శ్రీశైలంలో వరుణయాగం
– ఆరంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త
– 29న మల్లన్నకు సహస్రఘటాభిషేకం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో తలపెట్టిన వరుణయాగాన్ని Ô¶ నివారం ప్రారంభించారు. ఆలయ›ప్రాంగణంలోని రుద్రయాగశాలలో ప్రారంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 29 వరకు ఆలయప్రాంగణంలో వరుణ జపాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత మహాగణపతి పూజ, స్థలశుద్ధి కోసం పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, రుద్రపారాయణలు తదితర కార్యక్రమాలు చేశారు. 29న చివరి రోజు మల్లన్న సహస్రఘటాభిషేకం జరుగుతుందని, భక్తులు, స్థానికులు పాల్గొనాలని ఈఓ కోరారు.