సహనం అంత సులువైనదా!
సహనం విలువ గురించి మహాభారతం సవివరంగా చర్చించింది. అది చెప్పినంత సులువు కాదని, సహనం సంపూర్ణంగా ఉన్నవారిదే ఉన్నత మానసిక స్థాయి అనీ సందర్భాన్నిబట్టి అనేకానేక ఉదా హరణలు చూపెడుతుంది. మన కవిత్రయం అనేకచోట్ల ‘సంక్షిప్తం’గా రాయడంవల్ల వ్యాస భారతంలోని కొన్ని అంశాలు మనకు అంద కుండాపోయాయి. అందువల్లే మూల గ్రంథ మైన వ్యాసభారతం కూడా విధిగా చదివితే అటు ‘సహనం’ పెరుగుతుంది, ఇటు కవిత్ర యం విడిచిపుచ్చిన ‘ఉదాహరణలు’, ‘ఉపకథలు’ పూర్తిగా దొరుకుతాయి.
సహనం విషయంలో అగ్నిదేవుడికి సహితం ఓర్పు నశించిన ఘట్టం చూడండి. అడ్డూ ఆపూ లేకుండా చీటికీ, మాటికీ హోమాలు చేస్తుండటంవల్ల అగ్నిదేవుడికి సహనం నశించిందట. దాంతో నీళ్లలో అట్ట డుగున దాక్కున్నాడట. అగ్ని రాకతో ఏర్పడిన తాపాన్ని భరించలేక పాపం చేపలన్నీ వెళ్లి దేవతలకు మొరపెట్టుకున్నాయి. అయితే, ఈ వెర్రి చేపల తెలివి సంగతి ఆయనకు తెలిసి పోయింది. అవి దేవతలకు మొర పెట్టుకున్న విషయాన్ని ఎవరో అగ్నిదేవుడికి చేర్చారు. ఆయనకు రెండు విధాల సహనం నశిం చింది. వెనువెంటనే ‘‘ఎవరుబడితే వారు వేటాడి సులు వుగా చంపుదురుగాక’’ అని చేపల్ని శపించాడు. హోమా లు చేసేవారిపట్ల సహనం నశించి వచ్చిన అగ్ని దేవుడు చివరకు చేపలపై తన ప్రతాపాన్ని చూపాడు. కోపం ఒకరిపై, శాపం ఒకరిపై అన్నమాట! సహనమో, అసహ నమో... దాన్ని భరించగలిగినవారిపై చూపితే అతి హోమాల జోరు తగ్గేదా?! తనకొచ్చిన ఇబ్బంది కూడా పరిష్కారమయ్యేదా?! ఆయన ఆ పని చేయలేదు.
సహనం నశించినవాడికి చిరాకు పెరిగి ‘ముఖమే విల్లుగా అయి, మాటలే వాడి బాణాలయి సూటిగా దిగబడి’ అటువారికీ, ఇటువారికీ తీరిగ్గా విచక్షణ కలిగినా జరగాల్సిన నష్టం జరుగుతుందని సర్వకాలాలనూ ఉద్దే శించి వ్యాసుడంటాడు. శత్రువుల సంగతి చెబుతూ ‘ముం దు ఆయా వ్యక్తుల మనసులోనూ, అవతల సమాజం లోనూ ఉండే శత్రువులనూ కనిపెట్టి ఓడించేవాడికి బయటి శత్రువులు ఒక లెక్క కాదంటాడు. దుస్సహనం, దర్పం, దురహంకారం ఒకలాంటివే.
‘‘...నల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపః ఫలహాని...’’ చేయకపోదని చెబుతుంది మహాభారతం లోని ఉపకథ. యయాతి మహారాజుగారి బంధువులు ఆధ్యాత్మిక తిప్పలు ఏవో పడి ‘శిబి’ అనే నక్షత్రలోకానికి చేరుకున్నారు. అయితే, ఆ పైస్థాయికి చేర్చగల ఔన్నత్యాన్ని సాధించడానికి అవసరమైన సహనం కరువైంది వాళ్లకు. అందుకే ‘‘మాకు పుణ్యలోకాలు ఉన్నాయా?’’అంటూ అక్క డికి చేరిన యయాతిని అడిగారు. వారందరూ అంత స్థాయికి చేరుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్న యయా తికి ఈ ప్రశ్న మరింత విచిత్రం అనిపించింది. మానసిక ఔన్నత్యమనే పైస్థాయికి ఒక పరిమితి అంటూ లేదని ఈ సంభాషణ చెబుతుంది. ఇది ఉభయ భారతాల్లోనూ ఉంది.
-తల్లావఝ్జల శివాజీ