![Supreme Court agrees to hear plea for directive to ECI to debar him from polls - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/3/rahul.jpg.webp?itok=-UrmpYqX)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం విషయం తేలే వరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేలా కేంద్రం, ఎన్నికల సంఘం(ఈసీ)కు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. సీపీ త్యాగి, జై భగవాన్ గోయల్ అనే ఇద్దరు ఈ పిటిషన్ వేశారు. రాహుల్ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నారంటూ బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి 2015లో హోం శాఖకు లేఖ రాయడం, అనంతరం దీనిపై పక్షం రోజుల్లో స్పందన తెలపాల్సిందిగా హోం శాఖ రాహుల్‌ను కోరడం తెల్సిందే. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో ఇప్పటికే పోలింగ్ పూర్తవ్వగా, అమేథీలో 6న పోలింగ్ జరగనుంది. బ్రిటిష్ పౌరసత్వం అంశం తేలే వరకు గాంధీ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాల్సిందిగా ఈసీని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.
రాహుల్‌కు గుజరాత్ కోర్టు సమన్లు..
సూరత్: దొంగలందరి ఇంటిపేరు మోదీనే అని అన్నందుకు సూరత్ కోర్టు రాహుల్‌కు నోటీసులిచ్చింది. ఏప్రిల్ 13న రాహుల్ కర్ణాటకలోని కోలారులో ప్రసంగిస్తూ ‘నీవర్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఉంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్ 16న గుజరాత్ బీజేపీ శాసనసభ్యుడు పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. దీంతో సూరత్‌లోని చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా ఈ కేసులో రాహుల్‌కు నోటీసులు జారీ చేస్తూ, జూన్ 7న తన ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కాగా, అమిత్ షాను ‘హత్య కేసు నిందితుడు’ అని అన్నందుకు అహ్మదాబాద్ కోర్టు రాహుల్‌కు నోటీసులు పంపింది.
రాహుల్‌కు ఈసీ క్లీన్‌చిట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి ఈసీ క్లీన్‌చిట్ ఇచ్చింది. బీజేపీ చీఫ్ అమిత్‌షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్‌లో అన్నట్లు ఈసీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment