
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment