తండ్రీ, తనయుల, సోదరులు, భార్యాభర్తలకు జయాలు, అపజయాలు
Published Sat, May 17 2014 2:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సోదరులు, భార్యాభర్తలకు జయాలు.. అపజయాలు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలైనవారిలో తండ్రీ కొడుకులు కూడా ఉండటం విశేషం. మహబూబ్‌నగర్ పార్లమెంట్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన నాగం జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డిలు ఓడిపోయారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్, అలంపూర్ అసెంబ్లీకి పోటీ చేసిన మందా జగన్నాథం, ఆయన కుమారుడు శ్రీనాథ్‌లు కూడా ఓటమి చవిచూశారు.
అలాగే మహబూబ్‌నగర్‌లోని మక్తల్, దేవరకద్రల నుంచి పోటీ చేసిన కె.దయాకర్‌రెడ్డి, ఆయన భార్య సీతా దయాకర్‌రెడ్డి కూడా ఓడిపోయారు. గద్వాల నుంచి పోటీ చేసిన డీకే అరుణ, మక్తల్ నుంచి పోటీచేసిన ఆమె సోదరుడు రామ్మోహన్‌రెడ్డి ఇద్దరూ గెలిచారు. ఇక డోర్నకల్ నుంచి పోటీచేసిన రెడ్యానాయక్ గెలుపొందగా, మహబూబాబాద్ నుంచి పోటీచేసిన ఆయన కూతురు కవిత ఓటమిపాలయ్యారు.
పెద్దపల్లి పార్లమెంట్, చెన్నూరు అసెంబ్లీ సీట్లకు పోటీచేసిన జి.వివేక్, జి.వినోద్ సోదరులూ పరాజయం చవిచూశారు. అలాగే భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోగా, నల్లగొండ అసెంబ్లీకి పోటీచేసిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలిచారు.
కేసీఆర్‌తోపాటు ఆయన కూతురు కవిత (నిజామాబాద్ పార్లమెంట్), కుమారుడు కేటీఆర్(సిరిసిల్ల అసెంబ్లీ)తోపాటు, మేనల్లుడు హరీష్‌రావు(సిద్దిపేట) గెలిచి సత్తా చాటారు. హుజూర్‌నగర్, కోదాడల నుంచి ఉత్తమ్‌కుమార్ దంపతులు కూడా గెలుపొందారు.
Advertisement
Advertisement