purnahuthi
-
శ్రీమఠంలో ముగిసిన హోమాలు
లోకకల్యాణార్థం మూడురోజులుగా నిర్వహణ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో లోక కల్యాణార్థం చేపట్టిన హోమాలు బుధవారంతో ముగిశాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో మూడురోజులుగా శాంతి, వాస్తు హోమాలు నిర్వహించారు. శ్రీమఠం యాగశాలలో పండితుల వేద మంత్రోచ్ఛారణలు పఠిస్తుండగా, భక్తుల హర్షధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా పురోహితులు క్రతువులు కానిచ్చారు. హోమాల సమర్పణోత్సవంలో భాగంగా పూర్ణాహుతి కనుల పండువగా చేశారు. ముందుగా పీఠాధిపతి పూర్ణకుంభాలతో రాఘవేంద్రుల బృందావనంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా మంచాలమ్మ ఆలయం చేరుకుని పట్టువస్త్ర, ఆభరణాల సమర్పణ పూజలు చేశారు. యాగ శాలను చేరుకుని పూర్ణహుతి పలికారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో హోమాలు చేపట్టినట్లు పీఠాధిపతి వివరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
నేడు ఉగాది యాగాలకు పూర్ణాహుతి
శ్రీశైలం : ఉగాది ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీశైల ఆలయప్రాంగణంలో జరుగుతున్న రుద్ర, చండీహోమాలకు గురువారం ఉదయం 9.45గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. అక్కమహాదేవి అలంకార మండపంలో అదే రోజు రాత్రి శ్రీ భ్రమరాంబాదేవిని నిజాలంకరణలో, శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆధిష్టింపజేసి వాహనపూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తరీతిలో చేస్తారు. కాగా ఈ నెల26 నుంచి ప్రారంభమైన ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి, వసంతోత్సవ కార్యక్రమాలతో గురువారం ముగింపు సూచనగా వివిధ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. -
బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి
- శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు - వైభవంగా ధ్వజావరోహణ శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి సన్నిధిలో ఈ నెల 17న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా 9రోజులపాటు స్వామిఅమ్మవార్లకు నిత్యహోమబలిహరణలు, జపానుష్టానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు నిర్వహించారు. ప్రతి రోజూ శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి, హంస, మయూర, రావణ, పుష్పపల్లకీ, గజ, నంది వాహనాలపై ఆవహింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 4లక్షల మందికిపైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచన. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం జరిగిన యాగపూర్ణాహుతి సందర్భంగా అష్ట దిక్కుల్లో బలిహరణలను సమర్పించారు. ఈఓ నారాయణభరత్‌గుప్త దంపతులు, అర్చకులు, వేదపండితులు సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు తదితర పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. అనంతరం వసంతోత్సవంలో భాగంగా అర్చకులు వసంతాన్ని (పసుపు, సున్నంతో కలిసిన మంత్రపూరితజలం) పూర్ణాహుతిలో పాల్గొన్న వారందరిపై చల్లారు. ఆ తరువాత చండీశ్వరుడిని ఆలయప్రదక్షణ చేయించి మల్లికాగుండం వద్దకు తీసుకువచ్చి త్రిశూల స్నానం చేయించారు. ఉత్సవాల ముగింపు సూచనగా ధ్వజావరోహణ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ప్రారంభంగా కాగా ఉత్సవాల ఆరంభ సూచనగా అదేరోజు రాత్రి 8.30 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమ పూజలను నిర్వహించి ధ్వజపటాన్ని ధ్వజస్తంభం నుంచి శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య కిందకు దింపారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు వెంకటబ్రహ్మాచార్య, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, అర్చకులు, వేదపండితులు, వివిధ విభాగాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ముగిసిన కాలభైరవ హోమం
ఘనంగా మహా పూర్ణాహుతి లక్ష గారెలతో 42 గంటలు సాగిన క్రతువు అమలాపురం గోశాలకు పోటెత్తిన భక్త జనం అమలాపురం టౌన్ : అమలాపురం గౌతమ మహర్షి గోసంరక్షణ సమితి గోశాల నూతన ప్రాంగణంలో లక్ష గారెలతో మూడు రోజులుగా జరుగుతున్న అఖండ కాలభైరవ హోమం ఆదివారం ఉదయం మహా పూర్ణాహుతితో ముగిసింది. 42 గంటల పా టు కాలభైరవ జపంతో లక్ష గారెలను హోమ గుం డంలో వేస్తూ జ్వలింప చేసిన సంగతి తెలిసిందే. పూ ర్ణాహుతి క్రతువును తిలకించేందుకు భక్తులు వేలాది తరలివచ్చారు. నూతన గోశాల కుమ్మరి కాల్వ చెంతన వరిచేల మధ్య ఉండడంతో భక్తులు వరిచేల గట్టు, కాల్వగట్టు వెంబడి వరుసగా రావడంతో అక్కడో తిరునాళ్లు జరుగుతున్నంత స్థాయిలో భక్తజనం తరలివచ్చారు. దీంతో గోశాల భక్తులతో పోటెత్తింది. కొబ్బరికాయలు, కురిడీ కొబ్బరి కాయ లు, గుమ్మడి కాయలు, పోక కాయలు, ఇప్ప పువ్వు లు, నలుపు, తెలుపు చీరలు కూడా హోమం వేస్తూ పూర్ణాహుతి నిర్వహించారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య దంపతులు, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్, బీసీ కార్పొరేష¯ŒS డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి తదితర ప్రముఖులు పూర్ణాహుతిలో పాల్గొని హోమంలో ద్రవ్యాలు, సమిధులు వేసి పూజలు చేశారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, కనకదుర్గ దంపతల ఆధ్వర్యంలో జరిగిన ఈ అరుదైన లక్ష గారెల అఖండ కాలభైరవ హోమాన్ని భైరవ ఆరాధకులు నూకల నాగేంద్ర వరప్రసాద్, కుమారి దంపతులు, వారి కుమారుడు చిరంజీవి కాలభైరవ సహాయ సహకారాలతో హోమం జరిగింది. నూకల కుటుంబ వంశీకురాలు, 101 ఏళ్ల నారాయణ రత్నం కూడా ఈ హోమ నిర్వహణలో సేవలు అందించడం విశేషం. మధ్యాహ్నం గోశాల ప్రాంగణంలో జరిగిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని భైరవ ప్రసాదాన్ని స్వీకరించారు. గోశాల సేవకులు డాక్టర్ చీకట్ల వెంకటానందం, జక్కంపూడి శ్రీనివాసరావు, యర్రంశెట్టి వెంకటరమణ, గోకరకొండ బాల గణేష్, గొవ్వాల అచ్యుత రామయ్య, అయ్యల మల్లిబాబు, బసవా సింహాద్రి, యాళ్ల అప్పలరాజు, యెండూరి సీత, జక్కంపూడి సీతాకుమారి, మాతంశెట్టి కుమార్, కేవీ మావుళ్లయ్య, దాసరి సూరిబాబు తదితరులు మూడు రోజులుగా హోమ నిర్వహణలో సేవలందించారు. లక్ష గారెలను వండే కార్యక్రమంలో 400 మంది మహిళలు శ్రమదానం చేశారు. గోశాలకు వచ్చే మార్గాల్లో పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసు బందోబస్తు ఏర్పాౖటెంది. చివరగా సీతానగరం చిట్టి బాబాజీ సంస్థానం వ్యవస్థాపకుడు జగ్గుబాబు గోశాలను సందర్శించి యాగశాలలో పూజలు చేశారు. -
ముగిసిన వరుణయాగం
శ్రీశైలం: వర్షాలు కురవాలని దేవస్థానం గత నాలుగు రోజులుగా స్వామివార్ల యాగశాలలో నిర్వహిస్తున్న వరుణయాగానికి మంగళవారం పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఆలయ ఏఈఓ కష్ణారెడ్డి, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా యాగశాలలో నెలకొల్పబడిన దేవతా మూర్తులకు, ఋశ్యశంగమహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఋశ్యశంగుడిని ఆలయప్రాంగణంలో నిమజ్జనం చేశారు. -
దత్తపీఠంలో పూర్ణాహుతి
విజయవాడ(ఆటోనగర్) : కృష్ణా పుష్కరాల సందర్భంగా పటమటలోని దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి విశేష పూజలు నిర్వహించారు. తొలుత గోపూజ నిర్వహించారు. అనంతరం ^è క్రార్చన చేసి పది రోజులుగా దత్తపీఠంలో నిర్వహిస్తున్న రుద్రహోమానికి పూర్ణాహుతి చేశారు. భక్తులను ఉద్దేశించి స్వామి అనుగ్రహ భాష్యం చేస్తూ యజుర్వేద జఠాపారాయణ మహిమను వర్ణిస్తూ ఈ పారాయణ వేద మంత్రాలు విన్నంతనే సకల పాపములు నశిస్తాయని, ప్రతిఒక్కరూ సాత్విక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. మధ్యాహ్నం స్వామి కృష్ణా తీరాన ఉన్న ముక్త్యాల కోటిలింగ క్షేత్రం వద్ద నూతనంగా నిర్మించిన గణపతి సచ్చిదానంద ఘాట్‌ను సందర్శించారు. అనంతరం స్వామి పుష్కర స్నానమాచరించి అక్కడ ప్రతిష్టించిన దత్తపాదుకలకు విశేష పూజలు చేశారు. భక్తులందరికీ పుష్కర జలాన్ని సంప్రోక్షణ చేశారు. సాయంత్రం కృష్ణానదికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ముక్త్యాల నదీ తీర స్థల పురాణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఈ తీరం ప్రాచీన కాలంలో దత్త ఉపాసకులైన వాసుదేవానంద సరస్వతీ స్వామి సంచరించిన మహిమ గల ప్రదేశమని అన్నారు. -
పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం
యాదగిరిగుట్ట : స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హనుమ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా మండపారాధన, స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త, సారం రుద్రహవనము, మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్రం, యాదాద్రిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ యాగం నిర్వహించిన సూర్యానారాయణ ఘనాపాఠి తెలిపారు. -
పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం
యాదగిరిగుట్ట : స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హనుమ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా మండపారాధన, స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త, సారం రుద్రహవనము, మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్రం, యాదాద్రిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ యాగం నిర్వహించిన సూర్యానారాయణ ఘనాపాఠి తెలిపారు.