గణనాథుని అణువణువూ విజ్ఞానం... ప్రతి ఘటనా సందేశం
వినాయక చవితి గురించి ‘సాక్షి’తో కవినాయకుల కబుర్లు
భువనచంద్ర
వినాయకచవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. ఈ పండుగ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏనుగు తలకాయ.. అంటే పెద్దది. అంటే గొప్పగా ఆలోచించు.. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే... ‘నాయనా నీ శక్తినంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్ట్ చేయకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విను.. ఆ విన్నదాన్ని చక్కగా నీ మెదడుతో ఆలోచించు..’ అని అర్థం. ఇక ఆయన పొట్టకు నాగబంధం కట్టేశారు.. అంటే అర్థమేంటీ? జాగ్రత్తగా గమనిస్తే.. నాయనా నువ్వు ఎక్కువ గనుక తిన్నట్టయితే.. అది విషంతో సమానం. అందుకే మితంగా భుజించడం నేర్చుకో.. అందుకే తినే ముందు నీళ్లు జల్లి అమృతమస్తుః అంటాం.. అమృతం ఎప్పుడు అవుతుంది? మితంగా తిన్నప్పుడు అమృతం.. అపరిమితంగా తిన్నప్పుడు అది విషం. మనం తినేటటువంటి ఆహారం ఎలుకలు గనుక తినేస్తే.. ఎలుకలను గనుక కంట్రోల్‌లో పెట్టక΄ోతే మనిషికి గింజ కూడా దొరకదు. అందు గురించే ఆయనకు వాహనంగా పాదాల దగ్గర ఎలుకను ఉంచి ఎలుకలను కంట్రోల్‌లో పెట్టుకున్నావో నీ ఆహారం సేవ్ అవుతుంది అని సూచిస్తున్నారు.
వినాయకుడి చేతిలోని అంకుశం... దేన్నైనా కంట్రోల్ చేసుకునే పవర్.. ఏ బంధమైనా.. స్నేహం కావచ్చు.. ఏదైనా నిర్ణయం కావచ్చు.. అంకుశం ఏంటంటే.. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ చేస్తున్నది కరెక్టా కాదా అనేది మన చేతుల్లో ఉండాలి. తర్వాత పాశం.. రిలేషన్స్.. ఇలా వినాయకుడి శరీరంలో ఉండే ప్రతి భాగమూ మనకు ఒక పాఠం లాంటిది. జీవిత పాఠం అది. గ్రామాల్లో స్థానికంగా ఉండే దేవతల్లో లక్ష్మీ, వినాయకుడు ఇద్దరూ ఉంటారు. ఆహార ఉత్పత్తి, పొదుపు వల్ల సమృద్ధి. నాకు ఒకరు గొప్ప మాట చె΄్పారు. ఆరోజుల్లో జీతాలు తక్కువ వచ్చేవి కదా.. అప్పుడు ఒకరు చె΄్పారు. అది చాలా మంచి మాట. ‘ఏమండీ.. మా ఇంట్లో చింతపండు, ఉప్పు, ఎండు మిరిపకాయలు, బియ్యం కచ్చితంగా ఎప్పుడూ ఉంచుతానండీ... జీతం రాగానే మొట్టమొదట ఎక్కువ మోతాదులో అవే తీసుకుంటానండి’ అని. ‘అదేంటీ?’ అన్నాను. ‘మన ఇంటికి పది మంది అప్పటికప్పుడు వచ్చారనుకోండి.. ఆ నాలుగు పదార్థాలుంటే కనీసం చారన్నం అయినా పెట్టొచ్చు కదా?’ అని సమాధానం ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ లగ్జరీ ఐటమ్స్.
ఇక తర్వాత లేఖిని.. వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడం. ఇక్కడ లేఖిని అంటే అక్షరం రాయడం మాత్రమే కాదు.. ఏ విద్యైనా సిద్ధింపచేయాలంటే మొట్టమొదట చెవులు కరెక్ట్‌గా ఉండాలి.. బుర్ర కరెక్ట్‌గా ఉండాలి. అందుచేత సిద్ధి వినాయకుడు.. ఏది మొదలుపెట్టినా ‘అయ్యా ఇది నేర్చుకోదలిచాను.. నన్ను సిద్ధింపచేసే శక్తి నీలో ఉంది గనుక ఈ సిద్ధి నాకు ్రపాప్తించేలా చూడు’ అని నమస్కరిస్తాం. చిన్నతనంలో కూడా అందుకే వినాయకచవితి వచ్చిందంటే.. పుస్తకాలు, అట్టలు.. పెన్నులు అన్నీ స్వామి వారి ముందు ఉంచి పూజ చేసుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా.. ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా వినాయకుడికి మొట్టమొదటి స్థానం ఎందుకు ఇస్తారంటే.. ఆయన సిద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే సిద్ధి లేదు. నిజానికి కుమారస్వామితో ఆయన ΄ోటీ పడినప్పుడు కూడా ఆయన బుద్ధిని ఉపయోగించాడు.. అందుకే ఆయన భార్యలను సిద్ధి బుద్ధి అంటాం.. నీ బుద్ధిని గనుక సక్రమంగా వినియోగించినట్లు అయితే ఆటోమేటిక్‌గా సిద్ధి లభిస్తుంది. వినాయకచవితి ఏం చెబుతుందంటే.. ఏది చేసినా శ్రద్ధతో చెయ్.. చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఆయన కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే అర్థం ఏంటీ? సూక్ష్మమైనదాన్ని కూడా చూడగలగాలి. చీమ కన్ను ఎంత చిన్నగా ఉంటుంది? దానికి కూడా ఆహారం దొరుకుతుంది కదా? అట్లాగే ఏనుగు కళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన కదలికలను కూడా అది పట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. జంతువులు అన్నింటిలోనూ చక్కటి బ్రెయిన్ ఉన్న జంతువు ఏనుగు. అదే నెంబర్ వన్ . మానవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత పవర్ దానికి ఉంది.
పత్రి అనేది మనం ఎందుకు కోసుకొస్తాం? వెలగ, వాక్కాయ్ వంటివన్నీ ఎందుకు తీసుకొస్తాం పూజకి? ఎందుకంటే ఈ సీజన్ లో వాక్కాయ్ పచ్చడి తినమంటే ఎవరూ తినరు..? అందుకే వాక్కాయ్ – కొబ్బరికాయి, కొబ్బరికాయ – వెలగ కలిసి చేసుకుంటాం. నిజానికి ఈ సీజన్ లో ఇవి తింటేనే రోగనిరోధక శక్తి అద్భుతంగా పని చేస్తుంది. రెండొవది ఆకులు దూసిన తర్వాత కొత్త ఆకులువస్తాయి. అలా కాకుండా ఆ ఆకులు మొక్కకే ముదిరి΄ోతే అక్కడితో ఎండ్ అయి΄ోతుంది. ప్రతి ఔషధ మొక్కలను సజీవంగా ఉంచాలంటే పాత ఆకుల్ని పీకాలి. ఇక కామెర్లకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్ . ప్రకృతిని రక్షించేవాడు దేవత.. ప్రకృతిని రక్షిస్తూ.. ప్రకృతి మీద ఆధారపడేవాడు మానవుడు. ప్రకృతిని నాశనం చేసేవాడు రాక్షసుడు. ప్రకృతితో సహజీవనం చెయ్ అని చెప్పే ఏకైక పండుగ వినాయకచవితి.
సుద్దాల అశోక్‌తేజ
వినాయచవితి పట్ల నా పరిశీలన ఏంటంటే పురాణాలు కానివ్వండి.. ప్రబంధాలు కానివ్వండి.. కల్పనలు కావచ్చు.. యదార్థంగా జరిగినవి కావచ్చు.. ఏవైనా.. ఏవైనా సరే.. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం రాసినవే.. పుట్టించినవే.. శంకరుడు.. పార్వతమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్లబోతుంటే ఒక పిల్లోడు అడ్డుకుంటాడు.. అతడిపై ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు. ఇది కదా కథ? తర్వాత పార్వతమ్మ వచ్చి.. బాగా ఏడ్చి.. భర్త మీద కోప్పడితే.. మళ్లీ బతికించాడు.. ఫస్ట్ ఏంటంటే.. తొందరపాటుతనం మనుషులకే కాదు.. దేవతలమైన మాకు కూడా ఉంటుందని చెప్పడమే ఆ పసివాడ్ని చంపడం.. ఒక తొందరపాటులో ఇన్ని అనర్థాలు జరగుతాయి అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది అనుకుంటాను.. శివుడు సహనంగా ఉండి ఉంటే చంపేవాడు కాదు కదా..
నంబర్ 2– ఎంత పరమేశ్వరుడైనా భార్యకు శరీరంలో సగభాగం ఇచ్చాడు.. అదొక ఆదర్శమైతే.. భార్య అతడు చేసిన పొరబాటు గురించి చెప్పగానే.. ఎక్కడా పురుషాధిక్యత లేకుండా తన పొరబాటు తాను గ్రహించాడు.. అంటే ఇక్కడ స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా భావించడం తప్పు అని తన ఈ చర్య ద్వారా తెలిపాడు.. ‘నేను భర్తను, నువ్వు భార్యవి.. అవును చంపేశాను.. నా ఇష్టం..’ అని ఉంటే ΄ోయేది కదా..? కానీ అలా అనలేదు.. పొరబాటు గ్రహించడమే కాదు.. భార్య చెప్పిన దిద్దుబాటు చర్యకు పూనుకున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు చెప్పినా.. భార్య చెప్పినా.. మంచి చెప్పినప్పుడు మనం దాన్ని సవరించుకోవాలి.. వీలైతే ఆచరించుకోవాలి.. అనేది రెండో ఘటన.
మూడవది ఇది చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. తలను తీసేశాడు.. భార్య వచ్చి ఏడవగానే ఉన్న తలను అతికించొచ్చు కదా? ఎన్నో మాయలున్నవాడు.. పైగా నరికిన తల పక్కనే ఉంటుంది కదా? ఆ తలను అతికించకుండా ఏనుగు తల తీసుకుని రావడం ఎందుకు? ఎందుకు అంటే.. మనిషికి ఎంత ్రపాధాన్యత ఉందో.. దేవతలకు ఎంత ్రపాధాన్యత ఉందో.. జంతువులకు కూడా అంతే ్రపాధాన్యత ఉంది అని చెప్పడానికన్నమాట. అంటే ప్రకృతిని గౌరవించడం అనిమాటే. ‘‘నువ్వు జీవించు మిగతా వాటిని జీవించనివ్వు’’ అని చెప్పడం కోసం ఒక జంతువుకి అపారమైన ్రపాధాన్యత ఇవ్వడం కోసం ఏనుగు తలకాయ పెట్టి ఉంటాడా? ఇవన్నీ నా ఆలోచనలే.. నా వ్యక్తిగతమైనవి.
తర్వాత శంకరుడి దగ్గర కైలాసంలో పరస్పర శత్రువులైన జంతువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎలుకలను తినే పాము పక్కనే ఉంటుంది. పాముని తినే నెమలి పక్కనే ఉంటుంది. మూడు పరస్పర వైషమ్యాలు కలిగిన జీవరాశులకు కూడా సమానమైన గౌరవం ఇస్తూ సమానమైన జీవితావకాశాన్ని ఇచ్చిన వాడు శివుడు. కైలాసంలో జాతీయ జంతువు ఎవరో తెలుసా..? ఎద్దు. ఎద్దుని వాహనం చేసుకున్నవాడు శివుడు. బ్రహ్మ కమలం మీద ఉంటాడు. విష్ణువు ఆదిశేషువు మీద ఉంటాడు. కాని శివుడు రైతుకి, వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఎద్దును వాహనంగా ఎంచుకున్నాడు.
ఇక వినాయకుడిని పూజించే దగ్గర.. సాధారణంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన దగ్గర ఉన్నవో లేనివో నాణాలు తెచ్చిపెడతాం.. లేదా ఆరోజు బంగారం ఏదొకటి కొనుక్కుని పెడతాం. కానీ వినాయకుడికి అవేం ఉండవు. చెరకు, పత్రి, గరిక ఇలా అతి చౌక ఆకులు.. సులభంగా ప్రకృతిలో దొరికే వాటిని తెచ్చి పెడతాం. ప్రకృతి, ప్రకృతిలోని జీవులు, పరమాత్మ మూడు సమానమే అని చెప్పేందుకు గుర్తుగా ఈ వినాయకచవితి కొనసాగుతోంది. దీన్నే అందుకోవాలి సమాజం. దీన్ని అందుకోవాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. అందుకే బాలగంగాధర తిలక్ దైవభక్తిలో దేశభక్తిని రంగరించి.. వినాయకచవితిని మొట్టమొదటిసారి ఘనంగా జరిపించారు. అందుకే అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప శక్తిని నింపింది ఈ పండుగ. మా చిన్నప్పుడు వినాయకచవితికి ఇంత క్రేజ్ లేదు..ఇప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నదంటే దానికి కారణం తిలక్. ఆ గొప్పతనం ఆయనదే.
ఆ తర్వాత గణపతితో ఏం చేయించినారు.. ప్రపంచ పరుగు పందెం ΄ోటీ పెట్టేస్తే ఎలుక మీదున్న వాడు ఏం గెలుస్తాడులే అని కుమారస్వామి నెమలి మీద వెళ్లి΄ోతుంటే.. వినాయకుడు అమ్మానాన్నలను మించి ప్రపంచం భూగోళంలో ఏముంటుందని చెప్పి మూడు చుట్లు తిరిగితే.. అందరూ కలసి ఎవరు మొదలు వచ్చారంటే.. వినాయకుడే మొదట వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన దేవుడు అయ్యాడు.. ప్రథమ దేవుడు అయ్యాడు.. ఇక్కడ తల్లిదండ్రుల ్రపాధాన్యత కనిపిస్తుంది. ఇది గ్రహించాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment