సెన్సార్ బోర్డును తప్పుపట్టిన దీపికా పదుకొనే!
సెన్సార్ బోర్డును తప్పుపట్టిన దీపికా పదుకొనే!
Published Thu, Sep 4 2014 3:50 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
ముంబై: సెన్సార్ బోర్డు వ్యవహారతీరుపై బాలీవుడ్ తార దీపికా పదుకొనే మండిపడ్డారు. సెన్సార్ బోర్డు మార్గదర్శకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని దీపికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. త్వరలో విడుదల కానున్న ఫైండింగ్ ఫెనీ చిత్రంలోని 'వర్జిన్ (కన్య)' అనే పదాన్ని తొలగించడంపై దీపికా అభ్యంతరం తెలిపారు. సెన్సార్ బోర్డు విజ్క్షప్తి సమంజసంగా లేదు. సరియైన నిబంధనలు లేవని భావిస్తున్నాను.
ప్రతి ఆరు నెలలకొకసారి నిబంధనలు మారుస్తున్నారు అని ఓ కార్యక్రమంలో దీపికా వ్యాఖ్యలు చేసింది. దేనిపైనైనా అభ్యంతరం తెలిపేటప్పడు ఆ చిత్రానికి, సీన్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. అంతేకాకుండా అభ్యంతరం తెలిపినప్పుడు కారణాలు వెల్లడించాల్సిన అవసరం ఉంటుందని దీపికా పదుకొనే అన్నారు.
Advertisement