శ్రుతిహాసన్ దయాగుణం
చెన్నై : ఎక్కడైనా బావ అనుగాని వంగ తోట కాడ కాదు అన్న సామెత మన నటీమణులకు వర్తిస్తుందని చెప్పవచ్చు. చిత్రం జయాపజయాలతో మాకేంటి పని. మేము నటించాం. ముందుగా ఒప్పందం ప్రకారం తమ పారితోషికం చెల్సించాల్సిందే అని వసూలు చేస్తుంటారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన నటి శ్రీదేవి వృత్తాంతమే. ఆమె చాలా కాలం తరువాత తమిళంలో విజయ్ కథానాయకుడుగా నటించిన పులి చిత్రంలో ఒక ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే.
శ్రుతిహాసన్, హన్సికలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి ఆ చిత్ర హీరో విజయ్‌ను, నిర్మాతల్ని పొగడ్తల్లో ముంచెత్తారు. పులి చిత్రం విడుదల సమయంలో నిర్మాతల ఇళ్లల్లో ఐటీ దాడులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనుకున్న సమయంలో విడుదలవుతుందో, కాదో అన్నంత పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు తెరపైకి వచ్చినా చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది.
ఆ చిత్ర కథానాయకుడు కోట్ల పారితోషికం త్యాగం చేశారన్నది గమనార్హం. ఇక నటి శ్రుతిహాసన్‌కు కూడా పులి చిత్రం విషయంలో తన దారాళ మనసును చాటుకున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. ఈ చిత్రం కోసం ఒప్పందం కుదుర్చుకున్న పారితోషికంలో సుమారు 20 లక్షలు శ్రుతికి బాకీ ఉందట. ఆ మొత్తాన్ని శ్రుతిహాసన్ వదులుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.