![Tirumala TTD Board New Members 2023 Announced - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/25/TTD-Board-Members2023.jpg.webp?itok=FaM_denS)
సాక్షి, గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి ప్రకటన వెలువడింది. TTD బోర్డు కొత్త సభ్యుల జాబితాపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ పాలక మండలిని ప్రకటించారు. బోర్డు సభ్యులుగా.. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను(జగయ్యపేట), పొన్నాడ సతీష్(ముమ్మిడివరం), తిప్పేస్వామి(మడకశిర)లకు అవకాశం దక్కింది.
ఇక.. టీటీడీ సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు(ఉంగుటూరు).. నెరుసు నాగ సత్యం యాదవ్(ఏలూరు), ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ (శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య.. మాసీమ బాబు, ఎల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి(మంత్రాలయం), పెనక శరత్ చంద్రారెడ్డి, అశ్వద్థనాయక్‌లకు అనంతపురం నుంచి చోటు దక్కింది.
టీటీడీ సభ్యులుగా మేకా శేషుబాబు, రాంరెడ్డి సాముల, డాక్టర్ కేథన్ దేశాయ్, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, ఎస్‌ఆర్ విశ్వనాథ్‌రెడ్డి, సుదర్శన్ వేణులకు అవకాశం దక్కింది. అలాగే.. తమిళనాడు నుంచి డాక్టర్ ఎస్. శంకర్, కృష్ణమూర్తి వైద్యనాథన్, కర్ణాటక నుంచి ఆర్‌వీ దేశ్‌పాండే, తెలంగాణ నుంచి గడ్డం సీతా రంజిత్‌రెడ్డి( ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి) , మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలె నియమితులైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment