
ఘనంగా నాగుల పంచమి
మొయినాబాద్: నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మహిళలు నాగదేవతలకు పూజలు నిర్వహించారు. మండలంలోని పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, దేవల్ వెంకటాపూర్, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, ఎలుకగూడ, అమీర్‌గూడ, మొయినాబాద్, సురంగల్, శ్రీరాంనగర్, వెంకటాపూర్, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో మహిళలు నాగదేవతల విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేశారు.