ముగిసిన వరుణయాగం
శ్రీశైలం: వర్షాలు కురవాలని దేవస్థానం గత నాలుగు రోజులుగా స్వామివార్ల యాగశాలలో నిర్వహిస్తున్న వరుణయాగానికి మంగళవారం పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఆలయ ఏఈఓ కష్ణారెడ్డి, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా యాగశాలలో నెలకొల్పబడిన దేవతా మూర్తులకు, ఋశ్యశంగమహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఋశ్యశంగుడిని ఆలయప్రాంగణంలో నిమజ్జనం చేశారు.