Shanta Kumar
-
పీటీఐ చైర్మన్‌గా శాంత్ కుమార్
న్యూఢిల్లీ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్(మైసూర్)కు చెందిన కేఎన్ శాంత్ కుమార్(62) ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా హిందుస్తాన్ టైమ్స్ సీఈవో ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారు. అవీక్ సర్కార్ స్థానంలో శాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు. శుక్రవారం ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీటీఐ బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. శాంత్ కుమార్ 1983 నుంచి ది ప్రింటర్స్ (మైసూర్) ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
‘ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి’
షిమ్లా: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయారని అన్నారు. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. ఈ కేటగిరీలోని సంపన్నులు రిజర్వేషన్లతో లాభపడుతున్నారని శాంత కుమార్ ఆక్షేపించారు. రిజర్వేషన్ల నుంచి క్రీమీలేయర్‌ను మినహాయించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీల్లోని రిజర్వుడ్ కేటగిరీ నేతలు క్రీమీలేయర్ కిందకు వస్తారని వివరించారు. క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ‘అంతర్జాతీయ ఆకలి సూచిక’లో 130 దేశాల్లో భారత్ 117 స్థానంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. దేశంలో 19.40 కోట్ల మంది ఆకలితో నిద్రిస్తున్నట్లు ఆ నివేదిక చెప్పిందన్నారు. వీరిలో 12 మంది కోట్ల మంది రిజర్వుడ్ కేటగిరీ ప్రజలేనని వివరించారు. కుల రిజర్వేషన్లతో ఆ వర్గంలోని పేదలు ప్రయోజనం పొందడం లేదన్న వాస్తవం అర్థమవుతోందని చెప్పారు. చదవండి: అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి! 50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ -
శరవణభవన్ యజమానికి యావజ్జీవం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హోటల్ శరవణభవన్ యజమాని రాజగోపాల్‌కు ఓ హత్య కేసులో సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. జూలై 7వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. హోటల్ శరవణభవన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి కూతురు జీవజ్యోతి (20) అదే హోటల్‌కు చెందిన మరో బ్రాంచ్‌లో పనిచేసేది. చెన్నై వాసి ప్రిన్స్ శాంతకుమార్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లాడాలని ఆమె భర్త శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. దీంతో రాజగోపాల్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన చెన్నై పూందమల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రాజగోపాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది. తర్వాత నిందితులు మద్రాసు హైకోర్టుకు, తదనంతరకాలంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు ఇచ్చిన యావజ్జీవశిక్షను సమర్ధించింది. శరవణభవన్ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. -
బీజేపీ తీరుపై అగ్రనేతల ఫైర్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్ ఫలితాలు చాటుతున్నాయని బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందని, విజయం వస్తే క్రెడిట్ తీసుకోడానికి ముందుకొచ్చే వాళ్లే.. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నట్టు కనిపిస్తున్నదని ఈ ప్రకటనలో అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'గత ఏడాది కాలంగా పార్టీలో కనిపిస్తున్న నీరసమైన విధానమే తాజా ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. తాజా ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర సమీక్ష జరుపాల్సిన అవసరముంది' అని అగ్రనేతలు పేర్కొన్నారు. -
'లెటర్ బాంబు' పేల్చిన బీజేపీ సీనియర్ నేత
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీజేపీ.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు మల్లగుల్లాలు పడుతుండగా.. ఊహించని విధంగా సొంత పార్టీ ఎంపీనే ఈ విషయంపై లెటర్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు రావడం పార్టీ ప్రతిష్టను మసకబార్చేలా ఉందని, అవినీతి నిర్మూలించేందుకు లోక్‌పాల్ మాదిరిగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖ 10 రోజుల కిందటే పంపినా పార్లమెంట్ సమావేశాల ముందురోజు ఫేస్బుక్లో పెట్టారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కాం సిగ్గుతో తలదించుకునేలా చేసిందని శాంతకుమార్ ఘాటుగా విమర్శించారు. రాజస్థాన్, మహారాష్ట్రలో అవినీతి భాగోతాన్ని ప్రస్తావిస్తూ నేతల అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్ బిల్లు అవసరముందని లేఖలో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పేర్లు ప్రస్తావించకుండానే విమర్శలు ఎక్కుపెట్టారు. లేఖలో రాసిన ప్రతి పదానికి తాను కట్టబడిఉన్నానని చెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన శాంతకుమార్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ గీతను దాటికి శాంతకుమార్ బహిరంగంగా విమర్శలు సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఎఫ్‌సీఐ పునర్నిర్మాణంపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ పథకం(పీడీఎస్) అమలులో కీలకపాత్ర పోషించే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పునర్నిర్మాణంపై తగిన సూచనలు చేసేందుకు 8మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పనితీరు, వ్యయం పరంగా ఎఫ్‌సీఐలో ఉన్న లోపాలను తొలగించే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చే సినట్టు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. పార్లమెంటు సభ్యుడు శాంతకుమార్ అధ్యక్షుడిగా ఎఫ్‌సీఐ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సీ విశ్వనాథ్, వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ, ఎలెక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి రామ్ సేవక్ శర్మ, పంజాబ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, అహ్మదాబాద్ ఐఐఎంకు చెందిన జీ రఘురామ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన జీ నాంచారయ్య తదితరులు కమిటీ సభ్యులుగా ఉంటారు. కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ, ఆహార భద్రత తదితర అంశాలపై ఎఫ్‌సీఐ మరింత క్రియాశీలకంగా నిర్వహించవలసిన పాత్రను గురించి ఈ కమిటీ సూచనలు చేస్తుంది. కమిటీ మూడు నెలల్లోగా తన నివేదిక సమర్పించవలసి ఉంటుంది. -
1977 లో ఫలితాలే పునరావృతం!
మండి(హిమాచల్ ప్రదేశ్): 1977వ సంవత్సరంలో కాంగ్రెస్ ఎదురైన ఘోర పరాభవమే ఆ పార్టీ మరోమారు చవిచూడనుందని బీజీపీ నేత శాంతా కుమార్ జోస్యం చెప్పారు. ఆనాడు తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా ఓడి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిందన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హిమచల్ ప్రదేశ్ లోని మండిలో ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ నేటి పాలనపై ధ్వజమెత్తారు. ఆరోజు ఎమర్జెన్సీ కారణంగా కాంగ్రెస్ ఘోర ఓటమిని ఎదుర్కొని.. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజల్లో నమ్మకం కోల్పోవడమేనని శాంతా కుమార్ తెలిపారు. అదే తరహా ఫలితాలు ఈనాటి సార్వత్రిక ఎన్నికల్లో పునారావృతం కానున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలోని అవినీతికి ఓటు వేసేందుకు ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారన్నారు. చరిత్రలో గుర్తిండిపోయే అత్యంత దుర్ధినాన్ని కాంగ్రెస్ కు ఎదురుకానుందన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అవసరం లేని అత్యధిక మెజారిటీని బీజేపీ ఈ ఎన్నికల్లో సాధిస్తుందన్నారు.