
♦ సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి.
♦ మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచననూ స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
♦ నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది.
♦ నిత్యం పని చేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది.
♦ జీవితంలో భయం లేకుండా ఆత్మ విశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు.
♦ ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు.
♦ ఒక ధ్యేయంతో కృషి చేస్తే, నేడు కాకపోతే రేపయినా విజయం తప్పదు.
♦ జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే!
Comments
Please login to add a commentAdd a comment