
క్లీన్ ఇమేజ్ కోసం...
ముంబై: బెట్టింగ్, ఫిక్సింగ్ కుంభకోణాలతో మసక బారిపోయిన ఐపీఎల్ ప్రతిష్టను పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చిలో ‘క్లీన్ ఐపీఎల్’ ప్రచారాన్ని నిర్వహించబోతోంది.
ఇందుకోసం దిగ్గజ క్రికెటర్లు సచిన్, గంగూలీల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఎప్పటికీ అవినీతికి వ్యతిరేకమేనని ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రచారం చేయనున్నట్లు బోర్డు సభ్యులు చెప్పారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు పలు భాషల్లో వీరు ప్రచారం చేస్తారు. ఏడో సీజన్ ఆరంభమయ్యే నాటికి అభిమానులు గతాన్ని మర్చిపోవాలన్నదే తమ ఉద్దేశమని బోర్డు సభ్యుడొకరు చెప్పారు.