pujas
-
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకోండి
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీదు సెల్లార్‌లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్‌కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. ‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత,పూజారి సోమ్‌నాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్‌దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు. -
నేడు రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(ఎం): మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్న ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంక పాలంపేటకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాన్వాయ్‌లో 4:15 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను వారు రామలింగేశ్వరుడి ముందు పెట్టి పూజలు చేస్తారని తెలిపారు. శివుడిపై రాహుల్, ప్రియాంకతోపాటు తనకూ విశ్వాసం ఉందన్నారు. అనంతరం 4:45 గంటలకు ఆలయం నుంచి బస్సుయాత్ర ద్వారా రామాంజాపూర్‌లో ఏర్పాటుచేసిన మహిళా విజయభేరి సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ రాహుల్, ప్రియాంక మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా డిక్లరేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. సభ అనంతరం ప్రియాంక ఢిల్లీకి పయనం కానుండగా, రాహుల్ బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేస్తారు. రాహుల్ గురువారం ఉమ్మడి కరీంనగర్, శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో బస్సుయాత్ర సాగించనున్నారు. దసరా సెలవుల తరువాత రాహుల్ మలి దశ బస్సుయాత్ర ఉంటుంది. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం రామాంజాపూర్ సభాస్థలిని పరిశీలించారు. మహిళా విజయభేరికి పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
చార్ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పూజలు చేశారు. అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు. -
రోజంతా కేజ్రీవాల్ ధ్యానం
న్యూఢిల్లీ: దేశాభ్యున్నతి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రోజంతా ధ్యానం, పూజలు, ప్రార్థనలు చేశారు. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగినట్టు ఆప్ ట్వీట్ చేసింది. అంతకుముందు ఉదయం ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధిని కేజ్రీవాల్ సందర్శించి నివాళులర్పించారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థనలు చేస్తానని కేజ్రీవాల్ మంగళవారమే పేర్కొన్నారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని జైళ్లపాలు చేస్తున్నారని, దోచుకుంటున్న వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. -
పూజల పార్టీ బీజేపీ
కురుక్షేత్ర: సమాజంలో పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిపోతున్న భయంతోపాటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలియజేశారు. పాదయాత్రను ఒక తపస్యగా భావిస్తున్నామని చెప్పారు. పాదయాత్ర అనేది నిరాడంబరతను సూచిస్తుందని, ఇదొక ధ్యానం లాంటిదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తపస్యను నమ్ముతోందని, అధికార బీజేపీ ఒక పూజల సంస్థ అని విమర్శించారు. తపస్యపై బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కే ప్రజలంతా పూజలు (ఆరాధన) చేయాలని అవి కోరుకుంటున్నాయని ఆక్షేపించారు. బలవంతంగానైనా జనంతో పూజలు చేయించుకోవాలని ప్రధాని మోదీ ఆశిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల తపస్య అంటే మోదీకి భయమని, అందుకే మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారని దుయ్యబట్టారు. హరియాణాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటం అనేది తపస్య కోసం జరిగిన యుద్ధమని అన్నారు. ఆ సమయంలో బీజేపీ/ఆర్ఎస్ఎస్ పెద్దలు బ్రిటిష్ పాలకులకు పూజలు చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూజల ప్రభావాన్ని ఎదిరించడానికి లక్షలాది మంది నేడు కాంగ్రెస్ పార్టీతో కలిసి తపస్యలో నిమగ్నమయ్యారని ఉద్ఘాటించారు. హిందూ దేవుళ్ల అభయ ముద్ర నుంచే కాంగ్రెస్ పార్టీ గుర్తు (హస్తం) పుట్టిందని రాహుల్ అన్నారు. తాను ఒక తపస్వినని చెప్పారు. ఇకపైనా తపస్విగానే కొనసాగుతానని వివరించారు. తన యాత్ర రాజకీయ పోరాటం కాదని స్పష్టంచేశారు. బీఎస్సీ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు వ్యతిరేకంగా పోరాడితే అది రాజకీయ పోరాటం అవుతుందన్నారు. తమది ధర్మం కోసం సాగుతున్న సిద్ధాంతపరమైన పోరాటమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశంలో రైతన్నలు కష్టాల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
Bharat Jodo Yatra: పాదయాత్రతో నాలో ఓపిక పెరిగింది: రాహుల్
ఇండోర్: భారత్ జోడో యాత్రతో తనలో ఓపిక, ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం పెరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాలో ఓపిక పెరగడం ఎంతగానో సంతృప్తినిస్తోంది. 8 గంటలు నడిచినా విసుగు రావడం లేదు. ఎవరైనా నెట్టినా కోపం రావడం లేదు. యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరించాల్సిందే. ఆటంకాలు ఎదురైనంత మాత్రాన విరమించుకోవడం సరికాదు. ప్రజలు చెప్పేది సావధానంగా వింటున్నా. ఇది నాకెంతో మేలు చేస్తోంది. పాదయాత్ర ఇప్పటిదాకా ఎన్నెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది’’ అని చెప్పారు. -
మదర్సా ప్రాంగణంలో మూక దుశ్చర్య
బీదర్(కర్ణాటక): బీదర్‌లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌చేశారు. -
వైభవంగా పంచ కుండాత్మక యాగం
సాక్షి, యాదాద్రి: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అద్భుత ఘడియలు రానే వచ్చాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన ఘట్టానికి సోమవారం అంకురా ర్పణ జరిగింది. యాదాద్రి ప్రధానాలయ మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా వారం రోజుల పాటు జరిగే సప్తాహ్నిక పంచ కుం డాత్మక యాగానికి ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మో హనాచార్యులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. తొలిరోజు సోమవారం శ్రీస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పంచ కుండాత్మక యాగానికి ఉదయం స్వస్తి వాచనం, రాత్రి అంకురార్పణ నిర్వహించి ఆధ్యాత్మిక పర్వాలను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో భగవత్ ఆజ్ఞ తీసుకున్న అనంతరం బాలాలయంలో స్వస్తి వాచనం, విష్వక్సేన పూజ, పుకాహశించనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన, ఋట్విగ్వరణం, అఖండ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. పంచ కుండాత్మక యాగం పూజలు నిర్వహిస్తున్న ఆచార్యులు గోదావరి జలాలతో స్వామి పాదాలకు అభిషేకం ప్రధానాలయంలో శ్రీపంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం పారాయణీకులు అత్యంత వైభవంగా వాస్తుపూజ నిర్వహించారు. అలాగే మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా జంగంపల్లికి వచ్చిన గోదావరి జలాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదాలను అభిషేకించారు. ఆటంకాలు కలుగకుండా విష్వక్సేన పూజ బాలాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచ కుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవములలో భాగంగా సాయంత్రం 6 గంటలకు మృ త్సంగ్రహణం, అంకురారోపణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన వేడుకలు నిర్వహించారు. మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా ఎలాంటి అటంకాలు కలుగకుండా ఉండేందుకు విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా, సంపూర్ణంగా కొనసాగేందుకు శ్రీ విష్వక్సేన పూజ శ్రీపంచారాత్రాగమ శాస్త్రానుసారం నిర్వహించారు. లోకకల్యాణం కోసం స్వస్తి వాచనం ఆగమ శాస్త్రానుసారంగా స్వస్తి వాచన మంత్రాలతో వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం, ఎలాంటి బాధలు లేకుండా ప్రాణ కోటి సుఖసంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకొనే స్వస్తి వాచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి, సహాయ కార్య నిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలో ఈ కార్యక్రమాల సందర్భంగా అధికారులు మీడియాను లోపలికి అనుమతించలేదు. కొండపైన, యాదగిరిగుట్టలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు శాంతి పాఠం..అగ్నిమథనం యాదాద్రి ఆలయంలో సప్తాహ్నిక పంచకుం డాత్మక యాగం, మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శాంతి పాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుం భారాధనలు, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ట, యజ్ఞ ప్రారంభం చేస్తారు. అనంతరం విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్య లఘు పూర్ణాహుతి జరిపిస్తారు. సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమములు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం, నవకలశ స్నపనం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహిస్తారు. -
రాముడు లేనిదే అయోధ్య లేదు
లక్నో/అయోధ్య: రాముడు లేనిదే అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రాంతం రామ్ లల్లాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య తాత్కాలిక మందిరం దగ్గర పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటిన కోవింద్ అక్కడ పురోహితులతో కాసేపు మాట్లాడారు. 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వీలుగా చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన తర్వాత కోవింద్ అయోధ్యకు రావడం ఇదే మొదటిసారి. యూపీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు కోవింద్ లక్నో నుంచి అయోధ్యకి రైలులో వచ్చారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రామాయణ ఘట్టాలతో కూడిన పోస్టల్ కవర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడు లేని అయోధ్య అయోధ్యే కాదన్నారు. ‘‘రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది. ఈ నగరంలోని రాముడు శాశ్వతంగా ఉంటాడు’’అని కోవింద్ వ్యాఖ్యానించారు. రాముడు ఎప్పుడూ గిరిజనులపై వల్లమాలిన ప్రేమాభిమానాలు కురిపించారని రాష్ట్రపతి అన్నారు. -
‘కరోనా దేవి’కి పూజలు; తీవ్ర విమర్శలు
తిరువనంతపురం: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కరోనాకు కేరళలో ఓ భక్తుడు నిత్య పూజలు చేస్తున్నాడు. కోవిడ్ పోరులో ముందుండే వైద్య, పోలీసు, మీడియా సిబ్బంది, వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల కరుణ చూపాలని వేడుకుంటున్నాడు. వారికి ఎటువంటి హానీ తలపెట్టొద్దని ‘కరోనా దేవి’ని ప్రార్థిస్తున్నాడు. థర్మకోల్‌తో తయారు చేసిన సార్స్ కోవ్-2 వైరస్ చిత్రాన్ని కడక్కల్‌లో నివాసముండే అనిలన్ పూజిస్తున్నాడు. కరోనా దేవి పూజా విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, అనిలన్పై విమర్శలూ వస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే అతను పూజా డ్రామాలు చేస్తున్నాడని కొందరు విమర్శిస్తుండగా.. మూఢభక్తి ఎక్కువైందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘చదువున్నవారు మంచి ఉద్యోగాలు, ఉన్నత స్థితిలో ఉండటం చూశాం. కానీ, కాలం మారింది. చదివింది ఎంతైనా గుడ్డిగా మతాన్ని విశ్వసించేవారు ఎక్కువవుతున్నారు. మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారు’అని కేరళలో ప్రముఖ రచయిత, విమర్శకుడు సునీల్ పి.ఎలాయిడోమ్ కామెంట్ చేశారు. (చదవండి: నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో) కాగా, తనపై వస్తున్న ట్రోలింగ్‌ను ఎప్పుడూ పట్టించుకోలేదని అనిలన్ చెప్తున్నాడు. కరోనా దేవి పూజతో ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నానని పేర్కొన్నాడు. 33 కోట్ల హిందూ దేవతల్లో కరోనా దేవి కూడా ఒకరని అనిలన్ తెలిపాడు. నచ్చిన దైవాన్ని పూజించడం తన హక్కు అని స్పష్టం చేశాడు. ఇక తన ఇంట్లో కరోనా దేవికి పూజలు చేసేందుకు ఇతరులకు అనుమతి లేదని అనిలన్ తెలిపాడు. భారత్‌లో అన్‌లాక్-1 పేరుతో దేవాలయాలు తెరవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు స్వయంగా సృష్టించామని అసహనం వ్యక్తం చేశాడు. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, అస్సాంలోలో కూడా కరోనా దేవికి పలువురు పూజలు చేసిన ఘటనలు తెలిసిందే.ఇదిలాఉండగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. (చదవండి: ముద్దుతో కరోనా నయం చేస్తానని చివరకు..) -
గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు
సాక్షి, చేవెళ్ల: హైటెక్ కాలంలో కూడా ఇంకా ప్రజలు మూఢ నమ్మకాలను వీడడం లేదు. గుప్త నిధులు ఉన్నాయని క్షుద్రపుజలు నిర్వహిస్తున్నారంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేవెళ్ల మండల కేంద్రంలోని తులసీ వాటర్‌ప్లాంట్‌కు సమీపంలో ఉన్న ఓ పురాతన దర్గా వద్ద సోమవారం అర్ధరాత్రి కొంత మంది దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా దర్గా వద్ద గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వాటర్ ప్లాంట్ వద్ద ఉండే యువకులు దర్గా వైపు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడం గుర్తించారు. అక్కడ ఎవరో వ్యక్తులు ఉన్నట్లు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ హడావుడిలో దుండగులు అక్కడే వారి బైక్‌ను వదిలి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా దర్గా వద్ద క్షుద్రపూజలకు ఉపయోగించిన నిమ్మకాయలు, కుంకుమ, ఆకులు, ఇతర పూజా సామగ్రి ఉంది. దర్గా మధ్యలో ఒక గుంత, దర్గాకు రెండు వైపుల రెండు గుంతలను తవ్వారు. దుండగులు మద్యం సేవించేందుకు తీసుకువచ్చిన బాటిళ్లు సైతం అక్కడ లభించాయి. తులసీ వాటర్ ప్లాంట్ వద్ద పనిచేసే యువకులు సమాచారంతో వచ్చిన పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం కూడా.. ఆరునెలల కిత్రం కూడా దర్గా ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కాలంలో కూడా ప్రజలు ఇలాంటి వాటిని నమ్మడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. లేనిపోని ఆశలకు పోయి ప్రమాదాల్లో చిక్కుకుంటారని, ప్రజలు ఇలాంటి వాటిని నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా మండలమంతా వ్యాపించడంతో మంగళవారం ప్రజలంతా దర్గా వద్దకు బారులు తీరారు. -
చిలుమూరు గుడిలో హీరో రాజేంద్రప్రసాద్ పూజలు
సాక్షి, కొల్లూరు: ప్రముఖ సినీ హీరో రాజేంద్రప్రసాద్ కృష్ణా తీరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన గుంటూరుజిల్లా చిలుమూరులోని ఉభయ రామలింగేశ్వర క్షేత్రాన్నిఆదివారం ఉదయం తన కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భార్య, కుమారుడు, కోడలితో కలిసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. గోశాలను సందర్శించి గోపూజ చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో పల్లె వాతావరణాన్ని ఆస్వాదించిన రాజేంద్రుడు తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో కలిసి నెమరువేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ వస్తున్నట్లు తెలుసుకుని ఆయన్ను కలవడానికి వచ్చిన స్థానికులను చిరునవ్వుతో పలకరిస్తూ ఫొటోలు దిగారు. కొల్లూరు ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు క్రోసూరు అప్పయ్య, సర్పంచ్ మొలబంటి రామారావు తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
అహోబిలంలో ధనుర్మాస పూజలు
అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నవ నారసింహ క్షేత్రాలను సందర్శించారు. స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారిని లలితాదేవిగా అలంకరించి ఉత్సవ పల్లకిలో కొలువుంచి ఊరేగించారు. -
మహానందీశ్వరుడికి సహస్రఘటాభిషేకం
– ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం మహానంది : మహానందీశ్వరస్వామివారికి ఆదివారం సహస్రఘటాభిషేక పూజలు వైభవంగా జరిగాయి. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, పండిత బృందం ఆధ్వర్యంలో విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహస్ర ఘటాల్లో గంగావాహన, ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం, కలశ ఉద్వాసన, పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహానందీశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం చేపట్టారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజు, శివారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీశైలంలో వరుణయాగం
– ఆరంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త – 29న మల్లన్నకు సహస్రఘటాభిషేకం శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో తలపెట్టిన వరుణయాగాన్ని Ô¶ నివారం ప్రారంభించారు. ఆలయ›ప్రాంగణంలోని రుద్రయాగశాలలో ప్రారంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 29 వరకు ఆలయప్రాంగణంలో వరుణ జపాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత మహాగణపతి పూజ, స్థలశుద్ధి కోసం పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, రుద్రపారాయణలు తదితర కార్యక్రమాలు చేశారు. 29న చివరి రోజు మల్లన్న సహస్రఘటాభిషేకం జరుగుతుందని, భక్తులు, స్థానికులు పాల్గొనాలని ఈఓ కోరారు. -
గిరిపుత్రులు.. పుష్కర పూజకు దూరం
శ్రీశైలం ప్రాజెక్టు: అనాదిగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎటువంటి పూజలు జరగాలన్నా ముందుగా చెంచు గిరిజనులనే ఆహ్వానించేవారు. రోడ్డు, రవాణా సౌకర్యం లేని కాలంలో శివుని సన్నిధిలో ప్రథమ పూజారులు చెంచు గిరిజనులే. అటువంటి వారికి కష్ణా పుష్కరాల సందర్భంగా అధికార యంత్రాంగం ఎటువంటి ప్రాధాన్యతన కల్పించలేదు. శ్రీశైలం క్షేత్ర సమీపంలో హఠకేశ్వరం సమీపంలోని అప్పటి లింగమయ్య చెంచుగూడెం, శిఖరేశ్వరం, మాణిక్యమ్మ సెల, మేకలబండ ప్రాంతంలో సుమారు 320 మంది గిరిజనులు నివసిస్తున్నారు. పుష్కరాల ప్రారంభం సమయంలో వారికి అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇవ్వకపోగా, కనీసం పుష్కరాలపై అవగాహనను కూడా ప్రభుత్వం కల్పించలేకపోయింది. పుష్కరాలంటే మాకు తెలియదు: జెండాలమ్మ, చెంచుగూడెం పుష్కరాలంటే మాకేందో తెలియదు సామీ. శివరాత్రి, ఉగాదిపండగలప్పుడు గుడిసారోళ్లు వచ్చి మమల్ని పిలుచుకుపోతారు. రథం ముందు చిందులు తొక్కమని చెబుతారు. చిందులు తొక్కినందుకు ఆ రోజుకు మాకు ఖర్చులకు డబ్బులు ఇస్తారు. ఆ పండగలు తప్ప, మాకు ఇంకొకటి తెలవదు. పుష్కరాలంటే భక్తులు వస్తారనే తెలుసు. అంతకుమించి ఏమి తెలవదు. పుష్కర పూజకు పనికిరామా: గజ్జెల్, చెంచుగూడెం శ్రీశైలంలో శివుడు కొలువైనప్పటి నుంచి మా తాత ముత్తాతలు ఆయనకు పూజలు చేసేవాళని చెబుతారు. మమల్ని కూడా శివరాత్రి, ఉగాది, ఇతర పండుగలప్పుడు ఆలయాన్ని కడగడం, శివలింగాన్ని కడగడం వంటి పనులకు పిలుస్తారు. మా చెంచోలంతా ఆ పండుగలప్పుడు ఎంతో సంబరం చేసుకుంటాం. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా పుష్కరాలకు మా జాతిని, మా సేవలను ఎవరు గుర్తించలేదు. ఏ పూజకు మమల్ని పిలవలేదు. -
రేపు శ్రీశైలంలో పుష్కర ప్రారంభ పూజ
శ్రీశైలం: కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభమవుతుండడంతో అదేరోజు వేకువజామున దేవస్థానం వారు పాతాళగంగ నదీమాతల్లికి ప్రథమ పూజ నిర్వహించడానికి ఉదయం 5.30గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. అర్చకులు, వేదపండితుల సలహా మేరకు వేకువజామున 4గంటలకు ఆలయ రాజగోపురం నుంచి మంగళవాయిద్యాలతో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు పూజాద్రవ్యాలు, వస్త్రాలను తీసుకుని ఆలయం నుంచి బయలుదేరుతారని అన్నారు. ఆ తరువాత కార్యక్రమ వివరాలు ఇవి... శుక్రవారం ఉదయం 5.30గంటలకు... నదీమాతల్లికి పూజాధికాలు, సారె సమర్పణ 6.40గంటలకు కృష్ణానదీ జలాలతో పాతాళేశ్వరస్వామికి అభిషేకం 7గంటలకు కృష్ణానదీ జలాలచే నంది మండపంలోని నందీశ్వరుడికి అభిషేకాది అర్చనలు 7.25 గంటలకు క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామికి కష్ణా జలంతో అభిషేకం 7.40గంటలకు కృష్ణా జలాలతో ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీమల్లికార్జున స్వామివార్లకు ఆజలంతో అభిషేకాది ప్రత్యేక పూజలు -
ఉరుకుందలో ‘శ్రావణ’ సందడి
– ఆలయంలో పోటెత్తిన భక్తులు – ఈరన్నకు ప్రత్యేక పూజలు కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉరుకుంద ఈరన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆదివారం నుంచే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ రద్దీ సోమవారం పెరిగి..స్వామి దర్శనానికి గంటల కొద్ది సమయం పట్టింది. మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామతాభిషేకం తదితర ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రద్దీకి అనుగుణంగా అతిశీఘ్ర దర్శనంతో పాటు ప్రత్యేక, శీఘ్ర, ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి సన్నిధిలో పంచాయతీరాజ్ కమిషనర్ ఉరుకుంద ఈరన్న స్వామిని సోమవారం తెల్లవారుజామున పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఈవో మల్లికార్జున ప్రసాద్‌లు స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తమ ఇంటి దైవం ఈరన్న స్వామిని ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో దర్శించుకుంటామన్నారు. -
ఘనంగా నాగుల పంచమి
మొయినాబాద్: నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మహిళలు నాగదేవతలకు పూజలు నిర్వహించారు. మండలంలోని పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, దేవల్ వెంకటాపూర్, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, ఎలుకగూడ, అమీర్‌గూడ, మొయినాబాద్, సురంగల్, శ్రీరాంనగర్, వెంకటాపూర్, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో మహిళలు నాగదేవతల విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేశారు. -
ఉరుకుందలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాలు బుధవారం పాలకమండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, పాలక మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహరతి, పంచామతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 7గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అంతకు ముందుకు దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. ఆలయ పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, ఈరన్న, చిరంజీవి, శంకరమ్మ, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.