న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) బోర్డుకి చైర్ పర్సన్ పదవి తొలిసారిగా మహిళకు వరించింది. నాట్స్‌లో అంచెలంచెలుగా ఎదిగిన అరుణ గంటికి తాజాగా బోర్డ్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. 2011 నుంచి అరుణ గంటి నాట్స్‌లో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. తన నాయకత్వ ప్రతిభతో నాట్స్‌కు మహిళల మద్దతు కూడగట్టడంలో ఆమె విశేష కృషి జరిపారు. బోర్డు చైర్ పర్సన్ ఎంపికతో పాటు మిగిలిన బోర్డు సభ్యులను కూడా ప్రకటించారు.
సేవాభావం పెంపొందిస్తా
తన మీద నమ్మకం ఉంచి నాట్స్ బోర్డ్ బాధ్యతలను అప్పగించిన నాట్స్ సభ్యులకు అరుణ గంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళ సాధికారిత, మహిళా చైతన్యం కోసం నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్‌గా తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. అలాగే చిన్నారులు, యువతలో సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు తన ప్రాధాన్యత అని అరుణ గంటి చెప్పుకొచ్చారు. నాట్స్ వైపు వారిని ఆకర్షించేలా తన ప్రయత్నాలు ఉంటాయన్నారు.
బోర్డు సభ్యులు
2022- 2023 సంవత్సరానికి నాట్స్ ప్రకటించిన బోర్డు సభ్యుల వివరాలు అరుణ గంటి (చైర్ వుమన్), శ్రీధర్ అప్పసాని (ఇమ్మీడియేట్ పాస్ట్ చైర్మన్), ప్రశాంత్ పిన్నమనేని ( వైస్ చైర్మన్), శ్యామ్ నాళం (బోర్డ్ సెక్రటరీ), శేఖర్ అన్నే, ప్రెసిడెంట్ (డాక్టర్ మధు కొర్రపాటి) బోర్డు సభ్యులుగా శ్రీనివాస్ గుత్తికొండ, మోహన కృష్ణ మన్నవ, డాక్టర్ సుధీర్ అట్లూరి, ఆది గెల్లి, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజ్ అల్లాడ, ప్రేమ్ కలిదిండి, కృష్ణ మల్లిన, వంశీ కృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, శ్రీనివాస్ మల్లాది, రాజేంద్ర మాదాల, మధు బోడపాటి, సునీల్ పాలేరు, శ్రీనివాస్ అరసాడ, రాజేష్ నెట్టెం, రఘు రొయ్యూరు, సుమిత్ అరిగపూడి, శ్రీనివాస్ బొప్పన, మూర్తి కొప్పాకలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment