Central Board of Film Certification
-
అడల్ట్ మూవీకి ఓకే చెప్పిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్స్ ఉన్నప్పటికీ!
లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన చిత్రం 'బార్బీ'. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్‌తో పాటు మార్గోట్ రాబీ నటించారు. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్కు అర్థం ఏమిటంటే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్‌తో పాటు.. కొన్ని అసభ్యకరమైన సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని 12 ఏళ్ల వయసులోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్‌ను బట్టి అర్థమవుతోంది. (ఇది చదవండి: టైగర్ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే) అంతే కాకుండా ఈ చిత్రంలో హస్తప్రయోగంతో పాటు లైంగిక వేధింపుల దృశ్యాలు ఉండడంతో హాలీవుడ్ మూవీ బార్బీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మూవీలో కొన్ని అసభ్యకరమైన పదాలు, లైంగిక వేధింపుల సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన బార్బీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. జూలై 21, 2023న థియేటర్లలోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో విల్ ఫెర్రెల్, ఎమ్మా మాకీ, కానర్ స్విండెల్స్, నికోలా కాగ్లాన్, ఎమరాల్డ్ ఫెన్నెల్, కేట్ మెక్‌కిన్నన్, మైఖేల్ సెరా, సిము లియు, అమెరికా ఫెర్రెరా, కుటి గట్వా, ఇస్సా రే, కింగ్స్లీ బెన్-అదిర్, రియా పెర్ల్‌మాన్, షారన్ ఇవాన్స్ , అనా క్రజ్ కేన్, రీతు ఆర్య, జామీ డెమెట్రియో ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) -
సీబీఎఫ్సీ కార్యాలయాలు మూసివేత
కోవిడ్ 19 (కరోనావైరస్) ప్రభావంతో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రసూన్ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశం ఇలా.... ‘‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు సంబంధించిన మా క్లయింట్స్, ప్యానెల్ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, మిగతా సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని తొమ్మిది సీబీఎఫ్సీ కార్యాలయాలను మూసివేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో ఇకపై సినిమాలు స్క్రీనింగ్ కావు. కరోనా ప్రభావం తగ్గగానే తిరిగి మా సేవలను ప్రారంభిస్తాం. సందేహాలకోసం ఆయా కార్యాలయాల్లో హెల్ప్‌లైన్ నెంబర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనున్నారు. తద్వారా ఆన్ లైన్ అప్లికేషన్స్, ఫిల్మ్ అప్లికేషన్స్ వంటి వాటిని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మనందరి సమిష్టి పోరాటంతో ఈ విపత్కర పరిస్థితుల నుంచి త్వరలోనే బయట పడతామనే నమ్మకం నాకు ఉంది’’ అని జోషి పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. -
సెన్సార్ బోర్డు అధికారిగా బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిగా వి. బాలకృష్ణ ఈ రోజు(గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అయిన బాలకృష్ణ ఇప్పటి వరకు.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార అధికారిగా, యోజన తెలుగు మాస పత్రిక ఎడిటర్‌గా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎడిటర్‌గా, పత్రికా సమాచార కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు.అలాగే ఇద్దరు ఉప రాష్ట్రపతుల వద్ద ఇన్ఫర్మేషన్ అధికారిగా పని చేసి బదిలీపై హైదారాబాద్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా సెన్సార్ ధృవీకరణ పత్రం మంజూరుకు కృషి చేస్తానన్నారు. -
సెన్సారింగ్ మీ పని కాదు
సర్టిఫికేషనే మీ బాధ్యత - సీబీఎఫ్సీపై బాంబే హైకోర్టు మండిపాటు - ఏం చూడాలో ప్రజలను నిర్ణయించుకోనివ్వండి ముంబై: ఉడ్తా పంజాబ్ చిత్రంలో దృశ్యాలను కత్తిరించాలని కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) సూచించటంపై ముంబై హైకోర్టు మండిపడింది. చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వటమే బోర్డు పని అని.. అది వది లేసి సెన్సారింగ్ చేయటం మీ పని కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రం నిజంగానే అభ్యంతరకరంగా, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనుకుంటే.. ఎందుకు దీనిపై నిషేధం విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇదే సమయంలో చిత్ర నిర్మాతలు కూడా బోర్డు సూచించిన అనవసరమైన దృశ్యాలను తొలగించాలని సూచించింది. ప్రజలు ఏం చూడాలనుకుంటున్నారో వారి నే నిర్ణయించుకోనివ్వాలంది. రెండ్రోజులు జరిగిన విచారణను ముగించిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ శాలిని జోషిల డివిజన్ బెంచ్ సోమవారం తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా సీబీఎఫ్సీ బోర్డుపై కోర్టు మండిపడింది. ‘సర్టిఫికేషన్ ఇవ్వటంలో అతిగా ప్రవర్తిం చొద్దు దీనివల్ల సినిమాల్లోని సృజనాత్మకత చచ్చిపోతుంది. చిత్రంలో పంజాబ్, పంజాబ్‌లోని నగరాల పేర్లను తొలగించాలన్న రివైజింగ్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకెళ్తే.. సినిమా అర్థమే మారిపోతుంది. ఓ వ్యక్తి, ఓ ప్రాంతం గురించి నిర్మాతలు విమర్శించాలనుకుంటే దాన్నలాగే చూపించండి. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనిపిస్తే నిషేధించండి’ అని సూచించింది. అనవసర రాద్ధాంతం వల్ల చిత్రానికి అవసరానికి మించిన పబ్లిసిటీ పెంచుతున్నారని తెలిపింది. ‘చిత్ర నిర్మాతలు కూడా అనవసర దృశ్యాలు, అసభ్యపదజాలాన్ని చూపిస్తేనే జనాలకు నచ్చుతుందనుకోవద్దు. నేటి తరం చాలా పరిణతితో ఆలోచిస్తోంది. మంచి కథాంశం లేక ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతున్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని సూచించింది. ‘అడల్ట్ విత్ కాషన్’ ఉండాలి: శ్యాంబెనగల్ ముంబై: సినిమాల్లో కేటగిరీల్లో ‘అడల్ట్ విత్ కాషన్’ అనే కేటగిరీ ఉండాల్సిన అవసరం ఉందని సెన్సార్ బోర్డు పనితీరుపై ఏర్పాటైన కమిటీ సారథి దర్శకుడుశ్యామ్ బెనగల్ అభిప్రాయపడ్డారు. పెద్దలకు చెందిన విషయాల తీవ్రత ఎక్కువగా ఉన్న చిత్రాలకు ‘అడల్ట్ విత్ కాషన్’ లేదా ఏ/సీ పేరుతో సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించామన్నారు. అలాగే యూనివర్సల్(యూ)లో ‘యూ/ఏ 12 ప్లస్’, ‘యూ/ఏ 15 ప్లస్’.. ఇలా రెండు కేటగిరీలు ఉండాలని చెప్పామన్నారు. -
కేంద్ర సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా రాధిక
హైదరాబాద్: కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా బీజేపీ నగర మహిళామోర్చా అధ్యక్షురాలు బండారు రాధిక శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సెన్సార్‌బోర్డు రీజినల్ అధికారి టి.వి.కె.రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బండారు రాధిక శ్రీధర్ మాట్లాడుతూ... అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. -
‘చిత్ర’మైన వివాదం!
మన కళ్లముందు జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి చిత్రంగా అనిపిస్తాయి. ఇది కలా నిజమా అని సందేహం కలిగిస్తాయి. ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’ చలన చిత్రం చుట్టూ ఇప్పుడు అల్లుకున్న వివాదం అలాంటిదే. ఆ చిత్రం ప్రదర్శన యోగ్యమైనది కాదని కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు భావించింది. అనుమతి నిరాకరించింది. ఆ చిత్ర నిర్మాతలు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అది ఆదరాబాదరాగా చిత్రాన్ని చూసింది. దాన్ని వెనువెంటనే అనుమతించింది. ఈలోగా బోర్డు చీఫ్ లీలా శాంసన్, 13మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక చిత్రాన్ని ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు కాదన డమూ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లి కొన్ని కత్తిరింపులతో అనుమతులు తెచ్చు కోవడమూ కొత్తేమీ కాదు. గతంలోనూ అలాంటి ఉదంతాలు జరిగాయి. కానీ ఒక చిత్రం అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం ఆదుర్దాపడటం...ఆ విషయంలో అలిగిన బోర్డు చీఫ్, సభ్యులు రాజీనామాలకు ఉపక్రమించడం గతం లో ఎన్నడూ లేదు. అసలు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు అన్న పేరే చిత్రమైనది. ఆ బోర్డు నెలకొల్ప డంలోని అంతరార్థమూ, బోర్డు సభ్యుల ప్రధాన వ్యాపకమూ చలనచిత్రాలను సెన్సార్ చేయడమైతే...దాని పేరులో ఎక్కడా ఆ సంగతి ఉండదు. దేశంలో తొలి చలనచిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913లో విడుదలైతే సినిమాటోగ్రాఫ్ చట్టం 1920 లో అమల్లోకి వచ్చింది. ఆ చట్టంకింద దేశంలో అప్పటికి ప్రధాన నగరాలనదగ్గ మద్రాసు, బొంబాయి, కలకత్తా, లాహోర్, రంగూన్‌లలో ఆయా ప్రాంతాల పోలీస్ చీఫ్‌ల ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డులు ఏర్పడ్డాయి. ఆ చట్టం స్థానంలో 1952లో మరో చట్టం రావడం, దానికి సైతం 1983లో సవరణలు వచ్చి ప్రస్తుత ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు ఏర్పడటం చరిత్ర. ఆ బోర్డుకు దేశంలోని తొమ్మిది నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మిగిలిన కళారూపాల్లాగే చలనచిత్రం కూడా ఒక కళా రూపం. పైగా అది ప్రజాబాహుళ్యాన్ని ప్రభావితం చేయగల బలమైన మాధ్యమం. ఆ కళారూపానికుండే శక్తిసామర్థ్యాలను గ్రహించబట్టే బ్రిటిష్ వలస పాలకులు ఆలస్యంగానైనా దేశంలో సెన్సార్ బోర్డు నెలకొల్పారు. ఇప్పుడు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డులకు పోలీసు బాస్‌ల సారథ్యం లేకపోయినా చీఫ్లుగా ఉంటున్న వారు అలాం టి మనస్తత్వంతోనే ఉంటున్నారన్నది చలనచిత్ర దర్శకులు, నిర్మాతలు తరచు చేసే ఆరోపణ. ఎవరిని కదిలించినా బోర్డుతో తమకెదురైన అనుభవాలను ఏకరువు పెడతారు. మన దేశంలో ‘సెన్సార్ బోర్డు’ అనేది ఎప్పుడూ అర్థంకాని బ్రహ్మ పదార్థమే! కొన్ని చిత్రాలు చూస్తే వాటికి ‘సెన్సార్’ అనుమతి ఎలా లభించిం దా అనే అనుమానం కలుగుతుంది. చిత్ర ప్రదర్శనకు బోర్డు ససేమిరా కాదన్న కొన్ని చిత్రాలు చివరకు న్యాయస్థానాల జోక్యంతో విడుదలైనప్పుడు చూస్తే వీటిని ఎందుకు కాద న్నారా అనే సందేహం ఏర్పడుతుంది. మహిళా సంఘాలను, అశ్లీల ప్రతిఘటనా వేదికవంటి సంస్థలు చలనచిత్రాల్లో మహిళలను కించపరిచే దృశ్యాలు ఎలా పెరిగి పోయాయో చెబుతాయి. నీచాభిరుచుల్ని ప్రేరేపించి సొమ్ము చేసుకోవాలనుకునే వైఖరివల్ల సమాజంలో విలువలు పతన మవుతున్నాయని ఆందోళన వెలి బుచ్చుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’ను బోర్డు కాదనడమేమిటన్న మీమాంస కలగడం సహజమే. హర్యానా, పంజాబ్‌లలో గణనీయమైన సంఖ్యలో అనుచరులున్న దేరా సచ్చా సౌదా సంస్థ అధినేత బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ నిర్మించిన చిత్రమిది. దైవంగా చెప్పుకునే వారిపైనా, వారి మహిమలపైనా ఇంతకు ముందూ చిత్రాలు వచ్చాయి. కానీ, అలాంటి బాబాల పాత్రను మరొకరెవరో పోషించడం ఆనవాయితీ. ఈ చిత్రంలో రాం రహీం సింగ్ తన పాత్రను తనే పోషిం చారు. దీనికే బోర్డు అభ్యంతరం చెప్పింది. చిత్రంలో ఆయన ప్రదర్శించే ఫీట్లు... ఆయన దైవసమానుడని భావించే వారిలో ఆ విశ్వాసాన్ని మరింత పెంచుతాయన్నది బోర్డు ప్రధాన అభ్యంతరం. సభ్యుల రాజీనామా వెనక రాజకీయాలున్నాయని ఆ మంత్రిత్వశాఖను చూస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ఉండొచ్చు. వారి కాలపరిమితి ఎటూ ముగుస్తుంది గనుక... మళ్లీ పునర్నియా మకమయ్యే అవకాశం లేదు గనుక దీన్ని సాకుగా వాడుకున్నారని ఆయన చెబుతు న్నారు. అయితే, రాజీనామాలిస్తూ వారు చేసిన ప్రకటనలోని అంశాలు అంత తీసిపా రేయదగ్గవి కాదు. బోర్డు అభ్యంతరాలను బేఖాతరుచేసి, తగిన అర్హతలు లేనివారితో ఆదరాబాదరగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చిత్రాన్ని అనుమతించడమేమిటన్నది వారి ప్రధాన ప్రశ్న. అలాగే బోర్డు విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని, చలనచిత్రాల గురించి కనీస అవగాహన లేని అధికారులను కేటాయించి బోర్డును ధ్వంసం చేస్తున్నారని వారి ఆరోపణ. ఈమధ్య విడుదలైన ఆమిర్‌ఖాన్ పీకే చిత్రం విషయంలో బోర్డుపై కేంద్రంనుంచి ఒత్తిళ్లు వచ్చాయని లీలా శాంసన్ అంటున్నారు. బోర్డు సభ్యుల రాజీనామాలో రాజకీయాలున్నాయో...సినిమాను ఆదరా బాదరాగా అనుమతించడంలో రాజకీయ ప్రయోజనాలున్నాయో చర్చించడంవల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అసలిలాంటి స్థితి ఎందుకేర్పడిందని కేంద్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. చలనచిత్రాలకు సర్టిఫికేషన్ ఇవ్వడంలో ఇప్పుడను సరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉండటం, బోర్డు పనితీరులో పారదర్శకత లోపించడం... ఒక బలమైన మాధ్యమాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పాలకుల మనస్తత్వం ఈ మొత్తం స్థితికి మూలకారణాలు. కళారంగంలో నిష్ణాతులు, సామా జిక సేవారంగంలో పనిచేస్తున్నవారు, రాజ్యాంగం, చట్టాల్లో అవగాహనకలవారు సభ్యులుగా...స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తే సెన్సార్ బోర్డుకు విశ్వసనీయత, ప్రతిష్ట చేకూరతాయి. ఈ విషయంలో ఏడాదిన్నర క్రితం జస్టిస్ ముద్గల్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఎన్నో విలువైనవి ఉన్నాయి. వాటిని పట్టించుకునేందుకు కేంద్రం ఇప్పటికైనా ప్రయత్నించాలి. -
లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు లింగ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. లింగా చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని తెలిపారు. లింగ చిత్రం తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో రజనీ ముత్తు, నరసింహ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. లింగ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. -
సెన్సార్ బోర్డును తప్పుపట్టిన దీపికా పదుకొనే!
ముంబై: సెన్సార్ బోర్డు వ్యవహారతీరుపై బాలీవుడ్ తార దీపికా పదుకొనే మండిపడ్డారు. సెన్సార్ బోర్డు మార్గదర్శకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని దీపికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. త్వరలో విడుదల కానున్న ఫైండింగ్ ఫెనీ చిత్రంలోని 'వర్జిన్ (కన్య)' అనే పదాన్ని తొలగించడంపై దీపికా అభ్యంతరం తెలిపారు. సెన్సార్ బోర్డు విజ్క్షప్తి సమంజసంగా లేదు. సరియైన నిబంధనలు లేవని భావిస్తున్నాను. ప్రతి ఆరు నెలలకొకసారి నిబంధనలు మారుస్తున్నారు అని ఓ కార్యక్రమంలో దీపికా వ్యాఖ్యలు చేసింది. దేనిపైనైనా అభ్యంతరం తెలిపేటప్పడు ఆ చిత్రానికి, సీన్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. అంతేకాకుండా అభ్యంతరం తెలిపినప్పుడు కారణాలు వెల్లడించాల్సిన అవసరం ఉంటుందని దీపికా పదుకొనే అన్నారు.