
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిగా వి. బాలకృష్ణ ఈ రోజు(గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అయిన బాలకృష్ణ ఇప్పటి వరకు.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార అధికారిగా, యోజన తెలుగు మాస పత్రిక ఎడిటర్‌గా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎడిటర్‌గా, పత్రికా సమాచార కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు.అలాగే ఇద్దరు ఉప రాష్ట్రపతుల వద్ద ఇన్ఫర్మేషన్ అధికారిగా పని చేసి బదిలీపై హైదారాబాద్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా సెన్సార్ ధృవీకరణ పత్రం మంజూరుకు కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment