dhanurmasam
-
నేలకు చుక్కలు
ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు. ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.గొబ్బియల్లో... గొబ్బియల్లోముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.– డి.వి.ఆర్. భాస్కర్ -
మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం!
పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డుపలకోడి నూఱాయిరమ్ మల్లాణ్డు తిణ్ణోళ్ మణివణ్ణా! ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు’ అంటూ భగవంతుడికే మంగళాశాసనం చేసిన మహాభక్తుడు విష్ణుచిత్తుడు. అతని గారాలపట్టి మన గోదాదేవి ఆచరించిన ముప్ఫై రోజుల వ్రతమే ధనుర్మాస వ్రతం.హేమంత ఋతువులో వాతావరణ ప్రభావం చేత మనుష్యులు సుషుప్తి అవస్థలో వుంటారు. అటువంటి మాయావస్థనుండి బయటపడవైచే ఒకానొక ఉద్దేశంతో ఈ వ్రతం స్వయంగా ఆమె ఆచరించీ, సామాన్యుల చేత ఆచరింపజేసిన మహా తల్లి గోదాదేవి. యితర గోపికలని కూడా కలుపుకుని వారిని వేకువజామునే మేలుకొలుపుతూ అందరిని ఆ భగవత్సన్నిధికి చేరవేసిన నిస్వార్ధపరురాలు. పరమాత్మునికి సామూహిక పూజే చాలా ప్రీతి అన్న విషయం ఎరిగినందుకే గోదాదేవి తన బృందంతో సహా శ్రీ కృష్ణుని వద్దకు వెళ్ళింది. లోకమంతా పచ్చగా, భోగభాగ్యాలతో కళకళలాడాలనే ఉద్దేశంతో పరమాత్మని ప్రార్థిస్తూ తెల్లవారుఝామున స్నానం చేసి సౌందర్యవంతులైన గోపికలతో కలసి చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ఇక్కడ సౌందర్యమంటే ఆత్మసౌందర్యం, స్నానమనగా భక్తితత్వంలో మునిగితేలడం. రోజుకొక పాశురం పాడుతూ ఒక్కొక్క గోపికను మేలుకొలిపే ముప్పై పాశురాల రాగమాలికే తిరుప్పావై!రమారమి క్రీ.శ.750 ప్రాంతంలో శ్రీరంగనాథస్వామి వెలసిన శ్రీరంగానికి దగ్గరలో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో పెరియాళ్వార్ (విష్ణుచిత్తుని మరో పేరు)అనే భక్తశిఖామణి ఒకనాడు తన తులసివనంలో మొక్కలకు పాదులు తవ్వుతుండగా భూమిలో లభించిన ఈ బాలిక కర్కాటక మాసం, పుబ్బానక్షత్రంలో దొరికింది. ఈమెని పెరియాళ్వార్ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. విష్ణుచిత్తుని ఇంట అన్నసంతర్పణలూ, శ్రీరంగనాథుని భజనలే నిత్యకృత్యాలు. అందుకే గోదాదేవి చిన్నతనం నుంచి ఆ రంగనాథుడ్ని మనసారా సేవించింది. ఆమె భక్తితో కట్టే పూలదండలని వాసన చూసి ముందుగా తాను ధరించిన తరువాత వాటిని తండ్రిద్వారా ఆ రంగనాథునికి సమర్పించేది. పూలమాలలని ముందుగా తాను ధరించడంతో ఆమెకు శూడికొడుత్త అనే పేరువచ్చింది. గోదాదేవి ముందుగా ధరించి ఇచ్చిన పూలమాలలు తస్ప వేరే మాలలని తాను ధరించనని రంగనాథుడు స్వయంగా విష్ణుచిత్తునితో చెప్పడంతో తన బిడ్డ కారణ జన్మురాలని తనని తరింపజేయడానికే తన ఇంట వెలసిందని గ్రహించాడు.ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుణ్ణి భర్తగా పొందదలచి కాత్యాయనీ వ్రతాన్ని చే శారని తండ్రి ద్వారా తెలుసుకుంది గోదాదేవి. శ్రీకృష్ణుని లీలలు కథలు కథలుగా అక్కడి అందరూ చెప్పుకోవడంతో తాను ఆ కృష్ణావతార సమయంలో ఉంటే బాగుండునని తలచింది. అయితే కృష్ణావతారంలో సత్యభామ తానేనని జ్ఞానసంపద కలిగిన ఓ గోపిక ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తాను కూడా ధనుర్మాస వ్రతమాచరించి ఆ శ్రీరంగనాథుని సన్నిధి చేరుకోవాలని కోరుకుంది. ‘శూడిక్కొడుత్త శుడర్ క్కోడియే..తోల్పావై పొడి యరుళ వల్ల పల్ వళైయామ్, వేంగడ వఱ్కెన్నైవిది యెన్ద విమ్మాత్తమ్, నాంగడవా వజ్రమే నల్గు’ దీని అర్ధం–‘సువాసనతో కూడిన బంగారుజిలుగులు (జ్ఞాన కాంతులు) వెదజల్లే పుష్పదండలను దాల్చి, వాటినే శ్రీరంగనాథునికి సమర్పించిన ఓ మెరుపుతీగా, ఆ వేంకటేశ్వరునికి నీవు ఎట్లైతే ప్రియము కల్గించుమని వేడుకొన్నావో అలాగే, నీ భక్తులమైన మాకు కూడా ఆ వ్రతఫలం కల్గించు తల్లీ!’ అంటూ పరాశరభట్టర్ గోదాదేవిని స్తుతించడం ఇక్కడ గమనించాలి. సుగంధమైన పుష్పమాలలని స్వామికి సమర్పించినందున ఆముక్తమాల్యద అనే పేరు గోదాదేవికి వచ్చింది. కోదై, నాచియార్, ఆండాళ్...ఇలా వివిధ నామధేయాలు ఆమెకున్నాయి.గోదాదేవి మెడలో ధరించే పూమాల భక్తిగీతమాలగా, చేతిలోని చిలుక గురువుకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. గోదాదేవి ధనుర్మాస వ్రతమాచరించడానికి తన గోపికలతో కలసి ఆ పరమాత్మని కోరినదేమిటంటే, భూమండలాన్ని దద్దరిల్లచేసే తెల్లనైన ΄ాంచజన్యమనబడే శంఖాన్నీ, విశాలమైన పర అనే వాద్యాన్ని, మంగళగానం చేయడానికి భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజములు కావాలని కోరింది. వీటిని ఆ భగవత్సేవ వినియోగం కొరకు కోరుకున్నారు. అంతేకాదు, పాంచజన్యం, పర అనే భౌతిక వస్తువులని ఎందుకు కోరారంటే ఈ పరికరాలు ఎల్లప్పుడూ ఆ భగవంతుని అంటి పెట్టుకుని ఉంటాయి. అటువంటివి తమ వద్దవుంటే ఆ భగవంతుడు తమతో ఉన్నట్టేనని భావించి కోరుకున్నారు. వ్రతమాచరించే ముప్పై రోజులూ ఆహారనిష్ఠలతోపాటూ ఇతర కఠినమైన నియమాలు పాటిస్తూ సదా భగవన్నామ స్మరణలో గడిపారు గోదాదేవి బృందం. ఎదుటి వారిని నొప్పించే మాటలు ఆడకుండా, వారికి సహాయపడుతూ కలసి మెలసి మెలుగుతూ లోకకళ్యాణం కొరకు వ్రతమాచరించడమే గోదాదేవి ముఖ్యోద్దేశం.విష్ణుచిత్తుడు ఆ రంగనాథుని ఆజ్ఞతో ముప్పైరోజుల వ్రతానంతరం గోదాదేవిని శ్రీరంగానికి తోడుకొనిపోయి ఆ శ్రీరంగనాథునితో కళ్యాణం జరిపించాడు. గోదాదేవి భక్తి ప్రవత్తుల కారణంగా, జనులందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో లీనమైపోయింది. పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి మన ఆండాళ్ తల్లి! ‘తిరు’ అంటే శ్రీ, లక్ష్మీ, అమృతం మొదలగు అర్థాలున్నాయి. ‘పావై’ అంటే పాటల సమాహారం, వ్రతం అనే అర్థాలున్నాయి. ‘శ్రీకృష్ణుని(రంగనాథుడు) పొందకోరి ఆచరించిన గానామృత వ్రతమే ఈ మార్గశీర్ష వ్రతం లేదా ధనుర్మాస వ్రతం! మార్గమంటే బుద్ధి, శీర్షమంటే ఉత్తమమైనది. ‘మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే!’ అని స్వయంగా శ్రీ కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. అటువంటి కృష్ణుణ్ణి పొందడానికి మార్గశిరమే ఉత్తమమైన కాలమని భావించి ఈ వ్రతమాచరించింది గోదాదేవి. – కారంపూడి వెంకట రామదాస్ -
ధనుర్మాసం అంటే ..? ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదా..?
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు. శుభకార్యాలు ఎందుకు చేయరు?ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం. (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం
-
ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. భోగితో ముగుస్తుంది: సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. పాశురములు చదివేటప్పుడు.. మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పంచాలి (రోజు పొంగలి , దద్ధోజనం , పరవాన్నం) ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం* -
Dhanurmasam 2022: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం
గోదాదేవి పేరుతో తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్ అంటూ తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయం లోనే పఠించాలి. అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చింది. అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి తమను ఆదుకోమని గోప గోపీజనులు కోరారు. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించి, తెల్లవారు ఝామున రావాలని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు. దాంతో తిరుప్పావై కథావస్తువు మొదలైంది. శ్రీకృష్ణుడితో గడిపితే కలిగే ఆనందం, ఉత్సాహం గుర్తుకు వచ్చి గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగు వేల కవితలను నాలాయ రమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవేద్యం తరువాత నాలాయిర ప్రబంధ పారాయణం... తిరుప్పావై మంగళా శాసనం ప్రణవ నాదంతో ముగుస్తుంది. ఈ తమిళ ప్రబంధ పారాయణానికి ఏ ప్రతి బంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణ భేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. నారాయణ మంత్ర సారాంశాన్ని పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పినవాడు రామానుజుడు. కుల మత భేదాలు లేకుండా అంద రికీ నారాయణుని చేరే జ్ఞాన, వ్రత, మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ– గోదాదేవి, శ్రీరామానుజుడు. తిరుప్పావై జీయర్ అని రామానుజుని అంటారు. గోదాదేవి పుట్టి కావేరి నది తీరంలో శ్రీరంగనిలో లీనమైన రెండు వందల ఏళ్ల తరువాత క్రీస్తు శకం 1000లో జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణమైతే... తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీ సుందర బాహుస్వామికి వేయి బిందెల పాయసం చేయిస్తానన్న మొక్కును ఆయన తీర్చడం మరో కారణం. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కు తీర్చలేకపోయారు. ఆ విషయం విన్న మరుక్షణమే రామానుజుడు శ్రీసుందర బాహుస్వామి ఆలయా నికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారట. శంగత్తమిళ్ అంటే అందమైన తమిళ భాష అని అర్థం. డిసెంబర్ మధ్యలో ఉండే ధనుర్మా సంలో వచ్చే తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. గోదాదేవి రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. ఆ విధంగా 30 అందమైన ఎనిమిది పాదాల కవితలు గోదా గళం నుంచి జాలు వారాయి ఈ నెలలో. పదం పదంలో పుణ్యకథ కనిపిస్తుంది. వాటిని వింటుంటే రామాయణ ఘట్టాలూ, భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇందులో భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కానీ ఇది సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధనా, సాధనా... ఒక పిలుపు, వ్రతం, ఆరాధన కలిసిన ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు రచించిన పాశురాలు విన్న తరువాత... శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున మొత్తం 30 వింటాడు. గోదా గీతాగోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మి కోద్యమం ఇది. (క్లిక్ చేయండి: అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..) - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్ర యూనివర్సిటీ (డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా) -
16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. -
ఇంత ఆరోగ్యం దాగి ఉందా తండ్రీ!
ధనుర్మాసం... ముగ్గులు, హరిదాసులు, గొబ్బిళ్లు, బొమ్మలు, ఆటలు పాటలు... మరో పక్క గోదాదేవి తెల్లవారుజామునే నిద్ర లేచి, తన స్నేహితులను కూడా మేల్కొలుపుతుంది. అందరూ భక్తిగా శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం. గోదాదేవి ధనుర్మాసంతో మాట్లాడితే ఎలా ఉంటుంది. ధనుర్మాస పురుషుడు ఏమని సమాధానం చెప్పి ఉంటాడు. ధనుర్మాసంలో సామాజిక కోణం ఏదైనా ఉందా... ఉండే ఉంటుంది. గోదాదేవి, ధనుర్మాసుడితో సంభాషిస్తే బహుశ ఇలా ఉండొచ్చు. సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తూనే తన సహస్ర కిరణాలతో చలి బాణాలను ప్రపంచం మీదకు వదులుతున్నాడు. చలి గజగజలాడిస్తోంది మరి. చెట్లు వణికిపోతున్నాయి. నీళ్లు గడ్డకట్టిపోతున్నాయి. సూర్యుడు బారెడు పొద్దెక్కితేనే కానీ నిద్ర లేవనంటున్నాడు. పాపం చంద్రుడి పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది. నక్షత్రాలైతే ‘బాబోయ్ నిద్ర లేవటం మా వల్ల కాదు. మేం కొన్ని రోజులు హాయిగా నిద్రపోతాం’ అంటున్నాయి. పెద్దపులులు, సింహాలు, ఏనుగులు... ఎక్కడ కునుకు తీయాలో అర్థం కాక, పొదల కోసం పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అమ్మ బాబోయ్ ఇదేం మాసంరా నాయనా, ఇంత వణికిస్తూ భయపెడుతోంది అంటోంది ప్రాణి కోటి సమస్తం. చలితోనే స్నేహం చేస్తున్న చలిచీమలు ఏం చేస్తున్నాయో. చలి మొదలైతే చాలు చలి పులి అనేస్తాం. పులి కంటె భయంకరమైనది చలి. అయితేనేం... అన్నం పెట్టే రైతును ఆదరించే మాసంగా దనుర్మాసాన్ని ఆరాధిస్తోంది మానవాళి. అంతేనా ఈ మాసమంతా గోమయం, ఆనందమయం, ఆరోగ్య మయం. ధనుర్మాసంలో ధనుస్సును ఎక్కుపెట్టిన నెల్లాళ్లకు మకరం ప్రవేశించి, ధనుస్సు ను ముక్కలు ముక్కలు చేస్తేనే గానీ చలి పురుషుడు పారిపోడు. చలికి వణికిపోతున్నా, ఉదయాన్నే నిద్ర మేల్కొన్న గోదాదేవి ఒకనాడు ధనుర్మాసం దగ్గరకు వచ్చింది. వారిరువురి మధ్య చిన్న సంభాషణ జరిగింది (సృజన మాత్రమే) గోదా: ‘అయ్యా! నమస్కారం ధను: ప్రతి నమస్కారం తల్లీ! ఏమ్మా ఉదయాన్నే లేచావు! గోదా: మీకు తెలీదా తండ్రీ! మా కన్నెపిల్లలమంతా నోము చేసుకుంటున్నాం కదా! ఉదయాన్నే నిద్ర లేచి స్నానాదులు చేసుకుని, పరిమళపుష్పాలు తీసుకుని రంగనాథుని సేవించాలి కదా! ధను: అవును తల్లీ! ఈ చలికి ముసుగు వేసుకునేసరికి అన్నీ మరచిపోయాను. గోదా: మీరు మాత్రం ముసుగు వేసుకుని పడుకుంటారు, మేం మాత్రం గజగజ వణికిపోతూ చన్నీటి స్నానం చేసి, వ్రతం ఆచరించాలి. ధను: తల్లీ అసలు వ్రతం అంటే ఏమిటో తెలుసా నీకు? గోదా: ఏముంది, ఒక విధానంలో చేసే పూజే కదా. ధను: వ్రతం అంటే క్రమశిక్షణ. వ్రతం అంటే నియమానుసారంగా పనిచేయటం. వ్రతం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు... పంచభూతాలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే మానవులు అదుపు తప్పుతున్నారు. అలా ఉండకూడదని మీ వంటి యువతుల ద్వారా చెప్పించటమే వ్రతాలలోని పరమార్థం. గోదా: నిజమే స్వామీ. ఇంతకీ వ్రతం చేయటంలోని అంతరార్థం ఏమిటో కాస్త దుప్పటి తొలగించి వివరించు స్వామీ. ధను: వ్రతం చేయటమంటే ఆర్భాటంగా పట్టు వస్త్రాలు ధరించి, ఖరీదైన పూలు పండ్లతో అర్చించటం కాదు. త్రికరణశుద్ధిగా అంటే మనసు, వాక్కు, శరీరం ఈ మూడూ ఒక పని మీద లగ్నం కావాలి. ప్రదర్శన ఉండకూడదు. నువ్వు చేసే పని మీద నీ మనసు లగ్నం చేయాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. ఇటువంటి వాటి కోసమే వ్రతాలు, పూజలు, నోములు ఉద్దేశించబడ్డాయి. గోదా: నిజమే తండ్రీ. ధను: మరో విషయం చెప్పనా, ముఖ్యంగా ఆడపిల్లలకు ఉదయానే నిద్ర లేవటం ఆరోగ్యం. ఆమె శరీరం సుకుమారంగా ఉంటుంది. ఆ సౌకుమార్యాన్ని చలికి అలవాటు చేయడం కోసమే ఇటువంటివి నిర్దేశించబడ్డాయి. గోదా: ఇంత ఆరోగ్యం దాగి ఉందా తండ్రీ! ధను: అంతేకాదు తల్లీ, సృష్టిలో స్త్రీకి స్త్రీ శత్రువు అంటారు. అది అవాస్తవం అని చూపటానికే ఇటువంటి వ్రతాలు. కన్నె పిల్లలంతా కలిసికట్టుగా ఆచరించే పూజ ఇది. ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా... ఇరుగుపొరుగు స్త్రీలను ఆహ్వానించి వారికి తాంబూలం ఇస్తాం. ఇప్పుడు చెప్పు ఎవరికి ఎవరు శత్రువో. గోదా: నిజమే తండ్రీ! అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు వచ్చిన మాసంలోనే ముగ్గులు, గొబ్బిళ్లు, మూడు రోజుల పండుగలు.. పిండివంటలు ... ఇవన్నీ ఎందుకు తండ్రీ? ధను: బంగారుతల్లీ! చంద్రుడు ధవళ కాంతులీనుతున్నప్పటికీ, వెండి వెన్నెలలు కురిపిస్తున్నప్పటికీ, అమృతకిరణుడు, సుధామయూఖుడు అనుకున్నప్పటికీ, ఆయన కూడా పరుగులు తీస్తూనే ఉంటున్నాడు. అందువల్ల క్రిమికీటకాలు బద్దకం వదిలి విజృంభిస్తాయి. గోదా: ఓహ్ అందుకేనా అవి ఇంట్లోకి రాకుండా గుమ్మాలలో వరిపిండితో ముగ్గులు వేసి, గొబ్బిళ్లు ఉంచి, వాటిమీద పూలు అలంకరిస్తారు. ధను: ఇందులో మరో పరమార్థం చెప్పనా, ఆవుపేడతో గొబ్బిళ్లు చేస్తారు మీరు. ఆవుపేడను మించిన క్రిమిసంహారకం లేదు. అందుకే పేడతో గొబ్బెమ్మ ఆకృతి రూపొందించి, వాటి మీద ముగ్గు, పసుపు, కుంకుమ వేసి, ఆ పైన గొబ్బిపూలతో అలంకరించి, ముగ్గు నడిబొడ్డున ఉంచుతాం. గోదా: అవును నిజమే. మీరు చెప్పినది అక్షర సత్యం. ధను: మరొకటి, ఆడపిల్లలకు ఏ పనైనా అందంగా, పద్ధతిగా చేయటమంటే చాలా ఇష్టం. వాళ్లు మాత్రమే చేయగలుగుతారు. ఈ పనుల వల్ల ఆరోగ్యంతోపాటు, సృజన శక్తి కూడా పెరుగుతుంది. ఏ పనినైనా మంచి మనసుతో, క్రమశిక్షణతో, త్రికరణశుద్ధి గా చేయటం వల్ల పాపపుణ్యాల మాట అటుంచితే, ఆరోగ్యం సమకూరుతుంది. గోదా: ఈరోజు మీరు మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఒక్కో పండుగలోని సామాజిక కోణం తెలుసుకోవాలనే విషయం అర్థమైంది స్వామీ. ఇంక నేను బయలుదేరతాను. నా స్నేహితురాళ్లను నిద్ర లేపి, మీరు సూచించిన విధంగా వ్రతం ఆచరించుతాను. ధను: మంచిది తల్లీ! శుభమస్తు. (గోదాదేవి అందరినీ నిద్ర మేల్కొలపటానికి బయలుదేరింది) – సృజన: డాక్టర్ వైజయంతి పురాణపండ -
విష్ణువును మేల్కొలిపే ఉత్తమ మాసం
కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు.. మార్గశిర మాసంలో భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరి మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. తూర్పు తెలతెలవారుతుండగా..పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు.. వరిపిండితోనూ, సున్నపుపిండితోనూ వేసి.. వాటిమధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు.. తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు. విష్ణువు సూర్యనారాయణుడై ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయం కాబట్టి సౌరమానం ప్రకారం ఇది ధనుర్మాసం. ఈ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేద గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీ కృష్ణపరమాత్ముడే మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది. ఈ మాసంలో చేసే ఏ పూజైనా, హోమమైనా, ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియశాడు. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం. సూర్యుడు ధనూరాశిలో ఉండగా..విష్ణువును మేల్కొలిపే ధనుర్మాసవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూధనుడు’ అనే నామంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణువ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది కాబట్టి మనం గోదాదేవిని స్మరించుకోవడం శ్రేష్ఠం. ఈ మాసంలో లవణం దానం చేయటం వల్ల, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళంతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ మహావిష్ణువుతోపాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అని స్మరించుకుంటూ ఉండటం శుభఫలితాలనిస్తుందనీ శాస్త్ర వచనం.ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి వీటితో తయారైన పొంగలి, పులిహోర.. దద్యోజనం వంటి వాటిని విష్ణువుకు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా మార్గశిర గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రాతః కాలం లో స్నానం చేసి విష్ణువుని ఆరాధించడం లేదా శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం పఠనం చేయడం అనంతకోటి పుణ్యప్రదం. ఈ మాసంలో చేసే నదీస్నానాన్ని మార్గశీర్ష స్నానాలు అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. ఈ మాసంలో ఇంకా అనేక పర్వదినాలున్నాయి. వాటిని ఆచరించడం ప్రశస్తం. – కృష్ణ కార్తీక -
ధనుర్మాస ప్రాముఖ్యత
ప్రపంచ దేశాలన్ని మన భారత దేశం వైపు ఒక విధమైన సమస్కరణీయ దృష్టితో చూస్తున్నా యి. అందుకు కారణం మన సంస్కృతీమయ వైభవమే. మనం జరుపుకునే పర్వదినాలు, పండుగల వెనుక ఎంతో అంతరార్థం ఉంది. పండుగంటే కేవలం తిని, త్రాగి, కొత్త బట్టలు వేసుకోవటం మాత్రమే కాదు. నిశితంగా ఆలోచిస్తే కొన్ని పండుగల వెనుక మనిషికీ, మనిషికి మధ్య సత్సంబంధాలు పెంచే ఉద్దేశ్యం కనపడితే.. కొన్ని పండుగలు ఆరోగ్యం కాపాడుకోవటానికి దోహదం చేసేవిగా ఉంటాయి. ప్రతి పండగ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే, సందేశాన్ని ఇచ్చేదే. ‘ఏష సుస్తేషు జాగ్రర్తి భూతేషు పరినిష్ఠిత:’ అనే రామాయణ వచనాన్ని అనుసరించి లక్ష్మీ స్వరూపాలన్నింటిని ఇచ్చేది సూర్యభగవానుడే. (ధారణ శక్తి, పుష్టి, ఆనందం, ధైర్యం మొదలైనవన్ని లక్ష్మి స్వరూపాలే) కనుక సూర్యగమనంపై ఆధారపడి ప్రవర్తించేది, శక్తిని, పుష్టిని ఇచ్చేది అయిన ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్యమాసాలలో వస్తుంది ‘మాసానాం మార్గశీరోం’అని భగవద్గీతలో శ్రీకృష్ణుడంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలోనొకటి. ధనుర్మాసం సాధారణంగా డిసెంబరు 12-16 తేదీల మధ్య వస్తుంది. దీనిని నెలగంట పెట్టడం అని కూడా అంటారు. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం అనుసరించి జరుపుకునేవే. అయితే సంక్రమాణములు సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాము. ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని వాడుకలోనుంది. ఇది చైత్రాది పన్నెండు మాసాల్లో లేదు. ఈ మాసానినేచాపము, కోదండకర్మక, శూన్యమాసము అని కూడా అంటారు. ధనుర్మాసమనేది స్త్రీల సౌభాగ్యమును పెంచును. (చదవండి: భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం) అందుచేత సౌభాగ్యవంతులుగు స్త్రీలు,పెళ్ళి కావలసిన ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వుంటారు. ఆ సమయం రాగానే. గృహములను శుభ్రం చేసుకొని ఇంటి ముంగిట గోమయంతో కళ్ళాపి చల్లి, చిత్ర విచిత్రమగు ముగ్గులను. తీర్చి దిద్ది వాని మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి వాటిమీద పసుపు కుంకుమలు జల్లి గుమ్మడి పూలు బంతిపూలు పెట్టి ప్రదక్షిణం చేస్తూ గొబ్బిపాటలు పాడుతూ ఈ నెలంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. సుబ్బీ గోబ్బెమ్మ సుఖము లీయవే చామంతి పూవంటి చెల్లెల్నీయవే. తామర పూవ్వంటి తమ్ముడినీయవే మొగలి పూవంటి మొగుణ్ణీయవే లక్ష్మీ కటాక్షం అందరికి కావాలి. సౌభాగ్యవతులు నిత్య సౌభాగ్యం కొరకు సర్వదా, సర్వావస్థలయందు లక్ష్మీ తమ గృహమందు స్థిరనివాసమేర్పచుటకై భక్తి శ్రద్ధలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ విధంగా కోరుకుంటారు. నిత్యం సాపద్మహస్తా మమవసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా నగరవాసులకు ఇంత శ్రద్ధ తీరికా లేదు. పేడ అంటేనే అసహించుకుంటారు. అపార్ట్ మెంట్ ఇళ్ళు, సిమెంటు గచ్చులు. కళ్ళాపిఎక్కడ జల్లుతారు? కొంతలో కొంత నయం. ఉన్న జాగాలో ముగ్గులు పెడతారు, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కడతారు. లక్ష్మీ దేవి నారాదించు గృహిణిలు కూడా లక్ష్మీ స్వరూపులుగా ఉన్నప్పుడే ఆ దేవి అనుగ్రహం పొందగలరు. అందువలన ఇంటి గృహిణి పాదములకు పసుపు రాసుకుని శుభ్రమైన చీర ధరించి, కేశములను అందంగా అలంకరించుకుని, సువాసనగల పూలను తలలో ధరించి ముఖమున కుంకుమ బొట్టు తీర్చి దిద్దుకొని ఉన్నప్పుడు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. రూపేచ లక్ష్మీ అని అంటారు. ఈ మాసంలో కాత్యాయని వ్రతం ఆచరిస్తారు. పెళ్ళి కాని ఆడపిల్లల ఈ వ్రతం చేస్తే మంచి భర్తను పొందుతారంటారు. ఈ వ్రతాన్ని చేసే పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందింది అంటారు. ధనుర్మాసంలో మరో విశేషం గోపూజ. గోవులో ముక్కోటి దేవతలుంటారని పెద్దలు చెపుతారు. లక్ష్మీ స్వరూపాలైన గోవు గిట్టలందు, ధర్మస్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మీ ఉంటుందని శిష్టులు చెబుతారు. గోవును పూజించడం శుభకరం. ఘడియల్లో ధనుర్మాసంలో లక్ష్మీ నారాయణులనే కాక ప్రత్యక్ష దైవం సూర్యభగవానునికి కూడా పూజించడం, ప్రార్ధించడం, ధ్యానించడం వలన అవ్యయఫల ప్రాప్తి కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు దోహదపడే కాలమే ధనుర్మాసం. స్వస్తి - గుమ్మా ప్రసాద రావు -
రేపటి నుంచి ధనుర్మాసం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, ధనుర్మాస ఘడియలు 2021 జనవరి 14న ముగియనున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి కర్ణాటకలోని ప్రముఖ ద్వైత సంస్థానం వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశ తీర్థ స్వామి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సత్యదేవుడి కార్తీక ఆదాయం రూ. పది కోట్లు అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానానికి కార్తికమాసం సిరులు కురిపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు హుండీలలో సమరి్పంచిన కానుకలను సోమవారం లెక్కించారు. 1,85,71,847 ఆదాయం వచి్చంది. 33 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి కూడా లభించిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాధరావు తెలిపారు. ఇది 32 రోజుల హుండీ ఆదాయం కాగా..అందులో 29 రోజులు కార్తీకమాసమని వివరించారు. ఒకేసారి హుండీ లెక్కింపులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని చెప్పారు. దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా ఇప్పటికే సుమారు రూ. 8 కోట్లు పైబడి ఆదాయం వచి్చందని, ప్రస్తుత హుండీ ఆదాయం రూ.1.85 కోట్లు కలిపితే ఆదాయం సుమారు రూ. పది కోట్ల వరకు వచి్చందని అధికారులు తెలిపారు. భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం హైదరాబాద్: కోవిడ్–19 నిబంధనల కారణంగా ఈసారి శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం తపాలా శాఖ సహకారంతో భక్తుల ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. భక్తులు తమకు సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాల్లో రూ.450 చెల్లిస్తే చాలు.. పది రోజుల్లో అయ్యప్ప ప్రసాదంతో కూడిన కిట్ స్పీడ్‌పోస్ట్ ద్వారా కోరుకున్న అడ్రస్‌కు చేరుతుంది. ప్రసాదం కిట్‌లో అరవన్న పాయసంతో పాటు స్వామివారి అభిషేకం నెయ్యి, పసుపు, కుంకుమ, విబూది, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. పది రోజుల్లో కిట్ ఇంటికి చేరుతుంది. అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం జరిగే మకరసంక్రాంతి వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు -
పుణ్యపుడమిపై పన్నిద్దరాళ్వారులు
‘ఆళ్వారు’ అంటే, రక్షకుడు, భగవంతుని దూత, యోగి, పరమయోగి, భక్తి జ్ఞానమనే సాగరంలో మునిగి తేలినవారని అర్ధాలున్నాయి. ఆళ్వార్ల పరంపరలో మొట్టమొదటిగా అవతరించిన ఆళ్వార్లు పొయ్గై ఆళ్వారు. తరువాత పుదత్తాళ్వారు, పేయాళ్వార్లు జన్మించి శ్రీ మహావిష్ణువును ఆరాధించి, తమ సంకీర్తనల(పాశురాలు) ద్వారా వైష్ణవ సాంప్రదాయనికి ప్రాచుర్యం కలిగించి ముందు తరాలకి ఆధ్యాత్మిక బాటనిపరిచి తరించిన మహనీయులు. ఈ ముగ్గురూ ముదలాళ్వారులు(మొదటి ఆళ్వారులు)గా ప్రసిద్థికెక్కారు. మొత్తం పన్నెండుమంది ఆళ్వార్లు ఈ నేలపై జన్మించి విష్ణుభక్తితో తాము తరించి, జనులని తరింపచేసారు. వీరినే పన్నిద్దరాళ్వారులంటారు. వీరిలో ఆండాళ్ తల్లి మాత్రమే స్త్రీమూర్తి, మిగిలిన పదిన్నొక్క ఆళ్వార్లూ పురుష యోగులు కావడం విశేషం. అయితే మొత్తం పన్నెండుమంది ఆళ్వార్లూ క్రీ.శ.719–836 సంవత్సరాల మధ్య జన్మించిన వారే అని చరిత్రకారుల వాదన. ఈ లెక్కప్రకారం మొదలాళ్వారులు ముగ్గురూ క్రీ.శ.719లో జన్మించినవారిగా భావించవచ్చు. భగవంతుడి లీలలు ఎంత విచిత్రమో చూడండి. మొదలాళ్వారులైన పొయ్గై ఆళ్వారు, పుదత్తాళ్వారు, పేయాళ్వారు ముగ్గురూ ఒక్కొక్కరోజు తేడాతో ఈ ధరిత్రిపై ద్రవిడ దేశాన వేర్వేరు ప్రాంతాల్లో తన దూతలుగా జన్మింపజేయడం ఆ పరమాత్ముడి లీలకాకా మరేమిటి? ఈ మొదలాళ్వారులని యోగిత్రయం అని కూడా పిలుస్తారు. ఆళ్వార్లలో మొట్టమొదటి వారైన పొయ్గై ఆళ్వారు మహావిష్ణువు పాంచజన్యం ఆంశంతో కంచీపురంలో వుండే ఓ దివ్యసరోవరంలో కాంచన పద్మనుండి ఉద్భవించారు. వీరికి సరోయోగి, కాసారయోగి అనే పేర్లు కూడా వున్నాయి. విష్వక్సేనులంతటి వారితో పంచసంస్కారాలు చేయించుకున్నారు. ఆ శ్రీమన్నారాయణుడే, వెంకటాద్రిపై కొలువున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడనీ, ఈతనిని ధ్యానించినంత మాత్రానే అందరిని కరుణిస్తాడని ఆ శ్రీవారిని మంగళాశాసనం చేసారు. రెండవ ఆళ్వారులైన పూదత్తాళ్వారు లేక భూతయోగి శ్రీ మహావిష్ణువు కౌముదీ ఆంశంతో పొయ్గై ఆళ్వారు పుట్టిన మరుసటి రోజు మహాబలిపురంలో జీవంతి పువ్వు నుండి పుట్టారు. వీరు బ్రహ్మముద్ర గల దివ్యయోగులు. ఈతడు తిరుమల శ్రీవేంకటేశ్వరుణ్ణి పదకొండు పాశురాలతో మంగళాశాసనం చేసారు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా అవతరించి, రావణాసురుడిని వధించిన ఆ మహాత్ముడే కలియుగాన శేషాచలంలో శ్రీవేంకటేశ్వరునిగా నీరాజనాలు అందుకుంటున్నారని కీర్తించారు.ఇక యోగిత్రయంలో మూడవవాడైన పేయాళ్వారు శ్రీమహావిష్ణువు ఖడ్గాంశంతో జన్మించారు. వీరు పూదత్తాళ్వారు పుట్టిన మరుసటిరోజే జన్మించడం విశేషం. వీరు చెన్నపట్నం శెల్వకేశవస్వామి ఆలయంలో మణికైరవ తీర్ధం (బావి)లో ఎర్రకలువ నుండి పుట్టారు. పేయ్ అంటే పిచ్చి, భ్రమలాంటి అర్థాలున్నాయి. నిత్యం భగవన్నామ స్మరణలో తనని తాను మరచిపోయి సామాన్య మానవులకి భిన్నంగా ప్రవర్తించటంతో వీరికి ఆ పేరు వచ్చింది. ఇతడిని మహాయోగి అని కూడా పిలిచేవారు. ఆదివరాహ క్షేత్రమైన తిరుమలలో వున్న వరాహ నరసింహస్వామిని ఈతడు పదిపాశురాలతో మంగళాశాసనం చేసారు. అందులో ముఖ్యమైనది – ‘మదపుటేనుగులు తమలో తాము పోరాడుతూ, తళ తళ మెరిసే రాళ్ళలో ప్రతిబింబించే తమ రూపాలని చూసుకుని వేరే ఏనుగులని భ్రమిస్తూ తమ దంతాలలోని ముత్యాలని ఆ వెంకటాద్రిపై కురిపిస్తుంటాయి. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు వరహునిగా తన కొమ్ములతో సముద్రం నుండి భూమిని కాపాడిన ఆ శ్రీహరే నేటి పవిత్రమైన ఈ వెంకటాద్రిపై కొలువున్న ఈ ‘వరాహుడంటూ’ కీర్తించారు. ఈ ఆళ్వార్లు ముగ్గురూ విష్ణుభక్తులై, ద్రావిడ దేశంలో వైష్ణవ క్షేత్రాలని సందర్శిస్తూ దేశ సంచారం చేసేవారు. పోయ్గై ఆళ్వారు విష్ణువుని నూరు పాశురాలతో కీర్తించిన ప్రబంధమే ముదల్ తిరువన్దాది. పూదత్తాళ్వారు నూరు పాశురాలతో కీర్తించిన ప్రబంధం ఇరణ్ణాం తిరువన్దాది, పేయాళ్వారు వంద పాశురాలతో కీర్తించిన ప్రబంధం కమున్ణాం తిరువన్దాది అనే పేర్లతో ద్రావిడనాట ప్రసిద్ధికెక్కాయి. పన్నిద్దరు ఆళ్వారుల మొత్తం 24 దివ్య ప్రబంధాలు, శ్రీ రామానుజుల నూత్తందాది ప్రబంధంతో కలిపి మొత్తం 25 దివ్య ప్రబంధాలని నాలాయిర దివ్య ప్రబంధంగా ద్రవిడనాట ప్రసిద్ధికెక్కాయి. ఈ నాలాయిర ప్రబంధంలో మొత్తం నాలుగువేల పైచిలుకు పాశురాలుండటం గమనార్హం. ‘భగవద్గుణంగళిల్ ఆళంగార్ పట్టవరగళ్ ఆళ్వార్ గళ్’ అని వైష్ణవ ఆచార్యుల నిర్వచనం. భగవంతుని సుగుణాలని నిత్యం అనుభవిస్తూ తన్మయం చెందేవారే ఆళ్వారులు. వైష్ణవ వాఙ్మయం ఈ మొదలళ్వార్లతో ప్రారంభింపబడి ద్రవిడనాట మిక్కిలి ప్రసిద్ధికెక్కింది. ఆ తరువాత జన్మించిన తొమ్మిది మంది ఆళ్వారులేగాక సాక్షాత్ శ్రీమద్రామానుజాచార్యులు కూడా తమ విశిష్టాద్వైతంతో మొత్తం భారతదేశంలో వైష్ణవమతానికి బహుళ ప్రాచుర్యం కలిగించడంలో ముదలళ్వారులు వేసిన భక్తిబాట ఎంతో తోడ్పడింది. – కారంపూడి వెంకట రామదాస్ -
సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు అర్ధరాత్రి 11.47 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17 నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్ (గోదాదేవి) ఒకరు. శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఓ భాగం. నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. సాధారణంగా భోగశ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం ఏకాంతంగా జరుగుతుంది. కాగా, ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరచి ఉంచుతారు. -
తిరుమల ఆలయంలో 16 నుంచి ధనుర్మాస పూజలు
సాక్షి, తిరుమల: ఈనెల 15 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో 16వ తేదీ ఉదయం నుంచి జనవరి 14 వరకు తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల రోజులూ శ్రీవారిని సుప్రభాత సేవకు బదులుగా తిరు ప్పావై పఠనంతో మేల్కొలుపుతారు. అర్చ కులు రోజుకో పాశురం చొప్పున పఠిస్తారు. స్వామి వారి సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసీదళాలకు బదులుగా ఈ నెలరోజులూ బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. రూ.1.66 కోట్ల విరాళం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం 1.66 కోట్లను దాతలు విరాళంగా అందజేశారు. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు ఎస్.వెంకట్ ఎస్వీ అన్నప్రసా దం ట్రస్టుకు రూ.1,05,06,500, చండీఘడ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ.. నెక్టార్ లైఫ్ సైన్సెస్ సీఎండీ సంజయ్ గోయల్ రూ.51 లక్షలు అందజేశారు. ఏపీ రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు రూ.10 లక్షలను విరాళంగా ఇచ్చారు. అజ్ఞాత భక్తుడు శ్రీవారికి మూడేళ్లకు సరిపడా మేల్చాట్ వస్త్రాల కోసం రూ.1.20 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
17 నుంచి శ్రీవారికి సుప్రభాతం రద్దు
తిరుమల: తిరుమలలో ఈనెల 17నుంచి శ్రీవారికి సుప్రభాతం కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2018 జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారికి ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు మొత్తం 30 పాశురాలను వేద పండితులు పారాయణం చేస్తారు. ఈ నెల రోజులపాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయబద్ధంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణ ప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేదీ నుంచి యథావిధిగా సుప్రభాత సేవ జరుగుతుంది. -
అహోబిలంలో ధనుర్మాస పూజలు
అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నవ నారసింహ క్షేత్రాలను సందర్శించారు. స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారిని లలితాదేవిగా అలంకరించి ఉత్సవ పల్లకిలో కొలువుంచి ఊరేగించారు. -
16న గోదాదేవి పరిణయోత్సవం
సాక్షి, తిరుమల: ధనుర్మాసంలో చివరి రోజు శుక్రవారం కనుమ పండుగనాడు తిరుమల ఆలయంలో శ్రీగోదా పరిణయం నిర్వహించనున్నారు. శ్రీవారి వక్షస్థల లక్ష్మిని గోదాదేవిగా భావించి గోదాదేవి పరిణయోత్సవం ఏకాంతంగా (భక్తులను అనుమతించకుండా) నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తిరుపతి శ్రీగోవింద రాజస్వామి ఆలయంలోని గోదాదేవి (ఆండాళ్) ధరించిన పుష్పమాలలు తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారికి ధరింపజేస్తారు. అదే రోజు పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తులు ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేట మండపం వద్దకెళ్లి వేట కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆరోజు ఆలయంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి తిరుమల విజయ బ్యాంకులోని కరెంట్ బుకింగ్ కౌంటర్లో 100 సుప్రభాతం టికెట్లు కేటాయించనున్నారు. -
బ్రేక్‌ఫాస్ట్ షో : ధనుర్మాసం విశేషాలూ.. విశిష్టతలు