ఉజ్జాయిని ఆలయంలో రాహుల్ పూజలు
ఇండోర్: భారత్ జోడో యాత్రతో తనలో ఓపిక, ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం పెరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాలో ఓపిక పెరగడం ఎంతగానో సంతృప్తినిస్తోంది. 8 గంటలు నడిచినా విసుగు రావడం లేదు. ఎవరైనా నెట్టినా కోపం రావడం లేదు.
యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరించాల్సిందే. ఆటంకాలు ఎదురైనంత మాత్రాన విరమించుకోవడం సరికాదు. ప్రజలు చెప్పేది సావధానంగా వింటున్నా. ఇది నాకెంతో మేలు చేస్తోంది. పాదయాత్ర ఇప్పటిదాకా ఎన్నెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment