kanakadurga temple eo
-
ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల కలకలం
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పని చేస్తున్న ఉద్యోగులను ఆలయ అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించగా వారిని ఈఓ భ్రమరాంబ సస్పెండ్ చేశారు. అందులో ఒకరు సీనియర్ ఆసిస్టెంట్, మరొకరు జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం.. -
దుర్గగుడి సమావేశంలో మరోసారి బయటపడ్డ విభేదాలు
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశం సోమవారం రసాభాసగా సాగింది. ఆలయ ఈవో, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. ఉద్యోగుల సస్పెన్షన్ పై పాలకమండలి జోక్యం పట్ల ఈవో కోటేశ్వరమ్మ అసంతృప్తి చెందారు. సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోమని లెటర్ ఇచ్చింది చైర్మన్ గౌరంగబాబు కాబట్టి దీనికి ఆయనే బాధ్యత వహించాలన్న పాలకమండలి సభ్యులు. పాలనా పరంగా ఉద్యోగుల విషయాల్లో కలుగచేసుకోవద్దంటు చైర్మన్ గౌరంగబాబు. పాలకమండలి ఉద్యోగుల విషయంలో చెర్మన్, పాలకమండలి సభ్యలు జోక్యం చేసుకోవద్దన్న ఈవో దీంతో సమావేశం చెర్మన్ గౌరంగబాబు బయటకు వెళ్లి పోయ్యారు. -
కనకదుర్గ ఆలయ ఈఓగా పద్మ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయ వలనే ఈవో పోస్టు వచ్చిందని, అమ్మే ముందుండి తనను నడిపిస్తోందని చెప్పారు. శాస్ర్తాలకు విరుద్ధంగా కాకుండా భక్తులకు ఉపయోగపడేలా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఎవరి పని వారు చేసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవని వ్యాఖ్యానించారు. మిగతా ఆలయాల్లో ఏవిధంగా అభివృద్ధి ఉందో ఆవిధంగా చేయాలని అమ్మవారు కలలోకి వచ్చి సూచించారని తెలిపారు. ఆ విధంగా నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపై అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని పద్మ హామీ ఇచ్చారు. -
ఏం తమాషా చేస్తున్నావా?
-
ఏం తమాషా చేస్తున్నావా?
విజయవాడ: బెజవాడ కనకదుర్గ దేవాలయం ఈవో నర్సింగరావుపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. దాదాపు రూ. 25 లక్షల విలువైన బంగారు పాదుకలు కనకదుర్గ అమ్మవారికి సమర్పించేందుకు శ్రీ మిత్ర హౌసింగ్ చైర్మన్ ఎం వి చౌదరి ఆదివారం దుర్గమ్మ గుడికి విచ్చేశారు. ఆయనతోపాటు టాలీవుడ్ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు మంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడా వచ్చారు. అయితే అదే సమయానికి ఈవో నర్సింగరావు ఆలయంలో అందుబాటులో లేరు. దాంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీఐపీలు వస్తున్నారని సమాచారం అందించిన ఈవో ఎక్కడికెళ్లాడంటూ మంత్రి పుల్లారావు దేవాలయం సిబ్బందిపై మండిపడ్డారు. మంత్రి దేవాలయానికి వచ్చారన్న వార్త తెలుసుకున్న ఈవో వెంటనే దేవాలయానికి వచ్చారు. ఆయన్ని చూస్తూ పుల్లారావు ఆగ్రహంతో ఊగిపోయారు. వీఐపీలు వస్తున్నారని సమాచరం ఉండి కూడా నీవు బయటకు ఎలా వెళ్లావంటూ ప్రశ్నించారు. ఏం తమాషాలు చేస్తున్నావా అంటూ ఈవో నర్సింగరావుపై మండిపడ్డారు.