Rahul gandhi
-
రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ
దేవగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి కాంగ్రెస్ యువరాజు కుట్రలు సాగిస్తున్నాడని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలే పరమావధిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బలహీనపర్చడం కోసం రిజర్వేషన్లు అంతం చేయడానికి ప్రయతి్నస్తున్నాడని చెప్పారు. బుధవారం జార్ఖండ్‌లో రెండు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం అక్రమ వలసదార్లను ప్రోత్సహించిందని, సర్కారు అండతో వారంతా శాశ్వత నివాసితులుగా మారిపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల విషయంలో కాంగ్రెస్ ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. యువ రాజు తండ్రి(రాజీవ్ గాం«దీ)రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తుచేశారు. -
కాంగ్రెస్ బస్సు యాత్ర.. రైతులకు రాహుల్ కీలక హామీ
Updates.. తెలంగాణలో ముగిసిన రాహుల్ తొలి విడత బస్సు యాత్ర ►ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ►మూడు రోజులపాటు సాగిన యాత్ర ►18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక.. ►ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకు సాగిన యాత్ర ►ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర ►ఆర్మూర్ నుంచి హైదరాబాద్‌కు రోడ్ మార్గంలో రాహుల్ ►శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రాహుల్ ఆర్మూర్‌లో రాహుల్ కార్నర్ మీటింగ్ ►ఒక్క కుటుంబం వద్ద తెలంగాణ బందీ అయింది: రాహుల్ గాంధీ ►కేసీఆర్ లూటీ చేసిన డబ్బును వెనక్కి రప్పిస్తా ►కాంగ్రెస్ బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది.. ►జగిత్యాలలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరగబోతోంది. దొరలు తెలంగాణను రాజ్యమేలుతున్నారు.. దీన్ని సహిద్దామా?. దోపిడీ సొమ్మంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటే. ఈ మూడు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం ఎంఐఎం పోటీ చేసి సాయం చేస్తోంది. ►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభిస్తాం. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం. తెలంగాణతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు, ఇల్లు లాక్కున్నారు. పసుపు పంటకు 12వేల నుంచి 15వేల మద్దతు ధర ఇస్తాం. బడ్జెట్ కేటాయింపుల్లో ఓబీసీలకు ఎన్ని నిధులు ఇస్తున్నారు. కుల గణన చేయడానికి మోదీ, కేసీఆర్ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. ►నేడు మూడోరోజు కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కరీంనగర్ వీపార్క్ హోటల్ నుంచి రాహుల్ గాంధీ బయలుదేరనున్నారు. మొదట చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అయితే, మల్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉండగా.. పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం, జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రసంగించనున్నారు. షెడ్యూల్ ఇలా.. ►మధ్యాహ్నం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో కార్నర్ మీటింగ్ ►మధ్యాహ్నం కోరుట్లలో సమావేశం ►ఆ తర్వాత ముక్కాస్ కన్వెన్షన్‌లో భోజన విరామం ►అనంతరం నిజామాబాద్ జిల్లాకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ►ఆర్మూర్ బహిరంగ సభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్న రాహుల్ గాంధీ. కోదండరామ్‌తో రాహుల్ భేటీ.. కరీంనగర్ వీపార్క్ హోటల్లో రాహూల్ గాంధీని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినట్టు కోదండరామ్ తెలిపారు. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్! -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్‌పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
ట్రయిల్ కోర్టులో నాకు అన్యాయం జరిగింది..
-
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్‌లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
Bharat Jodo Yatra: పాదయాత్రతో నాలో ఓపిక పెరిగింది: రాహుల్
ఇండోర్: భారత్ జోడో యాత్రతో తనలో ఓపిక, ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం పెరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాలో ఓపిక పెరగడం ఎంతగానో సంతృప్తినిస్తోంది. 8 గంటలు నడిచినా విసుగు రావడం లేదు. ఎవరైనా నెట్టినా కోపం రావడం లేదు. యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరించాల్సిందే. ఆటంకాలు ఎదురైనంత మాత్రాన విరమించుకోవడం సరికాదు. ప్రజలు చెప్పేది సావధానంగా వింటున్నా. ఇది నాకెంతో మేలు చేస్తోంది. పాదయాత్ర ఇప్పటిదాకా ఎన్నెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది’’ అని చెప్పారు. -
Bharat Jodo Yatra: పెచ్చరిల్లిన నిరుద్యోగం
కొల్లం: దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, గత 45 ఏళ్లలో రికార్డు స్థాయికి నిరుద్యోగం రేటు చేరుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సానుకూల దృక్పథాన్ని నెలకొల్పి వారి భవిష్యత్‌ను బలోపేతం చేయాలన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తొమ్మిదో రోజు కొల్లామ్ జిల్లా పొలయతోడు నుంచి కరునాగపల్లి వరకు సాగింది. తన పాదయాత్ర విశేషాలను ఫేస్బుక్లో పంచుకున్న రాహుల్ గాంధీ తాను ఎంతో మంది యువతీ యువకుల్ని కలుసుకున్నానని, ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నానని వెల్లడించారు. యువ శక్తిని భారత్ సద్వినియోగం చేసుకుంటే దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘ఇప్పుడు యువత ఉద్యోగాలు దొరక్క తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. 45 ఏళ్లలో నిరుద్యోగం రేటు అత్యధిక స్థాయికి చేరుకుంది. యువతలో నిరాశను పోగొట్టి భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే’’ అని రాహుల్ అన్నారు. స్కూలు విద్యార్థులతో మాట మంతీ రాహుల్ పాదయాత్రను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా ప్రజలు ఆయనను చూడడానికి ఎగబడ్డారు. సీనియర్ సిటిజన్లు సెక్యూరిటీని దాటుకొని కరచాలనానికి, సెల్ఫీలకు ప్రయత్నించారు. ఒక కథాకళి డ్యాన్సర్ నాట్యం చేయడంతో రాహుల్ ఆసక్తిగా చూశారు. నీన్దకరలోని ఒక పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఫోటోలు దిగారు. ‘‘కేరళ అందాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఇక్కడి ప్రజలు రాష్ట్రానికి మరింత అందం తెస్తున్నారు’’ అన్నారు. -
రాహుల్ పోటీని అడ్డుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం విషయం తేలే వరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేలా కేంద్రం, ఎన్నికల సంఘం(ఈసీ)కు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. సీపీ త్యాగి, జై భగవాన్ గోయల్ అనే ఇద్దరు ఈ పిటిషన్ వేశారు. రాహుల్ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నారంటూ బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి 2015లో హోం శాఖకు లేఖ రాయడం, అనంతరం దీనిపై పక్షం రోజుల్లో స్పందన తెలపాల్సిందిగా హోం శాఖ రాహుల్‌ను కోరడం తెల్సిందే. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో ఇప్పటికే పోలింగ్ పూర్తవ్వగా, అమేథీలో 6న పోలింగ్ జరగనుంది. బ్రిటిష్ పౌరసత్వం అంశం తేలే వరకు గాంధీ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాల్సిందిగా ఈసీని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. రాహుల్‌కు గుజరాత్ కోర్టు సమన్లు.. సూరత్: దొంగలందరి ఇంటిపేరు మోదీనే అని అన్నందుకు సూరత్ కోర్టు రాహుల్‌కు నోటీసులిచ్చింది. ఏప్రిల్ 13న రాహుల్ కర్ణాటకలోని కోలారులో ప్రసంగిస్తూ ‘నీవర్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఉంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్ 16న గుజరాత్ బీజేపీ శాసనసభ్యుడు పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. దీంతో సూరత్‌లోని చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా ఈ కేసులో రాహుల్‌కు నోటీసులు జారీ చేస్తూ, జూన్ 7న తన ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కాగా, అమిత్ షాను ‘హత్య కేసు నిందితుడు’ అని అన్నందుకు అహ్మదాబాద్ కోర్టు రాహుల్‌కు నోటీసులు పంపింది. రాహుల్‌కు ఈసీ క్లీన్చిట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి ఈసీ క్లీన్చిట్ ఇచ్చింది. బీజేపీ చీఫ్ అమిత్‌షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్‌లో అన్నట్లు ఈసీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. -
‘రాఫెల్‌పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు’
సాక్షి, సంగారెడ్డి : ఎన్నికలకు ముందు డ్రామాలో భాగంగానే కేసీఆర్ మోదీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, రాఫెల్‌పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. సంగారెడ్డిలో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ మోదీని సపోర్ట్ చేస్తాడని, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని సమర్థించాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ పేదరికాన్ని అంతం చేయాలనకుంటే.. మోదీ పేదలనే అంతం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కనీస ఆదాయానికి దిగువనున్న 5కోట్ల కుటుంబాలకు ఏడాది 3.60లక్షల సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. మోదీ ఉదయం లేచింది మొదలు 15మంది ధనవంతుల సహాయం కోసమే పనిచేస్తారని ఆరోపించారు. మోదీ పేదలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. కాంగ్రెస్ పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని తెలిపారు. చైనాలో రోజుకు 50వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంటే.. దేశంలో మాత్రం 27వేల ఉద్యోగాలు కోల్పోతున్నారని వివరించారు. పెద్దనోట్ల రద్దును ఏ ఆర్థిక వేత్తను అడిగినా పిచ్చితనమని అంటారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే.. జీడీపీలో ఆరు శాతం నిధులు విద్యారంగంపై ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. హరిత, శ్వేత, టెలికాం విప్లవాలను తీసుకొస్తామన్నారు. పంట పొలాల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుతో రైతుల మెరుగైన ధరలు వస్తాయన్నారు. మోదీ ధనికులు, పేదలు అంటూ రెండు రకాల భారతదేశాలను ఏర్పర్చాలనుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు అన్నప్పుడే.. మోదీ అబద్దం చెబుతున్నాడని, అది అసాధ్యమని తనకు తెలుసన్నారు. -
ఇది ‘పునాది’ లేని పోరాటం!
జాతిహితం భారతీయుల్లో 31 శాతం మంది మాత్రమే 2014లో మోదీకి ఓటు వేశారని మనకు తెలుసు. రాహుల్ పదే పదే మోదీపై చేస్తున్న దాడులను ప్రజలు ఆస్వాదించవచ్చు. కానీ వీరు గంపగుత్తగా రాహుల్‌కి ఓట్లేస్తారని దీనర్థం కాదు. రాజీలేని మోదీ వ్యతిరేక తత్వం దానికదే ఒక భావజాలంగా కానీ లేక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కానీ కాజాలదు. మోదీపై ఆగ్రహం ఒక్కటే మీ లక్ష్యమైతే ప్రజలు తమకు అందుబాటులోని అనేక ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన వారిని ఎంచుకోవచ్చు. రాహుల్ దూకుడు శైలి మోదీ ప్రతిష్టకు నష్టం కలిగించి, ప్రజలు అంతిమంగా ప్రధానిని ఓడిస్తారని భావించినప్పటికీ, మోదీ స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని భావించవచ్చా? చాన్నాళ్ల క్రితం అప్పటి ప్రజాస్వామిక వ్యవస్థల్లో నాయకులు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, తమకు ఓటు వేయని వారితో సహా ప్రజలందరి ప్రయోజనాలను కూడా సంరక్షించేవారు. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసు అంటే ప్రజల విశ్వాసం. కానీ ఇప్పుడు మాత్రం పాలకులు తమను బలపర్చే ప్రజా పునాది గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వారి మద్దతుదారులు తప్ప తక్కినవారు ఇప్పుడు లెక్కలోకి రారు. ఒక ఉదాహరణ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్షలాదిమంది అమెరికన్లు మతిలేని మూర్ఖుడు, జాత్యహం కారి వగైరా వగైరా పదాలతో నిందిస్తున్నారు. కానీ తనను విమర్శిస్తున్నవారి పట్ల ట్రంప్ ఎంత తూష్ణీభావంతో చూస్తే అంత కంటే ఎక్కువగా మద్దతుదారులు ట్రంప్‌ను ఆరాధిస్తుంటారు. మిగతావారి విషయం ఏమిటి? వారు రంగం నుంచి తప్పుకోవలసిందే. ఇదేం సూచిస్తుంది? నీవు నాకు ఓటు వేయకపోతే, నానుంచి మీరు ఏమీ ఆశించవద్దు. అలాగే అధికారంలోకి రావడానికి హిందూ ఓటుపై స్వారీ చేస్తున్నమోదీ బీజేపీని చూడండి. 20 శాతం ముస్లిం జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అటు లోక్‌సభలో, ఇటు అసెంబ్లీలో బీజేపీ ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకుండానే రెండింటిలోనూ ఘనవిజయం సాధిం చింది. సవర్ణులు అంటే ఎగువ, మధ్య స్థాయి కులాల ఓట్లను కొల్లగొట్టింది కాబట్టే బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ ముస్లింలను, చాలావరకు దళితులను పక్కనబెట్టేసింది. అందుకే అగ్రకుల హిందువులను వైదొలుగుతున్న మోదీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లతో సత్కరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ తనకున్న ప్రజాపునాదిని ఎలా నిర్వచిస్తారు? ప్రజాపునాది అంటే ఏమిటో ఆయనకు తెలుసా? మోదీ వ్యతిరేకవాదం ఒక్కటి మాత్రమే మీ ప్రచారానికి ఇప్పుడు సరిపోదన్నది స్పష్టమే. భారతీయుల్లో 31 శాతం మంది మాత్రమే 2014లో ఓటు వేశారని మనకు తెలుసు. పైగా మోదీని ఇప్పుడు కూడా మీరు ఇష్టపడకపోవచ్చు లేక తనతో విభేదించవచ్చు. రాహుల్ పదే పదే మోదీపై చేస్తున్న దాడులను ప్రజలు ఆస్వాదించవచ్చు. కానీ ఇలాంటివారు గంపగుత్తగా రాహుల్‌కి ఓట్లేస్తారని దీనర్థం కాదు. మోదీపై ఆగ్రహం ఒక్కటే మీ ఉద్దేశం అయితే మీరు అందుబాటులో ఉన్న అనేక ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన వారిని ఎంచుకోవచ్చు. బెంగాల్లో మమత కావచ్చు, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కావచ్చు. బిహార్‌లో లాలూ కావచ్చు. కేరళలో వామపక్షం కావచ్చు. ఇక తెలంగాణ, ఒడిశా, ఢిల్లీల్లో వరుసగా కేసీఆర్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు. రాహుల్ ఒంటెత్తు మనస్తత్వం మాత్రమే మోదీ ప్రతిష్టకు అంత నష్టం కలిగించి ప్రజలు బీజేపీ ప్రధానిని ఓడిస్తారని భావించినప్పటికీ, మోదీ స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని భావించవచ్చా? ఈరోజు అలాంటి అవకాశమే కనబ డటం లేదు. ఎందుకంటే ఒక బలీయమైన ప్రతిపాదన లేదా అభిప్రాయం (మోదీది అధమపాలన) దానికదే మరొక ప్రతిపాదనవైపు మొగ్గు (రాహుల్ ఉత్తముడు) చూపకపోవచ్చు.1989 వరకు కాంగ్రెస్ ప్రజాపునాది దిగువ కులాలు, మైనారిటీలు, గిరిజనులు, బ్రాహ్మణులు, కొన్ని మధ్య కులాలు, పేదల్లో చాలామంది మద్దతును గెలుచుకోగలిగినంత పెద్దదిగా ఉండేది. అప్పట్లో బీజేపీ ప్రధానంగా పట్టణ వ్యాపారులు, హిందూ మధ్యతరగతులకు మాత్రమే పరిమితమై ఉండేది. కాబట్టే ఇందిరాగాంధీ జనసంఘ్, బీజేపీలను బనియా పార్టీగానే పిలిచేవారు తప్పితే వారిని హిందూ పార్టీగా ఎన్నడూ వర్ణించలేదు. అలాగే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్నంతవరకు, బీజేపీ ఎన్నడూ ఆమె పార్టీని ముస్లిం పార్టీగా పిలవగలిగేది కాదు. కానీ పొటా (ఉగ్రవాద నిరోధక చట్టం)ను ఎప్పుడయితే రద్దు చేశారో అప్పుడే మోదీకి కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీ అని పిలిచే దమ్ము వచ్చేసింది. 1989లో రాజీవ్ గాంధీ తన ప్రజాపునాదిని కోల్పోవడం ప్రారంభం కాగానే, కాంగ్రెస్ పార్టీ మిగిలిన తన మద్దతుదారులతో, బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల మద్దతుతో మాత్రమే మనగలగ సాగింది. 2014 తర్వాత పార్టీని తిరిగి వైభవంలోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటినుంచి వందరోజుల లోపు అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవలసి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్పితే మరే రాష్ట్రంలోనూ విశ్వాస పాత్రులైన ఓటర్లతో కూడిన ప్రజారాశులను కలిగిలేదన్నది స్పష్టం. అది ఇప్పటికే బీజేపీతో పాటు తూర్పు మధ్య ప్రాంత గిరిజనులను పంచుకుంటోంది. దళితులు అన్ని పార్టీల్లో ఉంటున్నారు. ముస్లింలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, అస్సాం వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అనేక అవకాశాలు ఉంటున్నాయి. పైగా పట్టణ మధ్యతరగతిలో ప్రధానంగా 25 ఏళ్ల లోపు వయస్కులలో చాలామంది ఇప్పటికీ మోదీ పట్ల అనుకూలతతోనే ఉంటున్నారు. మోదీ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారిని మీ శిబిరంలోకి లాక్కోవడం ద్వారా మాత్రమే మీరు ఎన్నికల్లో గెలుపు సాధించిపెట్టే కొత్త ఓటర్ పునాదిని మీరు నిర్మించలేరు. మీరు మోదీకి నష్టం కలిగించవచ్చు కానీ దాని ప్రయోజనం మాత్రం అనేకమంది మిత్రులు, ప్రత్యర్థుల మధ్య విభజితం కావచ్చు. ఈ కోణంలో, రాహుల్ 2010–14 నాటి అరవింద్ కేజ్రీవాల్ స్టైల్‌ని అనుసరిస్తున్నారు. అన్నాహజారేని, ఆరెస్సెస్ గొంతుబలాన్ని ఉపయోగించి, యూపీఏని ప్రత్యేకించి కాంగ్రెస్ విశ్వసనీయతను విధ్వంసం చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషిం చారు. దీంతో కాంగ్రెస్ వారు సైతం పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలనుంచి సమర్థించుకోలేని మానసిక స్థితిలో కూరుకుపోయారు. యూపీఏని పతనం చేసిన ఘనతను బీజేపీకి, వివేకానంద ఫౌండేషన్‌కి ఆపాదించడం ప్యాషన్ కావచ్చు కానీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రధానాస్త్రంగా వ్యవహరించింది మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. తాను యువకుడు, విశ్వసనీయత కలిగినవాడు, అవినీతి అంటనివాడు కాంగ్రెస్ పార్టీ గజదొంగల పార్టీ అనే ఇమేజిని తానే పెంచిపోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లించడానికి తాను ప్రయత్నించిన ఓటర్లు కేజ్రీవాల్వైపునకు రాలేదు. అలాంటి ప్రజాపునాదిని తాను నిర్మించుకోలేదు. అతడి ప్రయోజనాలు ఢిల్లీకే పరిమితమయ్యాయి. కాకపోతే, నరేంద్రమోదీవైపు ఓటర్లు మళ్లిపోయేలా చేయడంలో కేజ్రీవాల్ విజయవంతమయ్యారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించకుండా కేవలం వ్యతిరేకతపై మాత్రమే ఆధారపడిన రాజకీయాల్లోని ప్రమాదం ఇదే. ఇది జరగకూడదంటే మీరు మీ పునాదిని నిర్వచించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే రాహుల్ పెనుప్రమాదంలోకి కొట్టుకెళ్లిపోతున్నారు. ఒక తిరుగుబాటుదారుగా సమర్థంగా వ్యవహరించడం సరైందే కావచ్చు కానీ ప్రజాస్వామ్యంలో మీరు చేయగలిగేది ఏమిటంటే అధికారాన్ని గెలుచుకోవడం కాకుండా ప్రతిష్టను దెబ్బతీయగలగడం, అధికారాన్ని మరొకరికి అప్పగించడం మాత్రమే. గెరిల్లా యుద్ధతంత్రం ప్రకారం రాహుల్ తన ఎత్తుగడలను బలంగానే అమలు చేస్తున్నారు కానీ దాని వ్యూహాత్మక ఫలితం ఏమిటన్నదే ముఖ్యం. ముస్లింల అనుకూల పార్టీగా తనపై ఉన్న ముద్రను తొలగించుకోవడానికి రాహుల్ ఆలయాలను సందర్శిస్తూ టీవీల్లో ప్రసారమయ్యేలా జాగ్రత్తపడుతున్నారు, తన జంధ్యాన్ని ప్రదర్శిస్తూ తన బ్రాహ్మణ గోత్రాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. కానీ, ఆయన పార్టీ... ట్రిపుల్ తలాక్, శబరిమల, అగ్రవర్ణాల రిజర్వేషన్ వంటి కీలకమైన లౌకిక–ఉదారవాద సమస్యల పట్ల మౌనం వహిస్తోంది. భారతదేశాన్ని యూదుజాత్యహంకార దేశంగా సమర్థవంతంగా క్రోడీకరించబోతున్న పౌరసత్వ చట్ట సవరణపై చర్చ జరుగుతుంటే లోక్‌సభనుంచి వాకౌట్ చేయడంలో కూడా పార్టీ సంప్రదాయాల లేమి కొట్టొచ్చినట్లు కనబడింది. ఇజ్రాయెల్ తన్నుతాను భావజాలపరంగానే జాత్యహంకార దేశంగా మల్చుకుంది. కానీ భారత్ దానికి భిన్నంగా పూర్తి వ్యతి రేకదిశలో.. భావజాలేతర, లౌకిక రాజ్యాంగంగా తన్ను తాను మల్చుకుంది. ఈరోజు ఆ పునాదే సవాలుకు గురవుతుండగా కాంగ్రెస్ వాకౌట్ చేయటంకంటే మరేమంత ఘనచర్యకు పూనుకోలేకపోవడమే విషాదం. ఇలాంటి నిస్సహాయ స్థితిని అస్సామ్‌లో హిందువులు, ముస్లింలు ఇదదరూ కలిసి చూస్తుండిపోతున్నారు. సరిగ్గా ఈ స్థితే బీజీపీకి కలిసొస్తుంది. ఆ పార్టీ ప్రజాపునాది అనేది సరిగ్గా దీన్నే కోరుకుంటోంది. అక్రమ వలసదార్లు చెదపురుగులు అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే బీజేపీ ప్రజాపునాది అభినందిస్తోంది. ఈ చెదపురుగుల్లో ముస్లింలు మాత్రమే ఉంటున్నారని పేర్కొంటూ రాజ్యాంగాన్ని ఎవరైనా సవరించడానికి పూనుకుంటే బీజేపీ ప్రజాపునాది కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంటుంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తన పునాది ఏంటో కూడా తెలుసుకోవడం లేదు. లేదా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమీపిస్తుండగా అంటే వచ్చే నెలలో తన పునాదిని నిర్మిం చుకోవడం ఎలా అని కూడా దానికి తెలీడం లేదు. రాజీలేని మోదీ వ్యతిరేక తత్వాన్ని ఎంత ఆగ్రహంతో ప్రదర్శించినప్పటికీ, అది దానికదే ఒక భావజాలంగా కానీ లేక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కానీ కాజాలదు. మీరు చేయవలసింది ఏమిటంటే మోదీని వచ్చే ఎన్నికల్లో 200 కంటే తక్కువ సీట్లతో వెనుకబడేలా చేయడమే. దీనికి ప్రతిగా మీరు ప్రారంభంలోనే 100 సీట్లను అదనంగా పొందే స్థితిని ఇది కలిగిస్తుందా? అలా జరగాలంటే ముందుగా రాష్ట్రం తర్వాత రాష్ట్ర స్థాయిలో భారత చిత్రపటాన్ని నిశితంగా పరిశీలించాలి. బీజేపీ పట్ల ప్రజల్లో ఆశలు ఎంత ఎక్కువస్థాయిలో ఆవిరయినప్పటికీ మే నెలనాటికి కాంగ్రెస్ పార్టీ, చాలా రాష్ట్రాల్లో వారి ప్రత్యామ్నాయ ఎంపిక కావడం కష్టమే. రాహుల్ గ్రహించాల్సిన అత్యంత కఠిన వాస్తవం ఇదే మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాహుల్ సవాల్‌కు ఇరానీ కౌంటర్!
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాఫెల్‌తో పాటు దేశానికి సంబంధించిన అంశాలపై చర్చకు తాము సిద్ధమని, కానీ రాహుల్ చర్చకు వచ్చేముందు చేతిలో ఎలాంటి పేపర్లు (స్క్రిప్ట్) లేకుండా చర్చించగల సత్తా ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల రాహుల్ మాట్లాడుతూ.. రాఫెల్‌పై తనతో చర్చకు ప్రధాని మోదీ సిద్ధమేనా? అని సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ఇరానీ సోమవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా అమేథిలో రాహుల్ ఎంపీగా విజయం సాధిస్తూ వస్తున్నారని.. తన సొంత నియోజకవర్గంలోని కొన్ని గ్రామపంచాయతీల పేర్లు కూడా రాహుల్ చెప్పలేరని ఆమె ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి రాహుల్ వరకు అమేథిని పాలించింది వారి కుటుంబమేనని.. అక్కడ అభివృద్ది ఏమేరకు జరిగిందో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసిన ఇరానీ స్వల్ప తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి లోక్‌సభ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడింటిని బీజేపీ గెలుపొందగా, ఒక స్థానంలో ఎస్పీ విజయం సాధించింది. -
తెలంగాణ ఆకాంక్షలేవీ నెరవేరలేదు
-
గుజరాత్లో రాహుల్ ‘టెంపుల్ రన్’
సాక్షి,గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సౌరాష్ట్రలో సాగిన మూడు రోజుల పర్యటనల్లో హిందువులను ఆకట్టుకునేందుకు దేవాలయాలను సందర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మలివిడత టూర్లోనూ ‘టెంపుల్ రన్’ కొనసాగించనున్నారు. ఈనెల 9నుంచి 11 వరకూ మూడు రోజుల పాటు సాగే రెండో విడత పర్యటనలో భాగంగా రాహుల్ నడియాద్లోని శాంత్రామ్ దేవాలయాన్ని, ఫగ్వెల్లో కొలువైన భత్‌జీ మహరాజ్ ఆలయాన్ని, పావ్‌గఢ్‌లో మాకాశీ టెంపుల్‌ను, ఖేదా జిల్లాలో దకోర్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టూర్లో భాగంగా వదోదర, బొదేలీలో రెండు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 18 చిన్నపాటి సభలు, నాలుగు సంవాద్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రైతులు, వ్యాపారులు, కార్మిక సంఘాల నేతలతో సమావేశమవుతారు. పార్టీపై మైనారిటీలకు అనుకూలమన్న ముద్రను తొలగించుకునేందుకు, హిందువులను ఆకట్టుకునేందుకే ఆయన ఆలయాల బాట పట్టారని భావిస్తున్నారు. మైనారిటీలను దూరం చేసుకోకుండానే హిందువుల ఓట్లకు గాలం వేస్తూ ఓటు బ్యాంక్‌ను విస్తృతం చేసుకోవాలన్నది రాహుల్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక దీపావళి తర్వాత రాహుల్ ఉత్తర గుజరాత్ యాత్రను చేపట్టి అంబాజీ, బెచరజి, ఉంజా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. సౌరాష్ట్రలో రోడ్‌షోలను ముగించుకున్న రాహుల్ మలివిడత పర్యటనలు ఎనిమది జిల్లాల్లోని 500 కిమీ మీదుగా మధ్య గుజరాత్లో సాగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
‘రాహుల్..ఇటలీ అద్దాలు తీసి చూడండి’
సాక్షి,అహ్మదాబాద్: బీజేపీ హయాంలో గుజరాత్లో చోటుచేసుకున్న అభివృద్ధిని చూడాలంటే రాహుల్ గాంధీ ఇటలీ కళ్లద్దాలను తీసేయాలని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా అన్నారు. గుజరాత్ గౌరవ్ యాత్రలో భాగంగా సోమవారం పోర్బందర్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా తనదైన శైలిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. రాహుల్ ఇటీవలి అమెరికా పర్యటనను విహార యాత్రగా ఆయన అభివర్ణించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో గుజరాత్‌కు ఏమిచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని, గుజరాత్‌కు తాము ఎయిమ్స్‌ను కేటాయించామని, రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, నర్మదా డ్యామ్ ఎత్తు పెంపుకు అనుమతించామని గుర్తుచేశారు. ఆరు లక్షల మంది పట్టణ పేదలకు ఇళ్లు కేటాయించామని చెప్పారు. ఇటలీ కళ్లద్దాలు ధరించడంతో ఈ అభివృద్ధిని రాహుల్ చూడలేరని అమిత్ షా ఎద్దేవా చేశారు. గుజరాత్లో మూడు తరాల వారికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు విశ్వసించరని అన్నారు. -
15 నిమిషాల్లో వెయ్యి మెట్లెక్కి
చోటిలా(గుజరాత్): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనలో చివరి రోజైన బుధవారం సురేంద్ర నగర్ జిల్లాలోని ప్రఖ్యాత చోటిలా ఆలయాన్ని సందర్శించారు. 15 నిమిషాల్లో దాదాపు వెయ్యి మెట్లు ఎక్కి చాముండా మాతను దర్శనం చేసుకున్నారు. పటేల్ వర్గీయుల ఆరాధ్య దైవం ఖోదల్‌ధామ్ గుడితోపాటు మరో రెండు ఆలయాలనూ ఆయన సందర్శించారు. బీజేపీ ఆరెస్సెస్‌లు కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, అది వారి దుష్ప్రచారమేనని నిరూపించేందుకే రాహుల్ ఆలయాలను సందర్శిస్తున్నారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. బుధవారం రాహుల్ ఓ చోట మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ కలసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదనీ, మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన వ్యాసంలో రాశారని రాహుల్ పేర్కొన్నారు. పేదల దీనావస్థను విస్మరించిన ప్రభుత్వం, కొంతమంది ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. -
వాళ్లంతే అంటున్న రాహుల్
సాక్షి, ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. అధికారం నిలుపుకునేందుకు మోదీ, బీజేపీలు సమాజాన్ని విభజించడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. హర్యానాలో జాట్లు, జాట్లేతరుల మధ్య, మహరాష్ట్రలో మరాఠాలు, మరాఠేతరుల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల విచ్ఛిన్న రాజకీయాలను కేవలం కాంగ్రెస్ సిద్ధాంతం మాత్రమే దీటుగా ఎదుర్కోగలదని అన్నారు. మరాఠ్వాడా ప్రాంతంలోని పర్బానిలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నోట్ల రద్దుతో దేశంలోని బ్లాక్ మనీ అంతా వైట్‌గా మారిందన్నారు. తొలుత నోట్ల రద్దుతో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుతాయని చెప్పిన పాలకులు, ఆ తర్వాత నల్లధనం నియంత్రించేందుకే ఈ నిర్ణయమని చెప్పారన్నారు. అయితే 90 శాతం బ్లాక్ మనీ రియల్ఎస్టేట్, బంగారం రూపంలో ఉంటుందని దేశంలో ప్రతిఒక్కరికీ తెలిసిందేనన్నారు. రైతులు, కార్మికులు, గృహిణుల కష్టార్జితం కోసం మోదీ ఎందుకు పాకులాడారో అర్థం కావడంలేదన్నారు. రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరిందని చెప్పడానికి ఆర్బీఐకి ఏడాది సమయం పట్టిందని రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు.జీడీపీ 4.5 శాతానికి తగ్గడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీనికి ప్రధాని మోదీయే బాధ్యత వహించాలన్నారు. -
నా జీతం మొత్తం పార్టీకే ఇస్తా
రాహుల్‌గాంధీతో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి న్యూఢిల్లీ: రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తనకు ఎమ్మెల్యే పదవి ద్వారా వచ్చే జీతాన్ని పార్టీకి విరాళంగా ప్రకటించారు. తనను ఎమ్మెల్యేను చేసిన పార్టీ అభివృద్ధికోసం ఇకపై అవిశ్రాంతంగా కృషిచేస్తానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలిపారు. బుధవారం వంశీచంద్‌రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీ ని ఆయన నివాసంలో కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల సేపు రాహుల్‌గాంధీతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే కావడానికి అవకాశమిచ్చినందుకు ఆయన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. -
'ఓటమికి సోనియా, రాహుల్ బాధ్యులు కారు'
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యులు కారని తిరువనంతపురం ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశీథరూర్ గురువారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ప్రతిపక్ష బాధ్యత తీసుకోవాలని ఆయన సోనియా, రాహుల్ గాంధీలను కోరారు. అప్పుడే పార్టీలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. పార్టీలో, జాతీయ స్థాయిలో రెండు అధికార కేంద్రాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదనడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు అవినీతి ఆరోపణలే దెబ్బతీశాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక పరిణామాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆమూలాగ్రం సంస్కరించాల్సిన ఆవశ్యకతను శశీథరూర్ ఈ సందర్భంగా విశదీకరించారు. వచ్చే ఐదేళ్లూ సోనియా గాంధీ నాయకత్వమే కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.