ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకు, కూతురు ఉంటే తల్లిదండ్రులు కూతురికే ముందు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ ఆనవాయితి దేశీయంగా దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలనే తేడా లేకుండా దీన్ని పాటిస్తున్నారు. ఇందుకు అంబానీ కుటుంబం కూడా అతీతం కాదని నిరూపించారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కవల పిల్లలు. మొన్న అక్టోబర్ 23న వారు పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తన సోదరుడి పెళ్లికి సంబంధించి ఇషా అంబానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘అన్నయ్య ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకామెహతాతో నిర్ణయించుకున్నారు. మార్చి 24, 2018న గోవాలో ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. మే, 2018లో ఆనంద్ పిరమాల్‌తో నాకు నిశ్చితార్థం జరిగింది. ముందుగా అన్నయ్య ఎంగేజ్‌మెంట్ జరిగింది కాబట్టి, తన వివాహం ముందే జరగాల్సి ఉంది. కానీ నా పెళ్లి కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అందుకు వదిన శ్లోకామెహతా కూడా ఎంతో సహకరించింది. నా వివాహం డిసెంబర్ 2018లో పూర్తయిన తర్వాత మార్చి 9, 2019లో అన్నయ్య-వదినల పెళ్లి జరిగింది’ అని ఇషా అంబానీ చెప్పారు.
ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
రిలయన్స్ ట్రెండ్స్
టిరా బ్యూటీ
యూస్టా
అజార్ట్
హామ్‌లేస్
నెట్‌మెడ్స్
ఫ్రెష్‌పిక్
ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు
ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్
ముంబయి ఇండియన్స్
Comments
Please login to add a commentAdd a comment