'కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని వస్తున్న వార్తలను ఆప్ ఖండించింది.
70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలుండగా, బీజేపీ 31 సీట్లు ఉండేవి. అయితే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల లోకసభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీలో జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 14 తేది నుంచి రాష్ట్రపతి పాలన విధించారు.