varunayagam
-
మంత్రా మజాకా.. పదవీ రక్షణ పూజలు
చెన్నై : తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో ఓ మంత్రి ఏకంగా పదవీ రక్షణ పూజలు సాగించారు. వరుణ యాగం నినాదం తెర మీదకు తెచ్చినా, వెను వెంటనే పదవీ రక్షణ పూజలు చేయడం గమనార్హం. నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఓఎస్ మణియన్‌కు మంత్రి పదవిని దివంగత సీఎం జయలలిత కేటాయించారు. అమ్మ మరణంతో చిన్నమ్మ శశికళకు విశ్వాసపాత్రుడిగా ఈ మంత్రి ఉన్నారని చెప్పవచ్చు. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్‌కు మద్దతుగా కూడా వ్యవహరించారు. సీఎం పళనిస్వామి శిబిరంతో అంటీఅంటనట్టుగా ఉన్న ఆయన తన పదవికి గండం సృష్టిస్తారేమోనన్న ఆందోళనలో పడ్డట్టుంది. దీంతో ఆదివారం ఏకంగా 50 మేకపోతుల్ని బలి ఇచ్చి పూజలు చేయడం గమనార్హం. వేదారణ్యంలోని ప్రసిద్ధి చెందిన వేదారణేశ్వరర్ ఆలయంలో వరుణ యాగంకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ యాగంకు మంత్రి, అన్నాడీఎంకే వర్గాలు తప్ప, బయటకు వ్యక్తులు ఎవ్వరు లేరు. ఇక్కడ యాగం అనంతరం నేరుగా మంత్రి మునీశ్వర ఆలయానికి చేరుకుని 50 మేక పోతుల్ని బలి ఇచ్చి, తన బంధువులు, సహచరులకు విందుతో పూజలు సాగించారు. తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో మంత్రి ఈ పూజలు సాగించినట్టుగా చర్చ ఊపందుకుంది. -
ముగిసిన వరుణయాగం
శ్రీశైలం: వర్షాలు కురవాలని దేవస్థానం గత నాలుగు రోజులుగా స్వామివార్ల యాగశాలలో నిర్వహిస్తున్న వరుణయాగానికి మంగళవారం పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఆలయ ఏఈఓ కష్ణారెడ్డి, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా యాగశాలలో నెలకొల్పబడిన దేవతా మూర్తులకు, ఋశ్యశంగమహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఋశ్యశంగుడిని ఆలయప్రాంగణంలో నిమజ్జనం చేశారు. -
వర్షం కోసం వరుణయాగం
కర్నూలు (న్యూసిటీ) : సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనిS వరుణయాగాలు చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నగరంలోని చిదంబరరావు వీధిలో వెలసిన నగరేశ్వరస్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. స్వామికి అభిషేకం చేసి, మల్లె, మారేడు దళాలతో అలంకరణ చేశారు. అర్చకులు రఘురామశర్మ, చంద్రశేఖరశ్మ, మురళీశర్మ, ధర్మకర్త మండలి సభ్యులు గోవిందరాజు, కష్ణమూర్తి, సత్యనారాయణ సింగ్, శేషుసింగ్, జితేంద్ర, భక్తులు పాల్గొన్నారు. వెంగన్నబావి ప్రాంతంలో ఉన్న శివాలయంలో.. నగర శివారులోని వెంగన్నభావి దగ్గర ఉన్న వేములవెంగన్న శివాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేసి, మల్లె పూలతో అలంకరణ చేశారు. అనంతరం వరుణయాగం, రుద్రహోమం నిర్వహించారు. కర్నూలు మండలాధ్యక్షుడు రాజావర్థన్‌రెడ్డి, దిన్నెదేవరపాడు సర్పంచు నాగన్న, దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు డీవీ సుబ్బయ్య, భక్తులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో కొనసాగుతున్న వరుణయాగం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న వరుణ యాగం కొనసాగుతోంది. శనివారం రెండో రోజున యాగశాలకు నైరుతి భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన తొట్టిలో నీళ్లు నింపారు. పూజల అనంతరం నలుగురు వైదికులు కంఠం మునిగే వరకు నీటిలో ఉండి నిరంతర వరుణ, రుష్యశృంగ జపాలను చేశారు. ఆ తరువాత ఆవాహన కలశాలను షోడశోపచారాలతో పూజించి, మండపంలో ఆవాహన చేసిన దేవతలకు ప్రత్యేకపూజల అనంతరం ప్రధాన కుండంలో యజ్ఞ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ యాగం ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు రుద్రపారాయణలు, వరుణసూక్తపారాయణలు, చతుర్వేద పారాయణలు, వరుణజపాలు,రుశ్యశృంగజపం, విరాటపర్వపారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. 29న చివరి రోజున మల్లన్నకు జరిగే సహస్రఘటాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీస్వామిఅమ్మవార్ల కపాకటాక్షాలను పొందాలని ఈవో కోరారు. -
శ్రీశైలంలో వరుణయాగం
– ఆరంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త – 29న మల్లన్నకు సహస్రఘటాభిషేకం శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో తలపెట్టిన వరుణయాగాన్ని Ô¶ నివారం ప్రారంభించారు. ఆలయ›ప్రాంగణంలోని రుద్రయాగశాలలో ప్రారంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 29 వరకు ఆలయప్రాంగణంలో వరుణ జపాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత మహాగణపతి పూజ, స్థలశుద్ధి కోసం పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, రుద్రపారాయణలు తదితర కార్యక్రమాలు చేశారు. 29న చివరి రోజు మల్లన్న సహస్రఘటాభిషేకం జరుగుతుందని, భక్తులు, స్థానికులు పాల్గొనాలని ఈఓ కోరారు. -
భక్తిశ్రద్ధలతో వరుణయాగం
హిందూపురం అర్బన్ : పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్ రంగనాథస్వామికి ప్రత్యేకపూజలు చేపట్టారు. ఆలయ ఆవరణంలోని శివలింగానికి బిందెలతో ఘట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదపండితులు సాయంత్రం వరుణయాగం చేశారు. కార్యక్రమంలో అర్చకులు గోవిందశర్మ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలో ముగిసిన వరుణయాగం
తిరుమల: ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకుని సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల పార్వేట మంటపంలో ఆరు రోజులుగా టీటీడీ నిర్వహించిన వరుణయాగం (కారీరేష్ఠి యాగం) బుధవారంతో ముగిసింది. టీటీడీ ఆగమ సలహాదారు సుందరవరద భట్టాచార్యులు, యాగపర్యవేక్షకుడైన సుందర రామశ్రౌతి నేతృత్వంలో సుమారు వంద మంది రుత్వికులు యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగక్రతువు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు చతుర్వేదాలను పండితులు పారాయణం చేశారు. ఆరో రోజు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శాస్త్రోక్తంగా యాగక్రతువు నిర్వహిస్తూ చివర్లో పూర్ణాహుతితో యాగాన్ని ముగించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో అవబృదేష్టి కార్యక్రమాన్ని వైదికంగా పూర్తి చేశారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 39,535 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లు నిండాయి. వీరికి 16 గంటలు తర్వాత శ్రీవారి దర్శనం లభించింది.