సర్దుకుపోవడం, సహనం, సంయమనం, ఆవేశం... ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిలో ఏ లక్షణం మనల్ని డామినేట్ చేస్తోందో ఒకసారి చెక్‌చేసుకుందాం.
1. మీరు క్యూలో ఉండగా ఎవరైనా నేరుగా కౌంటర్ దగ్గరకు వెళుతున్నా చూస్తూ ఊరుకోవడం మీకలవాటు.
ఎ. కాదు బి. అవును
2. అలా వెళ్తున్న వారిని పిలిచి అప్పటికే క్యూ పాటిస్తున్న విషయాన్ని గమనించి మీ వంతు కోసం ఎదురుచూడడం ధర్మం అని సున్నితంగా హెచ్చరిస్తారు.
ఎ. అవును బి. కాదు
3. ఇంతమంది వెయిట్ చేస్తుంటే అలా వెళ్లడమేంటని గొడవపడతారు.
ఎ. కాదు బి. అవును
4. పిల్లల పుస్తకాలు అస్తవ్యస్తంగా ఉంటే మనసులోనే చిరాకుపడుతూ, చిరిగిన వాటిని సహనంగా అతికించి అన్నింటినీ సర్ది పెడతారు.
ఎ. కాదు బి. అవును
5. పుస్తకాలను అలా చూడగానే ఆవేశంతో ఊగిపోయి, పిల్లల్ని చివాట్లేసి, నాలుగు దెబ్బలేసి భయం చెబుతారు.
ఎ. కాదు బి. అవును
6. పిల్లల్ని పిలిచి ఊడిపోయిన పేజీలను అతికించమంటారు, అవసరమైతే సహాయం చేస్తారు. వారిచేతే చేయించడం ద్వారా పుస్తకాలను జాగ్రత్తగా పెట్టుకోవాలన్న బాధ్యత, ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలన్న స్పృహ కలుగుతుందని మీ అభిప్రాయం.
ఎ. అవును బి. కాదు
7. హాస్పిటల్‌లో మీ వంతు వచ్చే సరికి ఆలస్యమవుతుందనిపిస్తే అసహనంతో అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేయించుకుని మరో డాక్టర్ దగ్గరకు వెళ్లిన సందర్భాలున్నాయి.
ఎ. కాదు బి. అవును
8. మీ వంతు కోసం ఎదురు చూడడానికి టైమ్‌లేనప్పుడు మీ అపాయింట్ మెంట్‌ను మరొక రోజుకు కాని, అదే రోజు మీరు అటెండ్ కావాల్సిన పని పూర్తి చేసుకుని హాస్పిటల్‌కు వచ్చేటట్లు మార్చుకుంటారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం. ఆవేశపడటం కాని, అన్నింటికీ సర్దుకుపోతూ మిమ్మల్ని మీరు బాధపెట్టుకుంటూ ఉండడం కాని మీకు నచ్చదు. ‘బి’లు ఎక్కువైతే మీరు తాత్కాలిక ఆవేశపరులు అయి ఉండాలి లేదా అన్నింటికీ సర్దుకుపోతూ, నొచ్చుకుంటూ జీవిస్తున్న వారి కోవలో ఉన్నట్లు అనుకోక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment