compassion
-
ప్రవర్తన... పర్యవసానం
ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి? ’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది. మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు. చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను... సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు. ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి. సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది. ‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి. అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. – రోచిష్మాన్ -
Kindness Day: దయ చుట్టంబౌ.. నేడు ప్రపంచ దయాగుణ దినోత్సవం
దేవుడు భక్తుణ్ణి అడిగాడట– ‘నేను నీ ఇంటికొస్తే నాకు అన్నమెందుకు పెట్టలేదు’ అని. ‘నువ్వెప్పుడొచ్చావు తండ్రీ’ అన్నాడట భక్తుడు. ‘ఒకరోజు నీ ఇంటి ముందు ఒక దీనుడు క్షుద్బాధతో అన్నం అడిగాడు. అతడికి నీవు పెట్టి ఉంటే అతడిలో నేను కనపడేవాణ్ణి’ అన్నాడట దేవుడు. దయను మించిన అంటు లక్షణం మరొకటి లేదు. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ సమస్యలు పెరిగిపోయాయి. దయ చూపేవారికి సాటి మనిషి తోడు నిలుస్తాడు. దయే నేడు కావలసిన చుట్టం. వెతకవలసిన దైవం. దేవుడు మనుషుల పట్ల ఎంతో దయగా ఉన్నాడు. లేకుంటే ఉష్ణం గక్కే పగలు నుంచి సాంత్వనం కోసం రాత్రిని ఇచ్చేవాడా? క్రూరమృగాల కీకారణ్యంలో తీయని ఫలాలను వేళ్లాడగట్టేవాడా? నదులను గీత కొట్టి అంతే పారాలని చెప్పేవాడా? సముద్రానికి చెలియలికట్టలు గీచేవాడా. దేవుడు మనుషులతో ఎంతో దయగా ఉన్నాడు. జబ్బు ఉన్నచోటే మందు ఇచ్చాడు. గాయపడిన చోట మాన్పుకోవడమూ నేర్పాడు. కంటిలో నీరు ఇచ్చి ఆనందబాష్పాలను కూడా చిలకరించాడు. మనిషి? అన్నీ ఫ్రీ. గాలిలోని ఆక్సిజన్ ఫ్రీ. సూర్యుడిలోని డి విటమిన్ ఫ్రీ. మబ్బులోని వాన ఫ్రీ. చంద్రుడిలోని వెన్నెల ఫ్రీ. చెట్ల ఆకుపచ్చదనం ఆకాశంలోని నీలిమ.. అన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ అతడు బదులుగా ఇవ్వవలసింది చూపవలసింది ఏమిటి? సాటిమనిషి పట్ల కాసింత దయ. కొంచెం కరుణ. గుప్పెడు ఆర్ద్రత. చిటికెడు చెమరింత. ఇంగ్లిష్‌వాడు మానవజాతిని ‘మేన్‌కైండ్’ అన్నాడు. ‘కైండ్’గా ఉండటమే మానవజాతి లక్షణం. మానవీయమైన గుణం కలిగినవాడే మానవుడు. మానవీయగుణం అంటే దయ, కరుణ. ‘ఇంటి దగ్గర ఉండే లేగదూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను చంపి తిను’ అన్న గోవు మాట మీద నిలబడి తిరిగి వస్తే క్రూరమృగమైన పులికి దయ కలిగింది. ఆవును వదిలిపెట్టింది. కాని నేటి మనిషి పులి కంటే కఠినంగా మారుతున్నాడా? దయ, జాలి, కరుణ అనే మాటల్నే మరుస్తున్నాడా? ఇలాంటి మనిషిని ప్రకృతి ఇష్టపడుతుందా? ఇల్లు–ఇరుగు పొరుగు ‘పిల్లల పట్ల పెద్దలు దయగా ఉండాలి’ అని అంటారు. పిల్లలకు ఇంటి పని నేర్పించడం వేరు. ఇంటి పని పిల్లల చేత చేయించడం వేరు. బాల కార్మిక వ్యవస్థ బయట శిక్షార్హమైన నేరం. కాని ఇళ్లల్లో సొంత పిల్లలను రకరకాల పనుల్లో పెట్టి వారిని చెప్పుకోలేని బాధకు గురి చేసే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి పనికీ పిల్లల్ని కేక వేయడానికి వారు పనిమనుషులు కాదు. ఇక వారిని తిట్టడం, కొట్టడం వారిని భవిష్యత్తులో నిర్దాక్షిణ్యులుగా మార్చడమే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో ఇరుగు పొరుగువారితో దయగా ఉంటే, ‘వాచ్‌మెన్‌కు ఈ టిఫిన్ ఇచ్చిరా’ అని పిల్లల చేత పంపిస్తే, ‘పాపం.. వాళ్ల బండి పంక్చర్ అయ్యిందట.. మన బండి తాళం ఇచ్చిరా’ అని పంపిస్తే... పిల్లలు దయను కూడా నేర్చుకుంటారు. అవును. మంచి గుణాలను నేర్పించాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో చేయి సాచగానే తండ్రి నోటి నుంచి బూతులు, తల్లి మాటల్లో ఈసడింపు కనిపిస్తే పిల్లలు అలాంటి పేదవారి గురించి భవిష్యత్తులో దయగా ఉండే అవకాశం ఉండదు. ఇరుగు పొరుగు పిల్లలతో, క్లాస్‌లోని పిల్లలతో ఎంతో స్నేహంగా, దయగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు తమ ప్రవర్తనతో చూపాలి. యువతలో ఈ దయాగుణం లోపిస్తున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, యు.కెలలో క్లాస్ 12 లోపు పిల్లల కోసం ‘కైండ్‌నెస్ కరిక్యులమ్’ ప్రవేశపెడుతున్నారు. పని చోట మనతో పని చేసే వారితో మనం కఠినంగా ఉండాలి అనుకోవడమే సగం అనారోగ్యం. పని రాబట్టుకోవాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమగా ప్రశంసగా కూడా పని జరుగుతుంది చాలాసార్లు. కొలీగ్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూడటానికి మించిన నిర్దయ లేదు. వారి నిజమైన సమస్యలకు స్పందించడం, కనీసం వినడం, వారి పని సర్దుబాటులో, సెలవుల అవసరంలో సాయంగా ఉండటం పని చోట చూపాల్సిన కనీస దయ. పని చోట రాజకీయాలు నడిపితే అనారోగ్యం వస్తుందని దయగా ఉంటే మనశ్శాంతితో ఉంటూ శరీరంలో మంచి ఎంజైమ్‌లు ఊరుతూ ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందరూ పౌరులే ఈ దేశంలో అందరూ సమాన పౌరులే. అందరికీ రాజ్యాంగం శిరోధార్యమే. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. అలా జీవించే హక్కు వారికి ఉంది. ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ఆచారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి ఫలానా వారి పట్ల నిర్దయగా ఉండొచ్చు అనుకోవడానికి మించి సంకుచితత్వం లేదు. నువ్వు నిర్దయగా ఉన్నావంటేనే పైచేయి తీసుకుంటున్నట్టు అర్థం. పైచేయి తీసుకోవడం అంటే పీడన చేయడానికి సిద్ధమవడమేనని అర్థం. పీడిస్తే సంఘంలో బాధ ప్రవహిస్తుంది. దయగా ఉంటే సంతోషం, సామరస్యం పెల్లుబుకుతాయి. ఇవాళ ద్వేషం కాదు కావలÜంది దయ. బాగున్న వర్గాలు బాగలేని వర్గాల పట్ల నిర్దయను మానుకుంటే చాలు. వారి హక్కుల్ని వారు సాధించుకుంటారు. గ్రామీణులు ‘ఫలానా అతను దయగల్లోడు’, ‘ఫలానా ఇల్లాలు దయగలది’ అంటుంటారు. ఇవాళ, ఈ రోజున, మనల్ని ఎవరైనా అలా అంటున్నారా లేదా అని ఆత్మశోధన చేసుకోవడమే మనం చేయవలసిన పని. దయగా ఉంటే ఏం పోతుంది. మహా అయితే అందరూ మనతో దయగా ఉంటారు. అంతేగా? -
మోదీ ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ/ముంబై: దేశ ప్రజల్లో ప్రేమ, కరుణ పెంపొందించడం ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. తమ వాదనే సరైందని నమ్మకం కలిగించేందుకు ప్రధాని∙మోదీ ప్రజల మనసుల్లో విద్వేషం, భయం, ఆగ్రహాన్ని పాదుకొల్పుతున్నారని ఆరోపించారు. విద్వేషం బదులు ప్రజల్లో ప్రేమ, కరుణ ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని చెప్పేందుకు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని ఆయన శనివారం ట్వీటర్లో పేర్కొన్నారు. -
సంయమనంతో వ్యవహరిస్తున్నారా?
సర్దుకుపోవడం, సహనం, సంయమనం, ఆవేశం... ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిలో ఏ లక్షణం మనల్ని డామినేట్ చేస్తోందో ఒకసారి చెక్చేసుకుందాం. 1. మీరు క్యూలో ఉండగా ఎవరైనా నేరుగా కౌంటర్ దగ్గరకు వెళుతున్నా చూస్తూ ఊరుకోవడం మీకలవాటు. ఎ. కాదు బి. అవును 2. అలా వెళ్తున్న వారిని పిలిచి అప్పటికే క్యూ పాటిస్తున్న విషయాన్ని గమనించి మీ వంతు కోసం ఎదురుచూడడం ధర్మం అని సున్నితంగా హెచ్చరిస్తారు. ఎ. అవును బి. కాదు 3. ఇంతమంది వెయిట్ చేస్తుంటే అలా వెళ్లడమేంటని గొడవపడతారు. ఎ. కాదు బి. అవును 4. పిల్లల పుస్తకాలు అస్తవ్యస్తంగా ఉంటే మనసులోనే చిరాకుపడుతూ, చిరిగిన వాటిని సహనంగా అతికించి అన్నింటినీ సర్ది పెడతారు. ఎ. కాదు బి. అవును 5. పుస్తకాలను అలా చూడగానే ఆవేశంతో ఊగిపోయి, పిల్లల్ని చివాట్లేసి, నాలుగు దెబ్బలేసి భయం చెబుతారు. ఎ. కాదు బి. అవును 6. పిల్లల్ని పిలిచి ఊడిపోయిన పేజీలను అతికించమంటారు, అవసరమైతే సహాయం చేస్తారు. వారిచేతే చేయించడం ద్వారా పుస్తకాలను జాగ్రత్తగా పెట్టుకోవాలన్న బాధ్యత, ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలన్న స్పృహ కలుగుతుందని మీ అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 7. హాస్పిటల్లో మీ వంతు వచ్చే సరికి ఆలస్యమవుతుందనిపిస్తే అసహనంతో అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించుకుని మరో డాక్టర్ దగ్గరకు వెళ్లిన సందర్భాలున్నాయి. ఎ. కాదు బి. అవును 8. మీ వంతు కోసం ఎదురు చూడడానికి టైమ్లేనప్పుడు మీ అపాయింట్ మెంట్‌ను మరొక రోజుకు కాని, అదే రోజు మీరు అటెండ్ కావాల్సిన పని పూర్తి చేసుకుని హాస్పిటల్‌కు వచ్చేటట్లు మార్చుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం. ఆవేశపడటం కాని, అన్నింటికీ సర్దుకుపోతూ మిమ్మల్ని మీరు బాధపెట్టుకుంటూ ఉండడం కాని మీకు నచ్చదు. ‘బి’లు ఎక్కువైతే మీరు తాత్కాలిక ఆవేశపరులు అయి ఉండాలి లేదా అన్నింటికీ సర్దుకుపోతూ, నొచ్చుకుంటూ జీవిస్తున్న వారి కోవలో ఉన్నట్లు అనుకోక తప్పదు. -
రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీయొద్దు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జడ్జీలు సంయమనంతో వ్యవహరించాలి న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధులకు లోబడి ఉండాలి భోపాల్: న్యాయవ్యవస్థ క్రియాశీలత ఇతర వ్యవస్థల ఉనికిని దెబ్బతీసేలా ఉండకూడదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జడ్జీలను హెచ్చరించారు. అధికారాన్ని వాడేటప్పుడు సమతౌల్యం, సంయమనం పాటించాలని సూచించారు. ‘అన్ని వ్యవస్థలకన్నా రాజ్యాంగమే అత్యున్నతమైంది. ప్రజాస్వామ్యానికి కీలకమైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధులకు లోబడి వ్యవహరించాలి. ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యంచేసుకుని వాటి పనితీరుకు ఆటంకాలు సృష్టించరాదు. రాజ్యాంగం నిర్ధేశించిన విధులు సాఫీగా నిర్వర్తించడానికి దోహదపడాలి. ఇతర వ్యవస్థలతో సమస్య వచ్చినప్పుడు న్యాయమూర్తులు సంయమనంతో వ్యవహరించాలి. రాజ్యాంగంలో ఈ మూడు వ్యవస్థల అధికారాలను నిర్దిష్టంగా పేర్కొన్నారు’ అని అన్నారు. శనివారం ఇక్కడ జాతీయ జ్యుడీషియల్ అకాడమీలో సుప్రీం కోర్టు జడ్జీలు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగించారు. ‘శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయి. ఈ సందర్భంలోనే న్యాయవ్యవస్థ అన్ని వేళల్లో సంయమనం, క్రమశిక్షణ పాటించాలని, ఇదే న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండడం అవసరం. అప్పుడే ప్రజలకు నిస్పాక్షిక న్యాయం లభిస్తుంది. ప్రత్యేకించి దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇది అవసరం. న్యాయసమీక్ష న్యాయవ్యవస్థకు మూలాధారం. దేశంలో న్యాయవ్యవస్థ పరిధి విస్తరించడం మంచి పరిణామం. పౌరుల హక్కుల పరిరక్షణకు కోర్టులు పోస్టుకార్డుల ద్వారా అందే ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా స్పందిస్తూ న్యాయాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి చర్యలవల్ల సాధారణ ప్రజలకు న్యాయం అందుతోంది’ అని అన్నారు. కోర్టులు చట్టాల్లో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ అన్యాయాలను నియంత్రిస్తున్నాయని అన్నారు. సమాజంలో రూల్ ఆఫ్లా, స్వేచ్ఛలను కాపాడడంలో కోర్టులది అద్వితీయ స్థానమని ప్రశంసించారు. న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజల నమ్మకాన్ని ఎల్లవేళలా కాపాడాలని అన్నారు. సామాన్యులకు కోర్టు ఖర్చులు భారం కాకూడదని సూచించారు. దేశ విలువలు కాపాడడంలో, ప్రభుత్వానికి మార్గదర్శకంగా వ్యవహరించడంలో సుప్రీంకోర్టు పాత్ర ప్రశంసనీయమని అన్నారు. కాగా, కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోవడం ఆందోళనకరమైన అంశమని, వివిధ మార్గాల్లో కేసులను సత్వరంగా పరిష్కరించాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్విల్కర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్‌లో 3 కోట్ల కేసులు: సదానంద గౌడ దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు మూడుకోట్ల మేర కేసులు పెండింగ్‌లో ఉండడంపై న్యాయ మంత్రి సదానంద గౌడ ఆందోళన వ్యక్తంచేశారు. గత మూడేళ్లుగా పెండింగ్ కేసుల పరిష్కారానికి తీవ్రంగా కృషి జరుగుతున్నప్పటికీ, ఇంకా మూడుకోట్లమేర కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
అరెరె.. రాజుగారి కోటు మాయం!
రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో రష్యన్ యువతులు కనికట్టు చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కోటునే మాయం చేసేశారు. వేదికపై మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కూడా ఆశీనులయ్యారు. కోటు ధరించి ఉన్న పళ్లంరాజును ఓ బోను లాంటి తెరలో మూసి, క్షణాల్లో ఆ కోటును మాయం చేశారు. ఆయనతో పాటు కిరణ్‌కుమార్ రెడ్డి, హర్షకుమార్ తదితరులు ఈ మాయాజాలానికి మంత్రుముగ్ధులయ్యారు. - గరగ ప్రసాద్, సాక్షి, రాజమండ్రి -
శ్రుతిహాసన్ దయాగుణం
చెన్నై : ఎక్కడైనా బావ అనుగాని వంగ తోట కాడ కాదు అన్న సామెత మన నటీమణులకు వర్తిస్తుందని చెప్పవచ్చు. చిత్రం జయాపజయాలతో మాకేంటి పని. మేము నటించాం. ముందుగా ఒప్పందం ప్రకారం తమ పారితోషికం చెల్సించాల్సిందే అని వసూలు చేస్తుంటారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన నటి శ్రీదేవి వృత్తాంతమే. ఆమె చాలా కాలం తరువాత తమిళంలో విజయ్ కథానాయకుడుగా నటించిన పులి చిత్రంలో ఒక ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, హన్సికలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి ఆ చిత్ర హీరో విజయ్ను, నిర్మాతల్ని పొగడ్తల్లో ముంచెత్తారు. పులి చిత్రం విడుదల సమయంలో నిర్మాతల ఇళ్లల్లో ఐటీ దాడులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనుకున్న సమయంలో విడుదలవుతుందో, కాదో అన్నంత పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు తెరపైకి వచ్చినా చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఆ చిత్ర కథానాయకుడు కోట్ల పారితోషికం త్యాగం చేశారన్నది గమనార్హం. ఇక నటి శ్రుతిహాసన్‌కు కూడా పులి చిత్రం విషయంలో తన దారాళ మనసును చాటుకున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. ఈ చిత్రం కోసం ఒప్పందం కుదుర్చుకున్న పారితోషికంలో సుమారు 20 లక్షలు శ్రుతికి బాకీ ఉందట. ఆ మొత్తాన్ని శ్రుతిహాసన్ వదులుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
కరుణించేనా.. ఖరీఫ్ కలిసొచ్చేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్: ఖరీఫ్ సాగు కర్షకులను భయపెడుతోంది.. ఏటా అన్నదాతను ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్లుగా పంటలు నష్టపోతూనే ఉ న్నారు. దీంతో పంట పండితే పటే ల్.. పంట లేకుంటే పాలేరు అన్న చందంగా తయారైంది వారి పరిస్థి తి. ఏటా పెట్టుబడి కూడా ఎళ్లని ప రిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులు రూ.518 కోట్ల మేర అర్థికంగా నష్టపోయారు. 246 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపా తం కంటే 32 శాతం లోటుగా న మోదైంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతున్నా.. వాటితో లాభం లేకుండాపోయింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులు 4.50 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు.. ప్రధానంగా పత్తి, తరువాత సోయా, వరి పంటలు సాగు చేస్తారు. జిల్లాలో సాగు నీటి సౌకర్యాలు అవసరం మేరకు లేకపోవడంతో 80 శాతం వర్షాధారంగానే పంటలు సాగవుతాయి. ప్రకృతి కరుణిస్తే పండినట్లు.. లేకుంటే ఎండినట్లుగా ఐదేళ్లుగా ఆపసోపాలు పడుతున్నారు. అయినా.. నేలనే నమ్ముకున్న రైతన్న ఈ ఏడాదైనా కలిసి వస్తుందేమోనని ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నాడు. రోహిణి కార్తె ప్రారంభం నుంచే పనులు ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే మృగశిర కార్తె నుంచి వ్యవసాయ పనులు వేగవంతం అయ్యాయి. కొద్ది రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో 70 వేల హెక్టార్లలో పత్తి, 20 వేల హెక్టార్లలో సోయాబీన్, మరో 10 వేల హెక్టార్లలో తదితర పంటలు సాగు చేశారు. ఆరంభంలో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. మున్ముందు ఎలా ఉంటాయో అని వారిలో ఆందోళన మొదలైంది. కష్టాల కడలి నుంచి గట్టెక్కేనా..! ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయారు. దీనికితోడు పరిహారం అందించడంలో జాప్యం.. అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన పంటలకు బీమా వర్తింకపోవడం.. బ్యాంకర్లు నామమాత్రంగా రుణాలు ఇవ్వడం.. మద్దతు ధర అంతంతమాత్రంగానే ఉండడం.. ఫలితంగా రైతులు సాగు కోసం ప్రైవేటు అప్పులే చేయాల్సి వస్తోంది. దీంతో ఆ అప్పులను తీర్చేదారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది రైతులు వ్యవసాయం దండగా అని కాడెడ్లను సైతం అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. పంట భూములను బీడుగా వదిలివేస్తున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లోనైనా కాలం కనికరించాలని రైతులు కోరుతున్నారు. నాలుగేళ్లుగా నష్టమే.. ఏటా పత్తి సాగు చేస్తునే ఉన్న ఒక ఏడాది తుఫాన్లు, అధిక వర్షాలతో పంట నీటిలో మునిగింది. మరో ఏడాది వర్షాలు లేక పంట ఎండిపోయింది. నాలుగేళ్లుగా నష్టమే మిగులుతోంది. ఈ ఏడాదైనా కాలం కరుణించి దిగుబడి వస్తే గట్టెక్కుతాం. - మన్నె సంతోభ, దాబి(బి) ఇచ్చోడ. -
కాలచక్రంపపంచానికి శాంతి చక్రం
సందర్భం దలైలామా నిర్వహించే కాలచక్ర ఉత్సవం ప్రపంచ బౌద్ధ ఉత్సవాలలో ప్రముఖమైనది. టిబెట్ దేశానికి చెందిన ఈ బౌద్ధ సంప్రదాయం ప్రపంచ మానవాళిలో ప్రేమ, దయ, కరుణ, ప్రజ్ఞ, ఉపేక్ష భావాల్ని పెంపొందించి, సర్వ జీవుల్లో సమరస భావాన్ని నింపి, మానవ మనస్సుల్లోని సంకుచితత్వాన్ని పారద్రోలి, శాంతి పరిమళాలు వెదజల్లడం కోసం కృషి చేస్తుంది. ప్రతి మనిషి నిస్వార్థంగా మారడానికి, దుఃఖాన్నుండి విముక్తి కావడానికి కావలసిన మానసిక, శారీరక సాధనల్ని ఈ కాలచక్రం నిర్దేశిస్తుంది. ఈ కాలచక్ర పూజా విధానం మనుషుల మనస్సుల్లో పరిపూర్ణత్వాన్ని నింపుతుందని బౌద్ధుల నమ్మకం. కాలచక్ర అంటే? కాలానికి సంబంధించినదే ఈ కాలచక్ర. మనం సాధారణంగా క్యాలెండరు లేదా పంచాంగాన్ని కాలచక్రం అంటాం. అంటే కాలాన్ని కొలిచే విధానంగా కాలచక్రాన్ని భావిస్తాం. కానీ బౌద్ధుల ఈ ‘కాలచక్ర’ కాలానికి సంబంధించినదే అయినా, అది రోజులకు, వారాలకు, పక్షాలకు, మాసాలకు, రుతువులకు ఆయనాలకు సంబంధించినది మాత్రం కాదు. ఈ సృష్టి రచనకు సంబంధించినది కాలచక్ర - విధానాలు ఈ కాలచక్ర ఒక అద్భుతమైన తత్త్వం. ప్రకృతి, మనిషి వేరువేరు కావని చెప్పే ఒక విశ్వ ఐక్యతావాదం. ఆ విషయం కాలచక్రంలో ప్రధానంగా ఉన్న మూడు విధానాలు తెలియజేస్తాయి. ఇందులో మొదటిది బాహ్య కాలచక్ర. దీన్ని ‘కాలచక్ర భూమి’ అని కూడా అంటారు. విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, సౌరవ్యవస్థ, భూమి, మూలకాలు, మూల రాశులు - ఇలా భౌతిక జగత్తంతా ఈ బాహ్యకాలచక్రలో భాగమే. రెండోది అంతర కాలచక్ర. మనిషి, పుట్టుక, జీవనం, అనుభవాలు, మనస్సు, నాడీ చలనాలు, హృదయ స్పందనలు - ఇలా మనిషీ మనస్సు కలిసినదంతా ఈ విభాగంలోకి వస్తుంది. ఇక మూడోది ప్రత్యామ్నాయ కాలచక్ర. పైన చెప్పిన రెండు రకాల అంతర, బాహ్య కాలచక్రాల్ని ఒకటిగా అనుసంధానం చేసే విధానం ఇది. ఈ అనుసంధానం చేసే పద్ధతి ధ్యాన పద్ధతి. - బొర్రా గోవర్ధన్ టిబెట్‌లో దలైలామాలు, పంచన్లామాలు అక్కడి బౌద్ధ గురువులు. కాలచక్ర పథ మార్గాన్ని నడిపించే గురువులు వాళ్ల్లే. ఒకటవ, రెండవ, ఏడవ, ఎనిమిదవ, పద్నాలుగవ దలైలామాలు ఈ కాలచక్ర కార్యక్రమాల్ని ఎక్కువగా నిర్వహించారు. ప్రస్తుత దలైలామా 14వ దలైలామా. అయన అసలు పేరు ‘టెన్జిన్ గాట్సో’. ఆయన ఇప్పటికి 33 కాలచక్రలు నిర్వహించారు. ప్రస్తుతం జూన్ 3 నుంచి 14వ తేదీవరకు భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో ‘లే’ (లడక్) లో 34వ కాలచక్రను నిర్వహిస్తున్నారు. 2006లో అమరావతిలో నిర్వహించిన కాలచక్ర ముప్పయ్యవది. కాలచక్ర పూజావిధానం కాలచక్ర అనేది భిక్షుదీక్షను ఇచ్చే కార్యక్రమం. దీక్ష నిచ్చే గురువును ‘వజ్రగురువు’ అంటారు. ఆయన ఒక ఉన్నత ఆనసం మీద కూర్చుని కార్యక్రమం నిర్వహిస్తారు. కాలచక్రలో ప్రధానంగా మూడు వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో బాహ్యకాలచక్రలో ఉండే నక్షత్రాది గ్రహాలు ఉంటాయి. రెండో వలయంలో అంతర కాలచక్రలో ఉండే శరీర, మనోస్థితులు ఉంటాయి. మూడో వలయంలో బుద్ధి, కాలం ఉంటాయి. అంటే ఆయా వలయాలు ఆయా రాశులకు సంకేతాలుగా ఉంటాయి. ఈ మూడు వలయాల్ని 12 రోజుల్లో దాటుకుంటూ చివరికి చేరాలి. ఈ 12 రోజుల్ని 11 దశలుగా పూర్తి చేయాలి. ఈ దశల్ని అభిషేకాలంటారు. లామా ఈ కాలచక్రను కొన్ని మండలాలుగా విభజిస్తాడు. ఈ మండలాల్ని రంగురంగుల ఇసుకతో నింపుతాడు. కాలచక్ర చిత్రాన్ని గీస్తాడు. ఆ చక్రంలో 720 మంది దేవతల్ని ప్రతిష్ఠిస్తాడు. కోర్కెలకు ప్రతీకగా శ్వేత వర్ణ బొమ్మల్ని కాలచక్ర కాళ్లకింద అణచివేస్తున్నట్లు చిత్రిస్తాడు. ఈ బొమ్మల్లో చక్రం.. పరిణామానికి (పురుషుడు), కాలం.. ప్రజ్ఞ (స్త్రీ) కి ప్రతీకలుగా భావిస్తారు. అయితే కాలచక్ర తంత్రం స్వభావరీత్యా స్త్రీతంత్రం. స్త్రీలు ఆచరించేది కాదు. ఈ తంత్ర స్వభావం అది. అందుకే ఈ తంత్రాన్ని ‘విశ్వమాత’గా పిలుస్తారు. కాలచక్ర అంటే విశ్వమాత అని. చివరి రోజున గుణాలకు ప్రతీకలైన రంగురంగుల ఇసుకను చెరిపివేసి, సైకత ఆలయాన్ని కూల్చేసి, ఆ ఇసుకను, రంగుల్నీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ నది ప్రవహించే కాలానికి ప్రతీక. ఈ పన్నెండు రోజుల కార్యక్రమంలో బోధి చిత్తాన్ని పొందిన భిక్షువులు దుఃఖరహితులై, శాంతి కాముకులై, సర్వజీవశ్రేయస్సు కోసం పాటుపడతారు. ప్రపంచాన్ని శాంతికమలంలా పూయిస్తారు. కాలచక్ర అంటే ప్రపంచశాంతి చక్రమే.