దత్తపీఠంలో పూర్ణాహుతి
దత్తపీఠంలో పూర్ణాహుతి
Published Mon, Aug 22 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
విజయవాడ(ఆటోనగర్) :
కృష్ణా పుష్కరాల సందర్భంగా పటమటలోని దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి విశేష పూజలు నిర్వహించారు. తొలుత గోపూజ నిర్వహించారు. అనంతరం ^è క్రార్చన చేసి పది రోజులుగా దత్తపీఠంలో నిర్వహిస్తున్న రుద్రహోమానికి పూర్ణాహుతి చేశారు. భక్తులను ఉద్దేశించి స్వామి అనుగ్రహ భాష్యం చేస్తూ యజుర్వేద జఠాపారాయణ మహిమను వర్ణిస్తూ ఈ పారాయణ వేద మంత్రాలు విన్నంతనే సకల పాపములు నశిస్తాయని, ప్రతిఒక్కరూ సాత్విక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. మధ్యాహ్నం స్వామి కృష్ణా తీరాన ఉన్న ముక్త్యాల కోటిలింగ క్షేత్రం వద్ద నూతనంగా నిర్మించిన గణపతి సచ్చిదానంద ఘాట్‌ను సందర్శించారు. అనంతరం స్వామి పుష్కర స్నానమాచరించి అక్కడ ప్రతిష్టించిన దత్తపాదుకలకు విశేష పూజలు చేశారు.
భక్తులందరికీ పుష్కర జలాన్ని సంప్రోక్షణ చేశారు. సాయంత్రం కృష్ణానదికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ముక్త్యాల నదీ తీర స్థల పురాణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఈ తీరం ప్రాచీన కాలంలో దత్త ఉపాసకులైన వాసుదేవానంద సరస్వతీ స్వామి సంచరించిన మహిమ గల ప్రదేశమని అన్నారు.
Advertisement