‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’ | Isha Ambani about Diwali celebrations with her family members | Sakshi
Sakshi News home page

‘పండగలు ఓ ఆటవిడుపు.. పర్యావరణం కోసం వాటికి నేను దూరం’

Published Thu, Oct 31 2024 9:21 AM | Last Updated on Thu, Oct 31 2024 9:35 AM

Isha Ambani about Diwali celebrations with her family members

దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్‌ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.

‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్‌ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి  నేను దూరం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్‌!

ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు

  •   రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌

  •   రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌

  •   జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

  •   రిలయన్స్‌ ట్రెండ్స్‌

  •   టిరా బ్యూటీ

  •   యూస్టా

  •   అజార్ట్‌

  •   హామ్‌లేస్‌

  •   నెట్‌మెడ్స్‌

  •   ఫ్రెష్‌పిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement