TSPSC Paper Leak Case: SIT Issues Notice To Board Members - Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీకి సిట్ టెస్ట్‌.. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు

Published Sat, Apr 1 2023 1:41 AM | Last Updated on Sat, Apr 1 2023 11:12 AM

TSPSC Paper Leak Case SIT Notice To Board Members - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యు­డు లింగారెడ్డి, చైర్మన్‌ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్‌ అధికారులే టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్‌కాపీల (ప్రింటెడ్‌ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్‌ అప్లికేషన్‌ ద్వారా అందిందని సిట్‌ అధికారులు తేల్చారు. రాజశేఖర్‌రెడ్డి తనకు కంప్యూటర్‌ యాక్సెస్‌ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ) షమీమ్‌కు గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. 

ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. 
సిట్‌ అధికారులు ఏప్రిల్‌ 11న హైకోర్టుకు స్టేటస్‌ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి చైర్మన్‌ నేతృత్వంలో పనిచేయడంతో పాటు  కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్‌కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్‌కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్‌–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ డామెర రమేశ్‌కుమార్‌ ఇంతకుముందు కమిషన్‌ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్‌ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు.  

కేవలం ప్రింటెడ్‌ పత్రాలే ఇస్తూ..  
లీకైన పేపర్లలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్‌ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్‌ కంప్యూటర్‌ నుంచి ప్రవీణ్, రాజశేఖర్‌ చేజిక్కించుకున్నవి సాఫ్ట్‌కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్‌ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్‌లైన్‌ షేరింగ్‌ జోలికి పోలేదు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్‌కు మాత్రమే ఎనీడెస్క్‌ అప్లికేషన్‌ ద్వారా సాఫ్ట్‌కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్‌ఔట్స్‌ రూపంలో ఉన్న మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్‌ అధికారులు భావిస్తున్నారు. 

కంప్యూటర్‌ యాక్సెస్‌ కోసం పేపర్‌ ఇచ్చి.. 
రాజశేఖర్‌ తన పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్‌రెడ్డికి ఎనీడెస్క్‌ అప్లికేషన్‌ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్‌ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్‌ఓ షమీమ్‌ కూడా గ్రూప్‌–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్‌.. తాను ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేయాలని, ఎనీడెస్క్‌ ద్వారా న్యూజిల్యాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు యాక్సెస్‌ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్‌ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్‌ ఇచి్చన పెన్‌డ్రైవ్‌ను తీసుకువెళ్లిన షమీమ్‌ తన ఇంటివద్ద ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేసింది.

తర్వాత రాజశేఖర్‌ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్‌ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను యాక్సెస్‌ చేసిన ప్రశాంత్‌రెడ్డి.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్‌లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్‌కు ప్రవీణ్‌ ఇదే పంథాలో తన కంప్యూటర్‌ నుంచి ఎనీడెస్క్‌ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్‌–1 మెయిన్స్‌ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్‌.. ఎక్కడా లీకేజ్‌ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్‌ అధికారులు చెప్తున్నారు. 

ఫోరెన్సిక్‌ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ 
షమీమ్, రమేశ్, సురేశ్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్‌ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్‌లో ఉన్న­ది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపనున్నారు. మరోవైపు సిట్‌ అధికారులు గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్‌ అధికారులు చెప్తున్నారు.
చదవండి: రేవంత్‌ ఆరోపణలపై సిట్‌ రియాక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement