మండి(హిమాచల్ ప్రదేశ్): 1977వ సంవత్సరంలో కాంగ్రెస్ ఎదురైన ఘోర పరాభవమే ఆ పార్టీ మరోమారు చవిచూడనుందని బీజీపీ నేత శాంతా కుమార్ జోస్యం చెప్పారు. ఆనాడు తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా ఓడి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిందన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హిమచల్ ప్రదేశ్ లోని మండిలో ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ నేటి పాలనపై ధ్వజమెత్తారు. ఆరోజు ఎమర్జెన్సీ కారణంగా కాంగ్రెస్ ఘోర ఓటమిని ఎదుర్కొని.. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజల్లో నమ్మకం కోల్పోవడమేనని శాంతా కుమార్ తెలిపారు. అదే తరహా ఫలితాలు ఈనాటి సార్వత్రిక ఎన్నికల్లో పునారావృతం కానున్నాయన్నారు.
కాంగ్రెస్ పాలనలోని అవినీతికి ఓటు వేసేందుకు ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారన్నారు. చరిత్రలో గుర్తిండిపోయే అత్యంత దుర్ధినాన్ని కాంగ్రెస్ కు ఎదురుకానుందన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అవసరం లేని అత్యధిక మెజారిటీని బీజేపీ ఈ ఎన్నికల్లో సాధిస్తుందన్నారు.