Smithsonian’s National Museum: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు.
వందేళ్ల వేడుకలు
స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్‌ని 1923లో ప్రారంభించారు. రాబోయే 2023లో వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను నిర్వహించే బాధ్యత కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యుల మీదే ఉంది. ఇషా అంబానీ బోర్డు సభ్యురాలిగా చేరడంతో మ్యూజియం నిర్వాహాన మరింత బాగా ఉంటుందని చరిత్ర ప్రేమికులు నమ్ముతున్నారు.
ప్రతిష్టాత్మక మ్యూజియం
అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉన్న స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్‌లో అనేక అద్భుత కళాఖండాలు ఉన్నాయి. ఇందులో ఇండియా, మెసపోటనియా, జపాన్, చైనాలకు చెందిన 45,000లకు పైగా చారిత్రక చిత్రాలు, శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. రాతి యుగం నుంచి నేటి అధునాత యుగం వరకు ఏషియా నాగరికతను పట్టిచ్చే కళాఖండాలు ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment