
ఓ మనిషీ.. తిరిగిచూడు
ఉరుకులు.. పరుగుల నగర జీవనంలో.. తోటి మనిషికి ఏ ఆపదొచ్చినా.. పట్టించుకునే ఓపిక.. సాయపడాలనే తాపత్రయం అరుదు. సృష్టిలోనే జ్ఞాన సంపన్నుడైన మనిషే.. తోటివారు చచ్చినా చలించని కాలమిది. మానవత్వం మరుగైపోతున్న ప్రపంచమిది. అలాంటిది వాహనం ఢీకొన్న లేగదూడ కోసం ఏ జ్ఞానంలేని పశువులు మూడు గంటల పాటు రోడ్డుపై మూగగా రోదించాయి.
దూడ దగ్గరికొచ్చిన వారిపై తిరగబడి రక్షణగా నిలిచాయి. వాహనాలనూ అడ్డుకున్నాయి. ముఖ్యంగా తల్లి పశువు ఆవేదన చూపరులను కలచివేసింది. ఈ ఘటన తిరుపతిలోని టౌన్‌క్లబ్-అలిపిరి మార్గంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఫొటోలు: కె.మాధవరెడ్డి, తిరుపతి