Patience
-
కోరిక కాదు ఓపిక కావాలి.. ఇంట్రస్టింగ్ స్టోరీ
ఒకప్పుడు ఋషులు, మునీశ్వరులు, సాధువులు, మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త దర్శనభాగ్యం కోసం యోగముద్రలో, ధ్యానంలో ఉండేవారు. సృష్టికర్త దర్శనమిచ్చేంతవరకు వారి కార్యదీక్ష భగ్నం చేసుకునే వారు కాదు. వారి పూర్వజన్మ సుకృతమో, కర్మఫలమో ఫలించి ఆ భగవంతుడి దర్శనంతోనే వారి జన్మ ధన్యమైపోయేది.రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువై పోయాయి. కోరికలు తోడయ్యాయి. దైవపూజలు చేస్తూనే కోర్కెలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు. దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు. మనిషి తలరాతను రాసింది ఆయనే కదా!కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనిషి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే రాస్తాడు. మంచి అయినా, చెడు అయినా జరిగి΄ోతూనే వుంటాయి. బ్రహ్మ రాతను మార్చటం అసాధ్యం. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. అలాంటి పాప, పుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి. ఫలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను, అన్నదానాలు, వస్త్రదానాలు, నిలువుదోపిడీ ఇస్తామని మొక్కుకుంటారు. మనం మానవమాత్రులం కాబట్టి ఇలాంటి ఆలోచనలు, కోర్కెలు ఉండటం సహజం. (చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..!)ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు. సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తమ కుమారున్ని తిరిగి ఇవ్వాలని కోరతాడు. కోరిన వెంటనే శ్రీ కృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు. అంతటి గొప్ప మహర్షి కూడా భగవంతుడు వరం కోరుకొమ్మంటే ఏమీ పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు. అంతటి మేధావికన్నా మామూలు మనుషులం మనం ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు. కాబట్టి దైవసేవ చేయడం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే. ఇక ΄ాపపుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే..ఇదీ చదవండి: శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహంభక్తుడు పురోగతి సాధించినప్పుడు నీటి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు. విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయ్. మొలకలను తినాలని పక్షులు చూస్తాయ్. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్. అన్నిటినీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్. జీవితం కూడా అంతే! వచ్చేవరకు వేచివుండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే...– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి. -
vinayakachavithi 2024: ప్రతి భాగం ఓ పాఠం... ..ప్రకృతికి పీఠం
భువనచంద్ర వినాయకచవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. ఈ పండుగ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏనుగు తలకాయ.. అంటే పెద్దది. అంటే గొప్పగా ఆలోచించు.. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే... ‘నాయనా నీ శక్తినంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్ట్ చేయకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విను.. ఆ విన్నదాన్ని చక్కగా నీ మెదడుతో ఆలోచించు..’ అని అర్థం. ఇక ఆయన పొట్టకు నాగబంధం కట్టేశారు.. అంటే అర్థమేంటీ? జాగ్రత్తగా గమనిస్తే.. నాయనా నువ్వు ఎక్కువ గనుక తిన్నట్టయితే.. అది విషంతో సమానం. అందుకే మితంగా భుజించడం నేర్చుకో.. అందుకే తినే ముందు నీళ్లు జల్లి అమృతమస్తుః అంటాం.. అమృతం ఎప్పుడు అవుతుంది? మితంగా తిన్నప్పుడు అమృతం.. అపరిమితంగా తిన్నప్పుడు అది విషం. మనం తినేటటువంటి ఆహారం ఎలుకలు గనుక తినేస్తే.. ఎలుకలను గనుక కంట్రోల్లో పెట్టక΄ోతే మనిషికి గింజ కూడా దొరకదు. అందు గురించే ఆయనకు వాహనంగా పాదాల దగ్గర ఎలుకను ఉంచి ఎలుకలను కంట్రోల్లో పెట్టుకున్నావో నీ ఆహారం సేవ్ అవుతుంది అని సూచిస్తున్నారు.వినాయకుడి చేతిలోని అంకుశం... దేన్నైనా కంట్రోల్ చేసుకునే పవర్.. ఏ బంధమైనా.. స్నేహం కావచ్చు.. ఏదైనా నిర్ణయం కావచ్చు.. అంకుశం ఏంటంటే.. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ చేస్తున్నది కరెక్టా కాదా అనేది మన చేతుల్లో ఉండాలి. తర్వాత పాశం.. రిలేషన్స్.. ఇలా వినాయకుడి శరీరంలో ఉండే ప్రతి భాగమూ మనకు ఒక పాఠం లాంటిది. జీవిత పాఠం అది. గ్రామాల్లో స్థానికంగా ఉండే దేవతల్లో లక్ష్మీ, వినాయకుడు ఇద్దరూ ఉంటారు. ఆహార ఉత్పత్తి, పొదుపు వల్ల సమృద్ధి. నాకు ఒకరు గొప్ప మాట చె΄్పారు. ఆరోజుల్లో జీతాలు తక్కువ వచ్చేవి కదా.. అప్పుడు ఒకరు చె΄్పారు. అది చాలా మంచి మాట. ‘ఏమండీ.. మా ఇంట్లో చింతపండు, ఉప్పు, ఎండు మిరిపకాయలు, బియ్యం కచ్చితంగా ఎప్పుడూ ఉంచుతానండీ... జీతం రాగానే మొట్టమొదట ఎక్కువ మోతాదులో అవే తీసుకుంటానండి’ అని. ‘అదేంటీ?’ అన్నాను. ‘మన ఇంటికి పది మంది అప్పటికప్పుడు వచ్చారనుకోండి.. ఆ నాలుగు పదార్థాలుంటే కనీసం చారన్నం అయినా పెట్టొచ్చు కదా?’ అని సమాధానం ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ లగ్జరీ ఐటమ్స్.ఇక తర్వాత లేఖిని.. వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడం. ఇక్కడ లేఖిని అంటే అక్షరం రాయడం మాత్రమే కాదు.. ఏ విద్యైనా సిద్ధింపచేయాలంటే మొట్టమొదట చెవులు కరెక్ట్‌గా ఉండాలి.. బుర్ర కరెక్ట్‌గా ఉండాలి. అందుచేత సిద్ధి వినాయకుడు.. ఏది మొదలుపెట్టినా ‘అయ్యా ఇది నేర్చుకోదలిచాను.. నన్ను సిద్ధింపచేసే శక్తి నీలో ఉంది గనుక ఈ సిద్ధి నాకు ్రపాప్తించేలా చూడు’ అని నమస్కరిస్తాం. చిన్నతనంలో కూడా అందుకే వినాయకచవితి వచ్చిందంటే.. పుస్తకాలు, అట్టలు.. పెన్నులు అన్నీ స్వామి వారి ముందు ఉంచి పూజ చేసుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా.. ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా వినాయకుడికి మొట్టమొదటి స్థానం ఎందుకు ఇస్తారంటే.. ఆయన సిద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే సిద్ధి లేదు. నిజానికి కుమారస్వామితో ఆయన ΄ోటీ పడినప్పుడు కూడా ఆయన బుద్ధిని ఉపయోగించాడు.. అందుకే ఆయన భార్యలను సిద్ధి బుద్ధి అంటాం.. నీ బుద్ధిని గనుక సక్రమంగా వినియోగించినట్లు అయితే ఆటోమేటిక్‌గా సిద్ధి లభిస్తుంది. వినాయకచవితి ఏం చెబుతుందంటే.. ఏది చేసినా శ్రద్ధతో చెయ్.. చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఆయన కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే అర్థం ఏంటీ? సూక్ష్మమైనదాన్ని కూడా చూడగలగాలి. చీమ కన్ను ఎంత చిన్నగా ఉంటుంది? దానికి కూడా ఆహారం దొరుకుతుంది కదా? అట్లాగే ఏనుగు కళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన కదలికలను కూడా అది పట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. జంతువులు అన్నింటిలోనూ చక్కటి బ్రెయిన్ ఉన్న జంతువు ఏనుగు. అదే నెంబర్ వన్ . మానవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత పవర్ దానికి ఉంది. పత్రి అనేది మనం ఎందుకు కోసుకొస్తాం? వెలగ, వాక్కాయ్ వంటివన్నీ ఎందుకు తీసుకొస్తాం పూజకి? ఎందుకంటే ఈ సీజన్ లో వాక్కాయ్ పచ్చడి తినమంటే ఎవరూ తినరు..? అందుకే వాక్కాయ్ – కొబ్బరికాయి, కొబ్బరికాయ – వెలగ కలిసి చేసుకుంటాం. నిజానికి ఈ సీజన్ లో ఇవి తింటేనే రోగనిరోధక శక్తి అద్భుతంగా పని చేస్తుంది. రెండొవది ఆకులు దూసిన తర్వాత కొత్త ఆకులువస్తాయి. అలా కాకుండా ఆ ఆకులు మొక్కకే ముదిరి΄ోతే అక్కడితో ఎండ్ అయి΄ోతుంది. ప్రతి ఔషధ మొక్కలను సజీవంగా ఉంచాలంటే పాత ఆకుల్ని పీకాలి. ఇక కామెర్లకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్ . ప్రకృతిని రక్షించేవాడు దేవత.. ప్రకృతిని రక్షిస్తూ.. ప్రకృతి మీద ఆధారపడేవాడు మానవుడు. ప్రకృతిని నాశనం చేసేవాడు రాక్షసుడు. ప్రకృతితో సహజీవనం చెయ్ అని చెప్పే ఏకైక పండుగ వినాయకచవితి.సుద్దాల అశోక్‌తేజ వినాయచవితి పట్ల నా పరిశీలన ఏంటంటే పురాణాలు కానివ్వండి.. ప్రబంధాలు కానివ్వండి.. కల్పనలు కావచ్చు.. యదార్థంగా జరిగినవి కావచ్చు.. ఏవైనా.. ఏవైనా సరే.. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం రాసినవే.. పుట్టించినవే.. శంకరుడు.. పార్వతమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్లబోతుంటే ఒక పిల్లోడు అడ్డుకుంటాడు.. అతడిపై ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు. ఇది కదా కథ? తర్వాత పార్వతమ్మ వచ్చి.. బాగా ఏడ్చి.. భర్త మీద కోప్పడితే.. మళ్లీ బతికించాడు.. ఫస్ట్ ఏంటంటే.. తొందరపాటుతనం మనుషులకే కాదు.. దేవతలమైన మాకు కూడా ఉంటుందని చెప్పడమే ఆ పసివాడ్ని చంపడం.. ఒక తొందరపాటులో ఇన్ని అనర్థాలు జరగుతాయి అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది అనుకుంటాను.. శివుడు సహనంగా ఉండి ఉంటే చంపేవాడు కాదు కదా.. నంబర్ 2– ఎంత పరమేశ్వరుడైనా భార్యకు శరీరంలో సగభాగం ఇచ్చాడు.. అదొక ఆదర్శమైతే.. భార్య అతడు చేసిన పొరబాటు గురించి చెప్పగానే.. ఎక్కడా పురుషాధిక్యత లేకుండా తన పొరబాటు తాను గ్రహించాడు.. అంటే ఇక్కడ స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా భావించడం తప్పు అని తన ఈ చర్య ద్వారా తెలిపాడు.. ‘నేను భర్తను, నువ్వు భార్యవి.. అవును చంపేశాను.. నా ఇష్టం..’ అని ఉంటే ΄ోయేది కదా..? కానీ అలా అనలేదు.. పొరబాటు గ్రహించడమే కాదు.. భార్య చెప్పిన దిద్దుబాటు చర్యకు పూనుకున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు చెప్పినా.. భార్య చెప్పినా.. మంచి చెప్పినప్పుడు మనం దాన్ని సవరించుకోవాలి.. వీలైతే ఆచరించుకోవాలి.. అనేది రెండో ఘటన.మూడవది ఇది చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. తలను తీసేశాడు.. భార్య వచ్చి ఏడవగానే ఉన్న తలను అతికించొచ్చు కదా? ఎన్నో మాయలున్నవాడు.. పైగా నరికిన తల పక్కనే ఉంటుంది కదా? ఆ తలను అతికించకుండా ఏనుగు తల తీసుకుని రావడం ఎందుకు? ఎందుకు అంటే.. మనిషికి ఎంత ్రపాధాన్యత ఉందో.. దేవతలకు ఎంత ్రపాధాన్యత ఉందో.. జంతువులకు కూడా అంతే ్రపాధాన్యత ఉంది అని చెప్పడానికన్నమాట. అంటే ప్రకృతిని గౌరవించడం అనిమాటే. ‘‘నువ్వు జీవించు మిగతా వాటిని జీవించనివ్వు’’ అని చెప్పడం కోసం ఒక జంతువుకి అపారమైన ్రపాధాన్యత ఇవ్వడం కోసం ఏనుగు తలకాయ పెట్టి ఉంటాడా? ఇవన్నీ నా ఆలోచనలే.. నా వ్యక్తిగతమైనవి.తర్వాత శంకరుడి దగ్గర కైలాసంలో పరస్పర శత్రువులైన జంతువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎలుకలను తినే పాము పక్కనే ఉంటుంది. పాముని తినే నెమలి పక్కనే ఉంటుంది. మూడు పరస్పర వైషమ్యాలు కలిగిన జీవరాశులకు కూడా సమానమైన గౌరవం ఇస్తూ సమానమైన జీవితావకాశాన్ని ఇచ్చిన వాడు శివుడు. కైలాసంలో జాతీయ జంతువు ఎవరో తెలుసా..? ఎద్దు. ఎద్దుని వాహనం చేసుకున్నవాడు శివుడు. బ్రహ్మ కమలం మీద ఉంటాడు. విష్ణువు ఆదిశేషువు మీద ఉంటాడు. కాని శివుడు రైతుకి, వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఎద్దును వాహనంగా ఎంచుకున్నాడు. ఇక వినాయకుడిని పూజించే దగ్గర.. సాధారణంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన దగ్గర ఉన్నవో లేనివో నాణాలు తెచ్చిపెడతాం.. లేదా ఆరోజు బంగారం ఏదొకటి కొనుక్కుని పెడతాం. కానీ వినాయకుడికి అవేం ఉండవు. చెరకు, పత్రి, గరిక ఇలా అతి చౌక ఆకులు.. సులభంగా ప్రకృతిలో దొరికే వాటిని తెచ్చి పెడతాం. ప్రకృతి, ప్రకృతిలోని జీవులు, పరమాత్మ మూడు సమానమే అని చెప్పేందుకు గుర్తుగా ఈ వినాయకచవితి కొనసాగుతోంది. దీన్నే అందుకోవాలి సమాజం. దీన్ని అందుకోవాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. అందుకే బాలగంగాధర తిలక్ దైవభక్తిలో దేశభక్తిని రంగరించి.. వినాయకచవితిని మొట్టమొదటిసారి ఘనంగా జరిపించారు. అందుకే అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప శక్తిని నింపింది ఈ పండుగ. మా చిన్నప్పుడు వినాయకచవితికి ఇంత క్రేజ్ లేదు..ఇప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నదంటే దానికి కారణం తిలక్. ఆ గొప్పతనం ఆయనదే. ఆ తర్వాత గణపతితో ఏం చేయించినారు.. ప్రపంచ పరుగు పందెం ΄ోటీ పెట్టేస్తే ఎలుక మీదున్న వాడు ఏం గెలుస్తాడులే అని కుమారస్వామి నెమలి మీద వెళ్లి΄ోతుంటే.. వినాయకుడు అమ్మానాన్నలను మించి ప్రపంచం భూగోళంలో ఏముంటుందని చెప్పి మూడు చుట్లు తిరిగితే.. అందరూ కలసి ఎవరు మొదలు వచ్చారంటే.. వినాయకుడే మొదట వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన దేవుడు అయ్యాడు.. ప్రథమ దేవుడు అయ్యాడు.. ఇక్కడ తల్లిదండ్రుల ్రపాధాన్యత కనిపిస్తుంది. ఇది గ్రహించాల్సింది. -
Bharat Jodo Yatra: పాదయాత్రతో నాలో ఓపిక పెరిగింది: రాహుల్
ఇండోర్: భారత్ జోడో యాత్రతో తనలో ఓపిక, ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం పెరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాలో ఓపిక పెరగడం ఎంతగానో సంతృప్తినిస్తోంది. 8 గంటలు నడిచినా విసుగు రావడం లేదు. ఎవరైనా నెట్టినా కోపం రావడం లేదు. యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరించాల్సిందే. ఆటంకాలు ఎదురైనంత మాత్రాన విరమించుకోవడం సరికాదు. ప్రజలు చెప్పేది సావధానంగా వింటున్నా. ఇది నాకెంతో మేలు చేస్తోంది. పాదయాత్ర ఇప్పటిదాకా ఎన్నెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది’’ అని చెప్పారు. -
ప్రవర్తన... పర్యవసానం
ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి? ’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది. మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు. చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను... సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు. ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి. సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది. ‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి. అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. – రోచిష్మాన్ -
సహనమే.. సాధకునికి సంజీవని
సహనం అనేది మానవునికి అత్యంత ప్రధానమైన లక్షణంగా భాసించాలి. సహనం విజయానికి ప్రధానమైన కారణంగా ఎన్నోసందర్భాల్లో నిలుస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి ఒత్తిడికీ లోను కాకుండా, విజయం వైపు సాగడమే సహనానికున్న ఔన్నత్యం.. సహనం అనే గుణం మానవునికి విలువైన ఆభరణం వంటిది. సహనం అంటే క్షమ, ఓర్పు అని కూడా చెప్పవచ్చు. సహనంగా ఉండడం అనేది మనిషిలోని స్థితప్రజ్ఞతకు నిదర్శనం. సహనంగా ఉండడాన్ని అసమర్థతకు నిదర్శనంగా భావించరాదు. ‘‘అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు’’ అన్న మాటను మనం తరచూ వింటూనే ఉంటాం కదా..!! లౌకికంగా జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, ఆలోచనా ధోరణి ఎంత అవసరమో, దారిలో వచ్చే కష్టాలనూ, యాతనలనూ భరించడం, సహనాన్ని కోల్పోకుండా ఉండడం మనిషిని ఉన్నత స్థితికి తీసుకు వెళతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకానొక గురుకులంలో ఒక శిష్యుడు తోటివారితోనూ, గురువుగారితోనూ ఎంతో అసహనంగా ప్రవర్తించేవాడు. గురువు చెప్పిన విషయాలను పూర్తిగా వినకుండానే తనకు తోచిన రీతిలో దురుసుగా మాటలు మాట్లాడడం, వింతైన భాష్యాలను చెప్పడం అతని నైజంగా ఉండేది. గురువుగారు అతని ప్రవర్తనకు ఎంతగానో విసిగిపోవడమే గాక, ఒకింత ఆవేదనకూ గురయ్యేవారు. సహనంగా వ్యవహరించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని అతనికి తెలియచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడే పెద్దగా వాన కురిసి, వెలిసింది. వాతావరణం చల్లగా ఉంది. ఆయన ఒక శిష్యునితో ‘‘నాయనా.. కొంచెం పక్కనే పారుతున్న సెలయేటిలోని నీరు తీసుకుని వస్తావా.. దాహాన్ని తీర్చుకుందాం’’ అనడంతో శిష్యుడు సెలయేటి చెంతకు వెళ్ళి తిరిగివచ్చాడు. ‘‘గురువర్యా.. ఆ నీళ్ళు బురదగా ఉన్నాయి. తాగడానికి ఏమాత్రం బావుండవు’’ అన్నాడు. మళ్ళీ కాసేపటి తర్వాత గురువు గారు అతన్ని సెలయేటి దగ్గరకు పంపడం, మళ్ళీ అదే సమాధానం చెప్పడం జరిగింది. రెండు మూడుసార్లు ఆ విధంగా జరిగాక, శిష్యుడు చివరకు ఆనందంగా నీటితో తిరిగి వచ్చాడు. ‘‘గురువుగారూ.. ఇప్పుడు నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. అందుకే తాగడానికి తెచ్చాను’’ అన్నాడు. గురువుగారు అతని వైపు చూస్తూ, ‘‘నాయనా.. మనమంతా కొంత సమయం సహనంతో వేచి ఉన్నాం. అందుకే నీళ్ళు మామూలుగా ఉన్నాయి. మనం వేచి ఉన్న సమయాన నీటిలోని బురద స్వయంగా స్థిరపడింది. అందుకే ఇప్పుడు నీవు తెచ్చిన నీరు ఎంతో నిర్మలంగా ఉంది. మీ మనస్సు కూడా అలాంటిదే! ఇది ఆలోచనలనే బురదతో నిండి ఉన్నప్పుడు, మీరు దానిని తొట్రుపాటుకు లోను కాకుండా అలానే ఉంచాలి. మనసుకూ స్థిరపడడానికి కొంత సమయం అవసరం. అసహనానికి గురికావడంవల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. నీటిద్వారా నీవు తెలుసుకున్న ఉదాహరణే సహనంతో వర్తిస్తూ, విజయమార్గాన సాగడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది’’ అని చెప్పగానే శిష్యునికి కనువిప్పు కలిగింది. నాటినుంచి సహనంగా ప్రవర్తించడం అలవరుచుకుని, జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు ఆ శిష్యుడు. సహనం అనేది కొద్దిపాటి చేదుగానే ఉంటుంది. కానీ, సహనం యిచ్చే ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి. భూమాతకున్న సహనం ఎవరికుంది? ఎక్కడన్నా ఓటమి ఎదురైతే, క్రుంగిపోకుండా, ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు లేదా సహనం కలిగి ఉండడం అంటే, కేవలం ఒక బొమ్మలాగా మూలన నిశ్సబ్దంగా కూర్చోవడం కాదు. తాను వేచి ఉన్న తరుణం రాలేదని గ్రహించి, వైఫల్యానికి దారితీసిన కారణాలను కూలంకషంగా అన్వేషించి, విజయపథానికి బాటలు వేసుకోవడమే సహనంలోని ఆంతర్యం. ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది. ప్రతి క్రీడాకారుడూ గుర్తుంచుకోవలసిన వ్యక్తిత్వం శ్రీ లంక మాజీ కెప్టెన్ మర్వన్ సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో తాను ఆడిన తొలి 6 ఇన్నింగ్సులో 5 సార్లు సున్నా పరుగులు మాత్రమే సాధించి ఘోరంగా విఫలమైన మర్వన్, మరో ఇన్నింగ్సులో ఒక పరుగు సాధించాడు. అటువంటి ఆటతో ఆరంభించిన మర్వన్ ఎంతో సహనంతో ఆటను కొనసాగించి, శ్రీ లంక జట్టుకు 4 ప్రపంచ కప్పుల్లో ప్రాతినిధ్యం వహించడమేగాక, జట్టుకు నాయకుడుగానూ వ్యవహరించడం గమనార్హం. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఆటగానిగా స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికే గర్వకారణమైన నీరజ్ చోప్రా ‘‘నైపుణ్యం ప్రతి ఆటగాడికీ అవసరమే. అయితే, పరాజయాన్ని తట్టుకుని, సహనంతో ముందుకు సాగడం వల్లనే, ఎవరికైనా విజయం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని పలికిన మాటలు అందరికీ ఆచరణీయమైనవే. ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
సింధియా టైమ్స్
న్యూఢిల్లీ: అది 2018 డిసెంబర్ 13.. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నాక ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందా అని జోరుగా చర్చలు జరుగుతున్న వేళ. ఆ టైమ్‌లో రాహుల్‌గాంధీ కుడిచేత్తో జ్యోతిరాదిత్య సింధియాని, ఎడమ చేత్తో కమల్‌నాథ్ చేయి పట్టుకొని ఉన్న ఫొటోతో పాటు టాల్‌స్టాయ్ ప్రముఖ కొటేషన్ ‘అత్యంత శక్తిమంతమైన పోరాటయోధులు ఇద్దరే. ఒకరు సహనం, మరొకరు సమయం’’ అని షేర్ చేశారు. అది జరిగిన సరిగ్గా 15 నెలలు తర్వాత సింధియాలో సహనం నశించింది. పార్టీని వీడాల్సిన టైమ్ కూడా వచ్చిందని అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర్నుంచి సింధియా చాలా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఏకాకిగా మారిపోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు కల్పించడానికి ఎనలేని కృషి చేసి పార్టీకి ఒక జ్యోతిగా మారిన సింధియా సీఎం పదవిని ఆశించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ చేసిన జుగల్బందీ రాజకీయాలతో ఆయన ఆశించిన పదవి దక్కలేదు. సింధియాకు అనుభవం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్ నేత కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించారు. సోనియాగాంధీ. పీసీసీ అధ్యక్ష పదవిని కూడా పార్టీలో ఏకాభిప్రాయం లేదన్న కారణంతో తిరస్కరించారు. సీఎం కమల్‌నాథ్ ఆయనతో ఎప్పుడూ కలిసి నడవలేదు. పార్టీపైన కూడా కమల్‌నాథ్ ఆధిపత్యమే కొనసాగింది. ఆ తర్వాత జ్యోతిరాదిత్యని పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇది ఒక రకంగా పనిష్మెంట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఉనికి కూడా లేని ప్రాంతానికి ఇన్చార్జ్గా నియమాకం జ్యోతిరాదిత్యకు మింగుడుపడలేదు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. అలాంటి సమయంలోనే బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపింది. అప్పటికే కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ చేస్తున్న రాజకీయాలతో పార్టీలో తనకెలాంటి భవిష్యత్ ఉండదని భావించిన జ్యోతిరాదిత్య సింధియా ఆపరేషన్ కమల్‌కి ఆకర్షితులైనట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. సింధియాని రాజ్యసభకు పంపించి ఎన్డీయే కేబినెట్లో మంత్రి పదవి ఇస్తారని, చౌహాన్ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో సర్కార్ ఏర్పడితే సింధియా వెంట వచ్చే ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో మంత్రి పదవులివ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించినట్టు సమాచారం. ఏడాదిగా సంకేతాలు జ్యోతిరాదిత్య పార్టీ వీడి కాషాయం గూటికి చేరుతారని ఏడాదిగా సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. 2019 జనవరిలో ఆయన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత అది మర్యాదపూర్వక సమావేశమనేనని ఇరువురు నేతలు చెప్పుకున్నారు. 2019 నవంబర్‌లో ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లలో తన బయోడేటా నుంచి కాంగ్రెస్ పార్టీ పేరుని, ప్రధాన కార్యదర్శి అన్న హోదాను తొలగించి సామాజికవేత్త, క్రికెట్ ప్రేమికుడు అని రాసుకున్నారు. ఇక సోనియా, రాహుల్ నిర్ణయాలు, వివిధ అంశాల్లో పార్టీ వైఖరి కూడా జ్యోతిరాదిత్యకు మింగుడుపడలేదు. కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై కూడా ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా చాలా కాలంగా జ్యోతిరాదిత్య పార్టీని ఏ క్షణంలోనైనా వీడుతారన్న ప్రచారమైతే జరుగుతోంది. నాడు మోదీ మ్యాజిక్‌ను తట్టుకుని మధ్యప్రదేశ్ గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా మాధవరావు సింధియా దంపతులకు 1971, జనవరి 1న బొంబాయిలో జన్మించారు. డెహ్రాడూన్ డూన్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. స్టాన్‌ఫర్డ్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేశారు.2001లో హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి మాధవరావు మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తండ్రి మృతితో ఖాళీ అయిన గుణ స్థానం మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మన్మోహన్ కేబినెట్లో కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌ను తట్టుకొని లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
రెక్కలే రాని సీతాకోకచిలుక
పెరట్లో పూలమొక్కలను పరిశీలించి చూస్తోంది పింకీ. గన్నేరు చెట్టు ఆకు మీద ఏదో అతుక్కుని ఉన్నట్లనిపించింది. అమ్మని పిలిచి అదేమిటని అడిగింది. ‘‘అది సీతాకోకచిలుక గుడ్డులా ఉంది. దాన్ని ఏమీ చేయకు. ప్రతిదీ నీకే కావాలి. వెళ్లి చదువుకోపో’’ అని కోప్పడింది అమ్మ. ఓహో! ప్యూపా దశ అన్నమాట అని స్కూలు పాఠాన్ని గుర్తు చేసుకుంది పింకీ. అంతలోనే అమ్మ గద్దింపుతో చిన్నబుచ్చుకున్న పింకీ దగ్గరకు వెళ్లింది నానమ్మ. తనను బుజ్జగిస్తూ, చెవిలో ఏదో చెప్పింది. సంతోషంతో పింకీ కళ్లు మెరిశాయి. అమ్మ చూడకుండా ఆకును తెంచి, పాత జామెట్రీబాక్స్‌లో పెట్టింది. దానికి గాలి ఆడేందుకు వీలుగా పైన చిన్న రంధ్రాలు చేసింది. కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు పొద్దున్నే లేచిన పింకీ అగ్గిపెట్టె తెరిచేసరికి గుడ్డులో కదలిక కనపడింది. కాసేపటికి చిన్ని సీతాకోకచిలుక నెమ్మదిగా ఆ గుడ్డును పగులగొట్టుకుని బయటకు రావడం కనిపించింది. మరికొద్దిసేపటిలో దాదాపు ముప్పాతిక భాగం పైగా గుడ్డు నుంచి బయటికొచ్చింది. అయితే కొద్దిభాగం గుడ్డుకే అతుక్కుని ఉండడంతో దానికి సాయం చేద్దామని ఒక కత్తెర తెచ్చి నెమ్మదిగా దాన్ని కత్తిరించింది పింకీ. దాంతో పూర్తిగా బయటికొచ్చేసింది సీతాకోకచిలుక. అయితే ఎందుకోగాని అది ఎగరాలని ప్రయత్నించడం, ఎగరలేక కిందపడిపోవడం... జరుగుతుండేసరికి దీని సంగతి సాయంత్రం చూద్దాం లే అని బడికెళ్లిపోయింది. సాయంత్రం రాగానే బాక్స్ తెరిచి చూసింది. పాపం! దాని రెక్కలు సగం సగమే ఉన్నాయి. రెండు కాళ్లు కూడా లేవు. అందుకే అది ఎగరలేకపోతోందన్నమాట! బిక్కముఖం వేసింది పింకీ. వెక్కుతూ నానమ్మ దగ్గరకు వెళ్లింది. పింకీ చెప్పినదంతా విన్న నానమ్మ తనను దగ్గరకు తీసుకుని తలనిమురుతూ, ‘‘గుడ్డు నుంచి బయటికొచ్చేటప్పుడు దానిని పగలగొట్టుకునేందుకు చేసే ప్రయత్నమే దానికి తగిన బలాన్నిస్తుంది. నువ్వేమో సాయం చేద్దామనుకుని దాన్ని కత్తిరించేశావు. అందుకే దానికి రెక్కలు సరిగా రాలేదు. ఇప్పుడైనా కొంచెం ఓపిక పట్టు. కొన్నాళ్లకు బలం పుంజుకుని అదే ఎగిరిపోతుందిలే’’ అని బుజ్జగించింది. ‘సరే’నన్నట్లు తలూపింది పింకీ. ప్రతి ప్రాణికీ జీవించడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను ప్రకృతే ప్రసాదిస్తుంది. మనం అర్థం చేసుకుని ఓపిక పట్టాలి. పిల్లల హోమ్ వర్క్ తామే చేయడం, వారి పుస్తకాల సంచిని తామే మోయడం, ఆటలాడుకుంటే దెబ్బలు తగులుతాయని ఎక్కడికీ పంపకపోవడం వంటి వాటి వల్ల పెద్దయినా వారిలో ఏ పనీ సొంతగా చేయలేకపోవడం, అతి సుకుమారంగా తయారు కావడం వంటివి జరుగుతాయి. అలాగని పూర్తిగా వదిలేయమని, సాయం చేయవద్దనీ కాదు. ఎంతవరకో అంతే చేయాలి. – డి.వి.ఆర్. -
నన్ను వెళ్లనివ్వు
‘‘దేశానికి ఆపద, ప్రజలకు ప్రమాదం వచ్చిపడ్డాయి. కౌరవసేనను ఎదిరించడానికి తనకో సారథి కావాలంటున్నాడు రాకుమారుడు. అతని శౌర్యధైర్యాలు సారథి లేనికారణంగా నిర్వీర్యం కావడానికి వీలు లేదు. బృహన్నల ఒకప్పుడు సారథి. అర్జునుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నవాడు. అందువల్ల ఉత్తరకుమారుడికి సారథిగా పంపితే కార్యం సానుకూలమవుతుంది’’ అని సలహా చెప్పింది సైరంధ్రి. అలాగే అన్నాడు ఉత్తరకుమారుడు. బృహన్నలను పిలిచి ‘‘కౌరవులు మన గోవులను అపహరించుకుపోతున్నారు. వెంటనే రథం సిద్ధం చెయ్. కౌరవుల్ని పట్టుకుని నా ప్రతాపం చూపించాలి. తొందరగా పద’’ అంటూ హెచ్చరించాడు ఉత్తరకుమారుడు. క్షణాలలో రథం సిద్ధమైంది. గుర్రాలు ఆగమేఘాల మీద పోతున్నాయి. మహాసముద్రంలా ఉన్న కౌరవసేనను చూడగానే ఉత్తరకుమారుడి గుండెలు అవిసిపోయాయి. కాళ్లు గజగజా వణుకుతుండగా రథం మీద నిలబడటానికి కూడా ఓపిక లేనట్లుగా కూలబడిపోయాడు. ‘‘బృహన్నలా! మనవల్ల కాదు. రథాన్ని వెనక్కి తిప్పు. వెళ్లిపోదాం. బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అన్నాడు. బృహన్నల చిరునవ్వు నవ్వాడు. ‘‘ఉత్తరకుమారా! నువ్వు రాకుమారుడివి. అంతఃపుర స్త్రీల ముందు అనేక ప్రతిజ్ఞలు చేసి మరీ యుద్ధభూమికి వచ్చావు. మనం ఇప్పుడు శత్రువులకు భయపడి ఆవుల్ని తీసుకెళ్లకుండా ఉత్తిచేతులతో వెళ్తే మనల్ని చూసి అందరూ నవ్వుతారు. వెనకాముందూ చూసుకోకుండా బీరాలు పలకకూడదు. ధైర్యంగా పోరాడు. వెనక్కి వెళ్లే ఆలోచన మానుకో’’ అన్నాడు బృహన్నల. ‘‘నావల్ల కాదు, ఆడవాళ్లు నవ్వితే నవ్వనీ. ఎగతాళి చేస్తే చేయనీ, నన్ను మాత్రం వెళ్లనివ్వు’’ అంటూ రథం మీదినుంచి కిందికి దూకి పిచ్చివాడిలా పరుగెత్తుతున్న ఉత్తరకుమారుడి వెంటపడి పట్టుకున్నాడు బృహన్నల. అతన్ని రథం మీద కూర్చోబెట్టి తానే కార్యక్రమం నడిపించాడు. ప్రజల ముందు డాంబికాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చాక బెదిరిపోయి తిరుగుముఖం పట్టి పారిపోయిన ఉత్తరకుమారుడి కథ చెప్పే నీతి ఒకటే తగని మాటలు చెప్పకండి. తగని పనులు చేయకండి అని. -
నిబ్బరం... నిండుదనం
అతనొక బాలుడు. చేతిమీద పెద్ద కురుపు ఏర్పడింది. ఆ రోజుల్లో అలాంటి వాటికి కణకణ లాడే నిప్పుల్లో ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీని పెట్టడమే వైద్యం. అలాంటి ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆ వైద్యుడు ఇనపకడ్డీని కాల్చాడు. అయితే, అంత చిన్నపిల్లాడు ఆ బాధను తట్టుకోగలడా లేడా అని ఆలోచిస్తున్నాడు. అతని మనసులోని ఆలోచనను గ్రహించినట్లున్నాడా బుడతడు. కణకణలాడే ఆ కడ్డీని తీసుకుని చటుక్కున తనే ఆ కురుపు మీద పెట్టుకున్నాడు. వైద్యుడితోపాటు ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారతని ధైర్యానికి, సహన శక్తికి. ఆ తర్వాత కొంతకాలానికి అంటే ఆ కుర్రాడు యువకుడయ్యాక అతనికి అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. డాక్టరు మత్తుమందు ఇస్తానన్నాడు. అందుకు ఆ యువకుడు ఒప్పుకోలేదు. మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయమన్నాడు.మత్తివ్వకపోతే ఆ బాధను తట్టుకోలేవని వైద్యులు ఎంత చెప్పినా వినలేదు. చివరికి అతని పట్టుదలే నెగ్గింది. ఆపరేషన్ చేస్తున్నంత సేపూ ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉన్నాడు. అతను కష్టపడి చదువుకుని న్యాయవాది అయ్యాడు. రైతుల పక్షాన నిలబడి ఎన్నో కేసులు వారికి అనుకూలంగా వచ్చేలా వాదించి, విజయం సాధించాడు. ఒకసారతను కోర్టులో కేసు వాదిస్తుండగా ఎవరో ఇతనికి ప్లీడర్‌గా పెద్దగా డిగ్రీలు లేవని వ్యాఖ్యానించారు. దాంతో ఇతను రోషంతో లండన్ వెళ్లి చదువుకుని బారిస్టరీ పట్టా సాధించాడు. ఆ తర్వాత అతను మరింత పేరుమోసిన న్యాయవాది అయ్యాడు. అలాగే ఓసారి కోర్టులో కేసు వాదిస్తుండగా ఆయన భార్య మరణించినట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఆయన ఆ టెలిగ్రామ్‌ను చదువుకుని, మడిచి జేబులో పెట్టుకుని వాదనలు కొనసాగించి, కేసు గెలిచాడు. ఇంతటి నిబ్బరం, ఓరిమి ఉన్నాయి కనకనే అతను గాంధీజికి ప్రియశిష్యుడయ్యాడు. స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించాడు. స్వతంత్ర భారతదేశానికి ఉపప్రధానిగా, హోమ్ మినిస్టర్‌గా సేవలందించారు. 500కు పైగా సంస్థానాలను విలీనం చేశాడు. ఆ ఉక్కుమనిషే సర్దార్ వల్లభాయ్ పటేల్. అహ్మదాబాద్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట ప్రపంచంలోనే అతి ఎల్తైన విగ్రహంగా నిర్మించిన పటేల్ భారీ విగ్రహాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారు. – డి.వి.ఆర్. -
మీలో సహనం పాళ్లు ఎంత?
సహనం వహిస్తే కష్టమైన పనినైనా తేలికగా పరిష్కరించవచ్చు. కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులని కూడా ప్రశాంతంగా ఎదుర్కోలేక తరచుగా సహనం కోల్పోతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు మానవ సంబంధాలు దెబ్బతినవచ్చు. ఫలితంగా నష్టమే తప్ప లాభం ఉండదు. మీరు చిన్నచిన్న విషయాలకు కూడా అసహనానికి లోనవుతుంటారా? 1. మీరు హోటల్‌కి వెళ్ళినప్పుడు ఆర్డర్ తీసుకోవడం కొద్దిగా ఆలస్యమైతే కోపగించుకుని తిరిగి వచ్చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. మీ వాహనంలో పెట్రోల్ ఎప్పుడయిపోతుందో తెలియదు. బంక్‌లో క్యూ ఎక్కువగా ఉంది. మర్నాడు పెట్రోలు పట్టించుకునేంత టైమ్ ఉండదని తెలిసినా క్యూలో వెయిట్ చేయకుండా వెళ్ళిపోయే రిస్క్ తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. పబ్లిక్ టెలిఫోన్ దగ్గర మీకంటే ముందున్న వ్యక్తి నిర్దిష్ట సమయం కంటే ఎక్కువగా మాట్లాడుతుంటే ‘పబ్లిక్ టెలిఫోన్ని ఎలా వాడాలో తెలీదా?’ అని క్లాస్ తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. ఆటో అతను పది రూపాయలు ఎక్స్ట్రా అడిగితే, ఎక్సట్రా ఎందుకివ్వాలంటూ వాగ్వివాదానికి దిగుతారు. ఎ. అవును బి. కాదు 5. మీ పక్కింటివాళ్లు రేడియో, టీవీలు కాస్త ఎక్కువ సౌండుతో పెడితే, ‘న్యూసెన్స్ కంప్లయింట్ ఇస్తానం’టూ వారికి వార్నింగ్ ఇస్తారు. ఎ. అవును బి. కాదు 6. ట్రాఫిక్‌లో మీ ముందున్న వాహనం కదలకపోతే, ఏం జరిగిందో తెలుసుకోకుండా హారన్ కొడుతూనే ఉంటారు. ఎ. అవును బి. కాదు 7. కొన్ని ఫోన్‌కాల్స్ వచ్చి మీరు డిస్టర్బ్ అయితే తిట్టిన సందర్భాలున్నాయి. ఎ. అవును బి. కాదు 8. ఒకసారి వివరించిన విషయాన్నే మళ్ళీ చెప్పాల్సి వస్తే చిరాకు పడతారు. ఎ. అవును బి. కాదు 9. మీరు స్నేహితుల కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికే పది నిమిషాలు దాటిపోతే... ఇంతకంటే వెయిట్ చెయ్యడం దండగ అనుకుని వారికి ఇన్ఫార్మ్ చెయ్యకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. ఎ. అవును బి. కాదు 10. మిమ్మల్ని రెండోసారి ప్రశ్న అడగడానికి పక్కవారు భయపడతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’లు ఏడు దాటితే మీలో ఓర్పు చాలా తక్కువ. చిన్న చిన్న విషయాలలో కూడా సహనంతో ఉండక కోపగించుకుంటారు. ‘తన కోపమె తన శత్రువు’ అని గ్రహించండి. ‘బి’ లు ఏడు దాటితే సహనంగా ఉండడంలో మీకు సాధ్యమే. ఎంత పెద్ద సమస్య వచ్చి పడినా ప్రశాంతంగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ‘బి’ లను సూచనలుగా తీసుకుని ఓర్పుగా ఉంటే అది మీకు, మీ ఆరోగ్యానికి కూడా మంచిది. -
వివేకవాణి
♦ సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి. ♦ మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచననూ స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. ♦ నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. ♦ నిత్యం పని చేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. ♦ జీవితంలో భయం లేకుండా ఆత్మ విశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ♦ ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు. ♦ ఒక ధ్యేయంతో కృషి చేస్తే, నేడు కాకపోతే రేపయినా విజయం తప్పదు. ♦ జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే! -
సంయమనంతో వ్యవహరిస్తున్నారా?
సర్దుకుపోవడం, సహనం, సంయమనం, ఆవేశం... ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిలో ఏ లక్షణం మనల్ని డామినేట్ చేస్తోందో ఒకసారి చెక్చేసుకుందాం. 1. మీరు క్యూలో ఉండగా ఎవరైనా నేరుగా కౌంటర్ దగ్గరకు వెళుతున్నా చూస్తూ ఊరుకోవడం మీకలవాటు. ఎ. కాదు బి. అవును 2. అలా వెళ్తున్న వారిని పిలిచి అప్పటికే క్యూ పాటిస్తున్న విషయాన్ని గమనించి మీ వంతు కోసం ఎదురుచూడడం ధర్మం అని సున్నితంగా హెచ్చరిస్తారు. ఎ. అవును బి. కాదు 3. ఇంతమంది వెయిట్ చేస్తుంటే అలా వెళ్లడమేంటని గొడవపడతారు. ఎ. కాదు బి. అవును 4. పిల్లల పుస్తకాలు అస్తవ్యస్తంగా ఉంటే మనసులోనే చిరాకుపడుతూ, చిరిగిన వాటిని సహనంగా అతికించి అన్నింటినీ సర్ది పెడతారు. ఎ. కాదు బి. అవును 5. పుస్తకాలను అలా చూడగానే ఆవేశంతో ఊగిపోయి, పిల్లల్ని చివాట్లేసి, నాలుగు దెబ్బలేసి భయం చెబుతారు. ఎ. కాదు బి. అవును 6. పిల్లల్ని పిలిచి ఊడిపోయిన పేజీలను అతికించమంటారు, అవసరమైతే సహాయం చేస్తారు. వారిచేతే చేయించడం ద్వారా పుస్తకాలను జాగ్రత్తగా పెట్టుకోవాలన్న బాధ్యత, ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలన్న స్పృహ కలుగుతుందని మీ అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 7. హాస్పిటల్లో మీ వంతు వచ్చే సరికి ఆలస్యమవుతుందనిపిస్తే అసహనంతో అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించుకుని మరో డాక్టర్ దగ్గరకు వెళ్లిన సందర్భాలున్నాయి. ఎ. కాదు బి. అవును 8. మీ వంతు కోసం ఎదురు చూడడానికి టైమ్లేనప్పుడు మీ అపాయింట్ మెంట్‌ను మరొక రోజుకు కాని, అదే రోజు మీరు అటెండ్ కావాల్సిన పని పూర్తి చేసుకుని హాస్పిటల్‌కు వచ్చేటట్లు మార్చుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం. ఆవేశపడటం కాని, అన్నింటికీ సర్దుకుపోతూ మిమ్మల్ని మీరు బాధపెట్టుకుంటూ ఉండడం కాని మీకు నచ్చదు. ‘బి’లు ఎక్కువైతే మీరు తాత్కాలిక ఆవేశపరులు అయి ఉండాలి లేదా అన్నింటికీ సర్దుకుపోతూ, నొచ్చుకుంటూ జీవిస్తున్న వారి కోవలో ఉన్నట్లు అనుకోక తప్పదు. -
సహనంతో సౌఖ్యం
ఆత్మీయం మంచి ఎండలో చాలాదూరం నుండి మంచినీళ్లు తీసుకొస్తోందామె. రెండు బిందెలను ఇంటిముందు పెట్టి చిన్నబిందెతో నీళ్లు తెచ్చి, వాటిలో పోస్తోంది. ఇంతలో ఆమె భర్త చెమటలు కక్కుతూ వచ్చాడు. ఇంటిముందున్న బిందెలను గమనించక కాలితో తన్నాడు. నీళ్ళన్నీ ఒలికిపోయాయి. కోపంతో అతను భార్యను చూసి ‘అసలు నీకు బుద్ధుందా? నీళ్ళబిందెలను వాకిలికి అడ్డం పెట్టి వెళ్తావా? నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో! ఎలా పెంచిందో! బొత్తిగా తెలివితేటలు లేనిదాన్ని కట్టబెట్టారు’ అన్నాడు. చాల్లేండి, నేను బిందె తెస్తుంటే కనీసం అందుకోకుండా, నేను తెచ్చిపోసిన నీళ్లన్నీ నేలపాలు చే శారు. అది చాలక మా పుట్టింటివాళ్లని తిడతారా? ఈ ఇంట్లో నిమిషం కూడా ఉండను. మా పుట్టింటికే వెళ్ళిపోతాను.‘ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది భార్య. ఈ కథనే కాస్త సహనం ఉంటే ఎలా ఉంటుందో చూద్దామా! నీళ్ళ బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు. ‘అయ్యో! ఎంత కష్టపడి ఈ నీళ్లు తెచ్చిందో పాపం. నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది. ఇంటిపనితో సతమతమౌతూ కూడా నాకు ఇబ్బంది కలగకుండా నీళ్లు కూడా తనే తెస్తుంది. మళ్ళీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో, ఎదురెళ్ళి నీళ్ళ బిందెను అందుకుందాం’ అనుకుంటూ భార్యకు ఎదురెళ్ళి బిందెను అందుకుని – ‘పొరపాటున నీళ్లబిందెలను కాలితో తన్నేశాను. నువ్వేమీ కంగారు పడకు. కాసేపు విశ్రాంతి తీసుకో! నేను వెళ్ళి నీళ్ళు తెస్తాను’ ‘అయ్యో! ఎండనపడి వచ్చారు. దారికి అడ్డంగా పెట్టడం నా తప్పండి. నీళ్ళేకదా, పోతే పోనీయండి. భోజనం వడ్డిస్తాను కాళ్ళు కడుక్కుని రండి. బిందె తగిలి కాలికి దెబ్బేమీ తగల్లేదుకదా’ అంది భార్య. చూశారా తేడా? కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా! -
పిల్లల్ని ఇష్టంగా పెంచుకుంటున్నారా?
సెల్ఫ్ చెక్ ‘‘మా పిల్లలు సరిగా ఎదగడంలేదండీ... ఎంత చెప్పినా చదువు రావటం లేదు. చిరుతిళ్లేగాని ఒక్క మెతుకు ముట్టరు’’... ఇలా పిల్లల పెరుగుదల, చదువు విషయంలో తల్లడిల్లిపోతుంటారు కొందరు మాతృమూర్తులు. మీరూ అలాంటి అమ్మే అయితే తల్లిగా మీ బాధ్యతలను సరిగా నిర్వహిస్తున్నారా లేదా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. 1. భరించరాని సమస్యలు ఉన్నప్పుడు పిల్లలను వదిలి దూరంగా వెళ్లిపోవటం సమంజసమే అనుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. స్త్రీకి సహనం ఎక్కువ. పిల్లలను తండ్రి కంటే తల్లే ఎక్కువగా చూసుకోవాలి. ఎ. అవును బి. కాదు 3. పిల్లల దృష్టిలో తల్లి తమ విషయాలన్నింటిని (మార్కులు, మెడల్స్, దుస్తులు) బాగా గుర్తుంచుకుంటుంది. ఎ. అవును బి. కాదు 4. పిల్లలు తప్పుచేసినప్పుడు దండించినా, వెంటనే అక్కున చేర్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీరు బిజీగా ఉన్నా పిల్లల చదువు, కెరీర్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లల్ని కనాలని ఉన్నా వారి పోషణ, పెంపకం గురించి భయపడుతున్నారు. ఎ. కాదు బి. అవును 7. పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఎదగటానికి ఆహార, ఆరోగ్య విషయాలపై పరిపూర్ణ శ్రద్ధ తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. పిల్లలతో కలసి ఆటలాడటమంటే మీకు చిరాకు. ఎ. కాదు బి. అవును 9. పిల్లల చిన్ననాటి గుర్తులను అపురూపంగా చూసుకుంటారు, భద్రపరుస్తారు. ఎ. అవును బి. కాదు 10. పిల్లలకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీరు మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. పిల్లలను ఎలా పెంచాలో మీకు బాగా తెలుసు. మీ ప్రేమను పిల్లలపై చూపిస్తూనే వారిని క్రమశిక్షణలో పెట్టటానికి ప్రయత్నిస్తారు. ‘బి’ సమాధానాలు 7 దాటితే మీరు తల్లిగా ఇంకా బాగా అవగాహన పెంచుకోవాలని సూచన. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మానసికంగా, శారీరకంగా ఎదుగుతున్న పిల్లలకు అండగా ఉండటానికి ప్రయత్నించాలి. -
దెబ్బ తగిలింది
ఎన్ని దెబ్బలు తగిలితే అంత పదును తేలుతుంది ఇనుము! చేయని తప్పుకు నింద, శిక్ష .. ఇనుము మీద పడే దెబ్బలకంటే బలమైనవి! ఆ దెబ్బ మనకి తగిలితే ఓర్చుకోగలమేమో కాని... మన గౌరవానికి తగిలితే తిరగబడమా? ఇక్కడే ఓర్పు, సహనం, సంస్కారం.. కంచెలాగా కాపాడాలి! లేకపోతే దెబ్బ తగిలిన పిల్లలు దెబ్బతింటారు కూడా!! ‘ఒరేయ్.. వాడిని ఎందుకు కొట్టావ్రా? తోటిపిల్లలతో ఫ్రెండ్లీగా ఉండలేవా?పొద్దస్తమానం ఎవరితోనో ఒకరితో తగాదా పడుతుంటావ్? చేయి చాపు...?’ అసహనం, కోపం కలగలిసిన భావంతో గద్దించాడు భాస్కర్ .. పదిహేనేళ్ల సందీప్‌ను. చేయిచాపాడు సందీప్. కొట్టడం తప్పని తెలుస్తున్నా.. వాడి మీద వస్తున్న కంప్లయింట్స్కు బ్రేక్ వేయాలని, తోటి పిల్లల పట్ల వాడు ప్రవర్తిస్తున్న తీరులో మార్పు తేవాలని చెక్క స్కేల్‌తో సందీప్ అరచేతి మీద కాస్త గట్టిగానే కొట్టాడు భాస్కర్. కొడ్తున్నప్పుడు చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. కొట్టాక కూడా ఆ మొహంలో బాధ లేదు. ఆశ్చర్యపోయాడు ఆ క్లాస్ టీచర్ భాస్కర్. లంచ్ టైమ్‌లో సందీప్ క్లాస్‌మేట్స్‌ను నలుగురైదుగురిని వాకబు చేశాడు. మిగతా పిల్లలతో వాడు నిజంగానే తగాదా పడ్తున్నాడా? లేక కావాలని కంప్లయింట్ చేస్తున్నారా అని తెలుసుకోవడానికి. ‘సరదాగా కామెంట్ చేసినా చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నాడు సర్ సందీప్! కొట్టే మాట్లాడుతున్నాడు.వాడితో మాట్లాడాలన్నా భయమేస్తోంది మా అందరికీ!’చెప్పారు క్లాస్మేట్స్. ఆలోచనలో పడ్డాడు భాస్కర్. ‘ఈ రెండు రోజుల్లో సందీప్ వాళ్ల నాన్నను పిలిచి మాట్లాడాలి’ అనుకున్నాడు. రెండు రోజుల తర్వాత.. త్రీ... వన్... ఫైవ్... సిక్స్.. టూ.. ఎయిట్.. టెన్... ప్లే గ్రౌండ్లో క్రికెట్ ఆడ్డం కోసం బ్యాటింగ్ ఆర్డర్ వేసుకుంటున్నారు. సందీప్‌కి «థర్డ్ పొజిషన్ వచ్చింది. ఆట స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్‌కి వచ్చిన టీమ్ మెంబర్ రెండు రౌండ్లకే అవుటయ్యాడు. తన వంతేనని ఉత్సాహంగా బరిలోకి దిగబోయాడు సందీప్. ‘ఒరేయ్ నీకెందుకురా తొందర.. నువ్వాగు. నేనెళ్తా.. పిరికోడి కొడుకు పిరికోలాగే ఉండాల్రా.. కూర్చో..’ అంటూ సందీప్‌ను తోసుకుంటూ గ్రౌండ్లోకి వెళ్లిపోసాగాడు. ఫోర్త్ పొజిషన్ వచ్చిన ప్రభాత్. సందీప్‌కి కోపం ముంచుకొచ్చింది. దవడలు, పిడికిలి ఒకేసారి బిగుసుకున్నాయి. తన తర్వాత నంబర్ ఉన్నవాడు తనకన్నా ముందుకు పోతున్నాడు అనేదాని కన్నా ‘‘పిరికివాడి కొడుకు పిరికివాడిలాగే ఉండాలి’’ అన్న మాటకు ఉడికిపోయాడు సందీప్. అంతే... ముందుకు వెళ్తున్న ప్రభాత్ దగ్గరకు పరుగున వెళ్లి అంతే వడిగా అతని చేతిలోంచి బ్యాట్ లాక్కున్నాడు.. ఈ చర్యకు అసంకల్పితంగా. వెనక్కి తిరిగిన ప్రభాత్ తలమీద బ్యాట్‌తో ఒక్క దెబ్బ వేశాడు బలంగా. ‘ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే రెండు చేతులతో తలను పట్టుకుంటూ.. ‘అమ్మా...’ అని బాధగా అరిచి నేలమీద పడిపోయాడు ప్రభాత్. ఆ కేకకు ఆడుతున్నవాళ్లు, అక్కడున్న వాళ్లు ఒక్క ఉదుటున వీళ్ల దగ్గరకు వచ్చారు. ప్రభాత్ తల నుంచి రక్తం కారుతోంది. అంతా అవాక్కయ్యారు. ‘ఇప్పుడు చెప్పరా.. ఎవడు పిరికో’ అన్నాడు ప్రభాత్ మీదకు వంగి పళ్లు కొరుకుతూ! ‘ఒరేయ్.. ప్రభాత్‌ను కొట్టింది సందీపేరా.. ’ అన్నాడు ఆ గుంపులోంచి ఒకడు. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చినట్టయింది సందీప్‌కి. తమిద్దరి చుట్టూ ఉన్న గుంపును చూశాడు. ఇక్కడ ఉండడం క్షేమం కాదనుకున్నాడో ఏమో.. పారిపోయే ప్రయత్నం చేశాడు. కాని మిగతా వాళ్లు పట్టుకున్నారు. కొందరేమో ప్రభాత్ తలకు కర్చీఫ్ కట్టి.. వాడి మొహం మీద కాస్త నీళ్లు చల్లి లేపారు. ఈ ఇద్దరినీ ప్రభాత్ వాళ్లింటికి పట్టుకెళ్లారు. తల కట్టుతో కొడుకును చూసిన ప్రభాత్ వాళ్లమ్మ లబోదిబోమంది. సందీప్‌ను చూపిస్తూ విషయాన్ని వివరించారు వచ్చినవాళ్లు. ‘అయ్యో నా కొడుకును కొట్టి చంపబోయాడ్రో’ వీధంతా వినిపించేలా ఏడుపు మొదలుపెట్టింది ప్రభాత్ వాళ్లమ్మ. క్షణాల్లో ఇరుగుపొరుగు జమయ్యారు. పోలీస్‌ల దగ్గరకు తీసుకెళ్లమ్మని సలహా ఇచ్చారు. ఇద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లారు. నాన్న వల్లే... ‘ఎందుకు.. వాడి తల పగలకొట్టావ్?’ గద్దించాడు ఎస్ఐ. సమాధానం చెప్పకుండా ఎస్ఐని కళ్లకింది నుంచి చూడసాగాడు. ‘రేయ్.. ఆ చూపేంట్రా.. కళ్లు కిందికి దించు’ కోపంగా అన్నాడు ఎస్ఐ. ఆ మాటలకు తల పక్కకు తిప్పుకున్నాడు కాని ఎస్ఐ చెప్పినట్టు మాత్రం చేయలేదు సందీప్. ‘ఎంత పొగర్రా నీకు’ అని సీట్ లోంచి లేచాడు ఎస్ఐ. ఆయన ఆగ్రహం చూసిన హెడ్‌కానిస్టేబుల్ ఎస్ఐ పక్కకు వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ‘అచ్ఛా... ప్రశాంత్ సర్ కొడుకువా నువ్వు?’ హెడ్ చెప్పిన మాటతో తన హెడ్‌ను సందీప్ మీదకు వంచుతూ అన్నాడు ఎస్ఐ. జవాబివ్వలేదు సందీప్. ‘అంత మంచి తండ్రి కడుపున నువ్వెట్లా పుట్టావురా..?’ మళ్లీ ఎస్ఐ.. సందీప్ తండ్రితో తనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని. ‘ఎంత మంచి తండ్రి? మా నాన్న మంచితనం అంతబాగా తెలుసేంటి మీకు?’ వెటకారంగా అన్నాడు సందీప్.‘ఏయ్.. మాటలు తిన్నగా రానియ్’ గదమాయించాడు హెడ్‌కానిస్టేబుల్. ‘ఆగు... వెంకటేశ్వర్లు’ చైర్లో కూర్చుంటూ హెడ్‌ను వారించాడు ఎస్ఐ. ‘అసలు మా నాన్నవల్లే ఇదంతా జరిగింది’ ఉక్రోషంతో అన్నాడు సందీప్. ‘మీ నాన్న కొట్టమన్నాడా వీడిని?’ ఎస్ఐ. ‘మా నాన్న పిరికితనం చూసి వీళ్లంతా నన్ను ఆటపట్టిస్తున్నారు.. ఎగతాళి చేస్తున్నారు. నన్ను ఓ దద్దమ్మలా ట్రీట్ చేస్తున్నారు. నా దమ్మేంటో చూపిస్తా.. నేను మా నాన్నలాగా కాదు’ అరిచేశాడు ఏడుస్తూ! విస్తుపోయాడు ఎస్ఐ. ‘ఏంటి సర్ వాడితో మెల్లగా మాట్లాడుతున్నారు.. బొక్కలో వేసి తోమండి సర్.. కాస్తయితే నా కొడుకు ప్రాణం పోయేది’ అంటూ గోల చేసింది ప్రభాత్ వాళ్లమ్మ. ‘ఏం చేయాలో మాకు తెలుసులే అమ్మా’ అని అంటూనే ‘ప్రసాద్.. ఈ అబ్బాయిని ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్లండి’ ఇంకో కానిస్టేబుల్ని పురమాయించాడు. ‘రా.. అమ్మా..’ అంటూ ప్రభాత్‌ను, వాళ్లమ్మను తీసుకెళ్లాడు ప్రసాద్. వాళ్లు అటు వెళ్లగానే ‘వెంకటేశ్వర్లూ.. ప్రశాంత్సర్కి కాల్ చేసి పిలిపించు’ ఆర్డరేశాడు ఎస్ఐ. ‘చెయ్యెత్తి ఇంకొకరిని కొట్టడం కాదురా ధైర్యం అంటే.. ఇంకొకరికి నష్టం జరక్కుండా గుండె మీద చెయ్యి వేసుకొని పక్కకు తప్పుకోవడంరా ధైర్యమంటే’ కొడుకు వీపును తడుతూ చెప్పింది ఆ అమ్మ. రాత్రి 9 గంటలు.. అప్పుడే భోజనం ముగించుకొని హాల్లోకి వచ్చాడు ప్రశాంత్. అప్పటికే తినేసి టీవీలో చానల్స్‌ను తిప్పేస్తున్నాడు సందీప్. పోలీస్‌స్టేషన్, పోలీస్ కౌన్సెలింగ్.. వీటన్నిటి ప్రభావంతో సందీప్ తన తండ్రి మీద ఎక్కడ అక్కసు చూపిస్తాడోనని.. ఆదరాబాదరాగా వంటిల్లు సర్దేసి తనూ హాల్లోకి వచ్చింది లీల. భార్య ఆందోళనను గమనించి ప్రశాంత్ .. ‘ఏంకాదులే సర్దుకుంటాడు’ అన్నట్టు కళ్లతోనే భరోసా ఇస్తూ సోఫాలో కూర్చున్నాడు. లీల.. సందీప్ పక్కన చేరి భుజమ్మీద చేయి వేసింది. దృష్టి టీవీ మీదనుంచి మరల్చకుండానే తల్లి చేతిని తోసేశాడు విసురుగా. లేచి.. సందీప్‌కి ఆ వైపు కూర్చుంది. అయినా, వాడు ఆమె వైపు చూడలేదు. నెమ్మదిగా వాడి చేతిలోంచి రిమోట్ లాక్కుని టీవీ కట్టేసింది. ‘చూడు నాన్న..అ..’ అని ఆమె ఏదో చెప్పబోతుండగానే.. ‘అంతా ఈయన వల్లే జరిగింది, ఈయన వల్లే జరుగుతోంది.. ఈయన పిరికితనంతో నేనూ అందరికీ పిరికివాడిగానే కనిపిస్తున్నా.. పిరికివాడి కొడుకు పిరికివాడిలాగే ఉండాలట.. మీ నాన్న గర్ల్ ఫ్రెండ్‌కోసం జాబ్ వదిలేసుకున్నాడట కదా.. పక్కవాడు వచ్చి బైక్‌తో డాష్ ఇచ్చినా తప్పు నాదే అంటాడట కదా మీ నాన్న..’ అంటూ ఈ వీధిలో ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారమ్మా.. నేను పిరికి వాడిని కాదు.. నాకు ధైర్యం ఉందని ఒక్కోక్క నా కొడుక్కి ఉతికి చెప్తా’ అంటూ ఏడ్చేశాడు సందీప్. నివ్వెర పోయారు తల్లిదండ్రులిద్దరూ! వాడిని కాసేపు అలాగే ఏడ్వనిచ్చారు. ‘మీరు లోపలికి వెళ్లి పడుకోండి’ సంజ్ఞతో చెప్పింది భర్తకు లీల. బరువెక్కిన మనసుతో ఆయన లోపలికి వెళ్లిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ కాదు.. అప్పుడు కొడుకు తల నిమురుతూ.. ‘సందీప్.. నాన్న ఒక అమ్మాయి కోసం ఆ ఉద్యోగంలోంచి ఇంకో ఉద్యోగంలోకి మారాడు నిజమే. కాని ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ కాదు. నువ్వు చిన్నవాడివి.. పెద్ద విషయాలు ఎందుకులే అనుకున్నా.. కాని చెప్పాలి.. అర్థం చేసుకో. నాన్నకు ఇదివరకటి ఆఫీస్‌లో ప్రమోషన్ వచ్చింది. అది కిట్టని కొందరు కొన్ని రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని నాన్న ఏతో అన్నట్టు ఆ అమ్మాయితోనే చెప్పించారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆ గొడవను ఇంటివరకూ తీసుకొచ్చారు. నాన్న కాదు అని సాక్ష్యాలు చూపిస్తే ఆ అమ్మాయి ఉద్యోగం, పరువు, కాపురమూ పాడైపోతుందని తన తప్పు కాకపోయినా.. లేకపోయినా సారీ చెప్పి పక్కకు తప్పుకున్నాడు. నీకు తెలుసో లేదో.. నాన్న ఉద్యోగం రిజైన్ చేశాక ఆ అమ్మాయి పశ్చాత్తాపపడి వాళ్లాయనతో ఇంటికొచ్చి సారీ చెప్పి వెళ్లింది. అది నాన్న పిరికితనం కాదురా.. గొప్పతనం’ అని ఆమె చెప్తుంటే మోకాళ్ల మధ్య తల పెట్టుకొని ఏడుస్తున్న సందీప్ ఒక్కసారిగా పైకి లేచి ‘సర్లే.. నా కళ్లముందే .. నేను స్కూటర్ మీద వెనక కూర్చున్నప్పుడే మా వెనకాల వాడు వచ్చి మాకు డాష్ ఇస్తే.. ట్రాఫిక్ పోలీసులకు కూడా వెనకాల వాడిదే తప్పని తెలిసినా ఈయనే ఆ తప్పు తన నెత్తిమీద వేసుకొని వాడిని పంపించేశాడు. ఆ ట్రాఫిక్‌లో మా పక్కనే ఉన్న మా ఫ్రెండ్, వాళ్ల నాన్న మమ్మల్ని చూసి ఒకటే నవ్వడం. వాడు స్కూల్‌కి వెళ్లి అందరితో చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు.. ఇదేం గొప్పతనం మరి?’ ఎకసెక్కంతో సందీప్. ‘మిమ్మల్ని వెనకాల నుంచి ఢీ కొట్టినవాడు కాలేజ్ స్టూడెంట్ కదా..?’అడిగింది లీల. ‘అయితే ఏంటి? అందుకే గొడవ పెట్టుకుంటే వాడు గ్యాంగ్నేసుకొచ్చి కొడతాడని భయపడ్డాడా?’ మళ్లీ ఎకసెక్కం వాడి గొంతులో. ఈసారి లీలలో సహనం నశించింది. అయినా ఓపికను తెచ్చిపెట్టుకొని ‘కాదు.. పోలీస్‌కేస్ పెడితే ఆ కుర్రాడి జీవితం నాశనం అవుతుందని.. తప్పు వాడిది కాదు అని పంపించేశాడు’ ఫుల్స్టాప్, కామాల్లేకుండా చెప్పి టీవీ ఆన్ చేసింది లీల.. ఇక చెప్పేది ఏమీ లేదన్నట్టుగా. వాడి దగ్గరా మౌనమే! కొన్ని క్షణాలు గడిచాయి. ఆమె టీవీలో లీనమైంది.‘ అమ్మా... ’అన్నాడు ఆర్తిగా. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూసింది. ‘సారీ.. అమ్మా..’అన్నాడు అదే ఆర్తితో. ‘నాక్కాదు మీ నాన్నకు చెప్పు సారీ!’అంది లీల. ‘చెయ్యెత్తి ఇంకొకరిని కొట్టడం కాదురా ధైర్యం అంటే.. ఇంకొకరికి నష్టం జరక్కుండా గుండె మీద చెయ్యి వేసుకొని పక్కకు తప్పుకోవడంరా ధైర్యమంటే’ కొడుకు వీపును తడుతూ చెప్పింది ఆ అమ్మ. వాడి కళ్ల నుంచి నీళ్లు జలజలా చెంపలమీదికి కారిపోయాయి. హింసకు హింస సమాధానం కాదు ఒక్కొక్కరిదీ ఒక్కో తత్వం.. ఒక్కో వ్యక్తిత్వం. ఎవరమూ ఎవరినీ మార్చలేం. పైన కేస్‌స్టడీలో కూడా తల్లిదండ్రులు పిల్లాడికి అదే విషయం చెప్పాలి. ఇక్కడ పిల్లాడు తండ్రి ప్రవర్తన వల్ల తన చుట్టుపక్కల వాళ్లు, స్కూల్లో స్నేహితులు తనను ఎగతాళి చేయడంతో హింసాత్మకంగా రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు. తనను హేళన చేయడం అంటే తనను మానసిక హింసకు గురిచేయడమే. వాళ్లను శారీరకంగా హింసించి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అలా తన ధైర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. ఇది ప్రాక్టికల్‌గా తప్పు. హింసకు హింసే సమాధానమైతే నష్టపోయేది తనే అన్న విషయాన్ని పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పాలి. తోటివాడిని కొడితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది సందీపేకాని అవతలివాడు కాదుకదా. ఈ సత్యాన్ని అతనికి అర్థం చేయించాలి. నిజానికి సందీప్ పదిహేనేళ్ల కుర్రాడు. కాబట్టి వాడు పడుతున్న అవస్థను గమనించి అతని తండ్రే వాడికి కౌన్సెలింగ్ ఇవ్వచ్చు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఆలా చేయాల్సి వచ్చింది, గొడవలు పడని, పడలేని తన మనస్తత్వాన్ని గురించీ కొడుకుతో తండ్రి ఓపెన్‌గా మాట్లాడాలి. లేదంటే అతని తల్లి కూడా చెప్పొచ్చు. ‘‘ప్రతి మనిషిలో మంచి, చెడులు ఉంటాయి. వీటికి తల్లిదండ్రులు కూడా అతీతులు కాదు. వ్యక్తిని ఆ మంచిచెడులు రెండిటితో యాక్సెప్ట్ చేయాలి. మంచితో ఇన్స్పైర్ అవ్వాలి. చెడును ఇగ్నోర్ చేయాలి’’ అన్న విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాలి. ఏ సమస్యనైనా అగ్రెసివ్‌గా రిసాల్వ్ చేసుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే.. మంచిది కాదు అని స్పష్టంగా కన్వే చేయాలి పిల్లలకు. – డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రేయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. –శరాది -
సంపద సద్వినియోగంతోనే దైవ ప్రసన్నత
రమజాన్ కాంతులు మానవుల వద్ద ఉన్నదంతా దైవప్రసాదితమే. దాన్ని ఒక అమానతుగా దైవం మన దగ్గర ఉంచాడు. అందుకని ఆయన చూపినమార్గంలో, ఆయన ఆదేశించిన రీతిలో సద్వినియోగం చేసినప్పుడే దైవప్రసన్నత ప్రాప్తిస్తుంది. ఈ భావన ప్రతి విశ్వాసి హృదయంలో అనునిత్యం, నిరంతరం మెదులుతూ ఉండాలి. వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలకు ఆర్థికన్యాయం అందించే అపురూప సాధనం.ఇది ప్రజల హృదయాలనుండి స్వార్థం, సంకుచితత్వం, పిసినారితనం, కాఠిన్యం, ద్వేషం లాంటి దుర్గుణాలను దూరంచేసి, వాటిస్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సహనం, సానుభూతి, స్నేహశీలత, ఔదార్యం, కారుణ్యంలాంటి అనేక ఉన్నత మానవీయ గుణాలను పెంపొందిస్తుంది. జకాత్‌ను రమజాన్ మాసంలోనే చెల్లించాలన్న నియమం ఏమీ లేకపోయినా, ఈ మాసం శుభాల దృష్ట్యా అధికశాతంమంది ప్రజలు ఈనెలలోనే జకాత్ చెల్లింపుకు ప్రాధాన్యతనిస్తారు. ఈమాసంలో చేసే దానధర్మాలకు అనేకరెట్లు పుణ్యం లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లాహ్ అందరికీ చిత్తశుద్ధితో జకాత్ చెల్లించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఫారూఖ్ జునైద్ -
కామెడీ కార్నర్
బస్సులో ప్రయాణికుడు చాలా సేపట్నుంచి తుమ్ముని ఆపుకోడానికి నానా తంటాలు పడుతున్నాడు. తుమ్మడానికి ఏదో టెక్నిక్ ఉపయోగించి ఆపసాగాడు. పక్కనున్నతను సహనం కోల్పోయి అన్నాడు ‘‘ఎందుకండీ తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు... తుమ్మేస్తే పోతుంది కదా?’’ మొదటతను ‘‘మా ఆవిడ చెప్పింది... ‘మీకు ఎప్పుడు తుమ్ము వచ్చినా నేను నిన్ను గుర్తుచేసుకుంటున్నాను... నువ్వు నా వద్దకు రావాలి అని అర్థం’ అని చెప్పిందండి’’ అన్నాడు ముక్కును నలుపుకుంటూ... ‘‘అయితే ఏంటి... వెళ్ళచ్చుగా...’’ ‘‘ఆవిడ చనిపోయిందండీ...’’ ‘ఈరోజు మన ఇంటికి ఒక ఫ్రెండ్‌ను డిన్నర్‌కు పిలిచాను’ అన్నాడు అప్పారావు తన భార్యతో. ఆమె అగ్గి మీద గుగ్గిలం అయింది. ‘మన ఇల్లు ఏమైనా హోటల్ అనుకున్నావా? నేను చెత్తగా వండుతాననే విషయం నీకు తెలుసుకదా?’ అప్పారావు: తెలుసు భార్య: తెలిసి కూడా మన ఇంటికి ఎందుకు డిన్నర్‌కు పిలుస్తున్నావు? అప్పారావు: కుర్రాడు పెళ్లి చేసుకోవాలని సరదా పడుతుంటేనూ... -
కాపురం చేయను.. కానీ విడాకులూ వద్దు..
లీగల్ స్టోరీస్ ‘చేతకానివాడికి పెళ్లెందుకు? పెళ్లామెందుకు?’ తన భార్య తిట్లలోని చివరి మాటలు.. చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి.. అవి కూత పెట్టినప్పుడల్లా ప్రశాంత్ దవడలు బిగుసుకుంటున్నాయి.. చేతులు టూ వీలర్ స్పీడ్‌ను రైజ్ చేస్తున్నాయి.. అతని అహాన్ని దెబ్బతీస్తున్నాయి.. అలా ఆ మాటలు గుర్తుకొచ్చే ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ బైక్ వేగమూ పెరుగుతోంది.. ప్రశాంత్ చూపులు రోడ్డు మీద ఉన్నాయి కాని వాటికి సందేశాలిచ్చే పనిని నుంచి మెదడు ఎప్పుడో తప్పుకుంది. అందుకే బైక్ స్పీడోమీటర్ వందను దాటేసింది.. అప్పుడు అతని మైండ్‌కి తాను చేయాల్సిన పని గుర్తొచ్చినట్టుంది చేతులతో సడెన్ బ్రేక్ వేయించింది. దేన్నో ఢీకొట్టబోయి ఆగాడు ప్రశాంత్. అప్పటి దాకా అతని చెవుల్లో మోగిన రొద ఒక్కసారిగా ఆగిపోయింది. ఈలోకంలోకి వచ్చాడు. జరగబోయే ప్రమాదం తల్చుకొని ముచ్చెమటలు పోశాయి! ‘ఇలా అయితే లాభం లేదు.. ప్రాణాలు పోయేట్టున్నాయి.. సొల్యూషన్ కావాలి.. ’ ఓ నిశ్చయానికి వచ్చాడు. ఆ సమస్య ఏంటి? ‘తన పేరు వెన్నెల. పేరుకు తగ్గట్టే అందంగా.. ప్రశాంతంగా ఉంటుంది మొహం. బంధువుల పెళ్లిలో ఆ అమ్మాయిని చూసి మా అమ్మ, అక్క ఇష్టపడ్డారు. పెళ్లిచూపుల పేరుతో నాకూ చూపించారు. వాళ్ల టేస్ట్‌ను మనసులో ఎన్నిసార్లు మెచ్చుకున్నానో! దిగువ మధ్యతరగతి. ఆ కుటుంబంలో సంప్రదాయానిదే ఇంపార్టెంట్ రోల్. అందుకే అమ్మాయి చాలా అణకువగా... వినయంగా ఉంది. మా వాళ్లు, నేను ఈ సంబంధాన్ని కాదనలేకపోవడానికి అవీ కారణాలే. అందుకే కట్నానికి ప్రయారిటీ ఇవ్వకుండా పెళ్లికి ఒప్పేసుకున్నాం. పెళ్లి చూపులైన నెలకే పెళ్లి అయిపోయింది. ఆ నెల రోజుల్లో తనతో ఫోన్లోనే సంభాషణ. డిగ్రీ చదివింది. వంచిన తలెత్తని రకం. అభిరుచులు, ఆశలు, ఆశయాలు - పెద్దగా ఏమీ లేనట్టనిపించింది ఆమె మాటల్లో. ఏదడిగినా.. ‘మీకు ఎలా కన్వీనియెంట్గా ఉంటే అలాగే’ అనేది. మనసులో మురిసిపోయాను. ఫస్ట్ నైట్ అప్పుడు మొదలైంది.. ‘ఊ.. చెప్పు’ అన్నాను. ‘ఏం చెప్పను’ అంది. అప్పటిదాకా ఉన్న సిగ్గు, బిడియం ఏమీ కనిపించలేదు. ఒకరకంగా నిర్లక్ష్యంగానూ వినిపించింది. విస్తుపోయా.. పెరిగిన చనువు వల్లనేమో అని వెంటనే సర్దుకున్నా. ‘పోనీ ఏదైనా అడుగు’.. మంచం మీద ఆమెకు కాస్త దగ్గరగా జరుగుతూ తన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ అడిగా! వెంటనే తన చేతిని వెనక్కి లాగేసుకుంటూ.. కాళ్లను మంచమ్మీద పెట్టేసుకొని బాసింపట్టు వేసుకొని నాకు ఎదురుగా డెరైక్షన్ మార్చుకుంది అడగడానికి సిద్ధమవుతున్నట్టుగా! నవ్వుకున్నాను. ‘మీ జీతం ఎంత?’ అడిగింది. చెప్పాను. ‘మీ ఉద్యోగం గురించి తప్ప మీ ఆస్తుపాస్తుల గురించి మావాళ్లేమీ అడగలేదు. నాకు చెప్పండి’ అంది. అవసరమే అనిపించి వివరించా! ‘మీ అక్కకు కట్నమెంత ఇచ్చారు?’ తర్వాత ప్రశ్న. ‘ఎంక్వయిరీనా?’ సహనంగా అడిగా. ‘ఏదో అనుకొని చెప్పండి.. ఇప్పుడు మీ ఊళ్లో పొలాలు గట్రాలో కూడా ఆమెకేమన్నా వాటా ఉందా?’ తన ధోరణిలో తను. సహనం చిరాగ్గా మారింది. తమాయించుకుని చెప్పాను. ‘మీ అమ్మకు ఏవేం నగలున్నాయి?’ చిరాకు కోపానికి ట్రాన్స్ఫర్ కాకుండా జాగ్రత్తపడ్డాను. ఆ రాత్రి తీపి జ్ఞాపకంగా మిగలదని అర్థమైపోయింది. ఆమె అడిగినవి చెప్పి పడుకున్నా. ఫ్లైట్ జర్నీ.. పుట్టినరోజు గ్రాండ్ పార్టీ నాకున్న సెలవులు, బడ్జెట్ దృష్ట్యా హానీమూన్‌కి దగ్గరి డెస్టినేషన్ ఎంచుకున్నా. టికెట్స్ రిజర్వ్ చేసే ముందు వెన్నెలకు చెప్పా. ‘ఎక్కడికి వెళ్లాలో మీరొక్కరే నిర్ణయించుకుంటే ఎలా? జీవితంలో హనీమూన్ ఒక్కసారే వస్తుంది. కాబట్టి మంచి ప్లేస్‌కే వెళ్దాం. నాకు ఎప్పటి నుంచో ఫ్లయిట్ ఎక్కాలని కోరిక. ఫ్లయిట్లో వెళ్లే ప్లేస్‌కి హానీమూన్ టూర్ పెట్టండి’ అని ఆర్డర్ వేసింది. నిజమే మొదటిసారి పదే పదే రాదు కదా.. అని ఫ్లయిట్లో వెళ్లే ప్లేస్‌కే హానిమూన్ డెస్టినేషన్ మార్చా. పెళ్లయిన నాలుగు నెలలకు తన పుట్టినరోజు. తనెప్పుడూ బర్త్‌డే చేసుకోవడం ఎరగననీ, అందుకే గ్రాండ్‌గా చేసుకోవాలనుందని కోరింది. అప్పటికీ ఖర్చుల మోత ఎక్కువవుతున్నా.. పెళ్లాయ్యాక తన తొలి పుట్టినరోజు కదా.. ఆమె ఆశ నెరవేర్చడం భర్తగా నా బాధ్యత అనుకొని ఓ త్రీస్టార్ హోటల్లో టేబుల్ రిజర్వ్ చేశా. కానీ ఆమె సంతృప్తి పడలేదు. పుట్టినరోజు కానుకగా కనీసం ఓ ఉంగరం కూడా కొనపెట్టలేదనే కంప్లయింట్. దాని తాలూకు నసను ఓ నెల రోజులు కంటిన్యూ చేసింది. ఎక్స్పెక్ట్ చేస్తోంది కదా అని తనకు నచ్చిన ఉంగరం కొనిపెట్టా. ఆ తర్వాత నెలకు ఇంకో విష్. అలా చీరలు, నగలు, ఇంట్లో వస్తువులు.. చిట్టా పెరుగుతోంది. సాధింపు భరించలేక క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేస్తూ అడిగింది తెచ్చిపడేస్తున్నా. సాయంత్రం అయిందంటే చాలు ఇంటికెళ్లడానికే భయపడే పరిస్థితి వచ్చింది. ఆమె అడిగింది ఏదైనా కాదంటే, వంట కూడా చేయట్లేదు. నేను బయట తింటున్నా.. తను ఉపవాసం ఉంటోంది. శ్రుతి మించుతోందని భయమేసి ఒకరోజు వాళ్ల పేరెంట్స్‌కి చెప్పా. అడ్జస్ట్‌మెంట్‌కు మారుపేరు వాళ్లమ్మాయి అన్నారు. నేనే కట్నం కోసం అలా అబద్ధాలు చెప్తున్నానని నింద వేశారు. సమస్య ఇంకో రూపం తీసుకుంటుందేమోనని నోర్మూసుకున్నా!. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌కి గురి.. ఓ రోజు... తన ఫ్రెండ్ వచ్చింది. గృహప్రవేశమట.. ఇన్వయిట్ చేయడానికి. ఆమె వెళ్లిపోయాక.. మొదలైంది దెప్పడం.. ‘మనకన్నా రెండు నెలలు లేట్‌గా పెళ్లయింది వాళ్లకు. మీ కన్నా తక్కువ జీతం. అయినా ఇంత త్వరగా ఫ్లాట్ కొనేసుకున్నారు. నాకు తల తీసేసినట్టుగా ఉంది తన ముందు. మీరూ ఉన్నారు.. ఏ ప్లాన్ లేకుండా!’ అంటూ. ‘పెళ్లయినప్పటి నుంచి నాకు ఊపిరి సలపనిచ్చావా? ఏ నెల ఎక్స్ట్రా ఖర్చు లేకుండా నన్ను ఖాళీగా ఉంచావ్? పెళ్లయిన ఏడాదిలోపు మనమెంత వేస్ట్ ఖర్చు చేశామో.. క్రెడిట్ కార్ట్స్కి ఎంతెంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో లెక్క తీయ్. నువ్వు నీ కోరికలు కంట్రోల్ చేసుకుంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనొచ్చు’ అని విసురుగా వెళ్లిపోయా! కానీ తను ఊరుకోలేదు... తెల్లవారి నుంచి రోజూ పోరడమే! ఊళ్లో నా పేరు మీదున్న పొలం అమ్మి, త్రీబెడ్‌రూమ్ ఫ్లాట్ కొనమని! ఆ పోరు నరకాన్ని తలపిస్తోంది. ఓ రోజు కూర్చోబెట్టి నా జీతం, ఖర్చులు, అప్పులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. ‘పొలం నాన్న ఇచ్చిన ఆస్తి. దాన్ని వీలయితే పెంచుతా... లేదంటే తాత గుర్తుగా నా పిల్లలకు పంచుతా. అంతేకాని అమ్మను’ అని స్పష్టంగా చెప్పా. ‘ఒక్క ఏడాది ఓపిక పడితే ప్రమోషన్ వస్తుంది.. ఈ అప్పులూ తీర్చేస్తా.. అప్పటి దాకా నీ ఖర్చులు తగ్గించుకో. తర్వాత లోన్ తీసుకొని ఫ్లాట్ కొనుక్కుందాం... కాస్త ఓపిక పట్టు’ అంటూ బతిమాలుకున్నా. అప్పుడు ఊరుకుంది. అర్థం చేసుకుందని అపోహ పడ్డా. తెల్లవారి నుంచి డబుల్ టార్చర్ స్టార్ట్ చేసింది. ‘నన్నే పోషించలేని వాడికి... నాకే ఓ ఇల్లు సమకూర్చలేనివాడికి... ఇంకా పిల్లలనే ఆశ కూడానా! నన్ను ఖర్చులు తగ్గించుకోమంటున్నావ్.. రేపు పిల్లలు పుడితే ఎలా మెయిన్‌టెయిన్ చేస్తావ్. ఇద్దరికే ఇన్ని అప్పులు చేసినవాడివి... రేపు నన్ను, నా పిల్లలనూ అమ్మేస్తావేమో. అసలు నిజంగా నువ్ టీమ్ లీడర్వేనా? నీకు అంత సీన్ ఉందా..? ఇల్లు కొనలేని వాడివి, పెళ్లాం అడిగింది తెచ్చివ్వడం చేతకానివాడికి పెళ్లెందుకు? పెళ్లాం ఎందుకు?’ అంటూ హిస్టీరియా వచ్చినదానిలా అరిచింది. ఆ మాటలకు నాకూ కోపం, ఆవేశం వచ్చాయి. అక్కడే ఉంటే అదుపు తప్పి, తనను ఎక్కడ కొడతానో అని బయటకు వెళ్లిపోయా. కాపురం చేయను.. కానీ విడాకులూ వద్దు.. చాలా భరించాను. తను నా ఉద్యోగం, జీతం గురించి మా ఆఫీస్ వాళ్లతో ఎంక్వయిరీ చేసుకుంది. ఆ విషయం తెలిసినా ఊరకున్నా. ఇప్పుడు ఆమె మాటలతో నా ప్రాణమే పోయేది యాక్సిడెంట్ అయి. కలిసి ఉండడానికే కదా బతుకుతుంది. కానీ మా కాపురం ప్రాణాలు తీసే స్థితికి చేరుకుంది. విషయం ఇంత వరకు రావడంలో నా తప్పూ ఉండొచ్చు. స్వతహాగా వెన్నెల మంచిదే. లేమిలో పెరగడం వల్ల మనసులో దాచుకున్న కోరికలన్నిటినీ నా ద్వారా తీర్చుకోవాలనుకుంటుంది కాని నా ఆర్థికపరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. అంచనా వేయట్లేదు. ఆమెను కంట్రోల్ చేయలేకపోతున్నా. కలిసి ఉండడం నా వల్ల కాదు. అలాగని ఆమెకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలనీ లేదు. చాలు. పెళ్లంటేనే విరక్తి పుడుతోంది. దయచేసి భార్యభర్తలుగానే మేము విడివిడిగా.. ప్రశాంతంగా బతికే సొల్యూషన్ చెప్పండి. తను విడిగా ఉంటే నెలకు ఎంత ఖర్చు అవుతుందో అంతా ఇవ్వడానికి నేను సిద్ధమే. నాకు మానసిక ప్రశాంతత కావాలి’. లాయర్ దగ్గర బావురుమన్నాడు ప్రశాంత్. ‘మీరు అడిగిన దాన్ని బట్టి మీకు ఉన్న మార్గం.. జ్యుడీషియల్ సపరేషన్’ అని చెప్పారు లాయర్. జ్యూడిషయల్ సపరేషన్ అంటే: ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 10 జ్యుడీషియల్ సపరేషన్ గురించి చెబుతోంది. భార్యాభర్తలు కోర్ట్ ద్వారా విడివిడిగా జీవించడానికి పొందే ఆదేశాలనే ‘న్యాయనిర్ణయ వేర్పాటు’ (జ్యుడీషియల్ సపరేషన్) అంటారు. ఈ సెక్షన్ ప్రధానోద్దేశం పార్టీలు రాజీపడడానికి పునరాలోచించుకునే అవకాశాన్ని కల్పించడం. దంపతుల్లో ఎవరైనా సరే కుటుంబ న్యాయస్థానాల్లో దీనికి సంబంధించిన పిటీషన్ వేసుకోవచ్చు. తొందరపడి వివాహబంధాన్ని రద్దు చేసుకోకుండా ఉండేందుకు ఇదొక మంచి ఆప్షన్. జ్యుడీషియల్ సపరేషన్ డిక్రీ పొందిన వ్యక్తులు వేరువేరుగా నివసించాలి. అంతేకానీ వివాహ బంధం రద్దు కాదు. అంటే విడాకులు కావు. వారసత్వ హక్కులూ రద్దు కావు. అలాగని జ్యుడీషియల్ సపరేషన్లో ఉన్న భార్యాభర్తలు వేరేవారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇతరులతో శారీరకసంబంధాలూ ఏర్పరచుకోకూడదు. అంటే వీళ్లు చట్టప్రకారం భార్యాభర్తలే కానీ సంసారం చేయాల్సిన పనిలేదన్నమాట. వివాహబంధాన్ని కాక కలిసి జీవించవలసిన అవసరాన్ని, బాధ్యతను రద్దు చేస్తుందీ జ్యుడీషియల్ సపరేషన్. - parvathiadvocate2015@gmail.com -- సరస్వతి రమ -
ఓ మనిషీ.. తిరిగిచూడు
ఉరుకులు.. పరుగుల నగర జీవనంలో.. తోటి మనిషికి ఏ ఆపదొచ్చినా.. పట్టించుకునే ఓపిక.. సాయపడాలనే తాపత్రయం అరుదు. సృష్టిలోనే జ్ఞాన సంపన్నుడైన మనిషే.. తోటివారు చచ్చినా చలించని కాలమిది. మానవత్వం మరుగైపోతున్న ప్రపంచమిది. అలాంటిది వాహనం ఢీకొన్న లేగదూడ కోసం ఏ జ్ఞానంలేని పశువులు మూడు గంటల పాటు రోడ్డుపై మూగగా రోదించాయి. దూడ దగ్గరికొచ్చిన వారిపై తిరగబడి రక్షణగా నిలిచాయి. వాహనాలనూ అడ్డుకున్నాయి. ముఖ్యంగా తల్లి పశువు ఆవేదన చూపరులను కలచివేసింది. ఈ ఘటన తిరుపతిలోని టౌన్‌క్లబ్-అలిపిరి మార్గంలో మంగళవారం చోటు చేసుకుంది. ఫొటోలు: కె.మాధవరెడ్డి, తిరుపతి -
కోరుకున్న కురులు
బ్యూటిప్స్ జుట్టు పట్టుకుచ్చులా, అందంగా పొడవుగా ఉండాలని ఎవరికి ఉండదు? కానీ అలా కావాలంటే కొద్దిగా ఓపిక తెచ్చుకోక తప్పదు. వారానికి మూడుసార్లు కొబ్బరినూనె కానీ ఆలివ్ ఆయిల్‌తో కానీ రాత్రిపూట మాడుకు మసాజ్ చేయాలి. జుట్టుకు కూడా నూనె బాగా రాయాలి. తర్వాత వెడల్పు పళ్ల బ్రష్‌తో ఒక నిమిషంపాటు తలను దువ్వాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో తల స్నానం చేసి, వెంటనే చల్లటి నీటితో జుట్టును కండీషనింగ్ చేసుకుంటే చాలు. మీరు కోరుకున్నట్టు జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారింది. అందుకు ఈ చిట్కా వాడి చూడండి. కాకరకాయ రసంలో కొద్దిగా పంచదార కలిపి ఓ 15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత దాన్ని పొడిగా ఉన్న మాడుకు అప్లై చేయండి. 5-6 నిమిషాల పాటు ఆ మిశ్రమంతో మాడుకు మర్దన చేసి చల్లటి నీటితో తలను కడిగేసుకోండి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. ఎండలో బాగా తిరగటం కారణంగా ముఖం, చేతులు సన్‌టాన్‌తో నల్లగా, నిర్జీవంగా మారుతుంటాయి. అది సబ్బు పెట్టి రుద్దినంత మాత్రాన వెంటనే పోదు. ఇంటికి చేరుకోగానే శనగపిండితో చర్మాన్ని స్క్రబ్ చేయాలి. తర్వాత కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో మర్దన చేసుకుంటూ కడిగేసుకుంటే సన్‌టాన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా అవుతుంది, ఈ చిట్కాతో మునుపటి సౌందర్యం మీ సొంతమవుతుంది. -
పాలి‘ట్రిక్స్’లో ఓపికుండాలి గురూ!..
రాజకీయాల్లో నాయకులకు శక్తిసామర్థ్యా లు, అపారమైన అనుభవంతో పాటు ఆటుపోట్లకు తట్టుకుని వ్యవహరించే ఓపిక, టైమింగ్, నిలకడ కూడా ఉండాలని విశ్లేషకులు తరచుగా చెబుతుంటారు. రాజకీయ అనుభవం కలిగి ఉన్నా ఇవి లేకపోతే రాజకీయ వైకుంఠపాళిలో ఎదురుదెబ్బలు తప్పవంటున్నారు. సుదీర్ఘకాలంపాటు టీడీపీలో ఉండి అనేక మంత్రి పదవులను నిర్వహించిన నాగం జనార్ధనరెడ్డి ప్రస్తుతం కుదురుగా బీజేపీలోనే కొనసాగితే ఎన్నో పదవులతో పాటు, వి.రామారావు మాదిరిగా భవిష్యత్‌లో ఏ ఈశాన్య రాష్ట్రానికో గవర్నర్ పదవి కూడా దక్కి ఉండేది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడాన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా ‘తెలంగాణ బచావో’ అంటూ సొంతంగా గళమెత్తడం ‘కౌంటర్ ప్రొడక్టివ్’ తప్ప మరొకటి కాదని నిపుణులు అంచనావేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఎన్ని ఇబ్బందులు పడినా చివరకు పీవీని ప్రధాని పదవి వెదుక్కుంటూ రావడానికి ఆయన ఓపికగా ఉండడమే కారణమని ఉదహరిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నజ్మాహెప్తుల్లా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో విభేదించి బీజేపీలో చేరి ఉండకపోతే రాష్ట్రపతి పదవో. ఉప రాష్ట్రపతి పదవో దక్కి ఉండేదంటున్నారు. బీజేపీలో చేరినా ఆ పార్టీనే నమ్ముకుని ఉన్నందున ఆమె సీనియారిటీకి జాతీయస్థాయి పదవే దక్కిందని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు రాజకీయ వనవాసం చేసినా ఆ పార్టీలోనే ఉన్నందున, పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఆరీ్టిసీ చైర్మన్‌గా పలుపదవులను పొందడాన్ని ఉదహరిస్తున్నారు. అదేసమయంలో కాంగ్రె స్లో సీనియర్‌నేతగా ఉన్న పి.శివశంకర్ 2004 ఎన్నికలకు ముందు అసంతృప్తితో పార్టీ నుంచి దూరం పాటించకపోయి ఉంటే మరో ఉన్నతస్థాయి పదవి లభించి ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీని కాదని అనుకున్నా అటు టీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలలోకి వెళ్లలేక, సొంతగూడు టీడీపీలోకి వెళ్లేందుకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేక నాగం ఏం చేస్తారన్నది పెద్దప్రశ్నగా మారిందంటున్నారు. పార్టీ క్రమశిక్షణను కాదని తిరుగుబాటు జెండాను ఎగురవేస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగకపోగా, నేడో, రేపో బీజేపీ నుంచి కూడా ఉద్వాసన తప్పదని వారు సెలవిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తొందరపాటుతో నాగం ఆగమైపోయారంటున్నారు. -
మహిళల్లో ఓపిక నశించి పోతుంది
-
ఓర్పునకు మారుపేరు మహిళ
ఒంగోలు టౌన్ : ఓర్పు, నేర్పు, క్రమశిక్షణకు మహిళ మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల ముగింపు సభ ఆదివారం రాత్రి ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్నమంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ముఖ్యమంత్రి ప్రకటించారని ఉద్యోగులంతా అంకితభావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ మహిళల విషయంలో ప్రజల ఆలోచనా విధానం మారాలన్నారు. ఇప్పటికే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి ఆలోచనా విధానం మానుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పాటు చైల్డ్‌కేర్ లీవ్ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్ఎస్ఎ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అందుకు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లే నిదర్శనమన్నారు. జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులు కావాలని అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే వారి కుటుంబంతో పాటు సమాజంలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ రత్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతి, ఎమ్మెల్యే భార్యతో పాటు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సచివాలయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, డీఎంహెచ్‌వో యాస్మిన్, సాంఘిక సంక్షేమ శాఖ జీడీ సరస్వతి, ఎన్ఎస్పీ ఎస్ఈ శారద తదితరులు పాల్గొన్నారు. -
ఈ అన్నం మాకొద్దు..
నాగర్‌కర్నూల్‌టౌన్: ఎప్పటికైనా తమకు మంచి భోజనం పెడతారన్న ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థినుల్లో ఓపిక నశించింది. రోజూ నాసిరకం భోజనం, నీళ్లచారు, కుళ్లిపోయిన కూరగాయలతో చేసిన వంటలు ఇక తినలేమంటూ భోజనాన్ని పడేసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం మండలపరిధిలోని నాగనూల్ కస్తూర్భా బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం అల్పాహారం చేసేందుకు వచ్చిన విద్యార్థినులకు నాసిరకం అన్నం పెట్టడమే కాకుండా అందులో ఎలాంటి కూర లేకపోవడంతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిభోజనం పెట్టాలని ప్రత్యేకాధికారిణికి ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాలలో ప్రభుత్వం నిర్నరుుంచిన మెనూ అమలుకావడం లేదని, కుళ్లిపోయిన పండ్లు, ఒకే రకం కూరగాయలు వడ్డిస్తున్నారన్నారు, కొన్నిసార్లు దుర్వాసన భరించలేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా కాస్మోటిక్ చార్జీలు కూడా ఇవ్వలేదన్నారు. దాదాపు రెండుగంటలపాటు ఆందోళన చేయడంతో ప్రత్యేకాధికారిణి విజయ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో అక్కడికి చేరుకున్న సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు నాగర్‌కర్నూల్ తహశీల్దార్‌కు సమాచారం అందించారు. తహశీల్దార్ రాంరెడ్డి విద్యార్థినులతో మాట్లాడి ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మీరు వచ్చి వెళ్లాక ఒకటి, రెండు రోజులు మాత్రమే మంచి భోజనం పెడతారని, తర్వాత షరా మామూలేనంటూ వారు తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అప్పటికప్పుడు భోజనం తయారు చేయించాలని ప్రత్యేకాధికారిణి ఆదేశించారు. విద్యార్థులు పడేసిన నాసిరకం భోజనం, కూరగాయలను తహశీల్దార్ పరిశీలించి, ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ప్రత్యేకాధికారిని హెచ్చరించారు. -
ఉస్మానియా అస్పత్రిలో రోగుల అగచాట్లు
-
గర్భిణీని అస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది
-
సహనం అంత సులువైనదా!
సహనం విలువ గురించి మహాభారతం సవివరంగా చర్చించింది. అది చెప్పినంత సులువు కాదని, సహనం సంపూర్ణంగా ఉన్నవారిదే ఉన్నత మానసిక స్థాయి అనీ సందర్భాన్నిబట్టి అనేకానేక ఉదా హరణలు చూపెడుతుంది. మన కవిత్రయం అనేకచోట్ల ‘సంక్షిప్తం’గా రాయడంవల్ల వ్యాస భారతంలోని కొన్ని అంశాలు మనకు అంద కుండాపోయాయి. అందువల్లే మూల గ్రంథ మైన వ్యాసభారతం కూడా విధిగా చదివితే అటు ‘సహనం’ పెరుగుతుంది, ఇటు కవిత్ర యం విడిచిపుచ్చిన ‘ఉదాహరణలు’, ‘ఉపకథలు’ పూర్తిగా దొరుకుతాయి. సహనం విషయంలో అగ్నిదేవుడికి సహితం ఓర్పు నశించిన ఘట్టం చూడండి. అడ్డూ ఆపూ లేకుండా చీటికీ, మాటికీ హోమాలు చేస్తుండటంవల్ల అగ్నిదేవుడికి సహనం నశించిందట. దాంతో నీళ్లలో అట్ట డుగున దాక్కున్నాడట. అగ్ని రాకతో ఏర్పడిన తాపాన్ని భరించలేక పాపం చేపలన్నీ వెళ్లి దేవతలకు మొరపెట్టుకున్నాయి. అయితే, ఈ వెర్రి చేపల తెలివి సంగతి ఆయనకు తెలిసి పోయింది. అవి దేవతలకు మొర పెట్టుకున్న విషయాన్ని ఎవరో అగ్నిదేవుడికి చేర్చారు. ఆయనకు రెండు విధాల సహనం నశిం చింది. వెనువెంటనే ‘‘ఎవరుబడితే వారు వేటాడి సులు వుగా చంపుదురుగాక’’ అని చేపల్ని శపించాడు. హోమా లు చేసేవారిపట్ల సహనం నశించి వచ్చిన అగ్ని దేవుడు చివరకు చేపలపై తన ప్రతాపాన్ని చూపాడు. కోపం ఒకరిపై, శాపం ఒకరిపై అన్నమాట! సహనమో, అసహ నమో... దాన్ని భరించగలిగినవారిపై చూపితే అతి హోమాల జోరు తగ్గేదా?! తనకొచ్చిన ఇబ్బంది కూడా పరిష్కారమయ్యేదా?! ఆయన ఆ పని చేయలేదు. సహనం నశించినవాడికి చిరాకు పెరిగి ‘ముఖమే విల్లుగా అయి, మాటలే వాడి బాణాలయి సూటిగా దిగబడి’ అటువారికీ, ఇటువారికీ తీరిగ్గా విచక్షణ కలిగినా జరగాల్సిన నష్టం జరుగుతుందని సర్వకాలాలనూ ఉద్దే శించి వ్యాసుడంటాడు. శత్రువుల సంగతి చెబుతూ ‘ముం దు ఆయా వ్యక్తుల మనసులోనూ, అవతల సమాజం లోనూ ఉండే శత్రువులనూ కనిపెట్టి ఓడించేవాడికి బయటి శత్రువులు ఒక లెక్క కాదంటాడు. దుస్సహనం, దర్పం, దురహంకారం ఒకలాంటివే. ‘‘...నల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపః ఫలహాని...’’ చేయకపోదని చెబుతుంది మహాభారతం లోని ఉపకథ. యయాతి మహారాజుగారి బంధువులు ఆధ్యాత్మిక తిప్పలు ఏవో పడి ‘శిబి’ అనే నక్షత్రలోకానికి చేరుకున్నారు. అయితే, ఆ పైస్థాయికి చేర్చగల ఔన్నత్యాన్ని సాధించడానికి అవసరమైన సహనం కరువైంది వాళ్లకు. అందుకే ‘‘మాకు పుణ్యలోకాలు ఉన్నాయా?’’అంటూ అక్క డికి చేరిన యయాతిని అడిగారు. వారందరూ అంత స్థాయికి చేరుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్న యయా తికి ఈ ప్రశ్న మరింత విచిత్రం అనిపించింది. మానసిక ఔన్నత్యమనే పైస్థాయికి ఒక పరిమితి అంటూ లేదని ఈ సంభాషణ చెబుతుంది. ఇది ఉభయ భారతాల్లోనూ ఉంది. -తల్లావఝ్జల శివాజీ -
బొంత కుట్టినట్టు..!
ఈ ఫొటోలో కనిపిసున్న బాలింత తిప్పరి సునీత. ఈమెది కరీంనగర్‌లోని వావిలాలపల్లి. రెండో కాన్పు కోసం ఈనెల 16న కరీంనగర్ ప్రభుత్వాసుత్రిలో చేరింది. 18న శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మగబిడ్డకు పురుడుపోశారు. కుట్లు వేసే సమయంలో విచక్షణ కోల్పోయినట్లున్నారు. కోసిన భాగంలో బొంతకన్నా దారుణంగా అటుఇటు కలిపి రెండుకుట్లు మాత్రమే వేశారు. కుట్లు వేసిన రెండోరోజు మాత్రమే డాక్టర్ పరీక్షించి వెళ్లింది. అనంతరం ఆమెను పట్టించుకున్నవారు లేరు. గురువారం ఉదయం కుట్లు విప్పేందుకు సిబ్బంది సునీతను పరీక్షించగా.. కడుపంతా వాచిపోయింది. కుట్లు వేసిన భాగమంతా పుండుగా మారింది. తీవ్ర అవస్థతతో బాధపడుతున్న ఆమెకు పుండుమీద కారం చల్లినట్లు.. తిరిగి మరో ఆరు కుట్లు వేశారు. అవి కూడా అడ్డదిడ్డంగా వేయడంతో సునీత బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం ఆ కుట్లు కూడా ఎండకపోవడంతో సెప్టిక్ అయి నరకయాతన పడుతోంది. కడుపునొప్పితో బాధపడుతోందని, తలతిప్పుతోందని బాధితురాలి అత్త లక్ష్మి సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే.. శరీరాలను బట్టి ఒక్కోసారి ఇలాగే జరుగుతుందంటూ లెక్చర్ ఇవ్వడం గమనార్హం. -న్యూస్‌లైన్, కరీంనగర్ హెల్త్ -
నిర్లక్ష్యం నీడలో రోగులు
కరీంనగర్‌హెల్త్, న్యూస్‌లైన్: కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చావుబతుకుతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునేనాథుడు కరువ య్యాడు. ఆదివారం ప్రభుత్వాధికారులకు సెలవు అన్నట్లుగా ప్రభుత్వ వైద్యాధికారులు వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తుకలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేసి తీరుమార్చుకోవాలని హెచ్చరించినా వారు లెక్కచేయడం లేదు. తాజాగా ఆనారోగ్యంతో సొమ్మసిల్లి పడిపోయి గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని రెండుగంటలపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. బాధితుడి తల్లి మల్లవ్వ తెలిపిన వివరాలు.. కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన గోదాసు లింగయ్య ఆదివారం పనుల కోసం హుస్నాబాద్‌కు వెళ్లాడు. ఫిట్స్‌తో కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుతాసుపత్రికి రెఫర్ చేశారు. లింగయ్యను సాయంత్రం ఆరుగంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యం కోసం అత్యవసర సేవల విభాగానికి వెళ్తే.. ఇక్కడ కాదంటూ మేల్ వార్డుకు పంపించారు. అక్కడ కాదంటూ మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అక్కడ, ఇక్కడ అంటూ తిప్పడంతో చేసేదిలేక మేల్‌వార్డులో వరండాలో ఖాళీగా ఉన్న బెడ్‌పై పడుకోబెట్టారు. డాక్టర్‌కు సమాచారం అందించినా పట్టించుకోదని, ప్రాణాలు తీస్తారా..అంటూ నిలదీయడంతో వైద్యం మొదలుపెట్టారని మల్లవ్వ తెలిపింది. -
సంయమనం పాటించండి: సిఎం