సాక్షి, బెంగళూరు: ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.బాలకృష్ణన్ బోర్డు వ్యవహారంపై మరోసారి ధ్వజమెత్తారు. సెబీతో రాజీకి రావడంపై స్పందించిన ఆయన ఇన్ఫీ బోర్డులో అలాంటి సభ్యులను రద్దు చేయాలని శనివారం డిమాండ్ చేశారు. కార్పొరేట్ పాలనలో లోపాలకు నామినేషన్, ఆడిట్ కమిటీ బాధ్యులు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యంగా అప్పటి కో ఛైర‍్మన్ రవి వెంకటేశన్, ఆడిట్ కమిటీ ఛైర‍్మన్ రూపా కుద్వా లాంటి వారిని బోర్డునుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత పరిణామాల దృష్టా, బోర్డును పునర్నిర్మించాలని బాలకృష్ణన్ సూచించారు. అత్యధిక సమర్ధులు, విలువలతో వ్యక్తులను ఎంపిక చేయడం అన్నిటికన్నా ముఖ్యమైందన్నారు. మూర్తి ఎప్పుడూ అత్యున్నత కార్పొరేట్ గవర్నెన్స్ కోసం నిలబడ్డారని, ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆయన వ్యవహరించారని బాలకృష్ణన్ చెప్పారు. మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి ఆ కంపెనీ క్షమాపణ చెప్పాలని కంపెనీ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ అన్నారు. మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్‌తో వివాద పరిష్కారానికి కంపెనీ సెబీని ఆశ్రయించిన నేపథ్యంలోఆయన స్పందించారు. ఎట్టకేలకు మూర్తి వ్యాఖ్యలే నిజమయ్యాయని, అందుకే ఆయనకు క్షమాపణ చెప్పాలని సూచించారు.
కాగా సంస్థ మాజీ కంపెనీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సాల్ సెవరన్స్ పే విషయంలో సెటిల్మెంట్ చేయాలని ఇన్ఫీ సెబీని కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment