V Balakrishnan
-
దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..
బెంగళూరు: యూరోపియన్ యూనియన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బ్రిటన్‌లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్ దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో భారత్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. -
సెన్సార్ బోర్డు అధికారిగా బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిగా వి. బాలకృష్ణ ఈ రోజు(గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అయిన బాలకృష్ణ ఇప్పటి వరకు.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార అధికారిగా, యోజన తెలుగు మాస పత్రిక ఎడిటర్‌గా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎడిటర్‌గా, పత్రికా సమాచార కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు.అలాగే ఇద్దరు ఉప రాష్ట్రపతుల వద్ద ఇన్ఫర్మేషన్ అధికారిగా పని చేసి బదిలీపై హైదారాబాద్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా సెన్సార్ ధృవీకరణ పత్రం మంజూరుకు కృషి చేస్తానన్నారు. -
నందన్ నీలేకనిపై బాలకృష్ణన్ ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంపై ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.బాలకృష్ణన్ ప్రశంసలు కురిపించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఇన్పీ బోర్డు సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని అభినందించారు. గత బోర్డు చేసిన 'దుర్వినియోగాలను' సరిచేయడానికి, ప్రస్తుత సిఈఓకు సహేతుకమైన జీతాలను ఫిక్సి చేశారన్నారు. ముఖ్యంగా మాజీ సీఈవో విశాల్ సిక్కా కంటే తక్కువ వేతనం ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత నష్టాలను సరిచేయడానికి నందన్ సరియైన పని చేశారని, ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాలరీ స్ట్రక్చర్ రీజనబుల్‌గా ఉందని శనివారం వ్యాఖ్యానించారు. ఉన్నత వృద్ధిని పొందడం ద్వారా వాటాదారుల విలువను పెంచుకునేందుకు స్పష్టంగా దృష్టి కేంద్రీకరించాలనీ, బోర్డు ఏవైనా అభీష్టాలను వ్యక్తీకరించాలంటే సరైన వాదనతో వాటాదారులకు వివరించాలని ఆయన సూచించారు. కాగా ఇన్ఫీ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పరేఖ్ జీతం 2018-2019 ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 65 మిలియన్లుగా నిర్ణయించారు. వేతనం కింద రూ.6.5 కోట్లు, దీనికి తోడు రూ.9.75 కోట్లను వేరియబుల్ చెల్లింపుల కింద పొందుతారని ఇన్పోసిస్ ప్రకటించింది. మాజీ సీఈవో విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు. -
వారిని బోర్డునుంచి తొలగించండి- బాలకృష్ణన్
సాక్షి, బెంగళూరు: ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.బాలకృష్ణన్ బోర్డు వ్యవహారంపై మరోసారి ధ్వజమెత్తారు. సెబీతో రాజీకి రావడంపై స్పందించిన ఆయన ఇన్ఫీ బోర్డులో అలాంటి సభ్యులను రద్దు చేయాలని శనివారం డిమాండ్ చేశారు. కార్పొరేట్ పాలనలో లోపాలకు నామినేషన్, ఆడిట్ కమిటీ బాధ్యులు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యంగా అప్పటి కో ఛైర్మన్ రవి వెంకటేశన్, ఆడిట్ కమిటీ ఛైర్మన్ రూపా కుద్వా లాంటి వారిని బోర్డునుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిణామాల దృష్టా, బోర్డును పునర్నిర్మించాలని బాలకృష్ణన్ సూచించారు. అత్యధిక సమర్ధులు, విలువలతో వ్యక్తులను ఎంపిక చేయడం అన్నిటికన్నా ముఖ్యమైందన్నారు. మూర్తి ఎప్పుడూ అత్యున్నత కార్పొరేట్ గవర్నెన్స్ కోసం నిలబడ్డారని, ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆయన వ్యవహరించారని బాలకృష్ణన్ చెప్పారు. మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి ఆ కంపెనీ క్షమాపణ చెప్పాలని కంపెనీ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ అన్నారు. మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్‌తో వివాద పరిష్కారానికి కంపెనీ సెబీని ఆశ్రయించిన నేపథ్యంలోఆయన స్పందించారు. ఎట్టకేలకు మూర్తి వ్యాఖ్యలే నిజమయ్యాయని, అందుకే ఆయనకు క్షమాపణ చెప్పాలని సూచించారు. కాగా సంస్థ మాజీ కంపెనీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సాల్ సెవరన్స్ పే విషయంలో సెటిల్మెంట్ చేయాలని ఇన్ఫీ సెబీని కోరిన సంగతి తెలిసిందే. -
2018లో దేశీ ఐటీకి మంచి రోజులు..
హైదరాబాద్: అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగుపడుతోంది కాబట్టి దేశీ ఐటీ రంగానికి వచ్చే ఏడాది మెరుగ్గా ఉండగలదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీపై వ్యయం పెరగనుందని, కస్టమర్ల నుంచి డిమాండ్ కూడా ఎక్కువవుతుందని భావిస్తున్నట్లు వారు చెప్పారు. భారత ఐటీ రంగం ప్రధానంగా ఆధారపడే అమెరికా మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోగలగడమన్నది దేశీ సంస్థలకు కీలకమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ చెప్పారు. ‘అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బాగా మెరుగుపడింది. వార్షికంగా సుమారు 2–2.5 శాతం మేర వృద్ధి చెందుతోంది. ఇది అమెరికా వంటి దేశానికి మెరుగైన వృద్ధి రేటే. పైపెచ్చు అక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్... కార్పొరేట్ పన్నుల్ని తగ్గిస్తామని చెబుతున్నారు. దీంతో ఐటీపై కంపెనీలు చేసే వ్యయాలు కూడా 4–4.5 శాతం మేర పెరగబోతోంది. కాబట్టి వ్యాపార వృద్ధికి అవకాశాలు బాగున్నాయనే చెప్పొచ్చు. కాకపోతే వాటిని మన ఐటీ కంపెనీలు ఎంత మేర అందిపుచ్చుకోగలవన్నదే కీలకం’’ అని ఆయన వివరించారు. ఇక భారత ఐటీ కంపెనీల సమాఖ్య నాస్కామ్.. 2017–18లో ఐటీ ఎగుమతులు 7–8% మేర పెరగొచ్చని, దేశీ మార్కెట్ 10–11% మేర వృద్ధి చెందవచ్చని వేసిన అంచనాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయన్నారు. అంతర్జాతీయంగా ఐటీపై ఏటా 3.7 లక్షల కోట్ల డాలర్ల వ్యయాలు ఉంటుండగా.. ఇందులో మూడో వంతు ఐటీ సర్వీసులదేనని బాలకృష్ణన్ తెలిపారు. అటు ఇన్ఫోసిస్ మరో మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ సైతం డిజిటల్ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని చెప్పారు. -
టెకీ ఉద్యోగ సంఘాలపై ఇన్ఫీ బాలకృష్ణన్
ఉద్యోగుల తొలగింపుతో ఆందోళనలో ఉన్న టెకీలు ఉద్యమ బాట పట్టడంపై ఐటీ పరిశ్రమ సీనియర్ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకుంటున్నపుడు ఐటీ కంపెనీల్లో యూనియన్ల అవసరం లేదని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ తేల్చి చెప్పారు. అలాగే ఐటీ లో భారీ ఉద్యోగాల కోత అని వస్తున్న నివేదికలు కేవలం అతిశయోక్తి మాత్రమేనని కొట్టి పారేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన చెల్లింపుల విషయంలో తాము చాలా నైతికంగా వ్యవహరిస్తున్నామనీ ఇన్ఫీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిటిఐకి చెప్పారు. పనిపరిస్థితులు, జీత భత్యాలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో అసలు ఉద్యోగ సంఘాల అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు, వారి హక్కుల పట్ల అస్తవ్యస్తంగా, అనైతికంగా వ్యవహరించే కంపెనీలకు తప్ప ఐటీ కంపెనీలకు ఉద్యోగ సంఘాలు అవసరం లేదని చెప్పారు. ఐటీలో సంక్షోభంలో ఉన్నపుడు యూనియన్లు పుట్టుకొస్తాయని, కానీ తర్వాత ఉనికిలోఉండవని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా తీసివేతలు రెండంకెల్లోనే న్నాయన్నారు. కాబట్టి, ఐటీ పరిశ్రమలో యూనియన్ అవసరం లేదనీ , ఒకవేళ యూనియన్ ఉన్నా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారని భావించడం లేదన్నారు. మిగిలిన వాటిల్లా ఐటి సాంప్రదాయ పరిశ్రమ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పని అవకాశాలు కల్పిస్తూ భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిభ ఆధారంగా తొలగింపులు తప్ప, భారీ ఉద్యోగాల నష్టం అనేది అతిశయోక్తి తప్ప మరోకటి కాదని బాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లతో ఐటీ సర్వీసుల పరిశ్రమ ఒకే స్థాయిలో వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోందనీ వచ్చే ఏడాది రెండింతలు పెరగవచ్చంటూ ఆయన కొత్త ఆశలురేకెత్తించారు. అంతేకాదు ఐటీలో అవకాశాలు చాలా పెద్దవిగా ఉన్నాయన్నారు. భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకటిన్నర నుండి రెండు శాతం వద్ద పెరుగుతోందని బాలకృష్ణన్ తెలిపారు. -
ఇన్ఫోసిస్ షేర్లు బైబ్యాక్ చేయాలి
బెంగళూరు: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టాలని కంపెనీ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌తోపాటు, కొంతమంది బడా ఇన్వెస్టర్ల గ్రూప్ డిమాండ్ చేసింది. తద్వారా కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విశాల్ సిక్కాపై ఇన్వెస్టర్లకు గురి కుదురుతుందని వీరంతా పేర్కొన్నారు. షేరుకి రూ. 3,850 ధరలో షేర్ల బైబ్యాక్ చేసి ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు విలువను చేకూర్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. కంపెనీ చరిత్రలో తొలిసారి సొంత షేర్లను కొనుగోలు చేయడం(బైబ్యాక్) ద్వారా కంపెనీ వాటాదారుల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. వ్యవస్థాపకుల్లో ఒక్కరు కూడాలేని ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ వ్యవస్థాపకుడు కాని వ్యక్తి విశాల్ సిక్కా ఇన్ఫోసిస్‌కు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశ్రమ వృద్ధికంటే కంపెనీ వెనకబడింది. బైబ్యాక్ విషయమై రిటైల్ ఇన్వెస్టర్ల తరఫున జూలై 29న కంపెనీకి బాల లేఖ రాశారు. లేఖను బోర్డు సభ్యులతోపాటు, నారాయణ మూర్తికి, విశాల్ సిక్కాకుసైతం పంపినట్లు తెలిపారు. నిలకడైన, భారీ బైబ్యాక్‌కు తెరలేపాల్సిందిగా ఇన్ఫోసిస్ బోర్డును లేఖలో బాల కోరారు. సంస్థాగత ఇన్వెస్టర్లతో నిర్వహించిన చర్చల్లోనూ తమ ప్రతిపాదనకు మద్దతు లభించినట్లు తెలిపారు.1993 జూన్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఇన్ఫోసిస్ ఇంతవరకూ బైబ్యాక్ చేపట్టలేదు.