పీటీఐ చైర్మన్‌గా శాంత్‌ కుమార్‌ | KN Shanth Kumar of Deccan Herald is new PTI Chairman | Sakshi
Sakshi News home page

పీటీఐ చైర్మన్‌గా శాంత్‌ కుమార్‌

Published Sat, Sep 30 2023 5:55 AM | Last Updated on Sat, Sep 30 2023 5:55 AM

KN Shanth Kumar of Deccan Herald is new PTI Chairman - Sakshi

న్యూఢిల్లీ: ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్‌(మైసూర్‌)కు చెందిన కేఎన్‌ శాంత్‌ కుమార్‌(62) ఎన్నికయ్యారు. పీటీఐ వైస్‌ చైర్మన్‌గా హిందుస్తాన్‌ టైమ్స్‌ సీఈవో ప్రవీణ్‌ సోమేశ్వర్‌ ఎన్నికయ్యారు. అవీక్‌ సర్కార్‌ స్థానంలో శాంత్‌ కుమార్‌ బాధ్యతలు చేపడతారు.

శుక్రవారం ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీటీఐ బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. శాంత్‌ కుమార్‌ 1983 నుంచి ది ప్రింటర్స్‌ (మైసూర్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement