అహోబిలంలో ధనుర్మాస పూజలు
అహోబిలంలో ధనుర్మాస పూజలు
Published Fri, Dec 16 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నవ నారసింహ క్షేత్రాలను సందర్శించారు. స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారిని లలితాదేవిగా అలంకరించి ఉత్సవ పల్లకిలో కొలువుంచి ఊరేగించారు.
Advertisement
Advertisement