బోర్డు సభ్యులుగా చోటు
మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ వెల్లడి
న్యూఢిల్లీ: అధిక రేటింగ్ కలిగిన కంపెనీలు.. బోర్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ తాజాగా పేర్కొంది. తక్కువస్థాయి రేటింగ్ కలిగిన కంపెనీలతో పోలిస్తే వీటిలో బోర్డు సభ్యులుగా స్త్రీలకు అధికంగా చోటు కలి్పస్తున్నట్లు తెలియజేసింది. సంస్థ రేటింగ్ ఇచి్చన 3,138 కంపెనీలను విశ్లేషించినట్లు వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్(బీఏఏ, అంతకంటే అధిక రేటింగ్) కలిగిన కంపెనీల బోర్డు సీట్లలో సగటున 29 శాతం మంది మహిళలకు చోటు లభించింది.
2023తో పోలిస్తే 1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక స్పెక్యులేటివ్ గ్రేడ్(బీఏ, అంతకంటే తక్కువ రేటింగ్) కంపెనీలలో సగటున 24 % బోర్డు సీట్లను మహిళలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య యథాతథమే. అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థల్లో బోర్డు సభ్యుల లింగభేదం, క్రెడిట్ రేటింగ్స్ మధ్య పరస్పర సంబంధమున్నప్పటికీ వర్ధమాన మార్కెట్లలో ఇది లేనట్లు మూడీస్ పేర్కొంది. విశ్లేషణకు పరిగణనలోకి తీసుకున్న కంపెనీలలో 24 ఏఏఏ, 146 ఏఏ, 728 ఏ, 1165 బీఏఏ, 582 బీఏ, 394 బీ, 90 సీఏఏ, 9 సీఏ రేటింగ్ కలిగినవి ఉన్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment