు. తద్వారా ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి తప్పుకోనున్నారు. మేక్‌మైట్రిప్‌కు చెందిన రాజేష్ మాగో, స్వతంత్ర డైరెక్టర్ రోహిత్ భగత్ సైతం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి వైదొలగనున్నారు. రోహిత్ భగత్ ఫోన్‌పే కొత్త బోర్డులో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 40 బిలియన్ డాలర్లు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాదిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ విలువను మాతృ సంస్థ వాల్‌మార్ట్ 40 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. ఈ బాటలో ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ విభాగం ఫోన్‌పేను ప్రత్యేక సంస్థగా విడదీయనుంది. దీనిలో భాగంగా ఫోన్‌పేకు సొంత బోర్డును ఏర్పాటు చేయనున్న్లట్లు తెలుస్తోంది. తదుపరి దశలో ఫోన్‌పే 5.5 బిలియన్ డాలర్ల విలువలో నిధులను సమకూర్చుకునే ప్రణాళిల్లో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
తప్పు తేలితే బోర్డు సభ్యులను బ్లాక్ చేయాలి
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు సభ్యులు, అధికారులను సెబీ బ్లాక్ లిస్ట్ (నిషేధిత జాబితా)లో పెట్టాలని, అప్పటి వరకు వారికి చెల్లించిన పారితోషికాలను ముక్కు పిండి వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలకు మేలు చేసే విధంగా లేకపోతే తప్ప.. ప్రజావేగులు చేసే ఫిర్యాదులపై దర్యాప్తు సమాచారాన్ని కూడా వాటాదారులకు అందించాలన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘కార్పొరేట్ గవర్నెన్స్’పై నిర్వహించిన కార్యక్రమంలో మూర్తి పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజా వేగు ఫిర్యాదుపై విచారణలో భాగంగా కంపెనీ బోర్డు సభ్యులు, అధికారులు తమ విశ్వసనీయ విధులను సరిగ్గా న్విహించలేదని, పాలనా లోపం ఉన్నట్టు తేలితే రాజీనామా చేయాలని కోరాలి. ప్రజా వేగు ఫిర్యాదు అన్నది అసంతృప్త ఉద్యోగి నుంచి ప్రతీకార చర్య రూపంలో ఉండరాదు. తన ఫిర్యాదుకు ఆధారంగా అవసరమైన డేటా, వాస్తవాలను ఫిర్యాదిదారు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫిర్యాదిదారుకు వేధింపుల్లేకుండా కంపెనీ సరైన రక్షణ కల్పించాలి’’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాలను వినిపించారు. పారదర్శకత అవసరం..‘‘ప్రజా వేగు ఫిర్యాదును పరిష్కరించే విధానం పారద్శకంగా, విశ్వసనీయతను పెంచే విధంగా ఉండడం తప్పనిసరి. ఒకవేళ ఫిర్యాదు మధ్య స్థాయి లేదా దిగువ స్థాయి ఉద్యోగికి వ్యతిరేకంగా వచ్చినట్టయితే.. ఆ ఉద్యోగితో సంబంధం లేని సీనియర్ ఉద్యోగులతో ఓ కమిటీని నియమించి విచారణ నిర్వహించాలి. ఒకవేళ బోర్డు సభ్యులు లేదా చైర్మన్ లేదా సీఈవోకు వ్యతిరేకంగా పిర్యాదు దాఖలైతే.. చాలా వరకు భారతీయ కంపెనీల బోర్డులు బయటి నుంచి ఓ న్యాయ సేవల సంస్థ సహకారంతో విచారణ చేసి అస్పష్టంగా ముగించేస్తున్నారు. కానీ ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ఇటువంటి ప్రజావేగు ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో టాప్ టెన్ వాటాదారులు, సమాజంలో ఎంతో గౌరవనీయులైన వ్యక్తులను విచారణలో భాగం చేస్తున్నాయి’’ అంటూ నారాయణ మూర్తి కంపెనీల బోర్డులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదుల విచారణలో నిజాయితీ అవసరమని గుర్తు చేశారు. -
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా వీరే..
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో ఏడుగురుని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు గోవింద హరి, ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు రాకేశ్ సిన్హా, ముంబై లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అమోల్ కాలే, బెంగుళూర్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, భువనేశ్వర్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు దుష్మత్ కుమార్, చెన్నై లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఏజే శేఖర్‌లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 29 మందితో టీటీడీ 50వ ధర్మకర్తల మండలి రూపొందనుంది. ఎంపికైన వారు సెప్టెంబరు 23న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. -
దుర్గగుడి సమావేశంలో మరోసారి బయటపడ్డ విభేదాలు
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశం సోమవారం రసాభాసగా సాగింది. ఆలయ ఈవో, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. ఉద్యోగుల సస్పెన్షన్ పై పాలకమండలి జోక్యం పట్ల ఈవో కోటేశ్వరమ్మ అసంతృప్తి చెందారు. సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోమని లెటర్ ఇచ్చింది చైర్మన్ గౌరంగబాబు కాబట్టి దీనికి ఆయనే బాధ్యత వహించాలన్న పాలకమండలి సభ్యులు. పాలనా పరంగా ఉద్యోగుల విషయాల్లో కలుగచేసుకోవద్దంటు చైర్మన్ గౌరంగబాబు. పాలకమండలి ఉద్యోగుల విషయంలో చెర్మన్, పాలకమండలి సభ్యలు జోక్యం చేసుకోవద్దన్న ఈవో దీంతో సమావేశం చెర్మన్ గౌరంగబాబు బయటకు వెళ్లి పోయ్యారు. -
ఈవో Vs చైర్మన్!
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో అధికారవర్గం.. పాలకవర్గం విభేదాలపై పెడుతున్న శ్రద్ధ.. భక్తులకు మెరుగైన సేవలు అందించే అంశంపై పెట్టలేకపోతున్నారనేది అమ్మ భక్తులకు అర్థమవుతున్న విషయం. భక్తులు మెచ్చేలా.. అందరికీ నచ్చేలా నిర్ణయాలతో ముందడుగువేయాల్సిన తరుణంలో ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. కనకదుర్గమ్మ ఆలయ అధికారవర్గం.. పాలకవర్గం మధ్య విభేదాలు పాలక మండలి సమావేశం సాక్షిగా మరోమారు బహిర్గతమయ్యాయి. ఎడముఖం.. పెడముఖంగా ఈవో, చైర్మన్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి ఎవరి ధోరణిలో వారు మాట్లాడటం భక్తులను విస్మయపరుస్తోంది. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈఓ, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. దుర్గగుడి పాలక మండలి సమావేశం శనివారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రంలోని బోర్డు మీటింగ్ హాల్లో జరిగింది. చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఓ వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈఓ కోటేశ్వరమ్మ మాత్రమే మీడియాతో ప్రసంగించి ముగించారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల తర్వాత నలుగురు సిబ్బందిపై వేటు వేయడంపై పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యవహారం దేవస్థాన అడ్మినిస్ట్రేషన్‌కు చెందిందని ఈఓ సర్ది చెప్పారు. ఈ విషయంలో పాలక వర్గం ఆగ్రహంగా ఉంది. పాలక వర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి ఈఓ మీడియాకు వివరించి సమావేశాన్ని హడావుడిగా ముగించేశారు. అయితే సమావేశం గురించి, ఉద్యోగులపై వేటు వ్యవçహారం గురించి చైర్మన్‌ను వివరణ కోరగా, ఆయన మరోమారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాలక వర్గం, ఈఓ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేది అర్థమవుతోంది. దత్తత ఆలయాల నిర్వహణపై దృష్టి : ఈఓ దుర్గగుడి దత్తత ఆలయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు పాలక మండలి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లో దుర్గగుడి దేవస్థానం సిబ్బందిని నియమించాలని నిర్ణయించామన్నారు. ఇటీవల ఓ ఆలయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో గర్భగుడిని అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ధూపదీప నైవేద్యాలను సరిగా నిర్వహించడం లేదని గుర్తించి అర్చకుడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీంతో ఆ ఆర్చకుడు ఈఓ, ఏఈఓతో పాటు వైదిక కమిటీపై సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశామని వివరించారు. దుర్గాఘాట్‌లో పూజా సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల లైసెన్సులు రెన్యువల్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్‌లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు అవసరమైన ఇంజినీరింగ్ పనులకు ఆమోదం తెలిపామన్నారు. ఘాట్ రోడ్డులో పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించామని, అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బంగారం, వెండిని మింట్ ద్వారా కరిగించి గోల్డ్ బాండ్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గొల్లపూడిలోని దేవస్థానానికి చెందిన స్థలంలో కాటేజీలు నిర్మించేందుకు పాలకవర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. త్వరలోనే వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి విధి విధానాలను వచ్చే పాలక వర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని చెప్పారు. బస్టాండ్‌లో దేవస్థాన ప్రసాదాల కౌంటర్‌ను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలతో పాటు క్యాలెండర్లను విక్రయించనున్నామన్నారు. పాలకవర్గాన్ని పట్టించుకోవడం లేదు : చైర్మన్ పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాలను ఈఓ మీడియాకు వివరించారు. ఇంతలో దేవస్థానానికి హైకోర్టు న్యాయమూర్తులు వస్తున్నారంటూ ఈఓ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. దీంతో చైర్మన్ గౌరంగబాబు మీడియాతో మాట్లాడకుండానే సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల ఆలయంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై చైర్మన్, పాలక మండలి సభ్యులను మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడేందుకు అంగీకరించారు. దేవస్థానంలో నలుగురు ఉద్యోగులపై చర్యలు అంశంపై పాలక మండలిలో చర్చించేందుకు సభ్యులు ప్రతిపాదన చేశారని, అయితే అది దేవస్థాన అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన వ్యవహారంగా ఆలయ ఈఓ పేర్కొన్నారని తెలిపారు. దసరా ఉత్సవాలకు ఎంత వెచ్చించారని చైర్మన్‌ను ప్రశ్నించగా, గత ఏడాది దసరా ఉత్సవాల్లో మొత్తం రూ.6.65 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ తమకు రికార్డు పూర్వకంగా వివరాలను తెలిపారని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.8.40 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారన్నారు. అయితే గత ఏడాది దసరా ఉత్సవాల్లో సుమారు రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ పలుమార్లు పేర్కొనడం జరిగిందని, ఈ వ్యవహారంలో పాలక మండలిపై కావాలనే ప్రచారం చేయడం ఎంత వరకు సబబని పాలక మండలి సభ్యులు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సుధా నారాయణమూర్తి చేత జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పదవి ద్వారా సామాన్య ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. -
తితిదే బోర్డు మెంబర్ల నియామకం..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం చేపట్టింది. టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రా రెడ్డి, డొక్కా జగన్నాధం, సండ్ర వెంకట వీరయ్య(తెలంగాణ), ఇనుగాల పెద్దిరెడ్డి(తెలంగాణ), సుధా నారాయణ మూర్తి(కర్ణాటక), సప్న (మహారాష్ట్ర) నియమితులయ్యారు. -
వారిని బోర్డునుంచి తొలగించండి- బాలకృష్ణన్
సాక్షి, బెంగళూరు: ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.బాలకృష్ణన్ బోర్డు వ్యవహారంపై మరోసారి ధ్వజమెత్తారు. సెబీతో రాజీకి రావడంపై స్పందించిన ఆయన ఇన్ఫీ బోర్డులో అలాంటి సభ్యులను రద్దు చేయాలని శనివారం డిమాండ్ చేశారు. కార్పొరేట్ పాలనలో లోపాలకు నామినేషన్, ఆడిట్ కమిటీ బాధ్యులు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యంగా అప్పటి కో ఛైర్మన్ రవి వెంకటేశన్, ఆడిట్ కమిటీ ఛైర్మన్ రూపా కుద్వా లాంటి వారిని బోర్డునుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిణామాల దృష్టా, బోర్డును పునర్నిర్మించాలని బాలకృష్ణన్ సూచించారు. అత్యధిక సమర్ధులు, విలువలతో వ్యక్తులను ఎంపిక చేయడం అన్నిటికన్నా ముఖ్యమైందన్నారు. మూర్తి ఎప్పుడూ అత్యున్నత కార్పొరేట్ గవర్నెన్స్ కోసం నిలబడ్డారని, ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆయన వ్యవహరించారని బాలకృష్ణన్ చెప్పారు. మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి ఆ కంపెనీ క్షమాపణ చెప్పాలని కంపెనీ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ అన్నారు. మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్‌తో వివాద పరిష్కారానికి కంపెనీ సెబీని ఆశ్రయించిన నేపథ్యంలోఆయన స్పందించారు. ఎట్టకేలకు మూర్తి వ్యాఖ్యలే నిజమయ్యాయని, అందుకే ఆయనకు క్షమాపణ చెప్పాలని సూచించారు. కాగా సంస్థ మాజీ కంపెనీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సాల్ సెవరన్స్ పే విషయంలో సెటిల్మెంట్ చేయాలని ఇన్ఫీ సెబీని కోరిన సంగతి తెలిసిందే. -
ఉబర్ మాజీ సీఈవో ఏకపక్ష నిర్ణయం
ఉబర్ మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ ఏకపక్షంగా కీలక నిర్ణయం తీసుకుని బోర్డు సభ్యులను ఆశ్చర్యపరిచారు. ఈ పాపులర్ రైడ్ సర్వీసులో ఇప్పటికే నాయకత్వంలో ఉన్న టెన్షన్‌ను మరింత పెంచుతూ.. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలోకి మరో ఇద్దరు కొత్త సభ్యులను చేర్చుకున్నారు. శుక్రవారం రోజు జిరాక్స్ మాజీ చైర్మన్, సీఈవో ఉర్సుల బర్న్స్ ను, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ జాన్ థైన్లను బోర్డులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నియామకంపై వచ్చే వారంలో బోర్డు ఓటింగ్ జరుగనుంది. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జూన్‌లో కలానిక్ ఉబర్ సీఈవోగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో కొత్త సభ్యుల నియామకంపై జరుగబోయే ఓటింగ్‌లో కలానిక్‌కు తక్కువ ఓటింగ్ అధికారాలున్నట్టు అమెరికా మీడియా రిపోర్టు చేసింది. అపారమైన బోర్డు అనుభవం కలిగిన ఉర్సుల, జాన్ థైన్లు ఇద్దరూ అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లీడర్లని కలానిక్ చెప్పారు. బోర్డును పునర్వ్యస్థీకరించాలనే తాజా బోర్డు ప్రతిపాదన మేరకే వీరి నియామకం జరిగినట్టు చెప్పారు. వీరి నియామకంపై కలానిక్ బోర్డును సంప్రదించకపోవడం బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ఆశ్చర్యపరించింది. ఉర్సుల, జాన్ థైన్ నియామాకం ఇటు ఉబర్‌కు, అటు బోర్డుకు పూర్తిగా ఆశ్చర్యపరిచే విషయమని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో మరో కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. బోర్డులో కలానిక్‌కు మద్దతిచ్చేవారు, వ్యతిరేకించేవారు రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. -
జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సెంట్రల్ : జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ల ఎంపికకు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం పర్యవేక్షణాధికారి యల్లప్ప ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ది డైరెక్టర్ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసు, వెల్ఫేర్/ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ శాఖ, డోర్ నంబర్ 31–1–3ఎన్, సర్దార్ పటేల్ రోడ్డు, మారుతీనగర్, విజయవాడ–520004 అడ్రస్సుకు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు http://wcdsc.ap.nic.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. -
క్లీన్ ఇమేజ్ కోసం...
ముంబై: బెట్టింగ్, ఫిక్సింగ్ కుంభకోణాలతో మసక బారిపోయిన ఐపీఎల్ ప్రతిష్టను పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చిలో ‘క్లీన్ ఐపీఎల్’ ప్రచారాన్ని నిర్వహించబోతోంది. ఇందుకోసం దిగ్గజ క్రికెటర్లు సచిన్, గంగూలీల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఎప్పటికీ అవినీతికి వ్యతిరేకమేనని ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రచారం చేయనున్నట్లు బోర్డు సభ్యులు చెప్పారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు పలు భాషల్లో వీరు ప్రచారం చేస్తారు. ఏడో సీజన్ ఆరంభమయ్యే నాటికి అభిమానులు గతాన్ని మర్చిపోవాలన్నదే తమ ఉద్దేశమని బోర్డు సభ్యుడొకరు చెప్పారు. -
అన్నీ అమ్మకాలే!
అంగన్వాడీ నియామకాలలో నిబంధనలు గాలికి వదిలేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వారికి, అదీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యధిక పోస్టులు కట్టబెట్టేశారు. ఒక్కో పోస్టును రూ.50 వేల నుంచి రూ.70 వేల దాకా అమ్ముకున్నారు. ఇందులో హిందూపురం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఆంతరంగికుడు చక్రం తిప్పగా.. ముఖ్య అధికారి, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేసేశారు. గత ఏడాది రెండు విడతలుగా జరిగిన ఈ అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వచ్చాయి. అర్హత ఉండి ఉద్యోగాలు పొందలేకిపోయిన వారు సమాచార హక్కు చట్టం కింద నియామకాల ప్రక్రియ ఏ విధంగా సాగిందో బయటకు తీశారు. వీటి ఆధారంగా బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. హిందూపురం మునిసిపాలిటీ, న్యూస్‌లైన్ : హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 247 (మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు-94, మినీ అంగన్వాడీ కార్యకర్తలు-46, సహాయకులు-107) పోస్టుల భర్తీకి 2011 జనవరి 12న దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు 2013 ఫిబ్రవరి 5న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 245 పోస్టులు భర్తీ చేశారు. రెండో విడతలో 85 (మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 23, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 27, సహాయకులు-35) పోస్టుల భర్తీకి 2013 జూలై4న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి అదే ఏడాది నవంబర్ 15న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 59 పోస్టులు భర్తీ చేశారు. 29 పెండింగ్‌లో ఉన్నాయి. ఇంటర్వ్యూ బోర్డులోని ఓ ముఖ్య అధికారి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కలిసి ముందుగా నిర్ణయించుకున్న వారికే మిగతా సభ్యులు ఆమోదముద్ర వేసేలా ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభ ఉన్నా తమను పక్కకు పెట్టారంటూ హిందూపురం, చిలమత్తూరు మండలాలకు చెందిన దాదాపు పది మంది కోర్టుకెళ్లారు. తాజాగా 36 పోస్టులకు నోటిఫికేషన్ హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో తాజాగా 36 (మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు -8, మినీ అంగన్వాడీ కార్యకర్తలు -8, సహాయకులు-20) అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ తేదీని ఖరారు చేయాల్సి ఉంది. ఈసారైనా ఉన్నతాధికారులు అక్రమాలకు చెక్‌పెట్టి.. ప్రతిభ, అర్హత ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అన్యాయం చేశారు హిందూపురంలోని మోడల్‌కాలనీ-2 అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. పదోతరగతిలో 352 మార్కులు వచ్చాయి. అనుభవం మార్కులు చూసుకుంటే ప్రస్తుతం నియమించిన కార్యకర్తకంటే నాకే ఎక్కువ. ఎంపిక చేసిన కార్యకర్త వివరాలను అడిగితే అధికారులు ఇవ్వడంలేదు. దీంతో నేను హైకోర్టును అశ్రయించి స్టే తీసుకొచ్చాను. అయినా అధికారులు స్పందిస్తున్న దాఖలాల్లేవ్. - జె.శోభావతి, బాధితురాలు సున్నా మార్కులు వేశారు హిందూపురం పట్టణంలోని సత్యసాయికాలనీ అంగన్వాడీ వర్కర్ పోస్టుకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నాం. అందులో పదో తరగతిలో 418 మార్కులతో నేనే అందరికన్నా ముందు న్నా. ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాను. అయితే నాకు ఎమ్మెల్యే 0, ఐసీడిఎస్ అధికారులు 0 మార్కులు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టుకు ఎంపిక చేసిన ఆమె కన్నా నాకు పదో తరగతిలో 101 మార్కులు ఎక్కువ. విద్యావలంటీర్‌గా కూడా పని చేశాను. అయినా నన్ను ఎంపిక చేయలేదు. ఈ అక్రమ నియామకంపై న్యాయ పోరాటం చేస్తా. - ప్రశాంతి, బాధితురాలు -
రాజకీయాల్లోకి వస్తున్న ఇన్ఫోసిస్ ప్రవుఖులు