దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం.. ముఖేష్ అంబానీ కుటుంబం. ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఉత్సాహంగా పనిచేస్తూ కుటుంబానికి విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారి పిల్లలు అంటే ఇద్దరు కొడుకులు, కూతురు ఏం పని చేస్తున్నారు.. వ్యక్తిగతంగా ఎంత సంపాదిస్తున్నారన్నది ఆసక్తికరం.
రిలయన్స్ గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి తన పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ఉన్నత చదువులు చదివారు. వారి తండ్రి, తాతలను అనుసరించి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వారు రిలయన్స్ గ్రూప్‌లో ముఖ్యమైన విభాగాలను చూసుకుంటున్నారు.
ఆకాష్ అంబానీ
ఆకాష్ అంబానీ యూఎస్‌ఏలోని రోడ్ ఐలాండ్‌లోని ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. వ్యాపారం విషయానికి వస్తే తన తండ్రిని అనుసరించారు. ఆకాష్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో టెలికాం సేవలు, జియో సినిమా ఉన్నాయి. ఆకాష్ అంబానీ జీతం ఎంత అనేది వెల్లడించనప్పటికీ, ఆయన నెలవారీ జీతం దాదాపు రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా.
ఇషా అంబానీ
సోదరుడు ఆకాష్ అంబానిలాగే ఇషా అంబానీ కూడా వ్యాపారంలో మెలకువలు సాధించింది. ఆమె శిక్షణ పొందిన బిజినెస్ అనలిస్ట్ అలాగే సలహాదారు. యూఎస్‌లోని అగ్రశ్రేణి సంస్థలో కొంతకాలం పనిచేసిన తరువాత ఇషా అంబానీ తన తండ్రి వ్యాపారంలో చేరారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డివిడెండ్ లాభాలతో కలిపి ఇషా అంబానీ నెలవారీ జీతం రూ.35 లక్షలు ఉంటుందని అంచనా.
అనంత్ అంబానీ
ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు, ఆఖరి సంతానం అయిన అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఎనర్జీ వింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అంచనాల ప్రకారం.. అనంత్ అంబానీ నెలవారీ జీతం రూ. 35 లక్షలు.
ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!
Comments
Please login to add a commentAdd a comment