ఉరుకుందలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాలు బుధవారం పాలకమండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, పాలక మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహరతి, పంచామతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 7గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అంతకు ముందుకు దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. ఆలయ పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, ఈరన్న, చిరంజీవి, శంకరమ్మ, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.