అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం | Interesting facts about Isha Ambani and Akash Ambani. | Sakshi
Sakshi News home page

అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం

Published Wed, Oct 23 2024 1:59 PM | Last Updated on Wed, Oct 23 2024 3:01 PM

Interesting facts about Isha Ambani and Akash Ambani.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ వారసులు, కవలు ఆకాశ్‌ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్‌-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్‌ ద్వారా అక్టోబర్‌ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.

ఇషా అంబానీ

  • ముంబయిలో అక్టోబర్‌ 23, 1991లో జన్మించారు.

  • యేల్‌ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

  • స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

  • పిరమల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌

  • రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌

  • జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

  • రిలయన్స్‌ ట్రెండ్స్‌

  • టిరా బ్యూటీ

  • యూస్టా

  • అజార్ట్‌

  • హామ్‌లేస్‌

  • నెట్‌మెడ్స్‌

  • ఫ్రెష్‌పిక్‌

ఇదీ చదవండి: పెట్రోల్‌ కల్తీని ఎలా గుర్తించాలంటే..

ఆకాశ్‌ అంబానీ

  • ముంబయిలో అక్టోబర్‌ 23, 1991లో జన్మించారు.

  • ముంబయిలోని ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషన్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు.

  • అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

  • 2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.

కింది సంస్థలకు ఆకాశ్‌ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌

  • జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిడెట్‌

  • రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌

  • ముంబయి ఇండియన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement