
కామెడీ కార్నర్
బస్సులో ప్రయాణికుడు చాలా సేపట్నుంచి తుమ్ముని ఆపుకోడానికి నానా తంటాలు పడుతున్నాడు. తుమ్మడానికి ఏదో టెక్నిక్ ఉపయోగించి ఆపసాగాడు. పక్కనున్నతను సహనం కోల్పోయి అన్నాడు ‘‘ఎందుకండీ తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు... తుమ్మేస్తే పోతుంది కదా?’’ మొదటతను ‘‘మా ఆవిడ చెప్పింది... ‘మీకు ఎప్పుడు తుమ్ము వచ్చినా నేను నిన్ను గుర్తుచేసుకుంటున్నాను...
నువ్వు నా వద్దకు రావాలి అని అర్థం’ అని చెప్పిందండి’’ అన్నాడు ముక్కును నలుపుకుంటూ... ‘‘అయితే ఏంటి... వెళ్ళచ్చుగా...’’ ‘‘ఆవిడ చనిపోయిందండీ...’’ ‘ఈరోజు మన ఇంటికి ఒక ఫ్రెండ్‌ను డిన్నర్‌కు పిలిచాను’ అన్నాడు అప్పారావు తన భార్యతో. ఆమె అగ్గి మీద గుగ్గిలం అయింది. ‘మన ఇల్లు ఏమైనా హోటల్ అనుకున్నావా? నేను చెత్తగా వండుతాననే విషయం నీకు తెలుసుకదా?’
అప్పారావు: తెలుసు
భార్య: తెలిసి కూడా మన ఇంటికి ఎందుకు డిన్నర్‌కు పిలుస్తున్నావు?
అప్పారావు: కుర్రాడు పెళ్లి చేసుకోవాలని సరదా పడుతుంటేనూ...